సోమవారం నుంచి విశాఖలో పరేడ్ రిహార్సల్స్ | rehearsals for police parade start from Monday | Sakshi
Sakshi News home page

సోమవారం నుంచి విశాఖలో పరేడ్ రిహార్సల్స్

Published Thu, Jul 30 2015 7:35 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

rehearsals for police parade start from Monday

హైదరాబాద్ : ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని విశాఖపట్నంలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. ఈ వేడుకల్లో పోలీసు పరేడ్ ప్రధానమైన అంశం. దీన్ని పక్కాగా నిర్వహించడం కోసం కొన్ని రోజుల ముందు నుంచీ రిహార్సల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం (ఆగస్టు 3) నుంచి వీటిని ప్రారంభించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది.

డీజీపీ జేవీ రాముడు నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాటికే రిహార్సల్స్‌లో పాల్గొనే పోలీసు బలగాలను విశాఖపట్నం తరలించనున్నారు. ఆర్కే బీచ్‌కు ఆనుకుని ఉన్న రోడ్డులో సముద్రానికి అభిముఖంగా ప్రధాన వేదిక ఏర్పాటు చేయనున్నారు. పరేడ్ సైతం ఈ రోడ్డులోనే జరుగుతుందని అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement