
సాక్షి, హైదరాబాద్: సీఎస్ మేశ్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని టీపీ సీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)గా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్‌గా సోమేశ్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరా రు. ఆయన నియామకం అక్రమమని మొదటి నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు హైకోర్టు కూ డా అదే చెప్పిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.