
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల డ్రెస్ రిహార్సల్స్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు.
అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్స్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిడ్–19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment