
బాల్డ్‌విన్ ఆనంద బాష్పాలు
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్‌విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్‌పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్‌విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్‌విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment