rehearsals
-
‘రస్ట్’ కేసు కొట్టివేత
శాంటా ఫే: ‘రస్ట్’ సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్‌పై ఉన్న ‘అసంకల్పిత హత్య’ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది. -
మిలాన్ రిహార్సల్స్ అదుర్స్
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): భారీ యుద్ధ నౌకలు... స్పీడు బోట్లు.. ఫైటర్ జెట్స్... యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ తీరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. మిలాన్–2024లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో మంగళవారం నిర్వహించిన ఫైనల్ రిహార్సల్స్ అద్భుతంగా సాగాయి. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు తీరంలో తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించటం, తీవ్రవాదుల దాడులను ఎదుర్కొవడం వంటి అంశాలను ప్రదర్శించారు. అనంతరం మిగ్, హక్స్, ఫైటర్ జెట్స్ తీరంలో బాంబులను వెదజల్లుతూ అబ్బురపరిచాయి. అదే సమయంలో ఆకాశం నుంచి ఆరుగురు సైనికులు జాతీయ పతాకం, నేవీ పతాకం పట్టుకుని పారాచూట్ ద్వారా కిందికి దిగారు. వారు ఒక బహుమతిని ముఖ్య అతిథికి అందజేశారు. నేవీ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, జాతీయ గీతాల ప్రదర్శనలు అలరించాయి. అనంతరం దేశ రక్షణ బలగాలు, రాష్ట్ర రక్షణ బలగాలు, విదేశీ నేవీ బలగాలు, రాష్ట్ర సంప్రదాయ కూచిపూడి, థింసా, కోయ నృత్యాలు, సంక్షేమ పథకాల నమూనాలతో భారీ పరేడ్ నిర్వహించారు. ఈ నెల 22వ తేదీన తుది పరేడ్‌ను నిర్వహించనున్నారు. కాగా, పరేడ్ ఫైనల్ రిహార్సల్స్ చూసేందుకు విశాఖ నగర వాసులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి కురుసుర మ్యూజియం వరకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఈ రిహార్సల్స్‌ను చూసేందుకు నేవీ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. -
‘స్పేస్’లో ఇళ్లకు రిహార్సల్‌గా భూమిపై త్రీడీ ప్రింటింగ్ హోటల్
ఇల్లు కట్టాలంటే.. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇలా ఎన్నోకావాలి. మరి భవిష్యత్తులో చందమామపైకో, అంగారకుడిపైకో వెళ్లినప్పుడు అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఎలా? దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చెప్తున్న సమాధానం.. ‘త్రీడీ ప్రింటింగ్’ ఇళ్లు. కేవలం చెప్పడమే కాదు! చంద్రుడు, అంగారకుడిపై ఇళ్లు కట్టేందుకు ఓ ప్రైవేటు కంపెనీతో భాగస్వామ్య ఒప్పందమూ కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఇందుకు రిహార్సల్‌గా.. భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో విశాలమైన హోటల్‌ను కట్టేందుకు రెడీ అయింది. ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? భవిష్యత్తుకు బాటలు వేసేలా.. మున్ముందు చంద్రుడిపైకి, అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మనుషులు అక్కడ జీవించేందుకు వీలుగా.. అక్కడి మట్టితోనే ఇళ్లు కట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్‌లో పేరెన్నికగన్న కంపెనీ ‘ఐకాన్’తో భాగస్వామ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఐకాన్ సంస్థ తొలుత ప్రయోగాత్మకంగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించి పరిశీలించాలని నిర్ణయించింది. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఎడారిలో ఉన్న మర్ఫా పట్టణ శివార్లలో 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్ భవనాలు, గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఏమిటీ హోటల్ ప్రత్యేకతలు? ► ఈ హోటల్లో త్రీడీ విధానంలో ప్రింట్ చేసే కొన్ని భవనాలు, దూరం దూరంగా కొన్ని ఇళ్లు, ఒక స్విమ్మింగ్ పూల్, స్పా, ఆరుబయట సేద తీరేందుకు పలు ఏర్పాట్లు ఉంటాయి. ► దూరం దూరంగా నిర్మించే ఇళ్లకు ‘సండే హోమ్స్’గా పేరుపెట్టారు. రెండు నుంచి నాలుగు బెడ్రూమ్లు, బాత్రూమ్లతో ఆ ఇళ్లు ఉంటాయి. ► గుండ్రటి నిర్మాణాలు, డోమ్‌లు, ఆర్చీల డిజైన్లతో ఇళ్లు, భవనాలు ఉంటాయి. గదుల్లో బెడ్లు, టేబుల్స్ వంటి కొంత ఫర్నిచర్‌ను కూడా త్రీడీ విధానంలోనే ప్రింట్ చేయనున్నారు. ► చుట్టూ ఉన్న ఎడారి వాతావరణంలో కలిసిపోయేలా ఈ నిర్మాణాలకు రంగులను నిర్దేశించారు. ► ఎడారిలో క్యాంపింగ్ సైట్‌గా ఉన్న ప్రాంతంలో ప్రింట్ చేస్తున్న ఈ హోటల్‌కు ‘ఎల్ కాస్మికో’గా పేరు పెట్టారు. ఇలాంటి త్రీడీ ప్రింటెడ్ హోటల్ ప్రపంచంలో ఇదే మొదటిది కానుందని చెప్తున్నారు. ► ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ కంపెనీ ‘బిగ్ (బ్జర్కే ఇంగెల్స్ గ్రూప్)’ దీనికి డిజైన్లు రూపొందించగా.. ఐకాన్ సంస్థ త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మాణాలు చేపట్టనుంది. ఇక్కడ చేసి.. చూపించి.. ‘‘చంద్రుడు, మార్స్‌పై మొట్టమొదటి నివాసాలు కట్టేందుకు మా సంస్థ నాసాతో కలసి పనిచేస్తోంది. వాటికి రిహార్సల్‌గా అక్కడి ప్రాంతాలను పోలినట్టుగా భూమ్మీద ఉన్న ఎడారిలో త్రీడీ ప్రింటింగ్‌తో ఇళ్లను నిర్మించబోతున్నాం. కేవలం మట్టిని వాడి ఇళ్లను నిర్మించిన పురాతన మూలసూత్రాలను, ప్రస్తుత అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని వినియోగించి.. అద్భుతమైన నిర్మాణాలను రూపొందించనున్నాం..’’ – ‘ఐకాన్’ సహ వ్యవస్థాపకుడు జేసన్ బల్లార్డ్, హోటల్ యజమాని లిజ్ లాంబర్ట్ –సాక్షి సెంట్రల్ డెస్క్ -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రిహార్సల్స్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల డ్రెస్ రిహార్సల్స్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్స్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిడ్–19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
విశాఖపట్నం : సాగరతీరంలో ‘ఉగ్ర అలజడి’ ( ఫోటోలు)
-
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ రిహార్సల్స్
-
సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్లో రిపబ్లిక్ డే రిహర్సల్స్
-
మేరా భారత్ మహాన్
-
‘రిహార్సల్స్’ కొనసాగింపు!
వరల్డ్‌కప్‌కు రిహార్సల్స్‌గా సాగుతున్న పొట్టి క్రికెట్ మ్యాచ్‌ల పోరులో ఆస్ట్రేలియాతో మనోళ్లు క్లీన్‌స్వీప్ చేసేశారు. మరో రెండు వారాల తర్వాత ఆసియా కప్‌లో కనీసం నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆలోగా భారత్ కోసం మరో అంకం సిద్ధంగా ఉంది. అదే శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్. బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌తో పోలిస్తే ప్రపంచకప్‌లోపు సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడటం ధోని సేనకు కచ్చితంగా లాభిస్తుంది. ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్‌తో పాటు పరిస్థితులపై కూడా అవగాహన వస్తుంది. ఇదే ఆలోచనతో మరో క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టిన టీమిండియా సిరీస్ గెలిస్తే నంబర్‌వన్ ర్యాంక్‌నూ నిలబెట్టుకుంటుంది. * సొంతగడ్డపై భారత్ వరల్డ్‌కప్ సన్నాహాలు * రేపటినుంచి శ్రీలంకతో టి20 సిరీస్ సాక్షి క్రీడా విభాగం: వన్డేల్లో అలా వ్యాహ్యాళికి వెళ్లినంత అలవాటుగా, అతి తరచుగా, అభిమానులకు విసుగొచ్చేంతగా తలపడ్డ ప్రత్యర్థులు భారత్, శ్రీలంక. అయితే ఈ ‘ప్రియమైన శత్రువు’లకు టి20 క్రికెట్లో మాత్రం పెద్దగా ఎదురుపడే అవకాశం రాలేదు. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు మాత్రమే జరగ్గా... ఇందులో రెండు జట్లు చెరో 3 మ్యాచ్‌లు గెలిచాయి. వెస్టిండీస్ పర్యటన రద్దు నేపథ్యంలో బీసీసీఐ విజ్ఞప్తి మేరకు ఏడాదిన్నర క్రితం హడావిడిగా వన్డే సిరీస్‌కు వచ్చిన లంక, ఇప్పుడు కూడా టీమిండియాకు ‘ప్రాక్టీస్’ కల్పించేందుకు వారం రోజుల వ్యవధిలో మూడు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధం అయింది. భారత్, శ్రీలంక మధ్య జరిగిన రెండు వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ప్రత్యర్థినే విజయం వరించింది. 2014 టి20 ప్రపంచకప్ ఫైనల్లో లంక చేతిలో భారత్ ఓటమి తర్వాత ఇరు జట్లు తలపడనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మాత్రమే విశ్రాంతినివ్వగా... గాయాలతో మలింగ, మ్యాథ్యూస్ తప్పుకోవడంతో లంక జట్టులో దాదాపు అంతా కొత్త కుర్రాళ్లే కనిపిస్తున్నారు. కొత్తగా ప్రయత్నిస్తారా! టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో లేని ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు లంకతో సిరీస్‌లో పాల్గొంటున్నారు. బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే, బౌలర్ భువనేశ్వర్ కుమార్‌లకు ఈ సిరీస్‌లో అవకాశం దక్కింది. వరల్డ్ కప్ కోసమే ఈ సన్నద్ధత అని భావిస్తే వీరిద్దరికి తుది జట్టులో చోటే లభించకపోవచ్చు. ఆసీస్‌తో విజయం సాధించిన జట్టునే కాకుండా బయట అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా ఈ సిరీస్‌లో ప్రయత్నించాలని భావిస్తే ఆడించే అవకాశం ఉంది. కాబట్టి పాండే, భువీ కూడా మ్యాచ్‌ను ఆశిస్తున్నారు. ఇక ఓపెనర్‌గా రహానేకు ఒక అవకాశం ఇచ్చి చూడాలనే ఆలోచన కూడా ఉంది. అన్నింటికి మించి లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్ నేగికి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే నేరుగా వరల్డ్‌కప్‌కు ఎంపికైన నేగిపై ఐపీఎల్ వేలంతో అంచనాలు మరింత పెరిగాయి. ఐపీఎల్లో అతడి ఆటను దగ్గరి నుంచి చూసిన ధోని, ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లో నేగి ఆటపై ప్రత్యేకంగా దృష్టి పెడతాడనడంలో సందేహం లేదు. జడేజా లేదా పాండ్యాలలో ఒకరికి విశ్రాం తినిచ్చి నేగిని రెగ్యులర్‌గా ఆడించే అవకాశం ఉంది. అంతా కొత్తగా... భారత బోర్డుతో మొహమాటానికే తప్ప శ్రీలంక జట్టు ఈ సిరీస్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిం చడం లేదు. చాలా మంది సీనియర్లు గాయం పేరుతోనే దూరమయ్యారు. లసిత్ మలింగ, మ్యాథ్యూస్లకు తోడు సీనియర్లు కులశేఖర, రంగన హెరాత్ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక గాయంతో ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదు. శనివారం శ్రీలంక జట్టు భారత్‌కు చేరగా... అతను మాత్రం వారితో రాలేదు. దాదాపు నాలుగేళ్ల క్రితం లంక తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడిన దిల్హారా ఫెర్నాండో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో దిల్షాన్ మినహా తిసార పెరీరాకే ఎక్కువ మ్యాచ్‌లు (42) ఆడిన అనుభవం ఉంది. గతంలో కూడా ఈ ఫార్మాట్లో లంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన చండీమల్ ఈసారి కూడా జట్టును నడిపిస్తున్నాడు. గత నెలలో కివీస్ చేతిలో 0-2తో శ్రీలంక టి20 సిరీస్ ఓడింది. జట్ల వివరాలు భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రైనా, యువరాజ్, పాండే, జడేజా, అశ్విన్, పాండ్యా, బుమ్రా, హర్భజన్, నెహ్రా, భువనేశ్వర్, నేగి. శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), దిల్షాన్, ప్రసన్న, సిరివర్ధన, గుణతిలక, తిసార పెరీరా, షనక, గుణరత్నే, కపుగెదెర, చమీరా, దిల్హారా ఫెర్నాండో, రజిత, బినూరా ఫెర్నాండో, సేనానాయకే, వాండర్సే. నిలవాలంటే గెలవాలి శ్రీలంకతో సిరీస్‌ను గెలుచుకుంటే భారత జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. కనీసం 2-1తో గెలిచినా భారత్ నంబర్‌వన్‌గా కొనసాగుతుంది. ఇదే తేడాతో లంక గెలిస్తే ఆ జట్టు నంబర్‌వన్ కావడంతో పాటు భారత్ ఏడో స్థానానికి దిగజారుతుంది. -
రక్షణ ఛత్రంలో సాగర తీరం
-
రక్షణ ఛత్రంలో సాగర తీరం
► 15 వేల మందితో బందోబస్తు ► 3,4 తేదీల్లో పూర్తిస్థాయి రిహార్సల్స్ ► 7న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ► 1.50 లక్షల మంది సందర్శకులకు పాస్‌లు అల్లిపురం: అంతర్జాతీయ నౌకా ప్రదర్శన (ఐఎఫ్ఆర్) పటిష్ట భద్రతను నగర పోలీస్‌లు కల్పించారు. బుధవారం నుండి రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. అయితే పోలీసులు చెప్పిన దానికి బీచ్‌రోడ్డులో భిన్నమైన వాతావరణ కనిపిస్తుంది. నేవీ అధికారులు బీచ్‌రోడ్డును పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7గంటల వరకు బీచ్రోడ్లోకి వాహనాలు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. 15వేల మందితో భద్రత.. అంతర్జాతీయ నౌకా ప్రదర్శనకు భద్రతను మూడు ఫేజ్‌లలో ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌లో 3500 మందితోను. రెండవ ఫేజ్‌లో 7వేల మందితోను మూడవఫేజ్‌లో 15వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ట్రాఫిక్ నియంత్రణలకు అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఇప్పటికే 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అదనంగా మరికొన్న చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. అదే విధంగా స్నిఫర్ డాగ్స్ టీమ్స్, అర్మిడ్ సెక్యూరిటీ ఫోర్సు, బాంబ్ డిస్పోసబుల్ స్క్వాడ్స్‌తో నిరంతర తనిఖీలు ఉంటాయని తెలిపారు. అదే విధంగా 300 సీసీ కెమారాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటంతటికీ కంట్రోల్ అండ్ కమాండ్ రూంను వుడా చిల్డ్రన్ థియేటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లక్షా 50వేల మందికి మీసేవ ద్వారా పాస్‌లు.. నౌకా ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు లక్షా 50వేల పాస్‌లు మీ సేవా కేంద్రాల ద్వారా జిల్లా యంత్రాంగం అందజేసింది. సందర్శకులు పాస్‌లతో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకుని రావాలని సూచించారు. వీలైనంత వరకు నగర ప్రజలు 3,4 తేదీలలో జరిగే ఫుల్ డ్రస్ రిహారల్స్ను వినియోగించుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సూచించారు. 7వ తేదీన జరిగే అంత ర్జాతీయ నౌకా ప్రదర్శనకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవకాశం కల్పించాలని కోరారు. పోలీసులు సూచించిన విధంగా నగర ప్రజలు, సందర్శకులు మసలుకొని విశాఖ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాలని కోరారు. అదే విధంగా పోలీసులతో సహకరించాలని కోరారు. నగరంలో 95 సెంటర్లలో భారీ స్క్రీన్లు.. బీచ్‌రోడ్‌లో జరిగే నౌకా విన్యాసాలను నగర ప్రజలు వీక్షించేందుకు నగరంలో సుమారు 95 సెంటర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. అదే విధంగా ఆ రోజు సినిమా థియేటర్లలోను లైవ్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కీలకం కానున్న సమాచార వ్యవస్థ.. అంతర్జాతీయ స్థాయి వేడుకలకు నగరం వేదిక కావడంతో భద్రత పరంగా ప్రాధాన్యం చోటుచేసుకుంది. అం దుకు తగిన విధంగా నగర పోలీస్ కమిషనరేట్‌లో ఇన్ఫర్మేషన్ విభాగం డీఎస్పీ ఎస్.జ్యోతిర్మయి పర్యవేక్షణలో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఈ ఈవెంట్లో కీలకం కానుంది. ఈ మేరకు వెయ్యి అధునాతన వాకీ టాకీలు (వాయిస్ రెస్పాన్స్ సిస్టంలు) వినియోగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం క్యూనికేషన్ ఏడీజీపీ అంజనా సిన్హా కనుసన్నలలో నడవడం విశేషం. ఇందుకుగాను 14 మంది సిబ్బంది నిరంతరం సీసీ కెమారా ఫుటేజీలను పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సంబంధిత బీట్ కానిస్టేబుల్స్‌కు అందజేయటం జరుగుతుంది. ట్రాఫిక్ ఏర్పాట్లు.. అంతర్జాతీయ నౌకా ప్రదర్శనకు వచ్చే విఐపీలు, వీవీఐపీల రాక పోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. సైలర్స్ చావులమదుం జంక్షన్ నుంచి పోర్టు రోడ్లులో, కోస్టల్బ్యాటరీ వద్దకు చేరుకుని అక్కడ వారికి నిర్దేశించి స్థలంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు బీచ్‌రోడ్డు పోలీస్ మెస్ నుండి కాళీమాత గుడి, ఎన్టీఆర్ కూడలి వరకు నేవీ వారి స్వాధీనంలో ఉంటుందన్నారు. సందర్శకులు కేవలం పార్క్ హోటల్ నుంచి బీచ్‌లోకి ప్రవేశించి పోలీస్ మెస్ వరకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. అదే విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు అనుమతిస్తారని తెలిపారు. నేవీ సిబ్బందికి ఏపీఐఐసీ గ్రౌండ్సులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల మెస్ వెన క గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సైలర్స్కు హైవే నుంచి మద్దిలపాలెం నుంచి ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుండి షటిల్ బస్‌లు ద్వారా పోలీస్ మెస్ వరకు వచ్చి వారికి కేటాయించిన స్థలానికి చేరుకోవాలి. జనరల్ పబ్లిక్ పార్క్ హోటల్ వరకు చేరుకుని అక్కడ నుండి బీచ్‌లోకి ఎంటర్ కావాలి. ఆర్టీసీ బస్‌లు లాసన్స్‌బే కాలనీ కామత్ హోటల్ వరకు అనుమతిస్తారు. ఆర్టీసీ షటిల్ బస్సు రూటు 1. ఏఎస్ రాజా నుంచి కామత్ హోటల్ వరకు 2. ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి మానసిక ఆస్పత్రి 3. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి న్యూ కేర్ ఆస్పత్రి 4. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ 2/4 వీలర్ వాహనాలు 1. ఈస్ట్‌పాయింట్ కాలనీ రోడ్ 2. ఏయూ కేంపస్ ప్రవేశం 3. ఆంధ్ర మెడికల్ కాలేజ్ హాస్టల్ మైదానం ప్రవేశం -
సోమవారం నుంచి విశాఖలో పరేడ్ రిహార్సల్స్
హైదరాబాద్ : ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని విశాఖపట్నంలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. ఈ వేడుకల్లో పోలీసు పరేడ్ ప్రధానమైన అంశం. దీన్ని పక్కాగా నిర్వహించడం కోసం కొన్ని రోజుల ముందు నుంచీ రిహార్సల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం (ఆగస్టు 3) నుంచి వీటిని ప్రారంభించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. డీజీపీ జేవీ రాముడు నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాటికే రిహార్సల్స్‌లో పాల్గొనే పోలీసు బలగాలను విశాఖపట్నం తరలించనున్నారు. ఆర్కే బీచ్‌కు ఆనుకుని ఉన్న రోడ్డులో సముద్రానికి అభిముఖంగా ప్రధాన వేదిక ఏర్పాటు చేయనున్నారు. పరేడ్ సైతం ఈ రోడ్డులోనే జరుగుతుందని అధికారులు తెలిపారు. -
మహిళా సాధికారతే ప్రధానాంశం
ఆకట్టుకున్న గణతంత్ర దిన ఫుల్ డ్రస్ రిహార్సల్స్ న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర వేడుకల్లో మహిళా సాధికారతే ప్రధానాంశంగా నిలవనుంది. ఈ మేరకు ఆ రోజున రాజ్‌పథ్‌లో నిర్వహించే ప్రదర్శనల్లో త్రివిధ దళాలకు చెందిన మహిళా కాంటిజెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రస్ రిహార్సల్స్‌లో భాగంగా ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన వైమానిక దళానికి చెందిన జెట్ విమానాల విన్యాసాలు, చక్కని క్రమశిక్షణతో చకచకా ముందుకుసాగే మహిళా కంటింజెంట్లు, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వివిధ రాష్ట్రాలకు చెందిన రథాలు సందర్శకులను కట్టిపడేశాయి. శుక్రవారం రాజ్‌పథ్‌లో నిర్వహించిన ఫుల్ డ్రస్ రిహార్సల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసిక పుత్రికలైన ‘జన్ ధన్ యోజన’, ‘మా గంగా’, ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’, ‘బులెట్ రైలు’, ‘మేక్ ఇన్ ఇండియా’ తదితర రథాలు రాజ్‌పథ్‌కు వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందినవారిని చూపుతిప్పుకోనివ్వకుండా చేశాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ గుజరాత్‌కు చెందిన ‘స్టేట్యూ ఆఫ్ యూనిటీ’ రథం కూడా రాజ్‌పథ్‌లో ముందుకుసాగింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ఆధారంగా ఇచ్చిన ప్రదర్శన ఔరా అనిపించింది. వేడుకలు సమీపిస్తుండడంతో రాజ్‌పథ్ గగనతలంలో శుక్రవారం నాలుగు సైనిక హెలికాప్టర్లతో జాతీయ జెండాతో ప్రివ్యూ నిర్వహించారు. అనంతరం వైమానిక, నౌకాదళాలు బ్రహ్మోస్ మిస్సైళ్లు, ఉపరితలం నుంచి ఉపరితలంపైనే శత్రువులపై దాడిచేసే ఆకాశ్ క్షిపణులు, 214 ఎం.ఎం. పినాకా రాకెట్లు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకు, టీ-72 ట్రాల్, త్రీ డెమైన్షనల్ టాక్టికల్ కంట్రోల్ రాడార్ సిస్టమ్ తదితరాలు భారతీయ సైనిక పాటవానికి ప్రతీకగా ముందుకు సాగాయి. దీంతోపాటు అత్యాధునిక ఆయుధవ్యవస్థ, పారామిలిటరీ బలగాలు... బ్యాండ్‌కు అనుగుణంగా ముందుకు సాగాయి. వీటన్నింటినీ కన్నార్పకుండా తిలకించిన సందర్శకులు ఆనందపరవశంతో చప్పట్లు కొట్టారు. ఇవాళ జరిగిన పరేడ్‌లో జాతీయ సాహస బాలల పురస్కార విజేతలు కూడా పాల్గొన్నారు. దీంతోపాటు ఇవాళ్టి రిహార్సల్లో భాగంగా 16 రాష్ట్రాలకు చెందిన రథాలు కూడా పాలుపంచుకున్నాయి. ఆకట్టుకున్న విన్యాసాలు ఫుల్ డ్రస్ రిహార్సల్స్ ముగింపు దశలో భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్, జాగ్వార్, సీ-130జే తదితర యుద్ధవిమానాలు చేసిన విన్యాసాలను సందర్శకులు ఊపిరి బిగబట్టి తిలకించారు. కాగా ఈ రిహార్సల్స్‌ను తిలకించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో బయల్దేరడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
సెట్స్‌లో అప్సెట్!
పని పెరిగి... ఒత్తిడి అధికమైతే ఏం జరుగుతుంది..! దిమ్మ తిరిగి... బాడీ బెండవుతుంది. అందుకు బాలీవుడ్ ‘మేరికోమ్’ కూడా మినహాయింపేమీ కాదు. పాత్రలో జీవించడానికి ఆ మధ్య రింగ్‌లో దిగి పంచ్‌ల పవర్ చూపించిన ఈ అమ్మడు... ఇప్పుడు ‘హెవీ డ్యూటీ’ దెబ్బకు సెట్స్‌లో స్పృహ తప్పి పడిపోయింది. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్లో నాలుగు గంటలు నిర్విరామంగా రిహార్సల్స్‌లో మునిగిపోయిన ప్రియాంక... ఉన్నట్టుండి కళ్లు గిరగిరా తిరిగి కిందపడింది. అక్కడున్నవారంతా షాకయ్యి... షేకయ్యారని మిడ్ డే కథనం. -
దసరా ఏనుగులకు ‘అగ్ని పరీక్ష’
మైసూరు : విశ్వ విఖ్యాత దసరా సంబరాల్లో జరిగే జంబూ సవారీలో పాల్గొనే ఏనుగుల చేత చేయిస్తున్న రిహార్సల్స్‌లో భాగంగా శనివారం ఫిరంగి పేలుళ్లు నిర్వహించారు. రాజ ప్రాసాదం దక్షిణ ద్వారంలోని కోట మారమ్మ దేవస్థానంలో ఈ రిహార్సల్స్ జరిగాయి. దసరా ఉత్సవాల్లో జంబూ సవారీని నిర్వహించేటప్పుడు బన్ని మంటపం వద్ద 21 సార్లు ఫిరంగుల ద్వారా పేల్చుతారు. ఆ సందర్భంగా ఏనుగులు, గుర్రాలు బెదిరి పోకూడదనే ఉద్దేశంతో ముందుగానే శిక్షణనిస్తారు. అందులో భాగంగా ఎనిమిది సార్లు ఫిరంగి పేలుళ్లు జరిపారు. అక్టోబరు మూడే తేదీ వరకు మూడు రోజులకోసారి ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు, పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈ శిక్షణ ఉంటుంది. రాజప్రాసాదం ఆవరణలో విడిది చేసిన అర్జున నాయకత్వంలోని తొలి బృందానికి ఇదంతా పరిచయమే కనుక ఇనుప గొలుసులతో వాటిని బంధించలేదు. రెండో బృందంలోని ఏనుగులను మాత్రం గొలుసులతో బంధించారు. ఈ బృందంలోని దుర్గా పరమేశ్వరి, గోపీ అనే ఏనుగులు మాత్రం పేలుడు శబ్దాలకు కొంత గాబరా పడ్డాయి. -
నేవీ డే సందర్భంగా విశాఖ తీరంలో విన్యాసాలు