లండన్: యూకేలోని ఓ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన సూపర్ మోడల్ జిగి హడిద్‌ని అధికారులు డ్రగ్స్‌తో పట్టుకున్నారు. గిగి అమెరికా నుంచి ప్రైవేట్ విమానంలో యూకేలోని కైమన్ ద్వీపానికి వెళ్లింది. ఈ క్రమంలో ఓవెన్ రాబర్ట్స్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె బ్యాగులను చెక్ చేయగా.. అందులో గంజాయి, వాటిని తాగేందుకు ఉపయోగించే వస్తువులు కూడా అందులో లభించాయి.
ఇక రెడ్‌హ్యాండెడ్‌గా గిగి దొరికిపోయింది. ఆ సమయంలో గిగి తన స్నేహితురాలు లేహ్ నికోల్ మెక్‌కార్తీతో కలిసి ఉన్నారు. దీంతో పోలీసులు వారివురిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
కోర్టులో వారు నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి రూ.1000 డాలర్లు జరిమానా విధించారు. అనంతరం వారికి బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కాగా, గంజాను వ్యక్తిగతంగా వినియోగించడానికే తీసుకొచ్చినప్పటికీ.. దానిని దిగుమతి చేయడం, గంజా తాగడానికి ఉపయోగించే పాత్రలను తీసుకురావడం వంటి ఆరోపణలపై అమెరికన్ సూపర్ మోడల్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
చదవండి China Common Man Becomes Rich: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!
Comments
Please login to add a commentAdd a comment