Eye Drops
-
చత్వారకు చుక్కల మందు
న్యూఢిల్లీ: చత్వార (ప్రెస్బయోపియా–లాంగ్ సైట్) సమస్యకు రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండా తయారు చేసిన ఐ డ్రాప్స్‌ను తొలిసారి భారత్‌లోకి తీసుకురానున్నారు. ఈ ఔషధ తయారీ సంస్థ ఎన్టాడ్ ఫార్మా అక్టోబర్ తొలివారంలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఈమేరకు ప్రకటించింది.ఈ కంటి చుక్కల మందును దేశీయంగా మార్కెటింగ్ చేసేందుకు ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ నుంచి తుది అనుమతులు లభించినట్లు ఎన్టాడ్ ఫార్మా వెల్లడించింది. ప్రెస్వ్యూ ధర రూ.350గా ఉంటుందని సమాచారం. అక్టోబర్ తొలివారంలో ఈ ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీఈవో నిఖిల్ కె.మాసూర్కర్ తెలిపారు. ముందుగా భారత్‌తోపాటు ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో దీన్ని విక్రయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖసమీపంలో ఉన్న వస్తువులను సరిగా గుర్తించలేకపోవడం ప్రెస్బయోపియా లక్షణాల్లో ఒకటి. ఇది ఎక్కువగా 40 ఏళ్ల వయసు పైబడినవారిలో కనిపిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే ఈ లక్షణాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారంగా కళ్లద్దాలు వాడుతున్నారు. అందులో భాగంగా రీడింగ్ గ్లాసెస్, బైఫోకల్స్, ప్రోగ్రెసివ్ లెన్స్, కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తున్నారు. ఇవేవీ లేకుండా త్వరలో కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం చుక్కల మందు వేసుకుంటే సరిపోతుంది. -
ఐ డ్రాప్స్ స్థానంలో జిగురు.. యువతి విలవిల!
చాలాసార్లు తెలిసీతెలియక చేసే చిన్నపాటి పొరపాట్లు జీవిత పాఠాలను నేర్పుతాయి. ఇలాంటి పొరపాటు కారణంగా ఇటీవల ఒక మహిళ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె పొరపాటున కంటి చుక్కలకు బదులు గాఢమైన జిగురు(సూపర్ గ్లూ)ను కంటిలో వేసుకుంది. ఆ తరువాత ఆమె పడరానిపాట్లు పడింది. కాలిఫోర్నియాలోని శాంటా రోసాకు చెందిన ఆ బాధిత మహిళ పేరు జెన్నిఫర్ ఎవర్సోల్. ఆ మహిళ తన కళ్లు బిగుసుకుపోయాయంటూ ఆసుపత్రికి చేరుకోగా, ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తొలుత ఆమె కళ్లు తెరుచుకునేందుకు మందు వేసినా ఫలితం లేకపోయింది. చివరికి వైద్యులు ఆమె కనురెప్పలను తొలగించి, ఆమెకు ఉపశమనం కల్పించారు. ఆమె కనురెప్పలు జిగురు కారణంగా పూర్తిగా అతుక్కుపోవడం వల్లే ఆమె కళ్లు మూసుకుపోయాయని తెలుస్తోంది. బాధితురాలు తన కళ్లు తీవ్రంగా మండుతున్నప్పుడు తాను పొరపాటు చేశానని గ్రహించింది. ఈ ఉదంతం గురించి ఆమెకు చికిత్స అందించిన వైద్యుడు మాట్లాడుతూ ఇలాంటి కేసును తన జీవితంలో తొలిసారి చూశానని అన్నారు. కాగా ఆ మహిళ తాను చేసిన చిన్న పొరపాటుకు కనురెప్పలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత? -
కంటి సమస్యకు సన్ ఫార్మా ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్ను పొడిబారడం వంటి సమస్యలకు పరిష్కారంగా సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ సెక్వా పేరుతో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు పరిమితులను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. నానోమిసెల్లార్ టెక్నాలజీతో భారత్‌లో అందుబాటులో ఉన్న మొదటి ఔషధం ఇదేనని సన్ ఫార్మా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తి కంటే భారతదేశంలో ఈ సమస్య ప్రాబల్యం ఎక్కువగా ఉంది. సమస్య ఉత్పన్నమైతే కంట్లో దురద, నలుసు పడ్డట్టు అనిపించడం, ఎరుపెక్కడం, మంట, నొప్పి, ఒత్తిడి, నీరు కారడం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. -
భారత్ ఐడ్రాప్స్‌పై యూఎస్ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ
భారత్ కంపెనీ తయారు చేసిన ఆర్టిఫిషియల్ టియర్స్ అనే ఐడ్రాప్స్ పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఐ డ్రాప్స్ వాడటం వల్ల అత్యంత శక్తిమంతమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతవరకు ఇలాంటి బ్యాక్టీరియా జాతిని అమెరికాలో గుర్తించలేదని, ఇది ఏ యాంటి బయోటిక్స్‌కి లొంగదని యూఎస్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తన నివేదికలో పేర్కొంది. ఈ ఐ డ్రాప్స్‌ని చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ కంపెనీ ఎజ్రీకేర్ బ్రాండ్ పేరుతో తయారు చేస్తోంది. ఐతే ఈ ఐడ్రాప్స్ కారణంగా ముగ్గురు మృతి చెందారని, ఎనిమిది మందికి అంధత్వం వచ్చిందని, డజన్ల కొద్దీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని సీడీసీ వెల్లడించింది. దీంతో అమెరికా ఆ ఉత్పత్తులన్నింటిని వెంటనే నిలిపేసింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ ఈ డ్రాప్స్‌లో కలుషితమైన కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల కంటి ఇన్షెక్షన్లు వస్తాయని, అది అంధత్వానికి లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ బ్యాక్టీరియా కారణంగా రక్తం, ఊపిరితిత్తులు ఇన్ఫక్షన్ అవుతాయని, దీని యాంటి బయోటిక్ రెసిస్టన్స్ కారణంగా చికిత్స చేయడం కష్టతరంగా మారిందని అమెరికా నివేదికలో తెలిపింది. ఈ ఐ డ్రాప్స్‌ని ఉపయోగించిన రోగులు, కంటి ఇన్ఫ్క్షన్లు వచ్చినా, అందుకు సంబంధించిన లక్షణాలు ఏమైనా తలెత్తిని వెంటనే వైద్యులను సంప్రదించాలని సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్సీడీసీ స్పష్టం చేసింది. స్పందించిన గ్లోబల్ ఫార్మా కంపెనీ: ఈ మేరకు ఐ డ్రాప్స్‌ను తయారు చేసే గ్లోబల్ ఫార్మా కంటపెనీ డైరెక్టర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. అమెరికా చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చారు. ఆ ఐ డ్రాప్స్‌లో వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాలేదని, కలుషితమైన కృత్రిమైన నీటిని వినియోగించలేదని వెల్లడించారు. ప్రమాణాల అనుగుణంగానే ఈ డ్రగ్‌ని రూపొందించినట్లు తెలిపారు. దశల వారిగా జరిపిన పరిశోధనల్లో తమకు ఐ డ్రాప్స్‌లో అలాంటివేమి కనిపించలేదని, కలుషితమైన వాటిని ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. అమెరికా చేసిన ఆరోపణలను ఖండించారు. కూడా. ఈ ఐ డ్రాప్ తయారు చేసే డ్రగ్ ప్లాంట్ వద్ద కూడా కలుషిత నీటిని వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె నొక్కి చెప్పారు (చదవండి: యూకేలో పాస్‌పోర్ట్ సిబ్బంది సమ్మె) -
ఐ డ్రాప్స్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఐ డ్రాప్స్(కంటి చుక్కల మందు) ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ 15 ల్యాబ్‌లు నివేదిక ఇచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఐ డ్రాప్స్‌లో పీహెచ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వివరించారు. ఆ మందు వినియోగానికి అనుగుణంగా లేదన్నారు. దీనిపై ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకు హైకోర్టు అనుమతినిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్య గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, ఐ డ్రాప్స్ గురించి పలు ల్యాబ్‌లు ఇచ్చిన నివేదికను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆనందయ్య న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ, కరోనా వల్ల ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి ఈ కంటి చుక్కల మందు ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ మందు విషయంలో ఆయుష్ శాఖ ఆనందయ్యతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. సీజే స్పందిస్తూ.. సంప్రదాయ మందులను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదన్నారు. వేటి విలువ వాటికి ఉంటుందని వ్యాఖ్యానించారు. తనకు రెండు రోజుల పాటు తలనొప్పి వల్ల కలిగిన ఇబ్బంది.. ఓ ప్రాంత సాంప్రదాయ మందు ద్వారా తొలగిందని చెప్పారు. అనంతరం కౌంటర్ దాఖలుకు అనుమతిస్తూ.. ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
ఆనందయ్య ఐ డ్రాప్స్‌తో కళ్లకు హాని
సాక్షి, అమరావతి: ఆనందయ్య ఐ డ్రాప్స్ (కంటి మందు)లో హానికర పదార్థాలున్నట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. దీని వినియోగం వల్ల కళ్లకు హాని కలుగుతుందంటూ నివేదికలు వచ్చాయని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వివరాలు.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బి.ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్ తయారు చేశారు. ఈ మందుల వినియోగానికి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్యతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఐ డ్రాప్స్ మినహా మిగిలిన 4 రకాల మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పరీక్షల్లో తేలడంతో.. ప్రభుత్వం వాటి వినియోగానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఐ డ్రాప్స్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రముఖ సంస్థల నివేదికల ఆధారంగానే.. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, ఐ డ్రాప్స్ శాంపిళ్లను ఐదు సంస్థలకు పంపించామని చెప్పారు. కంటి చికిత్స రంగంలో ఎంతో పేరున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, శంకర నేత్రాలయ సంస్థలు నివేదికలిచ్చాయని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్‌లో హానికర పదార్థాలున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నాయని వెల్లడించారు. వాటి వినియోగం వల్ల కళ్లకు ప్రమాదం కలుగుతుందని చెప్పాయన్నారు. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్ వల్ల దుష్ప్రభావాలు ఉండవని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందన్నారు. ఈ మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని హామీ కూడా ఇస్తామన్నారు. ముందు ఐ డ్రాప్స్ విషయంలో ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. పరీక్ష ఫలితాల నివేదికలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. -
ఐడ్రాప్స్ అనుకుని కంట్లో జిగురు వేసుకుంది..
వాషింగ్టన్: తొందరపాటుతో అప్పుడప్పుడు మనం చేసే పనులకు జీవితకాలం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఐ డ్రాప్స్ అనుకుని పొరపాటుగా కంట్లో జిగురు వేసుకుంది. శాశ్వతంగా చూపు కోల్పోయే పరిస్థితి కానీ అదృష్టం కొద్ది ఆ ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఆ వివరాలు.. మిచిగన్‌కు చెందిన యాసిడ్రా విలియమ్స్ కాంటక్ట్ లెన్స్ వినియోగిస్తుంది. ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు వాటిని తొలగించి.. పడుకుంటుంది. అయితే పది రోజుల క్రితం ఆమె కాంటాక్ట్ లెన్స్ తీయకుండానే నిద్ర పోయింది. దాంతో అర్థరాత్రి సమయంలో కళ్లలో మంటగా అనిపించింది. దాంతో తన హ్యాండ్బాగ్లో ఉండే ఐడ్రాప్ బాటిల్ తీసుకుందామని దానిలో చేయి పెట్టింది. చేతికి దొరికిన డబ్బా తీసుకుని.. కంట్లో రెండు చుక్కలు వేసుకుంది. అయితే ఐడ్రాప్స్ వేసుకున్న తర్వాత విశ్రాంతిగా ఉండాల్సింది పోయి.. ఆమె కళ్లలో దురద, మంట పెరగసాగాయి. దాంతో ఆమె కళ్లు మూసుకుని వాటిని రుద్దసాగింది. ఆ తర్వాత చల్లని నీటితో కంటిని శుభ్రం చేసుకుందామని భావించి కళ్లు తెరవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. అప్పుడు కానీ ఆమెకు తాను చేసిన తప్పిదం తెలియలేదు. సాధారణంగా యాసిడ్రా విలియమ్స్ తన హ్యాండ్ బాగ్‌లో ఐడ్రాప్స్ బాటిల్‌తో పాటు నెయిల్ గ్లూ(గోళ్లు విరిగితే అతుకుపెట్టుకోవడానికి వాడతారు) డబ్బాలను రెండింటిని తనతో తీసుకెళ్తుంది. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉంటాయి. దాంతో ఆమె కళ్లు దురద అనిపించిన వెంటనే హ్యాండ్‌బ్యాగ్‌లో చేయి పెట్టి చేతికి దొరికిన డబ్బా తీసుకుంది. లైట్ వేసి అదేంటో చెక్ చేయలేదు. అలా పొరపాటున ఐ డ్రాప్స్‌కు బదులుగా నెయిల్ గ్లూ కళ్లలో వేసుకుంది. ఇక యాసిడ్రా విలియమ్స్ అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే పరిగెత్తుకు వచ్చి.. విషయం తెలుసుకుని ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేశారు. వైద్యులు ఆమె కళ్లకు శస్త్ర చికిత్స చేసి.. కంట్లో పడిన గ్లూ శుభ్రం చేశారు. అతుక్కుపోయిన కాంటాక్ట్లెన్స్ని తీశారు. వీటి వల్లనే ఆమె చూపు కోల్పోకుండా బయటపడగలిగిందని తెలిపారు. కాకపోతే కనురెప్పలను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. చదవండి: బెడిసికొట్టిన ప్లాన్.. ప్లీజ్ మీరు ఇలా చేయకండి! -
ఈ అమ్మాయి ఏడ్వకుండానే
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని ఆప్తమాలజిస్ట్లకు తాజాగా ఈ 11 ఏళ్ల బాలిక కేసు సవాలుగా మారింది. ఈ అమ్మాయి ఏడ్వకుండానే కన్నీరు ఎర్రగా వస్తున్నాయి. సాధారణంగా పిల్లలు ఏడ్చినప్పుడు మాత్రమే కన్నీరు వస్తాయి. కాని ఇక్కడ ఈ అమ్మాయి ఏడవకుండానే రోజులో మూడు నాలుగుసార్లు కళ్ల నుంచి ఎర్రనీళ్లు కారుతున్నాయి. తల్లి భయపడి స్థానిక ఐ క్లినిక్‌లో చూపించింది. వారికి ఏమీ తెలియలేదు. ఏ.ఐ.ఎం.ఎస్‌లోని కంటి నిపుణులకు కూడా ఏమీ తెలియడం లేదు. పిల్లల్లో కనిపించే ఈ అరుదైన స్థితిని ‘హిమోలాక్రియా’ అంటారు. గతంలో మనదేశంలో ఒక కేసు, బంగ్లాదేశ్‌లో ఒక కేసు కనిపించింది. మన దేశంలోని మరో కేసులో తల్లి కావాలని లేపిన పుకారని బయటపడింది. కాని ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో నిజంగా ఎర్రకన్నీరు వస్తున్నాయి. ‘ఇలా రావడానికి కచ్చితమైన కారణం అంటూ ఏదీ ఉండదు’ అని వైద్యులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఒక కారణం అయ్యే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి వైద్యుల పర్యవేక్షణలో ఉంది. తల్లికి ఓదార్పు ఏమిటంటే ‘ఇవి ఎలా మొదలయ్యాయో అలాగే పోతాయి’ అని వైద్యులు చెప్పడం. అంటే ఈ బాధ ఎల్లకాలం ఉండదు అని అర్థం. -
దారుణం : తాగే నీటిలో చుక్కల మందు కలిపి..
వాషింగ్టన్ : కంట్లో వేసే చుక్కల మందు తన భర్త ప్రాణం తీస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. రెండు సంవత్సరాల కింద చేసిన పని ఆమెను కటాకటాల వెనక్కి నెట్టేలా చేసింది. తన భర్తకు విషం ఇచ్చినట్లు అటాప్సీ రిపోర్టులో తేలడంతో కోర్టు ఆమెకు 25 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని దక్షిణ కరోలినా ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. దక్షిణ కరోలినా ప్రాంతానికి చెందిన స్టీవెన్ క్లేటన్ (64), లానా స్యూ క్లేటన్ (53) భార్యభర్తలు. లానా నర్స్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త స్టీఫెన్ వాలంటరీ రిటైర్మంట్ తీసుకొని ఇంట్లోనే ఉంటున్నాడు. వీరిద్దరు కలిసి షార్లెట్ సమీపంలోని క్లోవర్‌లో నివసిస్తున్నారు. కాగా 2018 జూలైలో ఆమె తన భర్త స్టీవెన్‌కు తాగేనీటిలో చుక్కల మందును కలిపి ఇచ్చినట్లు తెలిసింది. మొదట్లో ఆమె భర్త సాధారణంగానే చనిపోయాడని అందరూ భావించారు. అయితే అటాప్సీ టాక్సికల్ రిపోర్ట్‌లో విషపదార్థం కలవడంతోనే స్టీవెన్ మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.స్టీవెన్ తాగిన నీటిలో టెట్రాహైడ్రోజోలిన్ ఎక్కువ మోతాదులో ఉండడంతో అతను మృతి చెందినట్లు రిపోర్టులో తేలింది. దీంతో 2018 ఆగస్టులో పోలీసులు లానా క్లేటన్పై కేసు నమోదు చేశారు. 2016లోనూ లానా క్లేటన్ ఇదే విధంగా స్టీఫెన్‌ను గొడ్డలితో తల వెనుక భాగంలో కొట్టి చంపడానికి ప్రయత్నించడంతో పాటు దానిని ఒక యాక్సిడెంట్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు స్టీఫెన్ తరపు న్యాయవాది ఆరోపించారు. అయితే సాక్షాలన్నీ లానాకు వ్యతిరేకంగా ఉండడంతో.. తన భర్తను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు కోర్టు నిర్ధారించి ఆమెకు 25 సంవత్సరాలు శిక్షను ఖరారు చేసింది. 'నేను నా భర్తను చంపడానికి ప్రయత్నించలేదు. కేవలం అతన్ని మత్తులోకి తీసుకెళ్లాలనే తాగేనీటిలో కంటి మందును కలిపి ఇచ్చాను. కానీ ఆ మందు అతని ప్రాణం తీస్తుందని నేను ఊహించలేదంటూ' లానా కన్నీటీ పర్యంతమైంది'. ' నా సోదరుడిని లానా స్యూ క్లేటన్ అన్యాయంగా పొట్టనబెట్టుకుంది. ఇంత దారుణంగా స్టీఫెన్‌ను చంపుతుందని నేను ఊహించలేదు. ఎంతో తెలివిగా తాగేనీటిలో కంటి చుక్కల మందును కలిపి చంపిందని' స్టీఫెన్ సోదరి రోస్‌మేరీ క్లేటన్ ఆవేదన వ్యక్తం చేసింది. -
‘చుక్కలు’ చూపిస్తున్నాయి!
రోజూ లక్షల్లో మనదేశంలో స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోతున్నాయి. అయితే అదే సమయంలో కంట్లో వేసే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలోనే అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ మందుల అమ్మకాలు 54 శాతం పెరిగాయి. ఇదేంటి సెల్ఫోన్లకు, చుక్కల మందుకు ఉన్న సంబంధం ఏంటనుకుంటున్నారా?.. స్మార్ట్ ఫోన్లే మన కళ్లలో నీళ్లను ఆవిరి చేసేస్తున్నాయి.. ఐ డ్రాప్స్ కంపెనీల లాభాలు పెంచుతున్నాయి. స్మార్ట్ ప్రపంచంలో సమస్త సమాచారం చేతికందే దూరంలోనే ఉంటుంది. కాలు కదపకుండా మనకు కావాల్సిన సమాచారం, ఇతర అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలిగింది. మన అవసరాలు తీర్చడంతోపాటు అవే గ్యాడ్జెట్స్ మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయి. అతిగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లు వాడటం వల్ల మన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగినట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. 70% మంది కళ్లు పొడిబారిన సమస్యతో బాధపడుతుండగా వారిలో సగం మంది 20 నుంచి 30 మధ్య వయస్సు వారు ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటికి అవసరమైన నీళ్లు ఉత్పత్తి కావడం లే దని ఎయిమ్స్ గతేడాది చేపట్టిన సర్వేలో తేలింది. పదిమందిలో ఏడుగురికి ఇదే సమస్య కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతి పదిమందిలో ఏడుగురు ‘డిజిటల్ విజన్ సిండ్రోమ్’తో బాధ పడుతున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది. కంటికి చేటును తెస్తున్న ‘స్మార్ట్ ’డివైజెస్ మనదేశంలో ఒక వ్యక్తి సగటున రెండు గంటల 39 నిమిషాలపాటు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్లుగా ఈ ఏడాది చేపట్టిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో ఉద్యోగి రోజుకు ఆరున్నర గంటలపాటు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను వాడుతున్నట్లుగా మరో సంస్థ వెల్లడించింది. ప్రింట్ అయిన పేజీని చదవడానికి, కంప్యూటర్ లేదా డిజిటల్ స్క్రీన్‌ను చూడటానికి చాలా తేడా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ పేర్కొంది. కంప్యూటర్ స్క్రీన్‌పై వెలుతురులో అక్షరాలను చదవడంలో ఇబ్బందులు ఉంటాయి. గ్లేరింగ్, రిఫ్లెక్షన్, స్క్రీన్‌ను పైకీ కిందకి కదిలించడం వల్ల కంటి సమస్యలు పెరుగుతాయని వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల వాడకంతోపాటు ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండటం, వాతావరణ కాలుష్యం, ముఖ సౌందర్య సామగ్రి కళ్లు పొడిబారిపోవడానికి మరో కారణమని ఎయిమ్స్‌లోని ఆప్తమాలజీ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. ఏటా పెరుగుతున్న ఐ డ్రాప్స్ బిజినెస్ కళ్లు పొడిబారిన సమస్యకు సాధారణంగా రిఫ్రెష్ టియర్స్ వాడుతుంటారు. 2014 జూలై నుంచి 2018 జూలై మధ్య ఈ రిఫ్రెష్ టియర్స్ అమ్మకాలు 73 శాతం పెరిగాయి. ఓ కంపెనీ అమ్మకాలు 4,71,000 యూనిట్ల నుంచి 8,15,700 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. మరో బ్రాండ్‌కు చెందిన అమ్మకాలు ఏకంగా 800 శాతం పెరిగాయి. 2014లో ఆ బ్రాండ్ 82,600 యూనిట్లు అమ్మగా, 2018లో 7,45,000 యూనిట్లు అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో కంటి చుక్కల మందుల విభాగంలో 284 కొత్త ఉత్పత్తులను మందుల కంపెనీలు ప్రారంభించాయి. అందులో 45 ఉత్పత్తులు అంటే 15 శాతం కేవలం కళ్లు పొడిబారిన సమస్యకు సంబంధించినవే కావడం గమనార్హం. మిగిలినవి ఐ ఇన్ఫెక్షన్, కంటి చూపు మందగించిన సమస్యలకు వాడే డ్రాప్స్ ఉన్నాయి. -
చుక్కల మందుకు పెరిగిన గిరాకీ
రోజూ సుమారు 42 లక్షలకు పైగా స్మార్ట్ ఫోన్లు మన దేశంలో అమ్ముడుపోతున్నాయి. ఈ సంఖ్య చూస్తే మన దేశంలో మొబైల్ ఫోన్లకు ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతోంది. అయితే అదే సమయంలో కంట్లో వేసే చుక్కల మందులు కూడా భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే 54 శాతం అమ్మకాలు పెరిగాయి. ఇదేంటి సెల్ఫోన్లకు, చుక్కల మందుకు ఉన్న సంబంధం ఏంటనుకుంటున్నారా?..స్మార్ట్ ఫోన్లే మన కళ్లలో నీళ్లను ఆవిరి చేసేస్తున్నాయి..ఐ డ్రాప్స్ కంపెనీల లాభాలు పెంచుతున్నాయి. స్మార్ట్ ప్రపంచంలో సమస్త సమాచారం మనకు చేతికందే దూరంలోనే ఉంటుంది. కాలు కదపకుండా మనకు కావాల్సిన సమాచారం, ఇతర అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కలిగింది. అయితే మన అవసరాలు తీర్చడంతో పాటు మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయి. అతిగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లు వాడడం వల్ల మన కళ్లలో ఉండే నీరు ఇంకిపోయి కళ్లు పొడిబారిపోతున్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగినట్లుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 70 శాతం మంది కళ్లు పొడిబారిన సమస్యతో బాధపడుతుండగా వారిలో సగం మంది 20 నుంచి 30 మధ్య వయస్సు వారు ఉన్నారు. ఈ సమస్య కారణంగా కంటì కి అవసరమైన నీళ్లు ఉత్పత్తి కావడం లేదని ఎయిమ్స్ గతేడాది నిర్వహించిన సర్వేలో తేలింది. పదిమందిలో ఏడుగురికి ఇదే సమస్య కంటి సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చే ప్రతీ పదిమందిలో ఏడుగురు ‘డిజిటల్ విజన్ సిండ్రోమ్’తో బాధ పడుతున్నట్లుగా వైద్యునిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా గడిచిన నాలుగేళ్లలో 54 శాతం కంటి చుక్కల మందుల వ్యాపారం పెరిగింది. ఏటా పెరుగుతున్న ఐ డ్రాప్స్ బిజినెస్ కళ్లు పొడిబారిన సమస్యకు సాధారణంగా రిఫ్రెష్ టియర్స్ వాడుతుంటారు. 2014 జూలై నుంచి 2018 జూలై మధ్య ఈ రిఫ్రెష్ టియర్స్ అమ్మకాలు 73 శాతం పెరిగాయి. ఓ కంపెనీ అమ్మకాలు 4,71,000 యూనిట్ల నుంచి 8,15,700 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. మరో బ్రాండ్‌కు చెందిన అమ్మకాలు 800శాతం అమ్మకాలు పెరిగాయి. 2014లో ఆ బ్రాండ్ 82,600 యూనిట్లు అమ్మగా, 2018లో 7,45,000 యూనిట్లు అమ్ముడైనట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో కంటి చుక్కల మందుల విభాగంలో 284 కొత్త ఉత్పత్తులను మందుల కంపెనీలు ప్రారంభించాయి. అందులో 45 ఉత్పత్తులు అంటే 15 శాతం కేవలం కళ్లు పొడి బారిన సమస్యకు సంబంధించినవే కావడం గమనార్హం. మిగిలినవి ‘ఐ’ ఇన్ఫెక్షన్, కంటి చూపు మందగించిన సమస్యలకు వాడే డ్రాప్స్ ఉన్నాయి. కంటికి చేటును తెస్తున్న ‘స్మార్ట్’ డివైజ్స్ మనదేశంలో సగటున రెండు గంటల 39 నిమిషాల పాటు మొబైల్ ఫోన్‌ను వాడుతున్నట్లుగా ఈ ఏడాది నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఆఫీసులో ఉద్యోగి రోజుకు ఆరున్నర గంటల పాటు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ను వాడుతున్నట్లుగా మరో సంస్థ వెల్లడించింది. ప్రచురితమైన ఓ పేజీని చదవడానికి కంప్యూటర్ లేదా డిజిటల్ స్క్రీన్‌ను చూడడానికి చాలా తేడా ఉంటుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తమాలజీ పేర్కొంది. కంప్యూటర్ స్క్రీన్‌పై వెలుతురులో అక్షరాలను చదవడంలో అనేక ఇబ్బందులు ఉంటాయి..గ్లేరింగ్, రిఫ్లెక్షన్, స్క్రీన్‌ను పైకి కిందికి కదిలించడం వల్ల కూడా కంటి సంబంధిత సమస్యలు పెరుగుతాయని వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్ల వాడడంతో పాటు ఎక్కువ సేపు ఏసీ గదుల్లో ఉండడం, వాతావరణ కాలుష్యం, ముఖ సౌందర్య సామగ్రి కూడా కళ్లు పొడిబారిపోవడానికి మరో కారణంగా ఎయిమ్స్‌లోని ఆప్తమాలజీ విభాగానికి చెందిన ఓ ఫ్రొఫెసర్ తెలిపారు.