చాలాసార్లు తెలిసీతెలియక చేసే చిన్నపాటి పొరపాట్లు జీవిత పాఠాలను నేర్పుతాయి. ఇలాంటి పొరపాటు కారణంగా ఇటీవల ఒక మహిళ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె పొరపాటున కంటి చుక్కలకు బదులు గాఢమైన జిగురు(సూపర్ గ్లూ)ను కంటిలో వేసుకుంది. ఆ తరువాత ఆమె పడరానిపాట్లు పడింది.
కాలిఫోర్నియాలోని శాంటా రోసాకు చెందిన ఆ బాధిత మహిళ పేరు జెన్నిఫర్ ఎవర్సోల్. ఆ మహిళ తన కళ్లు బిగుసుకుపోయాయంటూ ఆసుపత్రికి చేరుకోగా, ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తొలుత ఆమె కళ్లు తెరుచుకునేందుకు మందు వేసినా ఫలితం లేకపోయింది. చివరికి వైద్యులు ఆమె కనురెప్పలను తొలగించి, ఆమెకు ఉపశమనం కల్పించారు.
ఆమె కనురెప్పలు జిగురు కారణంగా పూర్తిగా అతుక్కుపోవడం వల్లే ఆమె కళ్లు మూసుకుపోయాయని తెలుస్తోంది. బాధితురాలు తన కళ్లు తీవ్రంగా మండుతున్నప్పుడు తాను పొరపాటు చేశానని గ్రహించింది. ఈ ఉదంతం గురించి ఆమెకు చికిత్స అందించిన వైద్యుడు మాట్లాడుతూ ఇలాంటి కేసును తన జీవితంలో తొలిసారి చూశానని అన్నారు. కాగా ఆ మహిళ తాను చేసిన చిన్న పొరపాటుకు కనురెప్పలు కోల్పోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
Comments
Please login to add a commentAdd a comment