US Concerned Over Spread Of Drug-Resistant Germ Tied To Indian Eyedrops - Sakshi
Sakshi News home page

భారత్‌ ఐడ్రాప్స్‌పై యూఎస్‌ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ

Published Tue, Apr 4 2023 8:08 AM | Last Updated on Tue, Apr 4 2023 3:28 PM

US Concerned Spread Of Drug Resistant Germ Tied To Indian Eyedrops - Sakshi

భారత్‌ కంపెనీ తయారు చేసిన ఆర్టిఫిషియల్‌ టియర్స్‌ అనే ఐడ్రాప్స్ పట్ల అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఐ డ్రాప్స్‌ వాడటం వల్ల అత్యంత శక్తిమంతమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతవరకు ఇలాంటి బ్యాక్టీరియా జాతిని అమెరికాలో గుర్తించలేదని, ఇది ఏ యాంటి బయోటిక్స్‌కి లొంగదని యూఎస్‌ సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)​ తన నివేదికలో పేర్కొంది.

ఈ ఐ డ్రాప్స్‌ని చెన్నైకి చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ కంపెనీ ఎజ్రీకేర్‌ బ్రాండ్‌ పేరుతో తయారు చేస్తోంది. ఐతే ఈ ఐడ్రాప్స్‌ కారణంగా ముగ్గురు మృతి చెందారని, ఎనిమిది మందికి అంధత్వం వచ్చిందని, డజన్ల కొద్దీ ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయని సీడీసీ వెల్లడించింది. దీంతో అమెరికా ఆ ఉత్పత్తులన్నింటిని వెంటనే నిలిపేసింది. యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినస్ట్రేషన్‌ ఈ డ్రాప్స్‌లో కలుషితమైన కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల కంటి ఇన్షెక్షన్లు వస్తాయని, అది అంధత్వానికి లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఈ బ్యాక్టీరియా కారణంగా రక్తం, ఊపిరితిత్తులు ఇన్ఫక్షన్‌ అవుతాయని, దీని యాంటి బయోటిక్‌ రెసిస్టన్స్‌ కారణంగా చికిత్స చేయడం కష్టతరంగా మారిందని అమెరికా నివేదికలో తెలిపింది. ఈ ఐ డ్రాప్స్‌ని ఉపయోగించిన రోగులు, కంటి ఇన్ఫ్‌క్షన్లు వచ్చినా, అందుకు సంబంధించిన లక్షణాలు ఏమైనా తలెత్తిని వెంటనే వైద్యులను సంప్రదించాలని సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌సీడీసీ స్పష్టం చేసింది.

స్పందించిన గ్లోబల్‌ ఫార్మా కంపెనీ:
ఈ మేరకు ఐ డ్రాప్స్‌ను తయారు చేసే గ్లోబల్‌ ఫార్మా కంటపెనీ డైరెక్టర్‌ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. అమెరికా చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చారు. ఆ ఐ డ్రాప్స్‌లో వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాలేదని, కలుషితమైన కృత్రిమైన నీటిని వినియోగించలేదని వెల్లడించారు. ప్రమాణాల అనుగుణంగానే ఈ డ్రగ్‌ని రూపొందించినట్లు తెలిపారు.

దశల వారిగా జరిపిన పరిశోధన‍ల్లో తమకు ఐ డ్రాప్స్‌లో అలాంటివేమి కనిపించలేదని, కలుషితమైన వాటిని ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. అమెరికా చేసిన ఆరోపణలను ఖండించారు. కూడా. ఈ ఐ డ్రాప్‌ తయారు చేసే డ్రగ్‌ ప్లాంట్‌ వద్ద కూడా కలుషిత నీటిని వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె నొక్కి చెప్పారు

(చదవండి: యూకేలో పాస్‌పోర్ట్‌ సిబ్బంది సమ్మె)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement