CS Somesh Kumar
-
బిగుస్తున్న ఉచ్చు.. మాజీ సీఎస్ సోమేష్పై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారంటూ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమేష్‌కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించిన శ్రీకాంత్.. ఆయనకు గుర్గావ్లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయన్నారు. నోయిడాలోనూ కీలక ప్రాంతాల్లో బినామీల పేరుతో స్థలాలు కొన్నారని శ్రీకాంత్ అంటున్నారు. రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను జారీ చేశారన్న శ్రీకాంత్.. యాచారంలో సోమేష్‌కుమార్ భార్య పేరిట 25 ఎకరాల భూమిని కొన్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోనూ సోమేష్‌కుమార్‌కు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. సోమేష్‌కుమార్, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ అధికారాన్ని దుర్వినియోగంతోనే సంపాదించారని ఆరోపించారు. సోమేష్‌కుమార్ ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ చేసిన శ్రీకాంత్.. దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇదీ చదవండి: టీవీ5 సాంబశివరావుపై చీటింగ్ కేసు నమోదు -
కౌన్ బనేగా ‘రెరా’ చైర్మన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా) చైర్మన్‌గా ఎవరు నియమితులవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఎస్కే జోషి సహా పలువురు పదవిలో ఉన్న, పదవీ విరమణ పొందిన అధికారులు చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇందుకు కారణం. ఈనెల 3తో దరఖాస్తు గడవు ముగియనుంది. ఇప్పటికే 50కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ జాబితాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, రిటైర్డ్ ఐఏఎస్‌లు చిరంజీవులు, బుసాని వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారులు కూడా బరిలో ఉన్నట్లు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్, టీఎస్ రెరా మాజీ చైర్మన్రాజేశ్వర్ తివారీ ఈసారి దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఎంపిక ఎలా ఉంటుందంటే.. టీఎస్ రెరాకు చైర్మన్, సభ్యుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. తొలుత ఫిబ్రవరి 17ను గడువుగా విధించినా ఆ తర్వాత మార్చి 3 వరకూ పొడిగించింది. రెరా చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అదనపు కార్యదర్శి స్థాయిలో పనిచేసిన వారు చైర్మన్ పదవికి అర్హులు. వచ్చిన దరఖాస్తుల్లోంచి రెండు పేర్లను ఈ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. అందులోంచి ఒకర్ని ప్రభుత్వం చైర్మన్‌గా నియమిస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ లాబీయింగ్ చేశారని, రాష్ట్ర పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా సోమేశ్ పేరు లాంఛనమే అని రియల్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్‌గా నియమితులైన వాళ్లు ఐదేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్లోనే.. స్థిరాస్తిరంగ నియంత్రణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 2016లో రెరా చట్టాన్ని రూపొందించింది. అయితే రాష్ట్రంలో మాత్రం రెండేళ్లు ఆలస్యంగా 2018లో రెరాను అమల్లోకి తెచ్చారు. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తిస్థాయి రెరా అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా రాష్ట్రంలో ఇప్పటివరకు అథారిటీ, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. ఇలా అథారిటీని ఏర్పాటు చేయని రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్, తెలంగాణ ఉండటం గమనార్హం. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన అన్ని నిర్మాణ ప్రాజెక్ట్‌లు టీఎస్ రెరా పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రెరాలో 5 వేలకుపైగా ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. -
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను: సోమేష్ కుమార్
-
సోమేశ్ నిర్ణయాలపై సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: సీఎస్ మేశ్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని టీపీ సీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్‌గా సోమేశ్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరా రు. ఆయన నియామకం అక్రమమని మొదటి నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు హైకోర్టు కూ డా అదే చెప్పిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. -
ఒక తీర్పు.. పలువురిలో కలవరం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు పలువురు అఖిల భారత సర్వీసు అధికారుల్లో కలవరం పుట్టిస్తోంది. తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ కేడర్‌లో కొనసాగడానికి రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లోని సివిల్ సర్వీసెస్ అధికారులను ఆప్షన్లు అడిగిన తరువాత.. వారి సీనియారిటీ, స్థానికత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీవోపీటీ) వారిని రెండు రాష్ట్రాలకు విభజించి కేటాయింపు జరిపింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పలు కారణాలు చూపిస్తూ.. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (సీఏటీ)ను ఆశ్రయించి ఏపీకి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఉండడానికి అనుమతులు తెచ్చుకున్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్ కూడా వీరిలో ఉన్నారు. అయితే డీవోపీటీ 2017లోనే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం మంగళవారం తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం..సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పు ఇవ్వడం.. పలువురు అధికారులను కలవరపరుస్తోంది. తామంతా ఏపీకి వెళ్లాల్సిందేనా? అన్న చర్చ సదరు ఐఏస్, ఐపీఎస్ అధికారుల్లో కొనసాగుతోంది. ఏపీకి కేటాయించిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన కొందరు ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతున్నారు. అక్కడివారు ఇక్కడ.. ఇక్కడివారు అక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కేడర్లలో కాకుండా క్యాట్ ఉత్తర్వులతో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వారిలో 9 మంది ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఐపీఎస్‌లకు సంబంధించి ఇటీవలే తెలంగాణ ఇన్చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, అభిలాష్ మహంతిలు ఆంధ్ర కేడర్‌కు చెందిన అధికారులు కాగా.. తెలంగాణలో పనిచేస్తున్నారు. మొన్నటివరకు ఏపీ కేడర్‌కు చెందిన సంతోష్ మెహ్రా తెలంగాణలో పనిచేసినా, ఈ మధ్యనే ఆయన ఏపీ కేడర్‌కు వెళ్లిపోయారు. కాగా తెలంగాణకు కేడర్‌కు కేటాయించిన మనీష్‌కుమార్ సింగ్, అమిత్‌గార్గ్, అతుల్ సింగ్‌లు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఈ విధంగా ఐఏఎస్ అధికారుల్లో సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఎం.ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తెలంగాణ కేడర్‌లో పనిచేస్తుండగా కాగా తెలంగాణ కేడర్‌కు కేటాయించిన హరికిరణ్, శ్రీజన, శివశంకర్‌లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్నారు. ఇన్చార్జి డీజీపీగా అందుకేనా? తెలంగాణ డీజీపీగా అంజనీ కుమార్‌ను రెగ్యులర్ డీజీపీగా కాకుండా ఇన్చార్జి డీజీపీగా నియమించడానికి ప్రధాన కారణం హైకోర్టులో సోమేశ్‌కుమార్‌పై కొనసాగుతున్న కేసు నేపథ్యమేనన్న ప్రచారం ఉంది. తాజా తీర్పుతో ఇప్పుడు అంజనీకుమార్ పరిస్థితేంటన్నది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఉండగా సీనియర్ ఐఏఎస్‌ల్లో వాకాటి కరుణ ప్రస్తుతం విద్యా శాఖ కార్యదర్శిగా, వాణీప్రసాద్ పర్యావరణ పరిరక్షణ, పరిశోధన, శిక్షణా సంస్థలో డైరెక్టర్‌గా, రొనాల్డ్‌రోస్ ఆర్థికశాఖ కార్యదర్శిగా, ఎం.ప్రశాంతి అటవీ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాటా ఆమ్రపాలి కేంద్ర సర్వీస్‌ల్లోకి వెళ్లి ప్రస్తుతం పీఎంఓలో ఉన్నారు. -
తెలంగాణ నుంచి సోమేష్ కుమార్ రిలీవ్
-
తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు
-
సీఎస్ సోమేష్‌కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు.. టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్‌కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఎలాంటి సమయం ఇవ్వని హైకోర్టు.. 3 వారాలు సమయం కావాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్‌కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. చదవండి: వారెవ్వా... వందే భారత్.. ప్రత్యేకతలు ఇవే! -
కొత్త కార్పొరేషన్లు ఇవ్వొద్దు.. ప్రజాధనం వృథా చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్ల చైర్మన్లను నియమించి ప్రజాధనం వృథా చేయొద్దని ఫోరం ఫర్ గుడ్ గవ ర్నెన్స్ (ఎఫ్‌జీజీ) తెలిపింది. రాష్ట్రంలో కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథా రిటీలు కలిపి 70 వరకు ఉన్నాయని, కొన్ని మినహాయిస్తే చాలా కార్పొ రేషన్లు కేవలం కళ తప్పిన రాజకీయ నాయకులను చైర్మన్లుగా నియమిండానికి మాత్రమే ఏర్పాటు చేసినట్లు ఉన్నాయని విమర్శించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారం పడుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖరాశారు. కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథా రిటీల పనితీరు ఎప్పుడు, ఎవరూ కూడా విశ్లేషణ చేయలేదని, కొన్ని అయితే శాఖల పనిని డూప్లికేట్ చేయగా, మరికొన్ని ఏ పనీ లేకుండా ఉన్నాయని ఆరోపించారు. కార్పొరేషన్ చైర్మన్లకు జీతాలు, కార్యాలయం, తగిన సిబ్బంది, ప్రభుత్వ వాహనం, డ్రైవర్, వారి జీతభత్యాలతో రూ.2 కోట్ల వరకు ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పని లేని కార్పొరేషన్లను మూసేయా లని, ఎలాంటి కార్పొరేషన్లు నెలకొల్పవద్దని సీఎస్‌కు రాసిన లేఖలో పద్మనాభరెడ్డి కోరారు. -
8 ఏళ్లు 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ పారదర్శక పాలనతో గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ, అనుబంధ రంగాల పురోగతితోపాటు ఈ ఏడాదిలో చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలపై తన శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులభతర, సత్వర పారిశ్రామిక అనుమతుల జారీ కోసం తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ విధానం కింద 2014 నుంచి 2022 నవంబర్ వరకు కేవలం ఐటీ, అనుబంధ రంగాల్లోనే ఏకంగా రూ. 3.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇవి కాకుండా మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంతోపాటు ఇతర రంగాల్లో వచ్చిన పెట్టుబడులన్నింటినీ కలిపితే ఈ విలువ మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ పెట్టుబడులతో ఇదే కాలానికి రాష్ట్రంలో 22.5 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. పెట్టుబడుల కోసం 14 ప్రాధాన్యతా రంగాలు తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ పాలసీలను రూపొందించడంతోపాటు అవసరమైన పారిశ్రామిక పార్కులు, మౌలికవసతుల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావించిందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో దాదాపు 14 రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించి పక్కా ప్రణాళికతో భారీ పెట్టుబడులను సాధించిందని కేటీఆర్ తెలిపారు. ఒక్కో రంగానికి ప్రత్యేకంగా అధికారిని నియమించడంతోపాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించినట్లు కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇక్కడి మౌలిక వసతుల గురించి వివరించడం వల్లే అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో లక్షలాది మందికి ఉపాధి లభించడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న దేశంలోని ఇతర నగరాలను హైదరాబాద్ దాటిందని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులోనూ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. పూర్తి పెట్టుబడుల నివేదిక తయారు చేయండి పెట్టుబడుల సాధనకు కృషి చేసిన అధికారులను అభినందించిన కేటీఆర్... వివిధ రంగాల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పూర్తి వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీఎండీ వెంకట నరసింహారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1.85 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.85 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటించింది. ఈ మేరకు 2023–24కు సంబంధించిన ఫోకస్ పేపర్‌ను గురువారం విడుదల చేసింది. మొత్తం ప్రాధాన్యత రంగాల్లో రూ. 1,85,327 కోట్ల రుణ లక్ష్యం కాగా అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 1,12,762 కోట్లుగా లెక్కగట్టింది. వ్యవసాయ రుణాల్లో కీలకమైన పంట రుణాలకు రూ. 73,436 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. రుణ లక్ష్య ఫోకస్ పేపర్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. 2022–23 రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1,66,257 కోట్లు కాగా, అందులో వ్యవసాయ, అనుబంధాల రుణ లక్ష్యం రూ. 1.01 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది కంటే వచ్చే ఏడాదికి రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 19,070 కోట్లు ఎక్కువగా ఉంది. సాగులో దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ: మంత్రి హరీశ్ రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి రోల్ మోడల్‌గా మారిందని, దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సాగుభూమి, పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 19 శాతంగా ఉందన్నారు. అదే దేశ జీడీపీలో వ్యవసాయరంగ వాటా కేవలం 3.5 శాతమేనని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 10 శాతంగా నమోదైతే దేశంలో కేవలం 3 శాతంగానే ఉందని వివరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణ భారీగా నిధులను వెచ్చించిందన్నారు. ఆయిల్‌పాం సాగుకు చేయుత ఇవ్వాలి... నాబార్డు మూడు అంశాలపై దృష్టిపెట్టి అధిక రుణాలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగు చేస్తోందని, ఈ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరిసాగులో నాట్లకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలు అందించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డును కోరారు. సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి త్వరగా అనుమతి ఇవ్వా లని నాబార్డు సీజీఎం సుశీల చింతలను కోరారు. తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలు: సీఎస్ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2.75 లక్షలుగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు సమయానికి ఇప్పటికీ ఇది రెట్టింపు అయిందన్నారు. జీఎస్డీపీ దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామకృష్ణారావు, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్న నీటి వనరుల మరమ్మతులపై జీఎస్టీని ఎత్తేయాలి
సాక్షి, హైదరాబాద్: చిన్ననీటి వనరుల నిర్వహణ, మరమ్మతులపై జీఎస్టీని ఎత్తివేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో చిన్ననీటి వనరుల కింద 46 వేల జలాశయాలున్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ భేటీలో మంత్రి హరీశ్‌రావు పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమైనదని అందువల్ల మరమ్మతు పనులకు జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. అలాగే పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, రవాణా సేవలకు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని, పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతోందని ఆయన వివరించారు. లక్షలాది మంది మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమపై ఇప్పటికే 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, బీడీ ఆకులపై మరో 16 శాతం పన్ను విధించడం వల్ల పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందో ళన వ్యక్తం చేశారు. బీడీలపై పన్నును తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బీడీ ఆకులపై పన్ను మినహాయింపు ఇవ్వాలి బీడీ ఆకులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని హరీశ్ కోరారు. పన్నుల ఇన్వాయిస్ నిబంధనల సవరణ ప్రతిపాదనలను తమ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. టెలికాం సేవలకు సంబంధించి ట్రాయ్ నిబంధనల వల్ల ఆన్లైన్ వ్యాపారాల్లో వినియోగదారులు ఉన్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తుందని, దీనిని పరిశీలించి మార్పులు చేయాలని కోరారు. కాగా, ఈ విజ్ఞప్తులను పరిశీలన కోసం ఫిట్మెంట్ కమిటీకి సిఫారసు చేస్తూ కౌన్సిల్ ఆదేశించింది. పన్నుల ఇన్వాయిస్ లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. బీఆర్కే భవన్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హరీశ్‌తోపాటు సీఎస్ సోమేశ్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. -
జనవరి 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 నాటికి పూర్తి చేయా లని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ సునీల్ శర్మలతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఆహారభద్రత కార్డులు, అద్దె ఇళ్లలో ఉన్న వారి జాబితాను ఎంపిక చేయాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో హైదరాబాద్‌కు పంపాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 91 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టామని వివరించారు. హైదరాబాద్ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాగా, 62 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీల్లో విద్యుత్, సీవరేజ్, రహదారుల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. కాగా, సెక్రటేరియట్ భవనం, అమరవీరుల స్మారకచిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల, సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్ 10వఅంతస్తునుంచి పరిశీలించారు. 26లోగా పోడు సర్వే పూర్తి చేయాలి.. ఈ నెల 26లోగా పోడు భూముల సర్వే పూర్తి చేసి, గ్రామ సభల ద్వారా వివరాలను సబ్ కమిటీకి పంపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలను లక్ష్యాల మేరకు పూర్తి చేసి ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని కోరారు. ధరణిలో వచ్చిన ఫిర్యాదులను, జీవో 58, 59 ప్రకారం ఉన్న సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని సీఎస్ సూచించారు. డా.బి.ఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాలను బీఆర్కేఆర్ భవన్ పదో అంతస్తు నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలిస్తున్న -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌ను కలిసి ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. సీఎస్‌ను కలిసిన వారిలో ట్రెసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నిరంజన్‌రావు తదితరులు ఉన్నారు. -
Telangana: రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరింత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయం, అనుబంధ రంగాల ఆర్థికాభివృద్ధితో పాటు మరింత ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. ప్రైవేట్ పెట్టుబడులకు దోహదపడే విధానాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం, పాడి రంగాల ద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) వృద్ధిని పెంపొందించే కార్యక్రమాలపై బీఆర్కేఆర్ భవన్లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన దాదాపు 30 మంది ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొని విలువైన సూచనలు అందించారు. ప్రభుత్వ శాఖల పనిలో సమర్థతను పెంపొందించడం వల్ల ప్రజల దృక్పథంలో మార్పు వస్తుందని సోమేశ్‌కుమార్ అన్నారు. అధిక ఉత్పాదకతను సాధించేందుకు వీలుగా విధానాల మార్పుపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి అపారమైన అవకా శాలు ఉన్నాయన్నారు. సాగునీరు, విద్యుత్, సేకరణ, రైతుబంధు వంటి పెట్టుబడి మద్దతు విధానాలతో రాష్ట్రంలో రైతులు ఎంతో ప్రయో జనం పొందారని, గత ఎనిమిదేళ్లలో పంటల విస్తీర్ణం 64% పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు నివేదించారు. పంటల ఉత్పాదకతను ప్రోత్సహించడం, ఉద్యాన రంగం బలోపేతం, పంటకోత తర్వాత మెరుగైన నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ పరిశోధన, విస్తరణ వ్యవసాయ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి కొన్ని వ్యూహాలని తెలిపారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో మరింత ఉత్పాదకత, అధిక వృద్ధిని సాధించడానికి వివిధ శాఖల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. -
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దీని కోసం ప్రభుత్వంలోని వివిధ శాఖలు, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై సంబంధిత శాఖలు, న్యాయాదికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం సీజే మాట్లాడుతూ.. పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేస్తేనే మహిళలు, పిల్లలకు భద్రత ఏర్పడుతుందని స్పష్టం చేశారు. పోక్సో చట్టం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల నేతృత్వంలో ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సీఎస్ ఈ సందర్భంగా వివరించారు. మహిళలు, పిల్లల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దీనిలో భాగంగానే రాష్ట్ర పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డా. షమీమ్ అక్తర్, జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ రాధారాణి, జస్టిస్ నందా, అడిషనల్ డీజీ స్వాతిలక్రా, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య, న్యాయశాఖ కార్యదర్శి నర్సింగ్ రావు, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ తిరుమలాదేవి, సుజన ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రియల్ రంగంలో హైదరాబాద్ టాప్
మాదాపూర్: రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం రెండు రోజుల పాటు నిర్వహించనున్న టైమ్స్ ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో–2022ను ఆయన నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెరా(తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) ను ప్రారంభించినప్పటి నుంచి 5299 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను తెలంగాణ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐదవ స్థానంలో ఉన్నామని, అతి త్వరలో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకుంటామని చెప్పారు. నగరంలో నిరంతరం విద్యుత్ సదుపాయం ఉండడంతో ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం అంతరించిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతుండటంతో రియల్ రంగంలో హైదరాబాద్ టాప్‌గా నిలవనుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్బీఎల్ సీఈఓ అజితేష్ కొరుపోలు, మ్యాండేట్ ఎండీ బిస్వజిత్ పట్నాయక్, రాంకీ ఎండీ నందకిషోర్, కాన్సెప్ట్ అంబెన్స్ డైరెక్టర్ ముకుల్ అగర్వాల్, క్రెడాయ్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల అమ్మకం ఆపేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల అమ్మకం ఆపేయాలని, ఉచితాల పేరుతో అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని సర్కార్‌కు సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్‌జీజీ ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలకు ఉచితాల రూపంలో ఇచ్చేస్తుందని, దీంతో ప్రభుత్వం అప్పుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 1923 ఫ్లాట్లు, 18.05 ఎకరాల భూమి వేలం కోసం ఈనెల 11న నోటిఫికేషన్ ఇచ్చిందని లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి కోసం సరిపోయే స్థలం కావాలని ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరకు భూములు కొనుగోలు చేస్తుంటే మరో దిక్కు ఉన్న భూములను అమ్మాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. మున్ముందు పట్టణ పరిసరాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు, శ్మశాన వాటికలు, ఉద్యానవనాలకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు భూములు అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఉన్న కొద్దిపాటి భూములను అమ్మేస్తే భవిష్యత్తుల్లో భూములను ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని లేఖలో కోరారు. -
గ్రూప్–1 పరీక్షకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు సీఎస్ వివరించారు. స్ట్రాంగ్‌రూమ్‌లను గుర్తించి పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పరీక్షాకేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్ ఇన్చార్జీలు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం సూచనలను పాటించాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రిలిమినరీ టెస్ట్ కోసం అభ్యర్థులు హాల్‌టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు చివరి నిమిషంలో కాకుండా నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కోర్టు కేసులున్నందున తుదితీర్పునకు లోబడి ఈ పదోన్నతులుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందినవారిలో ఆర్.డి.మాధురి, బి.రోహిత్‌సింగ్, ఎ.పద్మశ్రీ, గుగులోతు లింగ్యానాయక్, మహ్మద్ అసదుల్లా, కె.వి.వి.రవికుమార్, డి.రాజ్యలక్ష్మి, కనకం స్వర్ణలత, జి.వెంకటేశ్వర్లు, వి.భుజంగరావు, డి.వెంకటమాధవరావు, ఎం.వెంకటభూపాల్‌రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, ఎస్.తిరుపతిరావు, చీమలపాటి మహేందర్‌జీ, కె.గంగాధర్, బి.కిషన్‌రావు, ఎస్.సూరజ్‌కుమార్, ఇ.వెంకటాచారి, వి.విక్టర్, ఎల్.కిశోర్‌కు మార్, పి.అశోక్‌కుమార్, ఎం.విజయలక్ష్మి, జె.శ్రీనివాస్, డి.విజేందర్‌రెడ్డి, కె.శ్యామలాదేవి, కె.వీరబ్రహ్మచారి, జె.ఎల్.బి.హరిప్రియ, కె.లక్ష్మి కిరణ్, డి.వేణు, టి.ఎల్.సంగీత ఉన్నారు. కాగా, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్, తహసీల్దార్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కు కృతజ్ఞతలు తెలిపాయి. -
Bathukamma: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3న ట్యాంక్‌బండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, ట్యాంక్ బండ్ వద్ద విద్యుత్ దీపాలంకరణ, బారికేడింగ్, మంచినీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్స్ సరఫరా, మొబైల్ టాయిలెట్స్, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. బతుకమ్మ పండుగపై ఆకర్షణీయమైన డిజైన్లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు 25 నుంచి ప్రారంభం కానున్నాయని, బతుకమ్మ ఉత్సవాలు కూడా అదే రోజున ప్రారంభం అవుతాయని తెలిపారు. -
వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్లకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లకు వాట్సాప్ ద్వారా.. సోమవారం నుంచి వారం రోజుల పాటు దృష్టి సారించాల్సిన అంశాలు, సాధించాల్సిన పురోగతిపై స్పష్టమైన లక్ష్యాలను విధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కుంటి నడకతో.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయికి వెళ్లే సరికి ముందుకు పురోగమించడం లేదు. క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతతో కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో తలెత్తుతున్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలపై విస్తృత రీతిలో సమీక్షలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కొంతకాలం అధికార యంత్రాంగం హడావుడి చేసినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్ చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత అంశాల అమలుపై ప్రతివారం లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. తాజాగా ఈ వారం ఐదు అంశాలపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని సూచించారు. 1. పోడుపై సమన్వయ కమిటీ సమావేశాలు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు పరిష్కారం కల్పించడంలో భాగంగా ఈ వారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలి. గ్రామ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి గడువు నిర్దేశించుకోవాలి. ఎప్పటిలోగా ఈ పనిని పూర్తి చేస్తారో తెలియజేయాలి. 2. పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో పంపిణీ చేపట్టాలి. ఒక్కో ఎమ్మెల్యే రోజుకు 8 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. కార్యక్రమం పూర్తికి లక్షిత తేదీని తెలియజేయాలి. 3. క్రమబద్ధీకరణ దరఖాస్తులు పరిశీలించాలి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి జారీ చేసిన జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలను ప్రారంభించి రెండు వారాల్లోగా పూర్తి చేయాలి. ఇందుకు సరిపడ సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలన జరపాలి. 4. ధరణి సమస్యలకు సత్వర పరిష్కారం ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టీఎం33 కింద ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పట్టాదారు పేరు, విస్తీర్ణం, భూమి స్వభావం, మిస్సింగ్ సర్వే నంబర్ల నమోదు గురించి వచ్చే దరఖాస్తులను పరిష్కరించాలి. ఎన్ని దరఖాస్తులు ఆమోదించారో, ఎన్ని తిరస్కరించాలో ఎప్పటికప్పుడు వివరాలు పంపాలి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. 5. విషాహార ఘటనలు పునరావృతం కావొద్దు రాష్ట్రంలోని గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లో విషాహార ఘటనలు పునరావృతం కాకూడదు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
కాళేశ్వరంపై బండి సంజయ్ ఫోకస్.. సీఎస్ రెస్పాన్స్‌పై సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా రెండు పార్టీల నేతలు పరస్పర రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని ఒకడుగు ముందుకేసి బండి సంజయ్ పాదయాత్రలో దాడులు కూడా చేసుకున్నారు. కాగా, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం పర్యటన కోసం తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాయండి చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఆదివారం సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. లేఖలో.. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సాగునీటి పారుదల రంగం నిపుణులతో కూడిన 30 మంది ప్రతినిధి బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం అనుమతి ఇవ్వాలని సీఎస్‌ను కోరారు. అయితే, సెప్టెంబర్ తొలి వారంలో తాము వెళ్లనున్నట్టు బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలకు, తమకు ఉన్న పలు అనుమానాలను తమ పరిశీలన ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం పర్యటనకు బీజేపీ నేతల పర్యటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇది కూడా చదవండి: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి -
పుస్తక ప్రదర్శనతో బాపూ భావజాలం ఆకళింపు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ ఆలోచనలను, భావజాలాన్ని ఆకళింపు చేసుకొనేందుకు పుస్తక ప్రదర్శన ఎంతో దోహదం చేస్తుందని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్నారు. ‘మంచి పుస్తకం చెంతన ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే‘.. అన్న గాంధీ సూక్తిని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ ఇండోర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులతో కలసి సీఎస్ శనివారం పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాంధీ చరఖాను, చేనేత మగ్గాన్ని, ఎద్దు గానుగ యంత్రాన్ని తిలకించారు. -
గోల్కొండలో వజ్రోత్సవాల రిహార్సల్స్
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఈనెల 15న నిర్వహించే 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి పూర్తిస్థాయి రిహార్సల్స్‌ను శనివారం గోల్కొండ కోటలో నిర్వహించారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోట నుంచి జాతీయ పతాకావిష్కరణ చేయ నున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్స్ జరిపారు. ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. 10.30 గంటలకు సీఎంకు గౌరవవందనం ఈనెల 15న ఉదయం పదిన్నరకు గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పతాకావిష్కరణ కోసం సీఎం వచ్చేటప్పుడు వేయిమంది జానపద కళాకారులు స్వాగతం పలుకుతారు. జాతీయ పతా కావిష్కరణ చేసిన అనంతరం సీఎంకు రాష్ట్రీయ సెల్యూట్‌ను పోలీస్ దళాలు అందజేస్తాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేకపాసులు జారీ చేశారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసింది. హాజరయ్యేవారికి మంచినీటి సౌకర్యంతోపాటు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. రిహార్సల్స్‌ను పరిశీలించినవారిలో పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ పోలీస్ కమి షనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమ య్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందని, దీనికి ముందు ముఖ్యమంత్రి పోలీస్ గౌరవవందనం స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా దాదాపు వెయ్యిమంది కళాకారులు స్వాగతం పలుకుతారన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
భద్రాద్రి జిల్లాలో మండలానికో అధికారి
సాక్షి,హైదరాబాద్: వరద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికీ ఒక సీనియర్ అధికారిని నియమించి సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్య, విద్యుత్, పారిశుద్ధ్య తదితర విభాగాల బృందాలను నియమించినట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో మంగళవారం సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4,100 మందిని, మున్సిపల్ శాఖ నుంచి 400 మంది శానిటేషన్ సిబ్బందితోపాటు మొబైల్ టాయిలెట్లు, ఎమర్జెన్సీ సామగ్రిని తరలించామని పేర్కొన్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతోపాటు పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల డైరెక్టర్లు, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీలు ఈ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 436 వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 10,000 మందికి వైద్య సేవలందించామన్నారు. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా సంక్షేమ శాఖల ద్వారా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ తెరవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. అందులోనూ కేవలం ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు మాత్రమే స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తుండగా... మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలు మాత్రం స్టడీ సర్కిళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా అన్ని సంక్షేమ శాఖలకు జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేయగా... గత వారం సీఎస్ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకొక స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రస్తుతం కొనసాగుతున్నవి, ఎక్కడెక్కడ అవసరం ఉంది తదితర సమగ్ర వివరాలతో సంక్షేమ శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే స్టడీ సర్కిళ్లు శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిరంతరంగా శిక్షణ ఇకపై ప్రతి జిల్లాలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తే వాటిని నిరంతరంగా కొనసాగించేలా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోంది. సంక్షేమ శాఖల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా వీటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయి వెంటనే ఉద్యోగార్థులతో ఒక బ్యాచ్‌ను ఎంపిక చేసి శిక్షణ మొదలు పెడతారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్లు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లు రెగ్యులర్‌గా ఉండటంతో వీటికి నిరంతరంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ శాఖల వారీగా ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రిహార్సల్స్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల డ్రెస్ రిహార్సల్స్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జూన్ 2న పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్స్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిడ్–19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
గ్రూప్–4పై తేల్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్–4 కొలువుల ప్రకటనకు ఇప్పట్లో అడుగు ముందుకు పడే అవకాశం కనిపించడంలేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,163 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి కదలిక లేదు. సీఎస్ ఆదేశాల ప్రకారం ఈనెల 29 నాటికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి శాఖల వారీగా ఇండెంట్లు (ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రోస్టర్ వారీగాకొలువుల భర్తీకి ప్రతిపాదనలు) సమ ర్పించాల్సి ఉంది. ఈమేరకు సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సీఎస్ డెడ్‌లైన్ కూడా విధించారు. అయినా ఒక్క శాఖ నుంచి కూడా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు చేరకపోవడం గమనార్హం. కారణం ఇదేనా? ప్రభుత్వ శాఖల వద్ద గ్రూప్–4 కేటగిరీలోకి వచ్చే కొలువుల ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉంది. అయితే నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు, రోస్టర్ వారీగా భర్తీ చేయాల్సినవెన్ని? తదితర సమాచారాన్ని సిద్ధం చేసుకుని ప్రతిపాదనలు తయారు చేసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఇటీవల ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశించారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ శాఖలు ఆ దిశగా గణాంకాలను సిద్ధం చేసుకోగా, వాటిని టీఎస్పీఎస్సీకి సమర్పించాల్సి ఉంది. టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పించే ముందు ఆయా ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన ఖాళీలకు తగినట్లుగా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిస్తారు. సాధారణంగా ఇదే పద్ధతి ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 29లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సీఎస్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ఆమేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూసిన శాఖలు, నిర్దేశించిన గడువులోగా అవి వెలువడకపోవడంతో ప్రతిపాదనలు సమర్పించలేదని తెలుస్తోంది. హడావుడిగా సాగి.. వివిధ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9,163 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. వీటిని రిజర్వేషన్లకు అనుగుణంగా విభజించి నూతన జోనల్ విధానం ప్రకారంభర్తీ చేయాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో రెండు వారాల క్రితం ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. రాజ్యాంగబద్ధమైన కమిషన్ చైర్మన్ దీనికి హాజరు కావడంతో అన్ని ప్రభుత్వ శాఖల్లో సైతం హడావుడి నెలకొంది. ప్రభుత్వ సమావేశాలకు ఆయన రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగాల భర్తీ వేగిరమైందని భావించారు. దీంతో దాదాపు అన్ని శాఖలు నిబంధనల ప్రకారం నిర్దేశించిన గడువులోగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాయి. కానీ తీరా గడువులోగా జీవోలు రాకపోవడంతో ఆ ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. -
పన్ను బకాయా.. ‘సెటిల్మెంట్’ చేస్కోండి
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రూ. 3 వేల కోట్లకు పైగా పన్నులను రాబట్టేందుకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ జనరల్ సేల్స్ ట్యాక్స్ యాక్ట్–1957, తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యాక్ట్–2005, సెంట్రల్ ట్యాక్స్ యాక్ట్–1956, తెలంగాణ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ఇన్టు లోకల్ ఏరియాస్–2001 చట్టాల పరిధిలోకి వచ్చే పన్నుల చెల్లింపునకు సంబంధించి పన్నుల శాఖతో వివాదం ఉంటే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. వివాదాల్లో ఉన్న పన్ను చెల్లింపులకు సంబం ధించి సాధారణ పన్నులో 60 శాతం మాఫీ కానుంది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 50 శాతం, ఎంట్రీ ట్యాక్స్ 40 శాతం మాఫీ అవుతుంది. పెండింగ్‌లో ఉన్న పన్నులను 100 శాతం కట్టాల్సి ఉంటుంది. అయితే వీటిపై వేసిన జరిమానాలు, వడ్డీలు రద్దవుతాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యాపారి సదరు మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం రూ.25 లక్షల కంటే ఎక్కువుంటే 4 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశమిస్తారు. ఈ వాయిదాల వరకు వడ్డీలు ఉండవు. 4 కన్నా ఎక్కువ వాయిదాలైతే పెంచిన వాయిదాల కు బ్యాంకు వడ్డీ వర్తిస్తుంది. పథకం కింద ఈ నెల 16 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను జూలై 1 నుంచి 15 వరకు స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీకి సర్కిల్ ఏసీ, డీసీ, జేసీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీదే తుది నిర్ణయం. మాఫీ పోను మిగిలిన సొమ్మును అదే నెల 16 నుంచి ఆగస్టు 15 వరకు చెల్లించాలి. -
సీఎస్ సోమేశ్ బదిలీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ బదిలీకి రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే సోమేశ్ కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2023లో ఎన్నికలు జరిగే వరకు సోమేశ్ కుమార్ సీఎస్‌గా కొనసాగుతారని భావించినా.. ఇటీవలి పరిణామాలను చూస్తే ఆయన బదిలీ తప్పదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల సోమేశ్ కుమార్ తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఢిల్లీలో గత వారం నిర్వహించిన సదస్సులో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సీఎస్ తీరును వివరించారు. సీఎం కేసీఆర్, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సోమేశ్ కుమార్‌తో ఇటీవల తాను సమావేశమైనప్పుడు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు సమస్యలను వారికి వివరించానని, వాటిపై కేసీఆర్ స్పందించి.. రెండు రోజుల్లో పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించారని, అయినా నేటి వరకు సీఎస్ నుంచి సరైన స్పందన లేదని హైకోర్టు సీజే.. జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సీజేఐ.. ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్ పెండింగ్‌లో పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితోపాటు సీఎస్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని, కొంతమంది ఉన్నతాధికారులను మినహా ఇతరులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్‌లోని పొరపాట్లను దిద్దడంలో విపరీతమైన జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. హైకోర్టులో కూడా సీఎస్‌పై అనేక వ్యాజ్యాలు నడుస్తున్నాయి. దీనికితోడు ఆయనను ఏపీకి పంపించాలని కేంద్రం సైతం పిటిషన్ వేయడంపై విచారణ జరుగుతోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సోమేశ్ బదిలీ జరుగుతుందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఆయన స్థానంలో భర్తీ చేయడానికి సీనియర్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. -
నూకల పరిహారం ఎంతిద్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని మరపట్టిస్తే సాధారణంగా వచ్చే 25 శాతం నూకలకు అదనంగా మరో 25 శాతం నూకలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నష్టాన్ని భరించే మిల్లర్లకు ఎంత పరిహారం ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్వింటాల్ ధాన్యానికి నూకల పరిహారంగా రూ. 300 ఇస్తే నష్టం ఉండదని మిల్లర్లు ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీలో కోరగా ఆయా జిల్లాల్లో వాతావరణ పరిస్థితులనుబట్టి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలవారీగా టెస్ట్ మిల్లింగ్ చేసి ఆయా జిల్లాల వాతావరణ పరిస్థితులు, నూకల శాతాన్ని లెక్కించి మిల్లర్లకు క్వింటాల్‌కు ఇచ్చే పరిహారాన్ని నిర్ణయించాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సీఎస్ కమిటీ 2–3 రోజుల్లో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా గరిష్టంగా క్వింటాల్‌కు రూ. 150–200 వరకు పరిహారం ఇవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ధాన్యాన్ని మిల్లింగ్ చేసేటప్పుడు బియ్యంతోపాటు వచ్చే అనుబంధ సరుకు (బియ్యపు పిండి, తౌడు, ఊక)ను కూడా పరిగణనలోకి తీసుకొని మిల్లింగ్ చార్జీల పేరిట నూకల నష్టాన్ని చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో నూకలకు పరిహారం కింద మిల్లర్లకు అక్కడి ప్రభుత్వాలు ఏమైనా చెల్లింపులు చేస్తున్నాయా అనే కోణంలో అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం ఇప్పటికే ప్రారంభమైన 1,565 కొనుగోలు కేంద్రాల్లో 94 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 85 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్..
ED Files Contempt Of Court Petition Against Telangana CS Excise Director: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వట్లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరిన వివరాలను ఈడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తర్వాత మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు తగ్గట్లు రాష్ట్రంలో అనేక వినూత్న పథకాలు అమలు చేస్తూ తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014–15లో జీఎస్డీపీ రూ.4.16 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి 130 శాతం వృద్ధితో రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ. 2.78 లక్షలకు చేరిందన్నారు. 2014–15లో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ 2021–22 నాటికి 3వ స్థానానికి చేరుకుందని చెప్పారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక అధ్యయనం కోర్సులో భాగంగా ఎయిర్ వైస్ మార్షల్ తేజ్బీర్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ ఫ్యాకల్టీ బృందం సోమవారం బీఆర్కేఆర్ భవన్‌ను సందర్శించి అధికారులతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ఈ బృందానికి సోమేశ్‌కుమార్ వివరించారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, ఇతర వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచడంతో రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను కూడా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. పలు ఫ్లాగ్షిప్ కార్యక్రమాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
వీఆర్వోలకు గ్రేడింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను గ్రేడింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలాల వారీగా వారి వివరాలను పంపాలని కోరుతూ సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపారు. ప్రత్యేక ఫార్మాట్లో ఆదివారం మధ్యాహ్నంకల్లా వివరాలు పంపాలని.. ఆయా మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. వీఆర్వో పనిచేస్తున్న మండలం, క్లస్టర్, ఉద్యోగి ఐడీ నంబర్, స్వగ్రామం, పాత జిల్లా, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటినుంచి పనిచేస్తున్నారు, చివరగా పనిచేసిన మూడు ప్రాంతాలు, పుట్టినతేదీ, వీఆర్వోగా రిక్రూటైన తేదీ, రిటైర్మెంట్ తేదీ, వీఆర్వోగా నియామకమైన పద్ధతి, కులం, రిజర్వేషన్, మొబైల్ నంబర్‌తోపాటు సదరు వీఆర్వోకు ఏ/బీ/సీ/డీ గ్రేడింగ్ ఇస్తూ వివరాలు పంపాలని ఆదేశించారు. సస్పెన్షన్‌లో ఉన్న, దీర్ఘకాలికంగా సమాచారం లేకుండా సెలవులో ఉన్న వారి వివరాలనూ పంపాలన్నారు. 15 ఇతర శాఖల్లో సర్దుబాటు! రెవెన్యూ శాఖ పరిధిలోని వీఆర్వోలను 15 శాఖల్లో సర్దు బాటు చేసేందుకే వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో 5,384 మంది వీఆర్వోలు పనిచేస్తుండగా.. అందులో 1,300 మంది వరకు నేరుగా రిక్రూటైనవారు ఉన్నారు. వారిని రెవెన్యూశాఖలో కొనసాగించి మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తారా? అందరినీ ఇతర శాఖలకే పంపుతారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు గాను వీఆర్వోలను ఆప్షన్లు అడుగుతారనే ప్రచారమున్నా.. అది సాధ్యం కాకపోవచ్చని, ప్రభుత్వమే అవసరాలకు అనుగుణంగా ఇతర శాఖలకు పంపేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. కాగా.. వీఆర్వోల విషయంగా ప్రభుత్వం ఒక అడుగు వేయడంతో.. తమ పేస్కేల్, పదోన్నతుల సమస్యకు కూడా త్వరలో పరిష్కారం లభించవచ్చని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఆశిస్తున్నారు. -
విద్యార్థులను తీసుకొచ్చే పనిలో ఉన్నాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు, ప్రవాసు లను రాష్ట్రానికి తీసుకురావ డానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు మొత్తం 150 కాల్స్ వచ్చాయని, అందులో ఉక్రెయిన్ నుంచి 10–12 కాల్స్ ఉన్నాయన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలు నమోదు చేసుకుని, విదేశీ వ్యవహారా లశాఖ, ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీకి అందజేస్తు న్నామని తెలిపారు. విద్యార్థులు, ఇతర ప్రవాసు లను ఉక్రెయిన్ నుంచి సరిహద్దులకు, అక్కడి నుంచి విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందన్నారు. విమానాల సమాచారంసహా పూర్తి వివరాలను అక్కడి తెలంగాణ విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. ఇప్ప టికే ఆయా అంశాలపై ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ఫస్ట్ సెక్రటరీతో మాట్లాడామని వివరిం చారు. తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువ మంది చదువుతున్న జఫరోజియా వర్సిటీకి సంబం ధించిన భారత ప్రతినిధితోనూ మాట్లాడామన్నారు. -
ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారానికి ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశం నిర్వహించా లని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కాగా త్వరలో అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ప్రకటించారు. సమావేశం అజెండాను పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఆయా అంశాలను పరిశీలించి తుది అజెండాను ఖరారు చేస్తామని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి సమావేశం తేదీని నిర్ణయిస్తారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పంకజ్‌కుమార్ మంగళవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సీడ్ మనీ మొత్తంపై పునరాలోచన కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు గెజిట్‌లో పేర్కొన్న మేరకు ఒక్కో బోర్డు ఖాతాలో ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా తక్షణమే డిపాజిట్ చేయాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి రూ.200 కోట్లను డిపాజిట్ చేయలేమని తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ నిధులను ఏం చేస్తారో చెప్పాలని సోమేశ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీడ్ మనీ తగ్గింపుపై పునరాలోచన చేస్తామని పంకజ్‌కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు అప్పగించం: తెలంగాణ కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–3 పరిధిలోని ప్రాజెక్టులను తక్షణమే ఆయా బోర్డులకు అప్పగించాలని పంకజ్‌కుమార్ ఆదేశించారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కొత్త ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎస్ కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టులను కూడా అప్పగించబోమని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మాత్రమేనని, ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు అవసరమే లేదని చెప్పారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని ఏపీ పేర్కొంది. గోదావరి బోర్డు అత్యంత ఆవశ్యకమని.. తక్షణమే శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్లను అప్పగించాల్సిందే: కేంద్రం రెండు రాష్ట్రాల అధికారుల వాదనల అనంతరం పంకజ్‌కుమార్ స్పందించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను తక్షమే కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. ఏకాభిప్రాయంతో వాటిని బోర్డుకు అప్పగించాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌ను మార్చే ప్రసక్తే లేదని.. గోదావరి బోర్డు అత్యంతావశ్యకమని స్పష్టం చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇలావుండగా గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి ఆమోదం పొందడం కోసం తక్షణమే వాటి డీపీఆర్‌లను కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) పంపాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ ఆదేశించారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులపై ఒక నివేదిక ఇస్తే.. కొత్తగా అనుమతి తీసుకోవాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుతామని చెప్పారు. -
ఉద్యోగుల విభజన త్వరగా చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన, జిల్లాలు, జోన్ల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులతో ఉద్యోగుల విభజన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించే ప్రక్రియ పూర్తయిందని, అన్ని కేడర్లలో సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశామని ఉన్నతాధికారులు సీఎస్‌కు వివరించారు. అనంతరం సోమేశ్ మాట్లాడుతూ విభజన ప్రక్రియ గురించి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైద్య, మహిళా శిశు సంక్షేమ, యువజన సర్వీసులు, పర్యాటక–సాం స్కృతిక, అన్ని సంక్షేమ శాఖలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక, విద్యుత్, అటవీ, వ్యవసాయ, రోడ్లు భవనాలు, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు, అలాగే ప్రమాదాల్లో మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఈ విషయంలో రవాణా, పోలీసు, వైద్య శాఖలు సమష్టిగా పనిచేస్తున్నాయని వివరించారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో రోడ్డు భద్రతపై సమావేశమయ్యారు. వాహనాల మితిమీరిన వేగాన్ని నియంత్రించేందుకు డ్రైవర్లకు అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపార. -
16లోగా విభజన ప్రక్రియ పూర్తి..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం రాత్రి రెండు జీవోలను జారీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సీనియారిటీ జాబితాపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విభజన పూర్తి చేయాలని, 20వ తేదీలోగా సంబంధిత అధికారులు కేటాయింపు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది పూర్తయిన వారం రోజుల్లో ఉద్యోగులు కేటాయించిన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా అధికారుల నేతృత్వంలో కమి టీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోనల్ పరిధిలో రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జీవోల్లో వివరించారు. -
ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై వారి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమైంది. కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై చర్చించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317లో ఈ కింది అంశాలను చేర్చాలని బృందం సూచించింది. ►ఉద్యోగులు/కుటుంబ సభ్యులు బైపాస్ సర్జరీ చేయించుకోవడం, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి ఉంటే ప్రత్యేక కేటగిరీ కింద ప్రాధాన్యత ఇవ్వాలి. ►45 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ►కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీకి గురైన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించాలి. n సొంత జిల్లా, ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాతో పాటు మొదటి నియామక జిల్లాను దరఖాస్తు నమూనాలో చేర్చాలి. ►రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు గరిష్ట కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించాలి. ట్రెసా చేసిన ఇతర విజ్ఞప్తులు.. ♦పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. ♦డీపీసీ ఆమోదం పొంది తహశీల్దార్లుగా పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న డిప్యూటీ తహశీల్దార్లకు పోస్టింగులు ఇవ్వాలి. 2017–18 నుండి డిప్యూటీ తహసీల్దార్ల కొత్త ప్యానెల్స్ తయారు చేయాలి. ♦సుదూర ప్రాంతాలోని ప్రొబేషనరీ నాయబ్ తహసీల్దార్లకు జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలి. ∙వీఆర్వోలకు కూడా బదిలీ ఆప్షన్లు ఇవ్వాలి. ∙వీఆర్ఏలకు స్కేల్ వర్తింప చేయాలి. -
ఒప్పందాలుంటేనే వరి.. యాసంగిలో వరి వేయొద్దని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి పారాబాయిల్డ్ (ఉప్పుడు) బియ్యం సేకరించబోమని భారత ఆహార సంస్థ నిర్ణయించినందున రాష్ట్ర రైతులు వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సీజన్లో పండే వరి ఉప్పుడు బియ్యానికే అనుకూలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డితో కలసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఒకవేళ విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందం లేదా సొంత అవసరాల కోసం అయితే సాగు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. జిల్లాల్లో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించారు. అవసరమైన చోట కొత్తగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు ఇతర ప్రాంతాల ధాన్యం వస్తున్నట్లు గుర్తించామని, దీన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు నిరోధించాలని ఆదేశించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్ఏఎం రిజ్వీ, పోలీస్ అధికారులు జితేందర్, అనిల్‌కుమార్, కార్యదర్శులు రఘునందన్‌రావు, క్రిస్టినా జెడ్. చొంగ్తు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పాల్గొన్నారు. -
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎస్
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయం వద్ద సోమేశ్కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్టా బంగారు కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజలు చేశారు. సీఎస్‌కు ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్ ప్రధానాలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రధానాలయం దాదాపు పూర్తయిందని, కొండ కింద రోడ్లు, తదితర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 28న జరిగే ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. -
భూ పరిపాలనా రంగంలో అతిపెద్ద సంస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూపరిపాలనా రంగంలో వచ్చిన అతి పెద్ద సంస్కరణ ధరణి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో పలు శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే ధరణి సాధ్యమైందని, ఈ సాహసాన్ని కేసీఆర్ తప్ప ఎవరూ చేయలేరని కొనియాడారు. సంవత్సర కాలంలో ఊహించినదాని కన్నా విజయవంతమైందని, 5.14 కోట్ల మంది ధరణి పోర్టల్‌ను చూడటం, 10 లక్షలకు పైగా లావాదేవీలు జరగడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న విప్లవాత్మక పథకాల కారణంగా రాష్ట్రంలోని భూముల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ధరణి పోర్టల్ కారణంగా భూ రికార్డులు పటిష్టంగా మారాయని, రికార్డులను తారుమారు చేసే పరిస్థితి లేకుండా భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు 574 తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు చెప్పారు. ధరణి విజయవంతం కావడంలో సీనియర్ అధికారులు, ఐటీ నిపుణుల శ్రమ ఉందని, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈ విజయంలో కీలక భూమిక పోషించారని ప్రశంసించారు. ఏడాది కాలంలో ధరణి సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆవిష్కరించారు. సమావేశంలో పలు శాఖల కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్.ఎం.రిజ్వీ, రాహుల్ బొజ్జా, శేషాద్రి, రఘునందన్‌రావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్, రష్యా, ఉక్రెయిన్, బ్రె జిల్, జర్మనీ, నెదర్లాండ్, చైనా తదితర దేశాల్లో కోవిడ్–19 మరో రూపంలో ప్రబలిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి నుంచి కా పాడేందుకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక మార్గమని, ఈ మేరకు రాష్ట్రంలో 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో వ్యాక్సినేషన్‌ను మరింత ఉధృతంగా చేపట్టేందుకు గ్రామ/వార్డు స్థాయి ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక బృందంలో ఆశ వర్కర్, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఏ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులకు వసతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతో పాటు వచ్చే సహాయకులకు వసతి కల్పించేందుకు ఆస్పత్రుల పరిసర ప్రాంతాల్లో తగిన ప్రదేశాలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులతోపాటు వస్తున్న సహాయకులు సరైన వసతి, సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు శనివారం సీఎస్ సోమేశ్‌కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దసరా పండుగ నుంచే వసతి కేంద్రాలను ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే ఈ కేంద్రాల్లో హరేకృష్ణ మిషన్ ఫౌండేషన్ సహకారంతో సబ్సిడీపై అల్పాహారం, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో తాగునీరు, శానిటేషన్‌తోపాటు మహిళా అటెండెంట్లకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హరేకృష్ణ మిషన్ చారిటబుల్ ఫౌండేషన్ సీఈఓ కౌంతేయ దాస్, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎం.డి. చంద్రశేఖర్, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ‘ఇటీవల జమ్మూ, కశ్మీర్ పర్యటన సందర్భంగా ‘కుంకుమ పువ్వు’ల సాగు కేంద్రంలో ఓ రైతు నాతో మాట్లాడుతూ గతంలో తమకు కిలో కుంకుమపువ్వుకు రూ.లక్ష వరకూ అందేదని, ‘కేసర్ పార్క్’ఏర్పాటైన తరువాత, సాగు, మార్కెటింగ్‌లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చిన తరువాత రెట్టింపు ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశార’ని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (2023) వేడుక సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు బియ్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ఎఫ్‌సీఐ ద్వారా సేకరించే బియ్యం మళ్లీ ప్రజలకే పంచుతున్నాం. ఈ క్రమంలో సేకరించే బియ్యం నాణ్యమైందా? కాదా? అన్నది చూస్తాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’’అని అన్నారు. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రయత్నం చేస్తారా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సరఫరా చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం అనుమతి పొందితే తాము సేకరించేందుకు సిద్ధమే’’అని తెలిపారు. -
15 రోజుల్లో కోటి టీకాలు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: థర్డ్‌వేవ్ హెచ్చరికలతో రాష్ట్రంలో అందరికీ టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో కోటి కరోనా టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కార్యాచరణ ప్రకటించి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. టీకాలు వేసేందుకు గురువారం నుంచి రోజు వారీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రెండు డోసులూ పూర్తి చేయాలని నిర్ణయించింది. టీకా ప్రక్రియ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 2 కోట్ల టీకా డోసులు వేశారు. కోటి డోసులు 165 రోజుల్లో వేశారు. తర్వాత 2 కోట్ల డోసుల మార్కును 78 రోజుల్లో చేరుకున్నారు. రాష్ట్రంలో 52 శాతం అర్హులకు మొదటి డోసు ఇచ్చారు. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు కూడా.. కనీసం పది ఇరవై మంది ఉన్న ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు, దుకాణాల వంటి చోట్లకు కూడా వెళ్తారు. వారందరికీ అక్కడికక్కడే టీకా ఇస్తారు. ఎవరైనా తమ కార్యాలయంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటే, సంబంధిత స్థానిక అధికారులకు తెలియజేస్తే నిర్ణీత తేదీన వ్యాక్సినేషన్ చేపడతారు. గ్రామాల్లో వ్యాక్సిన్ వేసే రోజున ప్రత్యేకంగా చాటింపు వేస్తారు. మొత్తం మీద రోజుకు ఆరేడు లక్షల మందికి వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అధికారుల కృషి అభినందనీయం: సీఎస్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు చేసిన కృషి కారణంగా తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో 2 కోట్ల టీకాల లక్ష్యాన్ని సాధించడంపై సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. అర్హులైన వ్యక్తులకు టీకాలు వేసేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలో దాదాపు అందరికీ మొదటి డోసు టీకాలు వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హై ఎక్స్పోజర్ గ్రూప్‌లలో ఉన్న 38 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ మార్గదర్శకాలు – నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీకాల శిబిరాలు ప్రారంభించాలి – గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు యూనిట్‌గా ఉంటాయి. – సబ్–సెంటర్లోని అన్ని ఆవాసాలను ముందుగా షెడ్యూల్ చేసిన క్యాంప్‌ల ద్వారా కవర్ చేయాలి. నివాసాల వారీగా సూక్ష్మ ప్రణాళికను సిద్ధం చేయాలి. – పట్టణ ప్రాంతాల్లో వార్డులు యూనిట్‌గా ఉంటాయి. – వార్డులోని అన్ని కాలనీలు/మురికివాడల్లో ముందుగా షెడ్యూల్ చేసిన క్యాంపుల ద్వారా కవర్ చేయాలి. కాలనీ/మురికివాడల వారీగా సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలి. – టీకా శిబిరం కోసం భవనం లేదా టెంట్లు, కుర్చీలు మొదలైనవి సమకూర్చాలి. – టీకా కేంద్రాల వద్ద సైడ్ ఎఫెక్టŠస్ వచ్చే కేసులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు 108 లేదా ఆర్బీఎస్కే వాహనాలను సిద్ధంగా ఉంచాలి. అలాగే జిల్లా స్థాయిలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. – సైడ్ ఎఫెక్టŠస్ కేసుల కోసం అన్ని ఏరియా, జిల్లా ఆసుపత్రులలో పడకలు, వైద్యులను 24 ్ఠ7 అందుబాటులో ఉంచాలి. మొబైల్ వ్యాన్లతో ఇంటింటికీ వెళ్లి పదిహేను రోజుల్లో కోటి టీకాల కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌ను చేపడతారు. మొబైల్ వ్యాన్లతో వీధివీధికీ, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్లు వేయాలని భావిస్తున్నారు. ఒక వీధికి వెళ్లాక వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వారు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా? అని ఆరా తీస్తారు. ఎవరైనా వేసుకోవాల్సి ఉంటే వారికి అక్కడికక్కడే వేస్తారు. ఇంట్లో అర్హులంతా వ్యాక్సిన్ వేసుకుంటే ఆ ఇంటి డోర్‌పై ‘ఫుల్లీ వ్యాక్సినేటెడ్ హోం’అనే స్టిక్కర్‌ను వేయాలని కూడా యోచిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఎవరికైనా టీకాలపై అనుమానాలుంటే అవగాహన కల్పిస్తారు. స్వచ్ఛందం పేరిట వారి ఇష్టానికి వదిలేయకూడదని అధికారులు భావిస్తున్నారు. త్వరలో 12–18 వయసున్న వారికీ 12–18 ఏళ్ల వయసున్న దాదాపు 48 లక్షల మందికి కూడా టీకా వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలోనే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ఆ తర్వాత ప్రభుత్వ రంగంలో వేసే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. -
తెలంగాణ నుంచి ఏపీకి బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీకి శాశ్వత బదిలీపై వెళ్లదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్టోబర్ 15లోగా తమ విభాగాధిపతి/శాఖాధిపతికి దరఖాస్తు చేసుకో వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఏపీకి వెళ్లాలనుకుంటున్న అధికారుల విష యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. ఈమేరకు ఏపీకి అంతర్రాష్ట బదిలీలకు సీఎస్ సోమేశ్ కుమార్ తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను ఏపీకి పంపేందుకు సంబంధిత శాఖ కార్యదర్శి నిరభ్యంతర పత్రం జారీచేస్తారు. చదవండి: అంతరిక్ష ప్రయోగాల్లో నవశకం -
ఎల్బీ శాస్త్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పేరిట ఏర్పాటైన ఎల్బీ శాస్త్రి ట్రస్టు హైదరాబాద్‌లో నైపుణ్యాభివృద్ది సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్రస్టు చైర్మన్, ఎల్బీ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో మంగళవారం బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. సింగపూర్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) భాగస్వామ్యంతో ఈ సంస్థను నిర్వహిస్తామని అనిల్ శాస్త్రి ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు విద్యారంగంలో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ.. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం వివిధ కోర్సులను ఈ సంస్థ ద్వారా అందిస్తామని, తమ కార్యకలాపాలకు హైదరాబాద్ అనువైనదిగా గుర్తించామని అనిల్ శాస్త్రి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సాయం అందిస్తామని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుండటంపట్ల సీఎస్ హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ట్రస్టు బాధ్యులు శ్రీవాస్తవ, పాండురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
TS: ‘ఉచిత విద్యుత్’ లబ్ధిదారుల నమోదుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: సెలూన్లు, ధోబీఘాట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. లబ్ధిదారులు తమ దరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ శాఖ అధికారులను కోరా రు. పథకం అమలుపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు నివేదించారు. -
పీడియాట్రిక్ అధ్యయన కేంద్రంగా నిలోఫర్
నాంపల్లి: ‘కోవిడ్ థర్డ్‌వేవ్ అంటూ వస్తే ఫ్రెండ్‌లాగా వస్తుంది. మనందరి ఆలోచనల్లో అది రాకూడదనే ఉంటుంది. కానీ, ఒకవేళ వస్తే మన సేవల్లో లోటుపాట్లు ఉండకూడదు. రోగాన్ని నిరోధించడానికి 200 శాతం మనం సిద్ధంగా ఉండాలి’అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ చిన్నపిల్లల ఆస్పత్రి అయిన నిలోఫర్ వైద్యులకు సూచించారు. ‘థర్డ్ వేవ్ నివారణకు కావాల్సిన మందులు, డయాగ్నోస్టిక్స్‌కు అవసరమైన పరికరాల కొనుగోలుకు ఆర్డర్ చేశాం. వీటితోపాటు అదనపు సిబ్బందిని సమకూర్చుకొని సూపర్ స్పెషాలిటీ కోవిడ్ నోడల్ కేంద్రంగా నిలోఫర్ పనిచేయాలి. ఈ ఆస్పత్రి వైద్యసేవలు అందించడంతోపాటు అధ్యయన కేంద్రంగా మారాలి. ఇతర జిల్లాల్లోని ఆస్పత్రుల్లో కూడా చిన్న పిల్లలకు ఎలాంటి వైద్యసేవలు అందాలో మీరే ఒక ప్రణాళికను రూపొందించాలి. చిన్న పిల్లల మరణాలను పూర్తిస్థాయిలో తగ్గించే దిశగా ఆలోచనలు మెరుగుపడాలి’అని అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో ఉన్న నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ బ్లాక్, పాత భవనసముదాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన వైద్యులతో మాట్లాడారు. ‘థర్డ్‌వేవ్ గురించి వింటున్నప్పటి నుంచి నేను నిలోఫర్‌కు రావాలని, ఇక్కడేమి జరుగుతుందో చూడాలని భావించానన్నారు. ఎన్ని కేసులు వచ్చినా... నిలోఫర్ ఆస్పత్రిలో పడకల సంఖ్య రెట్టింపైతే ఏ కేసు వచ్చినా ఎదుర్కొనగలుగుతామని, వైద్యులకు నిరంతర శిక్షణ సాగాలని సీఎస్ అన్నారు. ప్రస్తుతం ఇక్కడ థర్డ్‌వేవ్ లక్షణాలు కలిగిన ఐదారు కేసులు ఉన్నాయని, నిలోఫర్‌ను ఆరువేల పీడియాట్రిక్స్ పడకలు, 1,500 కోవిడ్ పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నామని తెలిపారు. ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన వారే కాదు, మన ప్రక్కన ఉన్న నాలుగు రాష్ట్రాలకు చెందిన రోగులు వస్తారు. వారికి కూడా మనమే చూడాలన్నారు. ఆస్పత్రి భవనం టెర్రస్ మీదకు వెళ్లి.. నిలోఫర్ ఆస్పత్రి భవనం టెర్రస్ మీదకు సోమేశ్ కుమార్ వెళ్లి ప్రాంగణాన్ని పూర్తిగా సర్వే చేశారు. తాత్కాలిక షెడ్లు వేస్తే ఎన్ని పడకలు అందుబాటులోకి వస్తాయంటూ అధికారులతో చర్చించారు. అనంతరం పాత భవనం పైకప్పుపై కలియదిరిగారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించి అక్కడున్న పీడియాట్రిక్ విభాగాలను పరిశీలించారు. సుమారు గంటన్నరపాటు ఆసుపత్రిలో ఉంటూ వైద్యులతో థర్డ్‌వేవ్‌పై సమీక్షించారు. అక్టోబర్‌లోగా అందరికీ వ్యాక్సిన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని, అక్టోబర్ నెలాఖరు నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బ్యాంక్ అధికారులు, సిబ్బందికి చేపట్టాల్సిన వ్యాక్సినేషన్‌పై శనివారం ఆయన వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
-
తెలంగాణలో కరోనా నియంత్రణకు కొత్త ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు గరిష్టంగా 100 మందికి మించవద్దని.. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించవద్దని స్పష్టం చేసింది. అదికూడా మాస్కులు, భౌతిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ చట్టం–2005 కింద ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలను, రాత్రి కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు భారీగాపెరుగుతున్న నేపథ్యంలో, గత నెల 23న కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాత్రి కర్ఫ్యూ మరో వారం పొడిగింపు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 8వ తేదీన ఉదయం 5 గంటలతో రాత్రి కర్ఫ్యూ గడువు ముగియనుండగా.. ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని కట్టడి చేయడానికి హైకోర్టు ఆదేశాల మేరకు.. ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూను సైతం కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను సీఎస్‌ఆదేశించారు. చదవండి: (వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందింది) (కరోనాతో భవిష్యత్తులో మరో పెనుముప్పు) -
వారాంతపు లాక్‌డౌన్‌పై పరిశీలించి నిర్ణయం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపయోగం లేదని నమ్ముతున్నాం. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించినా పెద్దగా తేడా రాలేదు. ప్రజల జీవనోపాధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారాంతంలో లాక్డౌన్ విధింపును పరిశీలించాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై బుధవారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పతన దిశలో కోవిడ్ సరళి.. ‘రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి సరళి దిగువకు (ట్రెండ్ డౌన్వర్డ్) పోతోంది. ఇది ఇంకా తగ్గుతుందని ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. కొంత కాలం తర్వాత సాధారణ పరిస్థితి నెలకొంటుంది. చివరి 10 రోజుల పాజిటివిటీ రేటు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. వ్యూహాత్మకంగా కరోనా రోగులకు ఓపీ సేవలు ప్రారంభించడం, లక్షణాలు కలిగిన వారికి మందుల కిట్ల పంపిణీకి తీసుకుంటున్న చర్యలతో మరో వారంలో ఫలితం కనిపిస్తుంది. రోజులో ఎంతమంది పాజిటివ్ అవుతున్నారు, పాజిటివిటీ రేటు ఎంత, ఆస్పత్రి బెడ్ల వినియోగం ఏమేరకు ఉంది? వంటి సూచికల ద్వారా ట్రెండ్ దిగువకు పోతోందని అంచనా వేశాం. కరోనా తొలి వేవ్ తర్వాత చాలావరకు ఇతర రాష్ట్రాలు పని ఆపేస్తే, మేము ఆక్సిజన్ బెడ్లు, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకోవడం వల్లే రాష్ట్రంలో కేసులు పెరిగినా ఇబ్బంది రాలేదు. మొదటి దశలో 18 వేల కోవిడ్ బెడ్స్ ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను 52 వేలకు పెంచాం. ఈరోజు దేశానికి వైద్య రాజధాని హైదరాబాద్. ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి 33 ఎయిర్ అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు వచ్చాయి..’అని సీఎస్ తెలిపారు. కేంద్రం సంబంధిత అంశాల్లోనే సమస్యలు ‘రాష్ట్ర పరిధిలోని అంశాల్లో సమస్యల్లేవు. మా దగ్గర 25 లక్షలకు పైగా ఎన్–95 మాస్కులు, 6 లక్షలకు పైగా పీపీఈ కిట్లు, 86 లక్షల త్రీ ప్లై మాస్కులు, 3 లక్షల ఆర్టీపీసీఆర్, 11 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్, 6.38 లక్షల హోం ట్రీట్మెంట్ కిట్లు, రెమ్‌డెసివిర్ 90 వేలు. టోసిలిజుమాబ్ 63 వాయిల్స్ ఉన్నాయి. మరో 5 లక్షల డోసుల రెమ్‌డెసివిర్ ఆర్డర్ చేశాం. ఏప్రిల్‌లో 4 లక్షల డోసులు వాడడం జరిగింది. రాష్ట్రానికి రోజూ 25 వేల రెమ్‌డెసివిర్ డోసులు అవసరమని హైకోర్టుకు తెలిపాం. కానీ కేంద్రం నుంచి రోజుకు 5 వేలు మాత్రమే వస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన వాటి నుంచే సమస్య వస్తోంది. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులకు రోజుకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే కేంద్రం 430 మెట్రిక్ టన్నులు కేటాయించింది. తమిళనాడు, కర్ణాటక నుంచి రావాల్సిన 45 టన్నుల ఆక్సిజన్ రావడం లేదు. రాష్ట్రానికి 125 ఎంటీల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దేశంలో మొదటిసారిగా వాయుసేన విమానాలతో ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రం తెప్పించుకుంది. 14 ట్రిప్పుల్లో 48 ట్యాంకర్లు వచ్చాయి. రాష్ట్రంలో 17 ఆర్టీపీసీఆర్ ల్యాబులుండగా, ప్రతిజిల్లాలో ఈ సదుపాయం కల్పించే దిశగా మరో 14 ల్యాబ్‌ల ఏర్పాటుకు టెండర్లు ముగిశాయి..’అని వివరించారు. వ్యాక్సిన్ల సరఫరా తగ్గింది ‘రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరాను కూడా కేంద్రం తగ్గించింది. మన రాష్ట్రంలోనే వ్యాక్సిన్ కంపెనీ ఉన్నా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో కేంద్రం నియంత్రిస్తోంది. రాష్ట్రంలో 18–44 ఏళ్ల జనాభా 1.70 కోట్లు ఉండగా, 3.40 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. మే నెల కోసం కేంద్రం రాష్ట్రానికి 3.90 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే ఇచ్చింది. అయితే 30 నుంచి 40 లక్షల వ్యాక్సిన్లు కావాలని కేంద్రాన్ని కోరాం. ఆ మేరకు వస్తేనే 18–44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ప్రారంభిస్తాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి కూడా ప్రధానితో మాట్లాడతారు. జూన్, జూలై తర్వాత వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఆలోగా జాన్సన్ అండ్ జాన్సన్ బయలాజికల్–ఇ వ్యాక్సిన్ కూడా వస్తుంది..’అని సీఎస్ తెలిపారు. సకాలంలో చికిత్సే రక్ష ‘చికిత్సలో జాప్యం, నిర్లక్ష్యం వల్లే కరోనా రోగుల పరిస్థితి విషమిస్తోంది. లక్షణాలు కనిపించిన వెంటనే మందులు మొదలు పెడితే సమస్యలు రావు. అందుకే ప్యూహాత్మకంగా లక్షణాలున్న వారందరికీ మందుల కిట్లు పంపిణీ చేస్తున్నాం. దీంతో రాష్ట్రంలో సీరియస్ కేసులు ఉండవు. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం రాదు. జీహెచ్ఎంసీలో దీనిని ప్రారంభిస్తే 2 రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు జిల్లాల్లో ప్రారంభిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రి, సబ్ సెంటర్, పీహెచ్సీలో కోవిడ్ ఔట్ పేషంట్ సేవలు ప్రారంభించాం. లక్షణాలున్న వారికి మందుల కిట్లు ఇస్తారు. మందులు ఎలా వాడాలో తెలిపే కరపత్రం కూడా ఉంటుంది. మరోవైపు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ/మున్సిపల్ సిబ్బందితో ప్రతి 1,000 గృహాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. వారు లక్షణాలున్న వారిని గుర్తించి మందుల కిట్లు ఇస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో 040–21111111 కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లే.. అన్ని జిల్లాల్లోనూ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి కోవిడ్ బాధితులకు సేవలందిస్తాం. ఇప్పటికే ఉన్న 104 సేవలకు ఇవి అదనం..’అని చెప్పారు. మరణాలపై మా లెక్కలే కరెక్ట్ ‘కోవిడ్–19 మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నవే అసలైన అంకెలు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే కోవిడ్–19 మరణాలను ధ్రువీకరిస్తున్నాం. కోర్టు కేసుల చిక్కుల వల్లే కాంట్రాక్టు విధానంలో వైద్య సిబ్బంది నియామకాలు చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీపై ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యతను ప్రభుత్వ వైబ్సైట్లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. కొరత లేదు. పలుకుబడి కలిగిన వారికి మాత్రమే బెడ్లు లభిస్తున్నాయనే ఆరోపణలు వస్తుండడంతో మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న వారిని మాత్రమే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశించాం..’అని సీఎస్ వివరించారు. -
సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయండి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బిఆర్ కెఆర్ భవన్లో గురువారం ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శాసన మండలి, శాసన సభలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆయన ఆదేశించారు. సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్‌ను అధికారులు సిద్ధం చేసుకుని ఉండాలని సీఎస్ సోమేష్‌కుమార్ సూచించారు. -
క్రమబద్దీకరణ: ఎల్ఆర్ఎస్కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకా నికి (ఎల్ఆర్ఎస్) ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకోసం లేఅవుట్ల క్రమబ ద్ధీకరణ నిబంధనలు–2020ను ప్రకటిం చింది. రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల తరఫున సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా మంగళవారం జీవో 131ను బహిర్గతం చేశారు. నో అప్రూవల్... నో రిజిస్ట్రేషన్ రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలు ప్రణాళికా బద్ధమైన సుస్థిరాభివృద్ధిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన లేఅవుట్లను ప్రోత్సహిస్తోంది. అయితే అక్రమ, అనధికార లేఅవుట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం స్థానిక సంస్థలకు భారంగా మారడంతోపాటు ప్లాట్ల యజమానులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి అక్రమ, అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయబోమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా అనధికార, అక్రమ లేఅవుట్లను ప్రణాళికాబద్ధమైన సుస్థిర అభివృద్ధి పరిధిలోకి తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్లాట్ల యజమానుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు– 2020ను తీసుకొచ్చినట్లు తెలిపింది. 2020 ఆగస్టు 31 నుంచి ఈ నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై అక్రమ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను నిషేధించడంతోపాటు భవన నిర్మాణాలకు సైతం అను మతులు జారీ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముందుగా స్థలాలను మిగతా క్రమబద్ధీకరించుకుంటేనే రిజిస్ట్రేషన్/విక్రయాలు/భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాలనే మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వర్తింపు... హైదరాబాద్ మహానగరాభివృద్ఢి సంస్థ (హెచ్ఎండీఏ), పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ), నగర/పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల్లోని స్థలాలకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) వర్తించనుంది. ఎల్ఆర్ఎస్ అమలు ప్రక్రియను మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు గ్రామ పంచాయతీల్లో కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక అభివృద్ధికి ఉపయోగించనున్నారు. క్రమబద్ధీకరణ వర్తింపు వీటికే... భూ యజమానులు/ప్రైవేటు డెవలపర్లు/సంస్థలు/కంపెనీలు/ప్రాపర్టీ డెవలపర్లు/సొసైటీలు అనుమతి తీసుకోకుండా చేసిన ప్లాట్ల విభజనలన్నింటికీ, ఏర్పాటు చేసిన అన్ని లేఅవుట్లు/వెంచర్లకు ఈ రెండు సందర్భాల్లో ఆధారంగా ఈ రూల్స్ వర్తిస్తాయి. 1) రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ప్లాట్లు విక్రయిస్తే 2) అనధికారికంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లలో కనీసం 10 శాతం ప్లాట్లు 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించిన వాటికి. – పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం, తెలంగాణ భూ సంస్కరణల చట్టం (వ్యవసాయ భూములపై పరిమితి) కింద సంబంధిత ప్రభుత్వ విభాగం నుంచి క్లియరెన్స్ కలిగి ఉండటంతోపాటు నిషేధిత భూముల రిజిస్టర్లో నమోదు కాని స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించనున్నారు. అసైన్డ్ భూముల విషయంలో జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. – 10 హెక్టార్లకంటే ఎక్కువ విస్తీర్ణంలోని జలాశయాలు, కుంటలు, చెరువుల సరిహద్దు నుంచి 30 మీటర్ల తర్వాత ఉన్న స్థలాలకే క్రమబద్ధీకరించుకొనే వెసులుబాటు ఉంటుంది. – 10 హెక్టార్ల విస్తీర్ణం కంటే తక్కువ ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, శిఖానికి 9 మీటర్ల తర్వాత ఉన్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేస్తారు. – కాలువలు, వాగుల సరిహద్దుల నుంచి 9 మీటర్ల దూరం, నాలా సరిహద్దుకు 2 మీటర్ల దూరం ఉన్న ప్లాట్లకే క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది. – విమానాశ్రయాలు, రక్షణ ప్రాంతాల పరిసరాల్లోని స్థలాల క్రమబద్ధీకరణపై ఆంక్షలు వర్తింపజేస్తారు. ఆ భూముల సరిహద్దు నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలంటే ఆయా సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరి. – జంట జలాశయాల పరిధిలో 111 జీవో ఉత్తర్వులపై ఎలాంటి సడలింపుల్లేవు. ఆ జీవోకు అనుగుణంగా ఉన్న ప్లాట్లనే క్రమబద్ధీకరిస్తారు. క్రమబద్ధీకరణ పరిధిలోకి రానివి... – మాస్టర్‌ప్లాన్‌లో పరిశ్రమలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూజ్ జోన్, రిక్రియేషనల్ జోన్, నీటివనరులు, ఓపెన్ స్పేస్‌గా నిర్దేశించిన ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదు. – వివాదాస్పద, దేవాదాయ, వక్ఫ్, శిఖం, ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో ఉన్న స్థలాలు కూడా క్రమబద్ధీకరణకు అనర్హమైనవి. కటాఫ్ తేదీ ఎప్పుడు? ఆగస్టు 26వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తించనుంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్/టైటిల్ డీడ్, సైట్ ప్లాన్, రెవెన్యూ స్కెచ్, మార్కెట్ విలువ, లేఅవుట్ నకలు, లొకేషన్ స్కెచ్, ఇండెమ్నిటీ బాండ్, నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) జతపరచాలి. దరఖాస్తులకు గడువు: అక్టోబర్ 15 వరకు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. మీసేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ), కామన్ వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ (త్వరలోనే అందుబాటులోకి) – లేఅవుట్లో అమ్ముడుపోని ప్లాట్లకు సంబంధించిన సేల్ డీడ్లను లేఅవుట్ యజమాని సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ప్లాట్ ఓనర్ అయితే రూ. 1,000, లేఅవుట్ యజమాని రూ. 10,000 ప్రాసెసింగ్ ఫీజు కింద దరఖాస్తుతోపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పటివరకు చెల్లించాలి? ఎల్ఆర్ఎస్కు ఆమోదం పొందిన స్థలాలకు నిర్దేశిత మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి 31 నాటికి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తేదీని పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్, నాలా ఫీజును వసూలు చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఆగస్ట్ 26 వరకు ఉన్న సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోనున్నారు. కనీస క్రమబద్ధీకరణ చార్జీలు ప్లాట్ల వైశాల్యం (చ.మీ.లలో) రుసుం (చ.మీ./రూ.లలో) 100లోపు 200 101–300 400 301–500 600 500పైనా 750 మురికివాడల్లో రూ. 5 (వైశాల్యంతో సంబంధం లేకుండా) కనీస క్రమబద్ధీకరణ రుసుం అంటే బెటర్మెంట్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలు, లేఅవుట్ స్క్రూటిని చార్జీలు, జరిమానా, ఇతర చార్జీలు కలుపుకొని ఉంటాయి. భూముల మార్కెట్ విలువ ఆధారంగా నిర్దేశించిన క్రమబద్ధీకరణ రుసుం స్థల వైశాల్యం (చ.గజాల్లో) రుసుం (శాతం) 3,000లోపు 25 3,001–5,000 50 5,001–10,000 70 10,001పైనా 100 – అనధికార లేఅవుట్లో 10 శాతం ఓపెన్ స్పేస్ అందుబాటులో లేకపోతే ప్లాటు విలువలో అదనంగా 14% ఓపెన్ స్పేస్ చార్జీలను వసూలు చేస్తారు. ఆగస్టు 26 నాటికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ స్థలం వైశాల్యాన్ని బట్టి శాతాలుగా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు. నోట్: అసలైన క్రమబద్ధీకరణ చార్జీలు అంటే కనీస క్రమబద్ధీకరణ రుసుములతోపాటు ఆగస్టు 26 నాటికి సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆ స్థలం వైశాల్యాన్ని బట్టి శాతాలుగా పరిగణనలోకి తీసుకొని రుసుములు విధిస్తారు. పంచాయతీల్లో తొలిసారిగా.. స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అధికారం తొలుత పురపాలకశాఖకే ఉండేది. రెండేళ్ల క్రితం సర్కారు చేసిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని వర్తింపజేసేలా పంచాయతీరాజ్ శాఖకు అధికారం లభించింది. సెక్షన్ 113 ప్రకారం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించే వెసులుబాటు లభించడంతో పంచాయతీల్లో తొలిసారిగా స్థలాల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. రూ. 10 వేల కోట్ల ఆదాయం! రాష్ట్ర ఖజానాకు ఎల్ఆర్ఎస్ కాసుల పంట పండించనుంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ పథకం భారీగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడం, గ్రామ పంచాయతీల్లోనూ ఈ పథకాన్ని వర్తింపజేస్తుండటంతో సర్కారుకు రూ. 10 వేల కోట్ల రాబడి రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్లో క్రమబద్ధీకరణ రుసుం పెంపు, ప్రస్తుత మార్కెట్ విలువనే పరిగణనలోకి తీసుకుంటుండటం, ప్రతి అనధికార ప్లాటు దాదాపుగా ఎల్ఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరనుంది. ఇప్పటివరకు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఎల్ఆర్ఎస్ వర్తింపజేసిన ప్రభుత్వం.. ఈసారి గ్రామీణ ప్రాంతాలకు కూడా వర్తింపజేయడంతో ఈ పథకం ప్రభుత్వానికి కాసులు కురిపించనుంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో పట్టణీకరణ శరవేగంగా సాగింది. ఈ క్రమంలో పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. దీంతో వాటిల్లో స్థలాలు కొన్న వారు తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్..కరోనాకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేశారా లేదా అని ప్రశ్నించగా..కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని సీఎస్ బదులిచ్చారు. ఇప్పటికే 50 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని పేర్కొనగా..మరి మిగిలిన హాస్పిటల్స్ పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అపోలో, బసవతారకం వంటి హాస్పిటల్స్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో త్వరలోనే బులిటెన్ విడుదల చేస్తున్నామని సీఎస్ సోమేష్‌కుమార్ కోర్టుకు వివరించారు. ఇక రాష్ర్టంలో 8వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేసిన ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఇటీవలె తొలిగించారు. పెండిండ్‌లో ఉన్న జీతాలను తిరిగి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ పిటిషన్‌పై హెకోర్టులో విచారణ కొనసాగుతుంది. -
‘హితం’ బాగుంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు టెలి మెడిసిన్ సేవలు, వారి పర్యవేక్షణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పద్ధతిలో ప్రవేశపెట్టిన ‘హితం’యాప్‌ను నీతి ఆయోగ్ సభ్యులు వినోద్ కుమార్ పాల్ అభినందించారు. పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తీ అహుజా, రవీంద్రన్‌లతో కూడిన కేంద్ర బృందం ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్‌లో పర్యటించింది. పర్యటన ముగింపు సందర్భంగా బీఆర్కేఆర్ భవన్లో బృందం సభ్యులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హితం యాప్ వివరాలతో పాటు రాష్ట్రంలో కరోనా మేనేజ్మెంట్పై చేపట్టిన పనులను ఇతర రాష్ట్రాలతో షేర్ చేస్తామని వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్‌ను పెంచారని, ఇది వైరస్ నియంత్రణకు కీలకమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఆస్పత్రుల సన్నద్ధత స్థాయి, వైరస్ నివారణ చర్యలు, రోగులకు చికిత్స వంటి అంశాలపై సంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల ప్రాణాలు కాపాడటానికి 24 గంటలు పని చేస్తున్నామని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో టెస్టింగ్, కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్ పట్ల కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. పర్యటనలో భాగంగా కేంద్ర బృందం సోమవారం ఉదయం సీఎస్, జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లతో సమీక్షించారు. వైరస్ విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సోమేశ్‌కుమార్ కేంద్ర బృందానికి వివరించారు. టెస్టింగ్‌లను ప్రతిరోజు 40 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు కరోనా నియంత్రణకు ప్రత్యేక నిధులు కేటాయించామని పేర్కొన్నారు. -
పారిశుధ్యం నిరంతరం కొనసాగాలి
సాక్షి, సంగారెడ్డి/సాక్షి, కామారెడ్డి/సాక్షి, వికారాబాద్: పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఈ నెల 1 నుంచి పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా ల్లో గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడడానికి అధికారులకు సమాచారం లేకుండా ఆకస్మికంగా వచ్చానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని ఎద్దుమైలారం, కొండాపూర్ మండలంలోని గుంతపల్లి గ్రామాల తనిఖీ సందర్భం గా మాట్లాడుతూ..జిల్లాలో రెండు గ్రామాలను పరిశీలిస్తే పారిశుధ్య కార్యక్రమాలు బాగా చేసినట్లు ఉందన్నారు. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను రాష్ట్ర వ్యాప్తం గా ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. త్వరలో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, మొక్కలను విరివిగా నాటా లని, ప్రతి గ్రామంలో ఓ నర్సరీ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా రూ.380 కోట్లు.. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి, కామారెడ్డి మండలంలోని గుర్గుల్ గ్రామాల్లో తనిఖీల సందర్శంగా సీఎస్ మాట్లాడుతూ, గ్రామాల్లో మొదటి, రెండో దశల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.380 కోట్లు మంజూరు చేస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు, దాతాపూర్ గ్రామాల్లో తనిఖీ పూర్తయిన అనంతరం మాట్లాడుతూ, ఆకస్మిక తనిఖీ తనకు సంతృప్తి నిచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లాలో వైకుంఠధామాల్లో బాడీ ఫ్రీజర్లు ఉంచాలన్న ఆలో చన నచ్చిందని, వికారాబాద్‌లో నర్సరీలు బాగున్నాయని చెప్పారు. త్వరలోనే రైతుల ద్వారా ఆగ్రోఫారెస్టీ విధానం అమలులోకి తెస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
తెలంగాణలో లాక్డౌన్ ఎప్పటి వరకు?
-
లాక్డౌన్ ముగియగానే వేతనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది.. అదేమీ పూర్తి స్థాయి కోత అని భావించవద్దు.. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించినట్టుగా భావించాలి. అది రిజర్వు ఫండ్ కిందే పెడతాం.. ఆపత్కాలంలో ఇబ్బంది ఉండకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నాం. లాక్డౌన్ ముగియగానే ఆ నిధులను విడుదల చేస్తాం’అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విషయంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మంగళవారం టీఎన్జీవో భవన్లో అత్యవసరంగా సమావేశమైంది. జీవో 27 జారీ తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత మాట్లాడారు. కరోనా డ్యూటీ చేస్తున్న ఉద్యోగులను జీవో 27 నుంచి మినహాయించి వారికి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. చాలా తక్కువ స్థాయిలో పింఛను పొందుతున్న పెన్షనర్లకు కోత లేకుండా చెల్లించాలని కోరారు. అలాగే మార్చి నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా సీఎస్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. జేఏసీ సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, ట్రెస్సా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ ఫిర్యాదుల విధానం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో సమస్యలు వచ్చినా, ఫలితాలకు సంబంధించి ఏమైనా పొరపాట్లు దొర్లినా, విద్యార్థులకు ఎదురయ్యే ఏ ఇతర సమస్యలకు సంబంధించి అయినా ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. గత పరీక్షల సమయంలో దొర్లిన తప్పులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో ఇంటర్మీడియట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు ఆన్లైన్లో చేసే ఫిర్యాదును నిర్ణీత సమయంలో పరిష్కరించేలా, సంబంధిత సమాచారాన్ని సదరు విద్యార్థి మొబైల్ నంబరు/ఈమెయిల్ ఐడీకి పంపేలా ఏర్పాటు చేస్తోంది. ఆన్లైన్లో ఫిర్యాదుల ద్వారా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం దీనిని ప్రారంభిస్తారని తెలిపారు. -
తల్లి లేకుంటే తండ్రి పేరిట చెక్కు
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందించే రూ.51 వేల ఆర్థికసాయాన్ని వధువు తల్లి జీవించి లేకపోతే, ఆమె తండ్రి పేరిట ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకూ ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు.