CBI inquiry
-
పాస్‌పోర్టు కోర్టులో ఉన్నా అమెరికా ఎలా వెళ్లాడు?
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు కోర్టు అధీనంలోనే ఉన్నప్పటికీ ధిక్కారం ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి అమెరికాకు వెలా వెళ్లిపోయాడని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం పేర్కొంది. దీనిపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐని ఆదేశించింది. అమెరికాలో భర్త వద్ద ఉన్న తన బిడ్డను అప్పగించాలంటూ ఓ మహిళ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జనవరి 29వ తేదీన ఆ వ్యక్తిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అతడిని అరెస్ట్ చేసేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని, చట్టం ముందు అతడిని నిలబెట్టాలని హోం శాఖను సైతం ఆదేశించింది. అయినప్పటికీ, అతడు తప్పించుకుపోవడంపై విస్మయం చెందింది. ఆ వ్యక్తి ఫోర్జరీ పత్రాలతో అమెరికా వెళ్లిపోయి ఉంటాడని పిటిషనర్ తెలిపారు. అమెరికా హోం శాఖకు విషయం తెలిపి, తప్పించుకున్న వ్యక్తిని అక్కడి అధికారుల సాయంతో వెనక్కి తీసుకువచ్చేందుకు అవకాశముందని అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ ధర్మాసనానికి నివేదించారు. ఆ వ్యక్తి ఎయిర్ పోర్టులో వీల్ చైర్లో వెళ్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను అందజేశారు. అయితే, చిన్నారిని తల్లి చెంతకు చేర్చడం ముఖ్యమైన అంశమని పేర్కొన్న ధర్మాసనం..చిన్నారి వెంటనే అమెరికా నుంచి తీసుకువచ్చి తల్లికి అప్పగించాలని ప్రతివాది తరఫు లాయర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
సీబీఐ దర్యాప్తుపై నమ్మకముంది
బరాసత్(పశ్చిమబెంగాల్): కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు. -
విశాఖ డ్రగ్స్: అంతర్జాతీయ లింకులపై సీబీఐ ఆరా.. బ్రెజిల్‌కు స్పెషల్ టీంలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈ మెయిల్స్, వాట్స్ అప్ చాటింగ్స్ ద్వారా కొంత మేర సమాచారం లభించింది. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనం రేకెత్తిచిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఆధారాలను సీబీఐ సేకరించింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. కాగా, తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటా, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా సీబీఐ ఫోకస పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. -
సీబీఐ ఛార్జ్‌షీట్ కల్పిత కథ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలా: సజ్జల
సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్‌షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. ‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్‌లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్‌రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు. ‘‘ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారు. అవినాష్‌రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్‌రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా? ‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్‌ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్‌మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు. చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ -
‘బాలాసోర్’ కళ్లు తెరిపిస్తుందా?
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో రైళ్లు ఢీకొన్న ఘోర ఉదంతం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తోంది. ఇప్పటికీ అనేక కుటుంబాలు తమ ఆప్తుల ఆచూకీ తెలియక తల్లడిల్లుతున్నాయి. 187 మృత దేహాలను ఇంకా గుర్తించాల్సివుందంటున్నారు. శుక్రవారం సంజె చీకట్లు అలుముకుంటున్న వేళ హౌరా నుంచి చెన్నైకి వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్లోకి ప్రవేశించి అక్కడున్న గూడ్స్ రైలును ఢీకొట్టడం, ఆ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన బోగీల్లో ఒకటి రెండు పక్క ట్రాక్‌పై పడడం, ఆ ట్రాక్‌పై వెళ్లే బెంగళూరు– హౌరా యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సైతం ప్రమాదంలో చిక్కుకోవడం ఊహకందని ఉత్పాతం. మృతుల సంఖ్య 275 వరకూ ఉండగా, 1100 మంది గాయపడ్డారు. వీరిలో కనీసం వందమంది వరకూ తీవ్ర గాయాలపాలైనవారున్నారు. విద్రోహ చర్యనో, సాంకేతిక తప్పిదమో ఇంకా నిర్ధారించాల్సే ఉన్నా ఆ దుర్ఘటన వందలాది కుటుంబాల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. అనేకులు శాశ్వత అంగవైకల్యం బారినపడ్డారు. సహాయ బృందాలు వచ్చేలోగా స్థానికులు చూపిన చొరవ ఎన్నో ప్రాణాలను కాపాడింది. ఇది విద్రోహ చర్య కావొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు. కారకులెవరో కూడా తెలిసిందంటున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కూడా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడాన్ని కొట్టిపారేయ లేమన్నది రైల్వే అధికారుల మాట. చెప్పడానికి ఇది బాగానేవున్నా... ఆ వ్యవస్థలో లోపాన్ని గుర్తించి మొన్న ఫిబ్రవరిలో నైరుతి రైల్వే జోన్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రాసిన లేఖ విషయంలో దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలేమిటో ఉన్నతాధికారులు వెల్లడించాలి. ఆ లేఖలోని అంశాలు భీతి గొలుపుతాయి. ఆ నెల 8న బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఇప్పుడు బాలాసోర్‌లో కోరమండల్‌కు ఎదురైన లాంటి సమస్యే వచ్చింది. మెయిన్ లైన్లో పోవచ్చని వచ్చిన సిగ్నల్‌కు భిన్నంగా ట్రాక్ మారటాన్ని గమనించి లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు.లేకుంటే అది కూడా పెను ప్రమాదంలో చిక్కుకునేది. మన దేశంలో అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరసగా పట్టాలెక్కుతున్నాయి. అహ్మదాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ పనులు నడుస్తున్నాయి. కానీ మన రైల్వేల పనితీరు అంతంత మాత్రమే. రోజూ మన రైళ్లు 2 కోట్ల 20 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. 1950లో ఉన్న మన రైల్వే ట్రాక్‌ల నిడివి 53,596 కిలోమీటర్లయితే, ఇప్పుడది 68,100 కి.మీ.కి చేరుకుంది. అప్పట్లో మన రైల్వే ట్రాక్‌ల నిడివిలో సగం కన్నా తక్కువగా...అంటే 21,800 కి.మీ. మాత్రమే ఉన్న చైనాలో 1997 నాటికి 66,000 కిలోమీటర్లకు చేరుకోగా, ప్రస్తుతం అది 1,55,000 కి.మీ ఉందని అంచనా. అంటే మనకు రెట్టింపు అన్నమాట. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న కేటాయింపులతో పోలిస్తే ఇప్పుడు రైల్వే కేటాయింపులు అయిదు రెట్ల వరకూ పెరిగిన మాట వాస్తవమే అయినా... దానికి తగినట్టు సదుపాయాలు పెరుగు తున్న దాఖలా గానీ, మెరుగైన బోగీలు తెస్తున్న తీరు గానీ కనబడటం లేదు. భద్రతా అంశాలు సరేసరి. తరచుగా రైళ్లలో ప్రయాణించేవారికి ఇవన్నీ నిత్యానుభవం. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి. రైల్వే శాఖ కూడా దీనికి మినహాయింపు కాదు. మొన్న జనవరి గణాంకాల ప్రకారం ఆ శాఖలో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా పడి వున్నాయి. వీటిల్లో చాలా పోస్టులు భద్రత, నిర్వహణ, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవే. సెంట్రల్ రైల్వేలో భద్రతకు సంబంధించిన విభాగంలో 28,650 పోస్టులుంటే అందులో సగం ఖాళీలే. కొత్త రైళ్లు వస్తున్నాయి. వాటి వేగం కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగినట్టుగా ట్రాక్‌లు ఉంటున్నాయా? సిబ్బంది పెరుగుతున్నారా? పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వేగవంతమైన రైళ్లు వచ్చాయని సంబరపడుతున్నాం గానీ...ఇప్పటికీ మన రైళ్ల సగటు వేగం గంటకు 50 కిలోమీటర్లు మించడం లేదు. దీన్ని అయిదేళ్లలో 75 కిలోమీటర్లకు పెంచుతామని 2017లో రైల్వే బోర్డు ప్రకటించింది. కానీ అది కలగా మిగిలిందని ఇటీవలే కాగ్ అక్షింతలు వేసింది. జపాన్, చైనా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లలో రైళ్ల సగటు వేగం 150 – 250 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. మన రైళ్ల సగటు వేగం నాసిరకంగా ఉన్నా భద్రతాపరంగా మెరుగైన స్థితిలో ఉండలేకపోతున్నాం. రైళ్లు పెరిగినా, వాటి వేగం పుంజుకున్నా అందుకు అనుగుణంగా ట్రాక్‌లు పెరగకపోవటం వల్ల ఉన్న ట్రాక్‌లపైనే ఒత్తిడి పెరుగుతోంది. ట్రాక్‌ల నిర్వహణ, విద్యుత్, సిగ్నలింగ్ వ్యవస్థల పర్యవేక్షణ వంటివి సక్రమంగా సాగటం లేదు. మరమ్మత్తుల కోసం రైళ్లను ఆపాల్సి రావటంతో ‘సూపర్ ఫాస్ట్’ భుజకీర్తులు తగిలించుకున్న రైళ్లు కూడా సకాలంలో గమ్యం చేరటం లేదు. రైళ్లను ఎక్కువగా వినియోగించేది సామాన్యులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పౌరులు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న కోరమండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ల మృతుల్లో ఎక్కువ మంది వలస వెళ్లక తప్పని బడుగుజీవులే కావటం యాదృచ్ఛికం కాదు. బాలాసోర్ ఉదంతం మన పాలకుల కళ్లు తెరిపించాలి. ఇతర సర్కారీ కొలువుల మాటెలావున్నా భద్రతకు అగ్ర ప్రాధాన్యమిచ్చి రైల్వేల్లో కొన్నేళ్ళుగా అలా ఉంచేసిన లక్షలాది ఖాళీలన్నిటినీ భర్తీ చేయాలి. ఆదాయం తప్ప మరేమీ పట్టని ధోరణి ఇకనైనా మారాలి. మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతకు ప్రాధాన్యం లాంటి అంశాల్లో రాజీ పనికిరాదు. -
సిన్సియర్ సమీర్.. రోలెక్స్ వాచీ, ఫారిన్ ట్రిప్పులు, ప్లాట్లు?!
సిన్సియర్ ఆఫీసర్‌గా పేరొందిన సమీర్ వాంఖడే సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంలో ఈ నార్కోటిక్స్ మాజీ అధికారి అక్రమంగా వ్యవహరించాడంటూ సీబీఐ చెబుతోంది. ఆర్యన్‌ను ఈ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఆయన, మరికొందరు కలిసి పాతిక కోట్ల రూపాయల లంచం షారూఖ్ ఖాన్ కుటుంబం నుంచి డిమాండ్ చేశారనే అభియోగాలతో ముందుకు వెళ్తోంది సీబీఐ. అయితే.. ఆదాయంతో సంబంధం లేకుండా అడ్డగొలుగా ఆయన ఆస్తుల్ని వెనకేసుకున్నారని, అలాగే కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్పులకూ వెళ్లారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదుచేసిన సీబీఐ.. తన దర్యాప్తు కొనసాగించడం గమనార్హం. సిబిఐ పెట్టిన కేసుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సమీర్ వాంఖడేకు సోమవారం వరకు ఊరట దక్కింది. Order Prima facie there is a legal bar under 17A of the PC Act and since a 41A notice is issued in the case..no coercive action against the petitioner till the next date Monday. #SameerWankhede#BombayHighCourt#CBI #AryanKhan — Live Law (@LiveLawIndia) May 19, 2023 2017 నుంచి 2021 మధ్య సమీర్ వాంఖడే ఆరుసార్లు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఆ జాబితాలో యూకే, ఐర్లాండ్, పోర్చ్‌గల్, సౌతాఫ్రికా, మాల్దీవ్స్ ఉన్నాయి. దాదాపు 55 రోజులు ఆ ట్రిపుల్లో గడిపాడు. ఆ పర్యటనల కోసం కేవలం రూ.8 లక్షల 75 వేలు మాత్రమే ఖర్చు చేశానని నివేదించాడాయన. కానీ, ఆ ఖర్చు విమాన ప్రయాణాలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు. ఇక సమీర్ వాంఖడే ఆస్తులకు సంబంధించి కూడా విస్తూపోయే విషయాల్ని వెల్లడించింది ఎన్సీబీ రిపోర్ట్. సమీర్, ఆయన భార్య ఇద్దరి ఆదాయం కలిపి ఏడాదికి 45 లక్షల రూపాయలుగా ఐటీ రిటర్న్స్‌లో చూపించారు. కానీ, చేతికి 17 లక్షల రూపాయలకు తక్కువకాని ఓ రోలెక్స్ వాచీతో పాటు ముంబైలో కోట్లు ఖరీదు చేసే నాలుగు ప్లాట్లు, అలాగే.. వాసిం ఏరియాలో 41 వేల ఎకరాల జాగా ఆయన పేరు మీద ఉన్నట్లు తెలిపింది. ఇక కొత్తగా 82 లక్షల రూపాయలకు మరో ప్లాట్‌ను కొన్నారాయన. అయితే.. గోరేగావ్‌లో ఉన్న ఆ ప్లాట్ విలువ రూ.2.45 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇవేకాదు.. పెళ్లికి ముందు కోటికి పైగా విలువ చేసే ఓ ప్లాట్‌ను సమీర్ ఖరీదు చేశాడు. అయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సమీర్ లెక్కలు చూపించలేదని సీబీఐ అంటోంది. Acceptance, tolerance, bravery, compassion. These are the things my mom taught me. The words of my mother echo constantly that my son is equal to thousands. Such inspiration lifts my spirit to epitome for each end every challenge and struggle…#MothersDay #SameerWankhede pic.twitter.com/pteBReu5bf — Sameer Wankhede (@swankhede_IRS) May 14, 2023 సెలబ్రిటీ పేరు వింటే.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ముంబై విభాగం) మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై స్థానిక మోడల్ మున్మున్ దామెచా సంచలన ఆరోపణలు చేశారు. కార్డిలియా డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి.. బెయిల్ మీద బయట ఉన్నారామె. ‘‘సమీర్‌కు పబ్లిసిటీ పిచ్చి. సెలబ్రిటీ అని తెలిస్తే చాలూ.. వాళ్లను ఏదో ఒకరకంగా జైలుకు పంపించేవాళ్లు. అలా మీడియాలో నానడం ఆయనకు ఇష్టం. అందుకే మోడల్స్‌ను, సెలబ్రిటీలను ఆయన టార్గెట్‌గా చేసుకునేవాళ్లు. ఈ కేసులో అన్యాయంగా నన్ను ఇరికించారాయన. తొలుత నాకేం కాదని ధైర్యం చెప్పే యత్నం చేశారు. ఆపై తాను ఒక మోడల్ అని తెలియగానే.. అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కస్టడీలో ఉన్నప్పుడు కూడా తనను మానసికంగా వేధించారని తెలిపారామె. ఎన్సీబీ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం.. ముంబైలో కార్డిలియా క్రూయిజ్ మీద దాడి జరిగాక.. ఆర్యన్ ఖాన్‌తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి నిమిషంలో సమీర్ టీం యాడ్ చేసింది. 2021, అక్టోబర్ 3వ తేదీన ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. అలాగే.. రోలింగ్ పేపర్‌తో పట్టుబడ్డ ఓ యువతిని మాత్రం వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆర్యన్ ఖాన్ కస్టడీ విషయంలో సమీర్ వాంఖడే వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిచ్చింది.అలాగే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చిన వ్యవహారానికి సంబంధించి తేడాలు కనిపిస్తున్నాయి అని ఎన్సీబీ విజిలెన్స్ నివేదిక వెల్లడించింది. BREAKING : WhatsApp chats between Sameer Wankhede & Shahrukh Khan leaked. Chats from the time when Shahrukh Khan's son was in jail in connection with Cordelia cruise drug case. In the chats, Shahrukh Khan tells Sameer Wankhede: 'You promised you will reform my child and not… pic.twitter.com/sLUcDb2guX — Jan Ki Baat (@jankibaat1) May 19, 2023 సమీర్‌కు ఊరట ఇదిలా ఉంటే సీబీఐ తనపై అరెస్ట్ సహా ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరుతూ సమీర్ వాంఖడే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసు తనపై ప్రతీకార చర్యగానే ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నారాయన. ఈ క్రమంలో.. ఆయనకు ఊరట లభించింది. సోమవారం(22, మే) దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని శుక్రవారం ఆదేశించింది బాంబే హైకోర్టు. గురువారం ఆయన సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆయన మాత్రం గైర్హాజరు అయ్యారు. మరోవైపు.. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ సింగ్ తనను కులం పేరుతో దూషించారని, వేధింపులకు గురి చేశారని సమీర్ వాంఖడే ఆరోపిస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసు నుంచి బయటపడేసేందుకే జ్ఞానేశ్వర్ తనపై సీబీఐను ప్రయోగించారంటూ సంచలన ఆరోపణలు చేశారు కూడా. -
వివేకా కేసులో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
-
‘ఆక్స్‌ఫాం’పై దర్యాప్తుకు కేంద్రం సిఫార్సు
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఆక్స్‌ఫాం ఇండియా సంస్థపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కోనున్న రెండో స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫాం. అమన్ బిరదారీ అనే సంస్థపైనా సీబీఐ దర్యాప్తుకు హోం శాఖ గత నెల సిఫార్సు చేయడం తెలిసిందే. పలు సంస్థలు, ఇతర ఎన్జీవోలకు విదేశీ ‘సాయాన్ని’ ఆక్స్‌ఫాం బదిలీ చేసినట్టు హోం శాఖ గుర్తించింది. అమన్ బిరదారీకీ కొంత మొత్తం పంపిందని సమాచారం.ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు నిధుల బదిలీ, కన్సల్టెన్సీ మార్గంలో తరలింపుకు పాల్పడిందని ఐటీ సర్వేలో తేలింది. -
సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ భాస్కర్ రెడ్డి
-
Manish Sisodia: సీబీఐ ఆఫీసులో సిసోడియా
సాక్షి, ఢిల్లీ: రాబోయే కొన్నినెలలు జైల్లో గడపాల్సి వచ్చినా పట్టించుకోను. ఎందుకంటే.. నేను భగత్ సింగ్ మార్గాన్ని అనుసరించే వ్యక్తి. తెలుసు కదా.. దేశం కోసం ఆయన తన ప్రాణాలను అర్పించాడు!. లిక్కర్ పాలసీ కేసులో.. సీబీఐ విచారణకు వెళ్లబోయే ముందు మనీశ్ సిసోడియా చేసిన ట్వీట్ ఇది. ఆమ్ఆద్మీ పార్టీలో నెంబర్ 2 నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లిక్కర్ స్కాంలో విచారణ కోసం ఆదివారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ఆయన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి సీబీఐ ఆయన్ని ప్రశ్నిస్తోంది. ఆప్ కార్యకర్తలు, తన మద్దతుదారులతో భారీ ర్యాలీగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్నారు. దారిపొడవునా సిసోడియా మద్దతు నినాదాలు, బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారంతా. ఇక మార్గమధ్యంలో ఆయన రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అక్కడే ఆయన ప్రసంగించారు. జైలుకు వెళ్లేందుకు నేను భయపడను. ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌కు భయపడుతున్నారు. మేం మోదీకి, బీజేపీకి భయపడం. నిజాయితీగా పని చేశా. ఆరోపణలన్నీ అవాస్తవాలే. ఇది సవాళ్లు ఎదుర్కొనే సమయం. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించేది ఆప్ మాత్రమే అని సిసోడియా ప్రసంగించారు. ఒకవేళ ఏడు, ఎనిమిది నెలలపాటు నేను జైల్లో గడపాల్సి వస్తే.. గర్వంగా భావించండి. కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బయపడతున్నారు. అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికిస్తున్నారు. నా భార్య ఇంటి వద్ద అనారోగ్యంతో ఉంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఢిల్లీ చిన్నారులకు నేను చెప్పేది ఒక్కటే.. తల్లిదండ్రుల మాట వినండి.. బాగా చదువుకోండి అని ప్రసంగించారు. మరోవైపు సిసోడియాను విచారణ పేరిటి పిలిపించి.. సీబీఐ అరెస్ట్ చేయబోతుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. సీబీఐ హెడ్ క్వార్టర్‌తో పాటు పలు చోట్ల సిబ్బందిని మోహరించి.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు ఆప్ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు కూడా. ఇదిలా ఉంటే.. సిసోడియాను ఉద్దేశించి ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేవుడు మీతోనే ఉంటాడని, ఢిల్లీలోని లక్షల మంది తల్లిదండ్రులు ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవేళ దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లడం ఎంత మాత్రం శాపం కాదని పేర్కన్నారాయన. అదొక ఘనతగా అభివర్ణించారు. జైలుకు వెళ్లినా వెంటనే తిరిగి రావాలని తనతో పాటు యావత్ ఢిల్లీ ఆకాంక్షిస్తోందని చెప్పారాయన. లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 19వ తేదీనే సిసోడియాను సీబీఐ ప్రశ్నించేందుకు పిలిచింది. అయితే.. సిసోడియా విద్యాశాఖతో పాటు ఆర్థిక మంత్రి కూడా(ఇంకా పలు శాఖలను పర్యేవేక్షిస్తున్నారు). దీంతో ఢిల్లీ బడ్జెట్ తయారీకి వారం గడువు కావాలని ఆయన దర్యాప్తు సంస్థను కోరారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని.. అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే.. దేశ రాజధానిలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ విధానం అవినీతి మరక అంటించుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కిందటి ఏడాది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఆ వెంటనే ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని తెరపైకి తెచ్చి.. కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ నిందించింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ పాలసీ కేసు ఛార్జిషీట్లో ఏడుగురు నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ.. సిసోడియా పేరు మాత్రం పేర్కొనలేదు. -
సోమేశ్ నిర్ణయాలపై సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: సీఎస్ మేశ్‌కుమార్ తీసుకున్న నిర్ణయాలపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని టీపీ సీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్‌గా సోమేశ్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరా రు. ఆయన నియామకం అక్రమమని మొదటి నుంచీ చెబుతున్నామని, ఇప్పుడు హైకోర్టు కూ డా అదే చెప్పిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. -
Delhi liquor scam: ఆదివారం కవిత ఇంటికి సీబీఐ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ మహిళా నేత, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారణ చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం(డిసెంబర్ 11వ తేదీన) ఆమె నివాసానికి వెళ్లనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఆర్పీసీ 160 కింద ఇప్పటికే కవితకు నోటీసులు ఇచ్చింది సీబీఐ. అంతకు ముందు.. పలానా తేదీల్లో తాను విచారణకు అందుబాబులో ఉంటానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీబీఐకు మెయిల్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయనున్నారు సీబీఐ అధికారులు. -
వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే..
పనాజీ/ఛండీగఢ్: బీజేపీ నేత, సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల సోనాలి ఫోగట్ గోవా టూర్లో ఉండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే.. చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితులపై ఫోన్ కాల్ ద్వారా సోనాలి అనుమానాలు వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గోవా పోలీసులు మాత్రం పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా రానందునా అసహజ మరణం కిందే కేసు బుక్ చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి గోవాలో ఆస్పత్రికి తీసుకెళ్లే టైంకి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే గుండెపోటుతో ఆమె మరణించిందన్న కోణంపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఎలాంటి మందులు వాడడం లేదని సోనాలి ఫోగట్ సోదరి రమణ్ చెబుతోంది. మీడియాతో.. సోనాలి సోదరి రమణ్ ‘‘గుండెపోటుతో సోనాలి ఫోగట్ మరణించారనడం నమ్మశక్యంగా లేదు. మా కుటుంబం ఈ వాదనను అంగీకరించదు. ఆమె ఫిట్‌గా ఉండేది. ఎలాంటి జబ్బులు లేవు. మందులు కూడా వాడడం లేదు. చనిపోవడానికి ముందు ఆమె నాకు ఫోన్ చేసింది. మా అమ్మతోనూ మాట్లాడింది. భోజనం చేశాక.. ఏదోలా ఉందని చెప్పింది. అక్కడేదో జరుగుతోందని, అనుమానాస్పదంగా ఉందని, నార్మల్ కాల్ కాకుండా.. వాట్సాప్ కాల్లో మాట్లాడదాం అని చెప్పింది. కానీ, మళ్లీ కాల్ చేయలేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయానికి ఆమె మరణించిందని తోటి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఈ వ్యవహారంలో మాకు అనుమానాలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హర్యానా, గోవా ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, ఆప్ నేతలతో ఆమె ఫోన్లో మాట్లాడారు. అయితే గోవా పోలీస్ చీఫ్ జస్పాల్ సింగ్ మాత్రం ఈ మరణంలో ఎలాంటి అనుమానాలు తమకు కలగడం లేదని, పోస్ట్‌మార్టం నివేదికే విషయాన్ని నిర్ధారిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆమె పోస్ట్‌మార్టంను వీడియోగ్రఫీ చేయాలని గోవా పోలీసులు భావిస్తున్నారు. 2016లో సోనాలి భర్త సంజయ్ ఫోగట్ అనుమానాస్పద రీతిలోనే ఓ ఫామ్‌హౌజ్‌లో మృతి చెందగా.. ఆ మిస్టరీ ఈనాటికీ వీడలేదు. చనిపోయే ముందు కొన్నిగంటల వ్యవధిలో ఆమె హుషారుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) హర్యానా టీవీ సెలబ్రిటీ అయిన సోనాలి ఫోగట్ బీజేపీలో చేరిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇటీవలె బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నికలో సోనాలి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదీ చదవండి: చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం -
ఢిల్లీ లిక్కర్ స్కాం: కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పార్టీ(తెలంగాణ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందని బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది వెల్లడించారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకుంటే.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారాయన. మంగళవారం బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, మరో ఎంపీ పర్వేష్‌వర్మతో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్‌లు జరుగుతున్నాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సీబీఐ విచారణ జరుగుతోందన్న ఆయన.. కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేకుంటే బండి సంజయ్‌ను ఎందుకు అరెస్టు చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్యుతంగా ధర్నా చేస్తే అరెస్టు చేస్తారా?. రాజకీయ కారణాలతోని అన్యాయంగా అరెస్టు చేశారు. కానీ, దర్యాప్తు సంస్థలు ఈ కేసులో పూర్తిగా శోధించి సత్యాన్ని బయటకి తీస్తాయి. మేం ఆరోపణలు చేస్తే కవిత ఎందుకు భయపడుతున్నారు?. ఎంపీగా సంజయ్‌కు నిరసన తెలిపే హక్కు లేదా? అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం అని ఎంపీ సుధాన్షు వెల్లడించారు. భారీ స్కాం జరిగింది: బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఢిల్లీలో మద్యం దుకాణాలకు ఎల్ - వన్ కమిషన్ రెండు నుంచి 12 శాతం పెంచారని, అది ఎందుకో ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదు ఢిల్లీ ప్రభుత్వం తీరుపై ఢిల్లీ ఎంపీ, బీజేపీ నేత పర్వేష్ వర్మ మండిపడ్డారు. ‘ఢిల్లీలో ఒక బాటిల్‌కు మరొక బాటిల్ ఉచితంగా ఇచ్చారు. కార్టెల్‌గా మారి జోన్లు ఇవ్వాలని మద్యం విధానంలో లేదు. మద్యం ఉత్పత్తి , డిస్ట్రిబ్యూషన్ , రిటైలర్.. ఈ మూడు ఒక్కరే. మహాదేవ్, బడి పంజా కంపెనీలు ఈ బిజినెస్ చేస్తున్నాయి. కరోనా నష్టాల పేరుతో 144 కోట్ల రూపాయలు మద్యం మాఫియాకు మాఫీ చేశారు. ఇది మద్యం పాలసీకి వ్యతిరేకం. ఎల్ -1 రిటైలర్ కు క్రెడిట్ నోట్ ఇచ్చి, వారి నుంచి వచ్చే నగదు ఆప్ పార్టీకి తరలించారు. ఆ డబ్బు ఎన్నికలకు వినియోగించి మోదీకి మేమే పోటీ అని అంటున్నారు. ఈ పాలసీ వల్ల విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యంపై పన్ను కూడా తగ్గించారు. పన్నులలో, ఆదాయంలో ప్రభుత్వానికి ఖజానాకు గండి కొట్టారు. మొత్తం 6,500 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం జరిగింది. ఆ ధనం ఎక్కడికి వెళ్ళింది అని ఎంపీ పర్వేష్ వర్మ, ఆప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: 33 జిల్లా కోర్టుల్లో కవిత పరువునష్టం దావా! -
రేవంత్ రెడ్డి సవాల్‌పై స్పందించిన మంత్రి పువ్వాడ.. దేనికైనా రెడీ!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. భూములు కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని వెల్లడించారు. సీబీఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని సూచించారు రేవంత్ రెడ్డి ఒక ఐటమ్ అని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చిన నువ్వా.. నా గురించి మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాడని, సుపారీ ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని రేవంత్‌పై మండిపడ్డారు. అలాగే ఈనెల 29 తర్వాత సాయి గణేష్ ఘటనపై మాట్లాడుతానని.. కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడలేనని అన్నారు. చదవండి👉 అందుకే కాంగ్రెస్‌లో చేరడం లేదు: ప్రశాంత్ కిషోర్ కాగా అంతకముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి పువ్వాడ ఓ సైకోనని, అతనికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. పువ్వాడ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈడీ కేసులు, కాంగ్రెస్ కార్యకర్తల మృతి, మమత కాలేజీలో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. దమ్ముంటే పువ్వాడే తనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి పువ్వాడ వేధింపులు తాళలేకే బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని రేవంత్ ఆరోపించారు.మంత్రి పువ్వాడ తమ కులాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించాడు. మంత్రి వల్ల కమ్మ కులానికి చెడ్డపేరు వస్తుందని, అతన్ని కులం నుంచి బహిష్కరించాలని కమ్మపెద్దలను రేవంత్ కోరారు. చదవండి👉 కమలం వికసించేనా?.. కేడర్ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు! -
మీడియాతో మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టీవీ, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో కేసు విషయం మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కస్టడీలోకి తీసుకొనేంతగా అభియోగాలు మోపలేదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని(డిసెంబరులో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న దృష్ట్యా) పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నామని తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా.. ధర్మాసనం అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ రఘురామ, అతని కుమారుడు భరత్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆర్మీ ఆస్పత్రి సీల్డ్ కవర్లో పంపిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఎడమ కాలులో రెండో వేలు ఫ్రాక్చర్ అయిందని, జనరల్ ఎడెమా (నీరు పట్టడం) ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు నివేదిక ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆ గాయాలు ఎలా వచ్చాయో ఆర్మీ ఆస్పత్రి స్పష్టం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. అయితే ఆ నివేదికలో గాయాలు ఎలా వచ్చాయో స్పష్టం చేయలేదు. మెడికల్ బోర్డు, ఆర్మీ ఆస్పత్రి పరీక్షల మధ్య ఏదో జరిగి ఉంటుంది. అవి స్వయంగా చేసుకున్న గాయాలు అని ఎందుకు భావించకూడదు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్తిగా ఉంది. గాయం ఎలా అయిందో అందులో లేదు’ అని దవే స్పష్టం చేశారు. ‘రఘురామకృష్ణరాజు రెండువర్గాల మధ్య ద్వేషాన్ని కలిగించడానికే యత్నించారు. ఇది ప్రజల్లో అసమానతలకు కారణమైంది. రెండు వైద్య నివేదికల మధ్య ఏదో జరిగింది. రఘురామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయండి. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. బాహ్య గాయాలేమీ లేవు. అఖిల్ గొగొయ్, సిద్ధిఖ్ కప్పన్ కేసులు కూడా రాజద్రోహం కేసులే. సుప్రీంకోర్టు ఈ కేసుల్లో బెయిల్ మంజూరు చేయలేదు. గాయాలు ఉన్నాయన్న ఒక్క కారణంతో పిటిషనర్‌కు బెయిల్ ఇవ్వడం సరికాదు’ అని దవే ధర్మాసనానికి నివేదించారు. ‘బాధ్యత కలిగిన వ్యక్తి ఇంకా బాధ్యతగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. రఘురామకృష్ణరాజు కులాలు, మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 124ఏ దుర్వినియోగం చేశారనడం సరికాదు. క్రిస్టియన్లు అధికారంలో ఉన్నారు. హిందువులకు వ్యతిరేకం అంటూ ప్రకటనలు చేశారు. పిటిషనర్ హద్దులు మీరి ప్రవర్తించారు. రెడ్డి, క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు’ అని దవే పేర్కొన్నారు. ఆ మధ్యలో ఏదో జరిగింది ‘పిటిషనర్ కోరిన మీదట హైకోర్టు ఆదేశాలతో ఏర్పడిన మెడికల్ బోర్డు రఘురామకృష్ణరాజుకు క్షుణ్ణంగా పరీక్షలు చేసింది. ఆర్మీ నివేదిక తప్పు అనడం లేదు. రెండు పరీక్షల మధ్య సమయంలో ఏదో జరిగింది. రెండు నివేదికలు విశ్వసించదగినవే. మెడికల్ బోర్డు పరీక్షలను హైకోర్టు పరిశీలించింది. నివేదికలో గాయాలు లేవని తెలిపింది’ అని దవే వివరించారు. కాలి రెండో వేలికి ఫ్రాక్చర్ అయిందని ఆర్మీ నివేదిక చెబుతోందిగా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘మెడికల్ బోర్డు పరీక్షల్ని వీడియో తీశారు. రిజిస్ట్రీకి ఇచ్చారు. మెడికల్ బోర్డు, ఆర్మీ వైద్యుల పరీక్షలకు మధ్య గ్యాప్‌లో ఏదో జరిగింది. అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటే బోన్ ఫ్రాక్చర్ కాదు. అది ఎప్పుడు జరిగింది. పాతదా కొత్తదా అనేది ఆర్మీ ఆస్పత్రి నివేదికలో లేదు. పోలీసులు కొడితే రెండో వేలు ఒక్క దానికే గాయం అవుతుందా. పోలీసులు ఏయే మెథడ్స్ ఉపయోగిస్తారో మీకు, నాకు కూడా తెలుసు. ఎంపీతో అలా వ్యవహరించరు. అంబులెన్స్‌లో కాకుండా సొంత కారులో ఆర్మీ ఆస్పత్రికి వెళ్తానంటే పిటిషనర్‌ను అనుమతించాం. వాహనంలో వెళ్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. పాదాలు బయటకు పెట్టి అందరికీ చూపారు. ఆ దృశ్యాలు మీడియా, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఆర్మీ ఆస్పత్రికి తరలించే ప్రక్రియను హాస్యాస్పదం చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో తనని కొట్టారని, చంపేస్తారని భయంగా ఉందంటూ మీడియాతో వ్యాఖ్యలు చేశారు’ అని దవే స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన కూడా పెట్టమంటారు ‘పిటిషనర్ తరఫు న్యాయవాది సీబీఐ విచారణ అడుగుతున్నారు. కాలి రెండో వేలికి గాయమైతే సీబీఐ విచారణ కోరతారా. పిటినషర్ తరఫు న్యాయవాదిని ఇలాగే అనుమతిస్తే.. రాష్ట్రపతి పాలన కూడా విధించాలని కోరతారు’ అని వ్యాఖ్యానించిన దవే ఇలాంటి కేసులను సీబీఐకి పంపాల్సిన అవసరం లేదన్నారు. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలి రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, వాదనలు వినిపించగా.. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. రఘురామకృష్ణరాజు దర్యాప్తునకు సహకరించాలని, దర్యాప్తు అధికారి పిలిస్తే స్వయంగా విచారణకు హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏ అంశంపైనా టీవీ, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. గతంలో మాదిరిగా గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని, షరతుల్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో రూ.లక్ష ష్యూరిటీ బాండ్లు ఇచ్చి బెయిలు పొందొచ్చని పేర్కొంది. ఇదిలావుండగా.. రఘురామను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు పాటించలేదంటూ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు దవే, వి.గిరి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ అలాంటి నోటీసులు జారీ అయితే ముందుగా సుప్రీంకోర్టులో ఆ అంశం మెన్షన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు గురువారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్‌దేశ్‌ముఖ్ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హోంమంత్రిగా ఉన్న సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ ముంబైలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్æ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘ఆరోపణలను చూస్తే వీటిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు చేయడమే మంచిదని భావిస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవాలనుకోవడం లేదంది. ‘ఒక సీనియర్ మంత్రిపై ఒక సీనియర్ పోలీసు అధికారి చేసిన తీవ్రమైన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయడం సరైనదే’ అని పేర్కొంది. మౌఖికంగా, ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఆదేశించడం సరికాదని అనిల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆధారాలు లేని ఆరోపణలపై, మంత్రి వాదన వినకుండానే బొంబాయి హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. ‘ప్రస్తుతం సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నేతృత్వంలో నడుస్తోంది. ఆ నియామకానికి సంబంధించిన పిటిషన్ కూడా ఇదే కోర్టులో విచారణలో ఉంది’ అని సిబల్ వివరించారు. -
‘మహా’ ముడుపులపై సీబీఐ
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై పదిహేను రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని బొంబే హైకోర్టు ఆదేశించింది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం కోసం స్వతంత్ర ఏజన్సీతో విచారణ అవసరమని తెలిపింది. మొత్తం మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక క్రిమినల్ రిట్పిటీషన్పై కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో ఒక పిల్‌ను సింగ్ దాఖలు చేయగా, మిగిలిన పిల్స్‌ను ఒక లాయర్, ఒక టీచర్ దాఖలు చేశారు. క్రిమినల్ రిట్‌ను లాయర్ జయశ్రీ వేశారు. ఈనెల 25న దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సీబీఐ విచారణ జరపాలని సింగ్ పిల్ దాఖలు చేశారు. సచిన్ వాజే సహా పలువురు పోలీసులను మామూళ్లు వసూలు చేయాలని అనిల్ ఆదేశించినట్లు సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్ తోసిపుచ్చారు. మహా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ పిల్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కానందున సీబీఐ విచారణ సాధ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం నుంచి సీబీఐ విచారణ షురూ! విచారణకు మంగళవారం సీబీఐ బృందం ముంబైకి వచ్చి విచారణ ప్రక్రియ ఆరంభించనుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తమకు అధికారిక ఆదే శాలు అందిన అనంతరం లీగల్ అభిప్రాయం తీసు కొని సీబీఐ విచారణ ఆరంభిస్తుంది. కానీ ఈ కేసు లో కోర్టు కేవలం 15 రోజుల సమయం ఇవ్వడంతో వీలయినంత తొందరగా విచారణ ఆరంభించాలని సీబీఐ భావిస్తుందని అధికారులు చెప్పారు. ముంబై రాగానే కోర్టు ఆదేశాలను, ఫిర్యాదు కాపీలను, ఇతర డాక్యుమెంట్లను సీబీఐ సమీకరించనుంది. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా తనపై మాజీ పోలీస్ కమిషనర్ సింగ్ చేసిన ఆరోపణలను సీబీఐతో విచారించాలని బొంబై హైకోర్టు నిర్ణయించడంతో మహారాష్ట్ర హోంమంత్రి అనీల్ దేశ్‌ముఖ్ ఆ పదవికి రాజీనామా చేశారు. అనీల్ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్‌కు పంపినట్లు ఎన్సీపీకి చెందిన మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అనీల్ సైతం తన లేఖ కాపీని ట్విట్టర్లో ఉంచారు. కోర్టు ఆదేశానంతరం అనీల్ ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను కలిసి పదవి నుంచి దిగిపోవాలని భావిస్తున్నట్లు చెప్పారని మాలిక్ తెలిపారు. పవార్ అంగీకారంతో అనీల్ రాజీనామాను ఉద్దవ్‌కు అందజేసినట్లు తెలిపారు. నూతన హోంమంత్రిగా ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ నియమితులయ్యారు. అనిల్æ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో దిలీప్‌ను సీఎం నియమించారు. -
1400కోట్ల మోసం: వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పాల ఉత్పత్తుల తయారీ సంస్థ క్వాలిటీ లిమిటెడ్ సంస్థ 1,400 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు తాజాగా అవినీతి నిరోధక శాఖ(సీబీఐ) చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. ఢిల్లీతో సహా ఎనిమిది చోట్ల సోమవారం తనిఖీలు చేసిన అనంతరం క్వాలిటీ లిమిటెడ్ బ్యాంక్ రుణాల చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు అభియోగాలు రుజువు కావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో క్వాలిటీ డైరెక్టర్లు సంజయ్ ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ ఉన్నారు. 2012లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం వారిపై చీటింగ్, ఫోర్జరీ, క్రిమినల్ కేసు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.(అరుణ్ శౌరీపై క్రిమినల్ కేసు పెట్టండి) క్వాలిటీ లిమిటెడ్ 2010లో బ్యాంకు నుంచి క్రెడిట్ తీసుకుందని, అయితే 2018 ప్రారంభంలో చెల్లింపులను డిఫాల్ట్ చేయడం ప్రారంభించిందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో బ్యాంక్ ఫిర్యాదు మేరకు సీబీఐ తన దర్యాప్తును ప్రారంభించింది. కంపెనీ చేసిన మొత్తం, 13,147.25 కోట్ల రూపాయల అమ్మకాల్లో 7,107.23 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకుల కన్సార్టియం ద్వారా మళ్ళీంచబడిందని బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ సీబీఐకి చూపించింది. క్వాలిటి తన వ్యాపార కార్యకలాపాలను ఉధృతం చేయడం ద్వారా తన ఆర్థిక నివేదికలను మించిపోయిందని, రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిర్యాదులో పేర్కొంది. (చదవండి: రిటైర్డ్ నేవీ అధికారి దారుణ హత్య) దీనిపై సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ మాట్లాడుతూ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఐడీబీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియంలలో క్వాలిటి సంస్థ మొత్తం 1400.62 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఇదంతా బ్యాంక్ ఫండ్ల మళ్లీంపు, సంబంధిత పార్టీలతో లావాదేవీలు, కల్పిత పత్రాలు, రశీదులతో పాటు తప్పుడు ఖాతాలు, ఆస్తులను సృష్టించి బ్యాంకులను మోసం చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు భారతదేశపు పురాతన, అత్యంత ప్రజాదరణ పొందిన ఐస్‌క్రీమ్ తయారీదారులలో ఉన్న క్వాలిటీ లిమిటెడ్ డిసెంబర్ 2018 నుంచి దివాలా పరిస్థితులను ఎదుర్కొంటుందని కూడా ఆయన వెల్లడించారు. -
అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ సభ్యులు కూడా అమరావతి భూకుంభకోణంలో ఉన్నందునే సీబీఐ విచారణ కోరుతున్నామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. న్యాయ వ్యవస్థను టీడీపీ ఎలా భ్రష్టు పట్టిస్తోందో లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి వివరించారని, ఆయన చెప్పిన విషయాలపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► అన్నిటితోపాటు న్యాయ వ్యవస్థను కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు భ్రష్టు పట్టించారు. ఆయన క్షుద్ర రాజకీయం పార్లమెంటులో బయటపడుతుంటే టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. ► ఒక రాజకీయ పార్టీలో దశాబ్దాలుగా ఉంటూ ఆ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన వ్యక్తులు న్యాయ వ్యవస్థలో ఉన్నారు. చంద్రబాబు కోసమే ఇప్పటికీ వారు పనిచేస్తున్నారు. ఇలాంటివారు న్యాయ వ్యవస్థలో ఉంటే ఈ దేశంలో న్యాయం ఉంటుందని ఎలా అనుకోగలం? ► చంద్రబాబుకు వత్తాసు పలికే ‘ఈనాడు’ పత్రికలో పెట్రో బాంబ్ అంటూ పెద్ద వార్తా కథనం ప్రచురించడం చూస్తే..æ ధృతరాష్ట్రుడు కౌరవుల పట్ల, పాండవుల పట్ల ఎలా వ్యవహరించాడో.. అలాగే పక్షపాతంతో ఎల్లో మీడియా వ్యవహరిస్తోందనేది స్పష్టమవుతోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో అమరావతి పేరు చెప్పి పెట్రో ఉత్పత్తులపై లీటర్‌కు రూ.4 చొప్పన వసూలు చేసిన డబ్బును ఎక్కడ ఖర్చు చేశారో చెప్పగలరా? ఈనాడు దృష్టిలో బహుశా అది పెద్ద వార్త కాదేమో! ► కేంద్రం ఇప్పటివరకు లీటర్‌కు రూ.10 పెంచింది. ఇది రామోజీరావుకు కనిపించలేదా? అంటే ఆయనకు చంద్రబాబుపై ప్రేమ.. ప్రధాని నరేంద్రమోదీ అంటే భయం ఉంది. ► పెట్రో సెస్ ద్వారా వచ్చిన డబ్బును రోడ్ల బాగుకు వినియోగిస్తామంటుంటే ఈనాడుకెందుకు అంత బాధ?. -
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి భరతం పట్టడానికి సహకరించాల్సింది పోయి, కుంభకోణాలకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో సాగిన కుంభకోణంపై ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేస్తే దర్యాప్తు ఆపేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నిందితుల జాబితాలో పెద్దల పేర్లు ఉండటమే ఇందుకు కారణమా అని నిలదీశారు. కేంద్రం తక్షణం స్పందించి అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును నిరసిస్తూ శనివారం వైఎస్సార్సీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన మంత్రి తక్షణం స్పందించాలి : పిల్లి సుభాష్ చంద్ర బోస్ – ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అమరావతి భూముల కుంభకోణం, ఫైబర్‌నెట్ కుంభకోణం, అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారంపై మూడు రోజులుగా వైఎస్సార్సీపీ ఎంపీలం పార్లమెంటులో ధర్నా చేస్తున్నాం. – ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణం స్పందించాలి. అమరావతిలో భూకుంభకోణం జరిగింది. న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవి వాస్తవమా కాదా నిర్ధారించడం కోసం వెంటనే సీబీఐ దర్యాప్తుకు, విభాగ సంబంధిత దర్యాప్తుకు అదేశించాలి. – ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగించినట్లయితే చక్కని సందేశాన్ని ఇచ్చిన వారవుతారు. అమరావతి భూసేకరణ ఒక పెద్ద కుంభకోణం. అయిన వారికి లీకులు ఇచ్చి భూములు కొనేలా చేశారు. – ఇందులో అప్పటి మంత్రులు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, వాళ్ల కుటుంబీకులు ఉన్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజలు పిటిషన్ వేయకపోయినా.. హైకోర్టుగానీ, సుప్రీంకోర్టు గానీ తనంతట తానే కేసులను చేపట్టి విచారణ జరిపిన సందర్భాలు దేశంలో కోకొల్లలు. – కానీ ఇక్కడ 13 మంది న్యాయమూర్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. తమ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు వాటిని స్వీకరించారు. – కోర్టులపై వ్యాఖ్యానించడం నా ఉద్దేశం కాదు. ఒక అధికారి మీదనో, ప్రజాప్రతినిధి మీదనో ఆరోపణలు వచ్చినప్పుడు సూమోటోగా కేసులు చేపట్టి దర్యాప్తుకు ఆదేశించే న్యాయస్థానాలు.. న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తునప్పుడు, పార్లమెంటు సభ్యులు ధర్నాలు జరుపుతూ మీడియా ద్వారా వాటిని యావత్ ప్రపంచం దృష్టికి తెస్తున్నప్పుడు దీనిపై దర్యాప్తు ఎందుకు జరపడం లేదు? – భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికి ఉందని మేమంతా నమ్ముతున్నాం. న్యాయస్థానాలు ఎలా çస్పందిస్తాయా అని ఆం«ధ్రప్రదేశ్‌లో సాధారణ ప్రజలు కూడా గమనిçస్తున్నారు. దయచేసి అక్రమాలపై దర్యాప్తు జరిపించండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే హైకోర్టు స్టే విధించింది. పేదలు మీ నివాస ప్రాంతాలకు సమీపంలో నివసించడానికి అనర్హులా? ఇదేనా సమానత్వం? – అంతర్వేదిలో మత కలహాలు రెచ్చగొట్టడానికి కొందరు ప్రయతిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌లకు కుల మత బేధాల్లేవు. వారికి అందరు సమానులే. దర్యాప్తు ఎందుకు ఆపేయాలి? : మోపిదేవి – న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు వివాదాస్పదంగా ఉన్నాయి. అశేష ప్రజాభిమానంతో ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల న్యాయస్థానం స్పందిస్తోన్న తీరు వివాదాస్పదంగా ఉంది. అమరావతి రాజధాని కోసం జరిగిన భూసేకరణలో అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. – చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక లాండ్ పూలింగ్ పేరుతో పచ్చని పంట పొలాలను బడుగు బలహీన వర్గాల వారి నుంచి సేకరించారు. ఇందులో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. నాడు ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ ఈ స్కాం గురించి అనేక సార్లు లేవనెత్తారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తున్నారు. ఇందులో తప్పేముంది? ఎందుకు దర్యాప్తు ఆపేయాలి? – గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పునఃసమీక్ష జరపడానికి వీల్లేదనడం విచారించదగిన విషయం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఆధారాలు ఉన్నందునే కేసు నమోదు : ఆయోధ్య రామిరెడ్డి – అవకతవకలు జరిగాయని ప్రాథామిక ఆధారాలు ఉన్న వాటిపైనే దర్యాప్తు జరుపుతున్నారు. తప్పులు జరగలేదనుకుంటే దర్యాప్తు జరగనివ్వండి. నిజానిజాలు తేలుతాయి కదా. – రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయాలనుకున్నా న్యాయస్థానాల ద్వారా మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వాన్ని పని చేయనీయడం లేదు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి పనిపై మా ప్రభుత్వం దర్యాప్తు జరపడం లేదు. – అమరావతిలో భూ అక్రమాలు, ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణం, అంతర్వేదిలో రథం దగ్ధం.. ఈ మూడింటిపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరపాలి. శక్తిమంతులకు మేలు చేస్తున్నట్లుంది : లోక్‌సభ జీరో అవర్‌లో కృష్ణదేవరాయలు – అమరావతిలో రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పించాల్సింది పోయి, హైకోర్టు శక్తిమంతులకు మేలు చేసినట్టుగా కనిపిస్తోంది. అమరావతి భూముల కుంభకోణంలో నిష్పాక్షిక విచారణ జరగాలి. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దర్యాప్తును నిలిపివేయడమే కాకుండా.. ఎఫ్ఐఆర్లో మాజీ అడ్వకేట్ జనరల్, ఇతర పలుకుబడి కలిగిన పెద్దల పేర్లు ఉన్నందున మీడియా ఆయా వివరాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తగదు. సామాన్యుడైనా, మాజీ అడ్వకేట్ జనరల్ అయినా చట్టం పరిధిలో అందరూ సమానమే. – ధర్నాలో వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, బీవీ సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు. -
జీవీకే గ్రూప్ ఆడిటర్ల రాజీనామా
హైదరాబాద్: ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తాజాగా మరో పరిణామం ఎదురైంది. ఆడిటింగ్‌లో కంపెనీ సహకరించడం లేదంటూ ప్రైస్ వాటర్‌హౌస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంది. వివిధ అంశాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ పలు మార్లు కోరినప్పటికీ కంపెనీ ఇవ్వడం లేదంటూ, ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆడిటింగ్ సంస్థ ఆగస్టు 13న లేఖ ద్వారా రాజీనామా ప్రతిపాదన పంపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు జీవీకే తెలియజేసింది. -
నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ని...
‘‘సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోషల్ మీడియా వేదికగా కోరారు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి. గత నెల 14న సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘గౌరవనీయులైన అమిత్ షాగారికి.. నేను సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. సుశాంత్ మనందరికీ దూరమై నెలరోజులు గడిచిపోయాయి. ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్ మృతిపై సీబీఐ పరిశోధన జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఎటువంటి కారణాలు ప్రేరేపించాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే’’ అని పేర్కొన్నారు రియా. సుశాంత్ మరణంపై సీబీఐ పరిశోధన జరిపాలని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది సినీవాసులు డిమాండ్ చేశారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియా ఓ కారణం అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సోషల్ మీడియా వేదికగా రియా ఫిర్యాదు చేశారు. -
‘జస్టిస్ ఫర్ సుశాంత్’ ఫోరం ఏర్పాటు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనూహ్య మృతిపై సీబీఐ విచారణే ధ్యేయంగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే ఫోరం ఏర్పాటు చేశారు. సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఈ ఫోరం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన ట్విటర్లో వెల్లడించారు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా జస్టిస్ ఫర్ సుశాంత్ ఫోరం పోరాడుతుందని అన్నారు. బలమైన సంకల్పం, ప్రతిభ కలిగిన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం తనను ఎంతగానే నిరాశ పరిచిందని తెలిపారు. (చదవండి: నన్ను చాలా టార్చర్ చేశారు) అతని అర్ధాంతర ముగింపునకు గల కారణాలను కొందరు దాస్తున్నారని, తమ ఫోరం వాటన్నింటినీ వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. సినీ పరిశ్రమలో నిరంకుశత్వం, గ్రూపు రాజకీయాలు అంతమొందించేందుకు పనిచేస్తామని, అందరి సహకారం కావాలని కోరారు. కాగా, జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ముంబై పోలీసులు విచారిస్తున్నారు. (మొదట్లో నన్ను ‘గోల్డ్ డిగ్గర్’ అంటుండేవారు: కంగనా) Im forming a Forum called #justiceforSushantforum.where i implore just about ev one to pressurize the govt to launch a CBI inquiry into Sushant's death,raise their voices against this kind of tyranny n gangism and tear down the mafias.i solicit your support. — Shekhar Suman (@shekharsuman7) June 23, 2020 -
వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐకి..
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు బుధవారం తీర్పు వెలువరించారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయమూర్తి అనుమతించారు. ఇవే అభ్యర్థనలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత సి.ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు సరైన సాక్ష్యాలను సేకరించలేకపోయారని పేర్కొన్నారు. వివేకా హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ఇందులో ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం కూడా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ తీర్పులను న్యాయమూర్తి ప్రస్తావించారు. ఆ తీర్పుల ఆధారంగా వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేసి, తుది నివేదికను సంబంధిత కోర్టులో దాఖలు చేయాలని సీబీఐకి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐకి అప్పగించాలని ‘సిట్’ను న్యాయమూర్తి ఆదేశించారు. బీటెక్ రవి, ఆది నారాయణరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, ఆర్.బసంత్ వాదించగా.. సౌభాగ్యమ్మ, సునీత తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. -
కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందంటూ పలువులు రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటకలోని 300 మందికి పైగా నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఎమ్మెల్యేలు ఆరోపించడంతో యడియూరప్ప ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ కోరింది. ఇలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. రెండోరోజు రాత్రి 8.30 గంటల తర్వాత కూడా విచారించారు. -
సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్ మెడికల్ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్ విచారణకు అనుమతించారు. దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్ చెప్పారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. -
హత్యాయత్నంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
నెల్లూరు(సెంట్రల్): విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై వెంటనే సీబీఐ విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని సౌదీ అరేబియాలోని వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు డిమాండ్ చేశారు. సౌదీఅరేబియాలోని రియాద్ సిటీలోని ముఝుమియా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్సీపీ సౌదీ అరేబియా యూత్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సౌదీఅరేబియా యూత్ లీడర్ షేక్ అర్హద్ ఆయుబ్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే హత్యాయత్నాన్ని నీరు కారుస్తోందన్నారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. -
పచ్చ కుట్ర
-
‘అగ్రిగోల్డ్’ ఆశలకు సమాధి.. హాయ్‌ల్యాండ్ ఆరగింపు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆశలకు సమాధి కడుతూ.. అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దల కోటరీ తాజాగా భారీగా స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ యాజమాన్యంతోనే న్యాయస్థానానికి కట్టుకథలు చెప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విలువైన ఆస్తిని కొల్లగొట్టడానికి దుర్మార్గపు ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడుతున్నారు. రూ.1,000 కోట్లకు పైగా విలువైన హాయ్‌ల్యాండ్ తమది కాదని చెప్పడం ద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రలకు యాజమాన్యం సహకరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు మనోవేదన గురై మరణిస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు. అగ్రిగోల్డ్ మోసంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తన పరిధిలోని సీఐడీకి ఈ కేసును హడావుడిగా అప్పగించి చేతులు దులుపుకుంది. హాయ్‌ల్యాండ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం తాజాగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హాయ్‌ల్యాండ్ తమదేనని ఇన్నాళ్లూ చెప్పుకున్న యాజమాన్యం ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చడం వెనుక ప్రభుత్వంలోని బడాబాబుల హస్తం ఉందని బాధితులు చెబుతున్నారు. హాయ్‌ల్యాండ్ తమదేనని, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని ఆర్కా లీజర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అల్లూరు వెంకటేశ్వరరావు హైకోర్టుకు చెప్పడాన్ని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తప్పుపడుతోంది. దీనిపై ఆందోళనకు సిద్ధమని ప్రకటించింది. హాయ్‌ల్యాండ్‌పై తొలుత దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థ కన్నేసింది. బేరం కుదరకపోవడంతో వెనక్కి తగ్గింది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే దాదాపు 86 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్ విస్తరించింది. 68 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్, 18 ఎకరాల్లో కల్యాణ మండపం, క్లబ్‌హౌస్, వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇందులోనే దాదాపు 10 ఎకరాల్లో గుంటూరుకు చెందిన ఓ ప్రముఖుడు స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని కృష్ణా జిల్లా నూజివీడులో ఏర్పడుతుందని ఒకసారి, గుంటూరు–విజయవాడ మధ్య వస్తుందని ఇంకోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీకులిచ్చిన సంగతి తెలిసిందే. చివరకు అమరావతిని రాజధాని కేంద్రంగా ఎంపిక చేశారు. ఈ వ్యవహారాలన్నీ ముందుగానే పక్కాగా తెలిసిన ఓ పత్రికాధిపతి హాయ్‌ల్యాండ్‌ను దక్కించుకోవడానికి స్కెచ్ వేశారు. ఇందుకోసం అప్పట్లో రూ.400 వందల కోట్ల దాకా బేరసారాలు జరిగాయని సమాచారం. అనంతరం ఆ పత్రికాధిపతి అనూహ్యంగా ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. తర్వాత గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరపైకి వచ్చింది. హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్‌ను అగ్రిగోల్డ్ యాజమాన్యం అంగీకరించలేదు. ఇంతలో రాష్ట్ర ముఖ్యనేత కుమారుడు, ఆయనకు సన్నిహితుడైన ఓ మంత్రి కలిసి హాయ్‌ల్యాండ్‌పై కన్నేశారు. అగ్రిగోల్డ్ బాగోతాలపై ఎలాంటి కేసులు రాకుండా చూస్తామని, హాయ్‌ల్యాండ్‌ను తమకు ఉచితంగా ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో చివరకు రూ.200 కోట్లు ఇస్తామని ప్రతిపాదించారు. చినబాబు–అగ్రిగోల్డ్ డీల్‌కు అప్పటి విజయవాడ పోలీసు ఉన్నతాధికారి మధ్యవర్తిగా వ్యవహరించారు. చినబాబుకు సన్నిహితుడైన మంత్రి అప్పట్లో ఆరేడు నెలల పాటు హాయ్‌ల్యాండ్‌లోనే మకాం వేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముఖ్యనేతకు భాగస్వామిగా ఉన్న అధికార పార్టీ ఎంపీ కూడా హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎస్సెల్ గ్రూప్ కూడా రంగ ప్రవేశం చేసింది. విజయవాడ ఏలూరు రోడ్డులో అగ్రిగోల్డ్‌కు చెందిన మిల్క్ భవన్లో ఎస్సెల్ గ్రూప్ తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. రసవత్తరంగా టేకోవర్ డ్రామా అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేస్తామంటూ ఎస్సెల్ గ్రూప్‌నకు(జీ గ్రూప్) చెందిన సుభాష్‌చంద్ర పౌండేషన్ ముందుకు రావడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ప్రచారం జరిగింది. రూ.వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన అగ్రిగోల్డ్ ఆస్తులను నామమాత్రపు ధరకు టేకోవర్ చేసుకునే ప్రతిపాదన వెనుక చాలా తతంగం నడిచింది. ఇందుకు విజయవాడ, హైదరాబాద్‌లకు చెందిన పలువురు మధ్యవర్తిత్వం నెరిపారు. ఎస్సెల్ గ్రూప్ ఎండీ సుభాష్‌చంద్ర సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతకు ముందే రెండు పర్యాయాలు వేర్వేరు ప్రాంతాల్లో వీరి భేటీ రహస్యంగా జరిగినట్టు సమాచారం. ఆ నేపథ్యంలోనే ఎస్సెల్ గ్రూప్‌నకు అగ్రిగోల్డ్ ఆస్తులను అప్పగించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తూ రావడంతో ఈ వ్యవహారం పక్కకు పోయింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయమై సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాయబేరం సాగించారు. బహిరంగ మార్కెట్లో రూ.35,000 కోట్లు వాస్తవానికి అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.35,000 కోట్ల పైమాటే. అగ్రిగోల్డ్ సంస్థ 32,02,630 మంది నుంచి రూ.6,380.52 కోట్ల డిపాజిట్లను సేకరించింది. ఈ డిపాజిట్లకు రూ.3,150 కోట్లకు పైగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. డిపాజిటర్ల నుంచి సేకరించిన సొమ్ముతో అనుబంధ సంస్థల పేరుతో అగ్రిగోల్డ్ యాజమాన్యం అపార్టుమెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, విల్లాలు, పవర్ ప్రాజెక్టులు, టింబర్ డిపోలు, డెయిరీఫామ్, రిసార్టులు, కార్యాలయ భవంతులను సమకూర్చుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ యజమాన్యం 18,395.74 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.35 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల పేరిట 16,857.81 ఎకరాల భూములున్నాయి. తొలినుంచీ అడ్డగోలు వ్యవహారాలే... అగ్రిగోల్డ్ వ్యవహారంపై కొందరు ముఖ్యనేతలు మొదటినుంచీ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత డైరెక్షన్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కొందరు తొలుత అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు బేరసారాలు జరిపారు. ప్రభుత్వాధినేతకు, అధికార పార్టీ ముఖ్యులకు అత్యంత సన్నిహితుడనే గుర్తింపు కలిగిన ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా అగ్రిగోల్డ్ ఆస్తులు, కేసుల వ్యవహారాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఒకదశలో హాయ్‌ల్యాండ్‌తోపాటు విజయవాడలోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయ భవనం, షాపింగ్ కాంప్లెక్స్, కీసరలోని పొలాలను తమకు కట్టబెడితే కేసుల నుంచి బయటపడేస్తామనే ప్రతిపాదనను అధికార పార్టీ పెద్దల తరఫున ఆ అధికారి తెచ్చారు. చివరకు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి బిడ్డర్లు రాకుండా అధికార పక్షం అడ్డుకున్నట్టు విమర్శలు వచ్చాయి. బిడ్లు వేసేందుకు వచ్చిన ఔత్సాహికులను కొందరు అధికార పక్షం నేతలు భయపెట్టి వెనక్కి పంపినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని ఆస్తులను దక్కించుకునేందుకు ఇతరులు బిడ్లు వేయకుండా తమ మనుషులనే రంగంలోకి దించినట్లు కూడా ప్రచారం జరిగింది. తక్కువ ధరకే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు హాయ్‌ల్యాండ్‌ను తక్కువ ధరకే ఇచ్చేయాలని కొందరు ప్రముఖులు ఒత్తిడి తెచ్చారని, అయినా తాము లొంగలేదని అగ్రిగోల్డ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను అప్పణంగా కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ఒత్తిళ్లు తెచ్చారు. పోలీసు అ«ధికారులను ప్రయోగించారు. బెదిరించారు. మేం ఏమాత్రం అంగీకరించలేదు. ముందుగా డిపాజిటర్లు, ఏజెంట్లకు డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేయండి. ఆ తరువాత మాట్లాడుకుని నిర్ణయానికి వద్దామని చెప్పాం. వారికి హాయ్‌ల్యాండ్ నచ్చిందట. ముందుగా ఇవ్వాలట. ఆ తరువాత మాట్లాడుతామన్నారు. మేం దానికి అంగీకరించలేదు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పాం. అందుకే మమ్మల్ని జైలుకు పంపారు’’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. డిపాజిటర్లకు సర్కారు అన్యాయం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన నాలుగన్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారు. వీరంతా మొత్తం రూ.491.99 కోట్లు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేశారు. ప్రభుత్వం కనీసం రూ.500 కోట్లు ఇచ్చినా ఇలాంటి చిన్న డిపాజిటర్లను న్యాయం జరుగుతుంది. కానీ, ఆ దిశగా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో దాదాపు 80 శాతం మంది ఏజెంట్లే ఉన్నారని అంచనా. ఒక్కో బాధితుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిహారాన్ని దశలవారీగా చెల్లిస్తోంది. హాయ్‌ల్యాండ్ విలువ గరిష్టంగా రూ.2,200 కోట్లు - హాయ్‌ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ హాయ్‌ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. - ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. - అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. - సుభాష్‌చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. - ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. - ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. - తాజాగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది. 21న ‘చలో హాయ్‌ల్యాండ్’ అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకోవడానికి అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం సన్నద్ధమైంది. ఈ నెల 21వ తేదీలోగా ప్రజాప్రతినిధులు సైతం స్పందించాలని అల్టిమేటం ఇచ్చింది. తాము నోరు తెరిస్తే కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించింది. ఈ నెల 21న ‘చలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి పిలుపిచ్చింది. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు ఆదివారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మీడియాతో మాట్లాడారు. హాయ్‌ల్యాండ్ కచ్చితంగా అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని, ఇందుకు తగిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున వాదిస్తున్న న్యాయవాది సైతం పలు సందర్భాల్లో కోర్టుకు కూడా ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. హాయ్‌ల్యాండ్ తమదంటూ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేని ఆర్కా లీజర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ అల్లూరి వెంకటేశ్వరరావు చెప్పడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావును అగ్రిగోల్డ్ యాజమాన్యం తన మేనేజర్‌గా నియమించుకుంటే ఇప్పుడాయన ఏకంగా బినామీగా మారి హాయ్‌ల్యాండ్ భూమి తనదనేదాకా ఎదిగారని మండిపడ్డారు. ప్రజాకోర్టులో శిక్ష తప్పదు 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్నిగోల్డ్ యాజమాన్యం కుట్ర పన్నుతోందని, దీని వెనుక రెండు రాజకీయ పార్టీల నేతలు, కొందరు అనధికార ప్రముఖులు ఉన్నారని ముప్పాళ్ల నాగేశ్వరరావు, తిరుపతిరావు ఆరోపించారు. రాజకీయ నేతల అండదండలు లేకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇంత బరితెగింపునకు ఒడిగట్టలేదన్నారు. కోర్టులో తప్పించుకున్నా ప్రజాకోర్టులో వీరికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆర్కా తరఫున వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 200 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, వెంకటేశ్వరరావు పిటిషన్‌తో బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు కూడా నాటకాలు ఆడుతున్నారని, అగ్రిగోల్డ్‌లో దాదాపు 160 బినామీ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. హాయ్‌ల్యాండ్ భూమి తనదేనంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున హాజరవుతున్న న్యాయవాది సైతం పలుమార్లు కోర్టుకు విన్నవించారని తెలిపారు. హాయ్‌ల్యాండ్ తమ కలల సౌధమని, దాని జోలికి రావొద్దని ఆ న్యాయవాది చెప్పారని గుర్తుచేశారు. దీనితో సంబంధం లేకుండానే బాధితులకు చెల్లించదగిన ఆస్తులు ఉన్నాయని ఆ న్యాయవాది గతంలో చెప్పారన్నారు. కోర్టునే మోసగించడానికి ప్రయత్నించిన అగ్రిగోల్డ్ యాజమాన్యానికి తగిన శిక్ష తప్పదన్నారు. ఈ నెల 21న హాయ్‌ల్యాండ్ ముట్టడికి పిలుపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించొద్దని, బందోబస్తు అవసరం లేదని ప్రభుత్వాన్ని కోరారు. 22వ తేదీ నుంచి గ్రామగ్రామాన సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై 21వ తేదీలోగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పకపోతే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. ఆస్తులు దోచుకోవడానికి కుట్ర ‘‘అగ్రిగోల్డ్ వ్యవహారమంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోంది. హాయ్‌ల్యాండ్‌తో అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని కోర్టుకు చెప్పడం వెనుక బడాబాబులున్నారు. కేసును విచారిస్తున్న సీఐడీ, మంత్రులు, అధికారులు అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని చెప్పకపోవడం గమనార్హం. విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవడానికి చంద్రబాబు, లోకేశ్ కుట్ర పన్నారు. లక్షలాది మంది డిపాజిటర్లు, ఏజెంట్లను మోసగిస్తున్నారు.బాధితులెవరూ అధైర్యపడొద్దు. వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల వ్యవధిలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటారు’’ – ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, లేళ్ల అప్పిరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటి కన్వీనర్, న్యాయస్థానానికి ఎవరేం చెప్పారంటే.. - హాయ్‌ల్యాండ్ విలువను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్ చంద్ర ఫౌండేషన్ హాయ్‌ల్యాండ్ విలువను రూ.522 కోట్లుగా లెక్కించింది. - ఇదే సమయంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. - అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. - సుభాష్‌చంద్ర ఫౌండేషన్ ప్రతిపాదనలు నమ్మశక్యంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. - ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కనిష్టంగా రూ.1,600 కోట్లు, గరిష్టంగా రూ.2,200గా లెక్కగట్టింది. - అగ్రిగోల్డ్ యాజమాన్యం దేశవ్యాప్తంగా 32.02 లక్షల మంది డిపాజిటర్లను రూ.6380.48 కోట్ల మేర మోసం చేసిందని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. - ఆంధ్రప్రదేశ్‌లో 19.52 లక్షల మందిని రూ.3,966 కోట్ల మేర మోసం చేసినట్లు సీఐడీ అధికారులు తేల్చారు. అగ్రిగోల్డ్‌కు అనుబంధంగా 160 కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు. - తాజాగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీ కాదన్న విషయాన్ని గుర్తించకపోవడంపై సీఐడీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ వ్యవహారం హైకోర్టుకొచ్చేంత వరకు ఆ విషయాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించింది. ఇక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ప్రయోజనం ఏమిటని నిలదీసింది. – సాక్షి, హైదరాబాద్ -
జీవోతో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయింది
సాక్షి, రాజమహేంద్రవరం: సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటే సీఎం చంద్రబాబు ఎందుకు గజగజ వణుకుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర భూభాగ పరిధిలో సీబీఐ విచారణ చేసేందుకు అనుమతి లేదంటూ దేశంలోనే మొదటిసారిగా జీవో జారీ చేసిన సీఎంను ఈయన్నే చూస్తున్నామన్నారు. మేము అవినీతికి పాల్పడతాం.. మాపై విచారణ జరపకూడదన్న విధంగా సీఎం జీవో జారీ చేసిన తీరును ఆయన తప్పుపట్టారు. రాష్ట్రప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ జీవో జారీ చేయడం పలు అనుమాలకు తావిస్తోందన్నారు. ఉండవల్లి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రం జారీ చేసిన జీవో హాస్యాస్పదమైందన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలమీద, రాష్ట్రప్రభుత్వం కోరితే రాష్ట్ర వ్యవహారాలపై, న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఎక్కడైనా విచారణ జరిపే హక్కు సీబీఐకు ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆ జీవోను వాడిపడేసే(టిష్యూ) పేపర్‌తో సమానమంటున్నారని చెప్పారు. మంచోళ్లయితే పోలీసులు వస్తే ఇబ్బందేమిటి? మా ఊర్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు మా ఊరికి రావాల్సిన అవసరం లేదంటే ఎలా? అంటూ ఉండవల్లి సీఎం తీరును తప్పుపట్టారు. ఊర్లో అందరూ మంచివాళ్లయితే పోలీసులొచ్చి మీ ఇంట్లో ఉన్నా ఇబ్బందేముంటుందన్నారు. వ్యాపారాలు చేసే టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఐటీ సోదాలు చేస్తే తనపై దాడి చేసినట్లుగా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. కోటీశ్వరులపై దాడులు జరిగితే వచ్చే నష్టం ఏమిటన్నారు. చంద్రబాబు తన వెనకున్న కోటీశ్వరుల తరఫునా? లేక సామాన్య ప్రజల పక్షమా? చెప్పాలన్నారు. సెక్షన్ 6 ఏమి చెబుతుందో తెలుసుకోకుండా జారీ చేసిన జీవో వల్ల రాష్ట్రప్రభుత్వం పరువుపోయిందన్నారు. విచారణ చేస్తామంటే తొడకొట్టి ఆహ్వానించాలిగానీ మావాళ్లను బెదిరిస్తున్నారని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. మీరే కోర్టులని జీవో ఇవ్వండి... గతంలో రాజకీయ కారణాలతో సీబీఐ విచారణకు ప్రభుత్వాలు ఆదేశించినా.. సీబీఐ విచారణపై ప్రజల్లో నమ్మకం ఉందని ఉండవల్లి అన్నారు. వైఎస్ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ కేసులు వేశారని, చంద్రబాబుపైనా విచారణకు ఆదేశించాలని వైఎస్ విజయమ్మ కోరితే కోర్టుల ద్వారా ఆ విచారణ నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. మాకు కోర్టులు అవసరం లేదు, మా ఎమ్మెల్యేలే కోర్టు, లోకేష్ అప్పీల్ కోర్టు, చంద్రబాబు సుప్రీంకోర్టు అని జీవో జారీ చేయిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో రాజ్యాంగం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. అప్పుడు చేసిన తీర్మానాలేమయ్యాయి? నాలుగున్నరేళ్లు కాపురం చేసి పిల్లల్ని కని, ఏదో మనస్పర్థలు వస్తే కోర్టుకెళ్లిన భార్య.. తన భర్త నపుంసకుడు అన్న రీతిలో సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ పట్ల వ్యవహరిస్తున్నారని ఉండవల్లి అభివర్ణించారు. మోదీ ప్రధాని అయ్యాక భారతదేశం ప్రపంచంలో వెలిగిపోతోందంటూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తి బ్యాలెన్స్‌గా మాట్లాడాలన్నారు. మీరు తప్పు చేయకుండా విచారణ సంస్థలను పంపితే మోదీ మిగులుతాడా? మోదీ ఏమి చేయకుండానే ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం అనుకుంటే తన పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఆదేశించవచ్చన్నారు. చంద్రబాబు పాలన సమర్థతను పక్కనపెడితే ఆయన రాజకీయ సమర్థతపై ఎవరికీ అపనమ్మకం లేదన్నారు. దేశంలో అన్ని పార్టీలతో కలసినవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. -
నయీం కేసులో కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు 2 వారాల గడువునిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నయీం అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సూర్యాపేట హుజూర్నగర్కి చెందిన శ్రీనివాస్ 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీజే నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసుల అండదండలతో నయీం వందల కోట్ల రూపాయాలతోపాటు వందల ఎకరాల భూములను అక్రమంగా ఆర్జించారని తెలిపారు. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశం తో నయీంను ఎన్కౌంటర్ చేశారని, అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. -
రమణదీక్షితులుపై క్రిమినల్ కేసులు
సాక్షి, తిరుపతి: టీటీడీపై గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పాలకమండలి సిద్ధమైంది. మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావుకు లీగల్ నోటీసులు జారీ చేయాలని, తిరుమల టీటీడీ పరువు తీసే విధంగా విమర్శలు చేసిన మరికొందరిపైనా పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. టీటీడీ న్యాయ నిపుణుల సలహా తీసుకుని రెండు మూడు రోజుల్లో చర్యలకు దిగనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అధ్యక్షతన ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశం రమణదీక్షితులు వ్యవహారమే ప్రధాన అజెండాగా సాగింది. మాజీ ప్రధాన అర్చకులు చేసిన ఆరోపణలపై టీటీడీ పాలకమండలి సభ్యులు కొందరు అధికారులతో కలిసి ఇటీవల అమరావతికి చేరుకుని సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. అందులో భాగంగానే మంగళవారం మరోసారి టీటీడీ పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. అన్నమయ్య భవన్లో జరిగిన సమావేశంలో రమణదీక్షితులుపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విషయాన్ని ప్రస్తావించిన సమయంలో ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌తో పాటు మరి కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపైనే ఆయన సమావేశం నుంచి అలిగి వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సైతం రాలేనని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ పెద్దలు, పాలకమండలి సభ్యుల ఒత్తిడితో విలేకరుల సమావేశానికి హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే రమణదీక్షితులుపై క్రిమినల్ కేసు నమోదు చేయటం, ఐవైఆర్ కృష్ణారావుకి నోటీసులు జారీ చేయటం, మరి కొందరిపై పరువునష్టం దావా వేయాలని నిర్ణయించారు. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి? పరువు నష్టం ఎంతకు వేయాలి? అనే అంశాలపై టీటీడీ న్యాయ నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఆభరణాల ప్రదర్శనకు ఆగమశాస్త్రం అభ్యంతరం? ఆభరణాలు మాయమయ్యాయన్న రమణదీక్షితుల ఆరోపణలపై ఈఓ అనిల్కుమార్సింఘాల్ ఇటీవల సుధీర్ఘ వివరణ ఇచ్చారు. 1952లో రికార్డుల్లో నమోదైన ఆభరణాలన్నీ భద్రమేనని వివరించారు. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాలన్నీ ప్రదర్శించటానికి సిద్ధమని వెళ్లడించారు. ఆ విషయంపైనా మంగళవారం పాలకమండలి సమావేశంలో చర్చ జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆభరణాల ప్రదర్శన చేయవచ్చా అన్న దానిపై పలువురు అర్చకులు, పూజారులతో సమావేశమైనట్లు తెలిసింది. వారు అభ్యంతరం వ్యక్తం చేశారని సమాచారం. ఆభరణాలను ప్రదర్శిస్తే... 1952కి ముందు ఉన్న ఆభరణాలు ఏమయ్యాయి? అనే ప్రస్తావన వస్తుందని, అనవసరంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆభరణాల ప్రదర్శన విషయమై టీటీడీ వెనక్కు తగ్గినట్లు సమాచారం. అయితే ఈఓ విలేకరుల సమావేశంలో మాత్రం ఆగమశాస్త్రం ఒప్పుకుంటే ఆభరణాల ప్రదర్శనకు సిద్ధమని ప్రకటించారు. అదే విధంగా రమణదీక్షితులు సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా... సమాధానం దాటవేశారు. తిరుమలకు రా తేల్చుకుందాం ఇరవై ఏళ్లుగా తిరుమలలో పనిచేసి దేవుడిపై అప ప్రచారం చేస్తావా? చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లో కూర్చొని చెప్పటం కాదు. తిరుమలకు రా తేల్చుకుందాం. దేవుడే నీకు గుణపాఠం చెబుతారు’ అని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుపై తీవ్రస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం. శ్రీవారి భక్తులకు మరింత భద్రత శ్రీవారి భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మెన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారు. టీటీడీ బోర్డు సమావేశం తీర్మానాలను ఆయన వెల్లడించారు. ఇవీ ప్రధానాంశాలు. - భక్తుల కోసం టీటీడీ నిఘా, భద్రతా ఆధ్వర్యంలో కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు రూ.1.60 కోట్లు మంజూరు. నిర్వాహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన మ్యాట్రిక్ సెక్యూరిటీస్, సర్వీసెస్ కంపెనీకి అప్పగింత. - దళిత, గిరిజన వాడలు, మత్స్యకార కాలనీలు ఇతర గ్రామాల్లో శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీరామ ఆలయాల నిర్మాణానికి ఇచ్చే నిధులను రూ.8లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు. - చిత్తూరు జిల్లా నాగలాపురం ఆలయ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు అక్కడ వేదపాఠశాల ఏర్పాటు. - 2018–19 సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆసుపత్రులు, వాటి అనుసంధాన ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలుకు రూ.4.84 కోట్లు మంజూరు. - తిరుపతిలోని అలిపిరి వద్ద టాటా ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రికి (అలిమేలు చారిటబుల్ ట్రస్టు పౌండేషన్) 33 సంవత్సరాల పాటు లీజుకు 25 ఎకరాల స్థలం కేటాయింపు. ఏడాదికి ఎకరాకు రూ.లక్ష లీజుగా నిర్ణయించారు. - తిరుపతి– చెర్లోపల్లి మధ్య మార్గంలో సైన్స్ మ్యూజియంకు 19.15 ఎకరాలు, సైన్స్‌సిటీకి 50.96 ఎకరాలను కేటాయింపు. - తిరుమలలో ధర్మగిరి వేదపాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇచ్చే తరహాలోనే శ్రీవేంకటేశ్వర వేద యూనివర్సిటీలో వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.3లక్షలు డిపాజిట్. - ఎస్వీ వేద విద్యాలయం ఆధ్వర్యంలో శ్రీబాలాజీ వేదపరిపోషణ ట్రస్టు ఏర్పాటు. దీనికి విరాళాలు అందించే భక్తులకు బస, స్వామివారి దర్శనం. - ఆంధ్రప్రదేశ్‌లోని పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని నిర్ణయం. - 29 మంది ఇంజనీరింగ్ మజ్దూర్లకు హెడ్ మజ్దూర్లుగా పదోన్నతి. -
సీబీఐ విచారణకు సిద్ధం
హైదరాబాద్: ఇటీవల కాలంలో కొందరు టీటీడీ అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలపై తాను సీబీఐ విచారణకైనా సిద్ధమని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్పష్టం చేశారు. అయితే ఆరోపణలు చేసే వారూ, వారి బినామీలూ సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణలకు బాధపడ్డానని, భక్తులకు వాస్తవాలు తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్లు వెల్లడించారు.1994 నుంచి స్వామి వారి సన్నిధిలో అర్చకుడిగా ఉన్నానని గతంలో జేఈవోలుగా పనిచేసిన బాల సుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు.. బ్రాహ్మణ, అర్చక వ్యతిరేకులుగా, నాస్తికులుగా పనిచేశారన్నారు. వెయ్యి కాళ్ల మంటపాన్ని మాస్టర్‌ప్లాన్ కోసం అంటూ కూల్చిన సమయంలో గట్టిగా పోరాటం చేశానని అన్నారు. తనపై కక్ష కట్టిన అధికారులు ఎంతో ప్రాచీనమైన, వంశపారంపర్యంగా వచ్చిన తన ఇంటిని కూడా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలసుబ్రమణ్యం చట్టవ్యతిరేక విధానాలు, వ్యసనాలకు అలవాటుపడి అర్చకులను క్రూరంగా హింసించేవాడన్నారు. ఇక శ్రీనివాసరాజు అవినీతి, అక్రమాలు ప్రపంచానికి మొత్తం తెలుసని ఆరోపించారు. 24 ఏళ్లుగా ఇలాంటి అధికారులతో హింసకు గురయ్యానని చెప్పారు. 2001లో పింక్ డైమండ్ మాయమైందని, ఇది నాణేలు తగిలి పగిలిపోయిందని అధికారులు చెబుతున్నారని.. ఎంతో కఠినంగా ఉండే వజ్రం ఎలా పగులుతుందని ప్రశ్నించారు. 1800లో బ్రిటిష్ మ్యానువల్స్‌లో స్వామివారి వంటశాల పక్కనున్న నేలమాలిగల్లో నిధులున్నాయని ఉందని.. అక్కడ తవ్వకాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 2 నెలలకోసారి అపోలో ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వస్తానని, ఇప్పుడు కూడా దీని కోసమే వచ్చినట్లు తెలిపారు. -
గీతాంజలికి ఐసీఐసీఐ రుణాలపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆభరణాల వ్యాపారవేత్త మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం ఇచ్చిన రుణాలపై తాజాగా సీబీఐ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) దర్యాప్తు చేస్తుండగా.. సీబీఐ కూడా దర్యాప్తు చేయనున్నట్లు తెలిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ సారథ్యంలోని 31 బ్యాంకుల కన్సార్షియం.. గీతాంజలి గ్రూప్‌నకు రూ. 5,280 కోట్ల మేర రుణాలిచ్చాయి. దీనికి సంబంధించి విచారణలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్, యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మలను మార్చి 6న ఎస్ఎఫ్ఐవో ప్రశ్నించింది. సీబీఐ ప్రస్తుతం పీఎన్బీని వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 13,000 కోట్ల మేర మోసగించిన కేసును దర్యాప్తు చేస్తోంది. పీఎన్బీ ఉద్యోగులతో కుమ్మక్కై తీసుకున్న నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎల్వోయూ)ల ద్వారా మోదీ తదితరులు ఈ కుంభకోణానికి తెరతీశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో బహ్రెయిన్‌లోని కెనరా బ్యాంక్ అధికారులు ఇద్దరిని, యాంట్వెర్ప్ (బెల్జియం)లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరినికి సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. -
బాబూ సీబీఐ విచారణకు సిద్ధపడు
కడప కార్పొరేషన్: నేను నిప్పులాంటి మనిషినని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధపడి, నిజంగా నిప్పేనని నిరూపించుకోవాలని వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు సవాల్ విసిరారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, పవన్‌కళ్యాణ్ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లు కలిసి సంసారం చేసిన తర్వాత నేడు ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా నేటికీ సజీవంగా ఉండటానికి కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషేనని తెలిపారు. ఆయన చేపట్టిన ధర్నాలు, దీక్షలు, యువభేరిల వల్ల ప్రజలు చైతన్యవంతులయ్యారని, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. నేను అడిగినా కేంద్రం ఇవ్వలేదని, బీజేపీతో జగన్ లాలూచీ పడ్డారని సీఎం విమర్శించడం హాస్యాస్పదమన్నారు. టీడీపీపై బీజేపీ విమర్శలు చేసినా, పవన్‌కళ్యాణ్ విమర్శలు చేసినా జగనే చేయించారని చెప్పడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో లక్షా నలభై ఐదువేల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. వైజాగ్‌లో రూ.245కోట్ల విలువగల భూమిని ఏపీఐఐసీ ద్వారా కాకుండా నేరుగా సీఎం బంధువులు కాజేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నలభై లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు కట్టిన సొమ్ము వెనక్కిరాక రోడ్డున పడి ఉంటే, ఆ సంస్థ ఆస్తులను కూడా టీడీపీ నాయకులు దోచుకున్నారన్నారు. నీరు–చెట్టు పనుల్లో రూ.1800 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచి నాలుగు వేల కోట్లు స్వాహా చేశారన్నారు. అమరావతిలో ఐదు పంటలు పండే 35వేల ఎకరాల భూములను లాక్కొని ఐదువేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మురళీమోహన్, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు వంటివారు ముందే భూములను కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నారని, ఆ భూములు ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయన్నారు. పట్టిసీమలో రూ.750కోట్ల అవినీతి జరిగిందని కాగ్ కడిగేసిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో 80 శాతం నిధుల్ని వినియోగించలేదని, ఖర్చుపెట్టిన 20 శాతం నిధులకు కూడా యూసీలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. హోదా కోసం రాజీనామా చేసేందుకు సిద్ధం: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాకు వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తెలియక ఒకసారి మోసపోయారని, మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. బాబు డబ్బుకోసమే ముఖ్యమంత్రి అయ్యారే తప్పా ప్రజలకు సేవ చేయాలని కాదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లక్షా తొంబైవేల కోట్లు చంద్రబాబు జేబులోకే పోతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. హోదా సాధించేవరకూ వైఎస్ఆర్సీపీ వెనకడుగు వేయదని తేల్చిచెప్పారు. చంద్రబాబు ప్లేటు ఫిరాయించినంత మాత్రాన ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రత్యేక హోదా ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు ఇన్నాళ్లు తుంగలో తొక్కారనే విషయం ప్రజలకు బాగా తెలుసని, చంద్రబాబు నేడు ప్లేటు ఫిరాయించినంత మాత్రాన ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి అన్నారు. చంద్రబాబు చుట్టూ ఉండే నారాయణ, కోడెల తనయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మురళీమోహన్ వంటి వారు అమరావతిలోని భూములను కారు చౌకగా కొట్టేశారని, అసైన్డ్ భూములను కూడా వదల్లేదన్నారు. లక్షా యాభై వేల ఎకరాల ఆయకట్టు ఉన్న బ్రహ్మంసాగర్‌లో ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి పని కూడా చేయలేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి కూలీలకు పని కల్పించకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో పనులు చేశారని ధ్వజమెత్తారు. 20 శాతం కూడా పనిచేయకుండా వందశాతం బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని, బ్రహ్మదేవుడొచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు తుమ్మలకుంట శివశంకర్, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. మంత్రి ఆది కలెక్షన్ వీరుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి కలెక్షన్ పదవి చేపట్టినప్పటి నుంచి కలెక్షన్ వీరుడిగా మారారని ఎద్దేవా చేశారు. పార్టీ మారేముందు 100 రోజుల్లో జమ్మలమడుగును అభివృద్ధి చేస్తానన్న ఆయన ఇన్ని మాసాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. గాలేరు నగరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారా, గండికోట ముంపు వాసుల సమస్య తీర్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి అయ్యాక ఆయన చేసిన ఘన కార్యమేమిటంటే రూ.5కోట్లు తీసుకొని సస్పెండ్ అయిన 142 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడమేనన్నారు. ఆదికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. -
నన్ను చంపేందుకు సీఎం కుట్ర!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దళితుడేనంటూ వాగ్దానం చేసి మాట తప్పారని విమర్శించినందుకు తనపై కక్ష గట్టి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో లేఖను సమర్పించారు. గత ఏడాది జూలై 8వ తేదీన ఈ కుట్రపై తనకు అనుమానం కలిగిందని, సూర్యాపేట నుంచి వరంగల్‌కు ప్రయాణిస్తుండగా తనపై కొందరు దాడికి యత్నించారని లేఖలో ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు తాము చేస్తున్న పోరాటానికి స్పందిస్తూ పలుమార్లు అఖిలపక్ష నేతలను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని ప్రకటించి కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నిస్తే రెండు సార్లు అరెస్టు చేశారని తెలిపారు. చివరగా రెండోసారి జనవరి 2న అరెస్టు చేసినప్పుడు 23 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో ఉండగా తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, ఇది వెలుగులోకి రావడంతో అమలుచేసేందుకు వెనకడుగు వేశారని వివరించారు. తనను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామని, భవిష్యత్తులో కూడా అణచివేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఈ నెల 14వ తేదీన శాసనసభలో ప్రకటన చేశారని వెల్లడించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తనపై జరిగిన హత్యాయత్నంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవే అంశాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డికి వివరించినట్టు మంద కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇంద్రాణితో కలిపి కార్తీ విచారణ
ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా సీబీఐ ఆదివారం కార్తీ చిదంబరంను ఢిల్లీ నుంచి ముంబైలోని బైకుల్లా జైలుకు తీసుకు వచ్చింది. అక్కడ ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్, షీనా బోరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాతో కలిపి విచారణ జరిపింది. ఇద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టిన ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం ఉదయం 11.15 గంటల నుంచి నాలుగు గంటల పాటు ప్రశ్నించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కార్తీని తిరిగి విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇద్దరినీ విచారణ జరుపుతున్న సమయంలో బైకుల్లా జైలు గేట్లను మూసి వేశారు. చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2007లో ఆయన కుమారుడు కార్తీ నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ నిధులకు అనుమతులు మంజూరు చేయించారనీ ఇంద్రాణి ఇటీవల సీబీఐ ఎదుట అంగీకరించారు. -
బ్యాంకులో డబ్బుల మాయంపై సీబీఐ విచారణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో డబ్బులు మాయమైన కేసు సీబీఐ చేతికి చేరింది. గత నెల 30న బయటకు వచ్చిన ఈ కుంభకోణం సంచలనం సృష్టించింది. దీనిపై సీబీఐ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. డిపాజిట్ దారుల ఖాతాల్లో నుంచి బ్యాంకు అధికారులే డబ్బులు స్వాహా చేసినట్లు తేల్చారు. గత 11 సంవత్సరాలుగా బ్యాంకులో పనిచేసిన పలువురు మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది కలిసి మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రూ.9 కోట్ల వరకు దోపిడీ చేసినట్లు తేల్చారు. 10 మందిపై కేసు నమోదు... తెలంగాణ గ్రామీణ బ్యాంకు కుంభకోణంలో సీబీఐ అధికారులు పది మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుత బ్యాంకు మేనేజర్ మండల రవీందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ అధికారులు ప్రధాన నిందితుడు క్యాషియర్ మాడి జైపాల్‌రెడ్డితోపాటు ఇక్కడ గతంలో బ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన జే.మోజస్, కె.లక్ష్మినర్సయ్య, కె.చంద్రయ్య, జి.శ్రీనివాసరావు, రాజన్న, వీవీజే రామారావు, ప్రస్తుత అకౌంటెంట్ సి.గురుప్రసాద్, తాత్కాలిక ప్రాతిపధికన స్వీపర్‌గా పనిచేస్తున్న మాడి శ్రీనివాస్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వీరితోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంత మంది ప్రైవేటు వ్యక్తులపై సైతం కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం, బుధవారం సీబీఐ అధికారులు బ్యాంకును సందర్శించి పలు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వేర్వేరుగా విచారించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన సూత్రదారి క్యాషియర్... అజీజ్‌నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు కుంభకోణంలో బ్యాంకు క్యాషియర్ జైపాల్‌రెడ్డి ప్రధాన సూత్రదారి అని తేలింది. 2010 నుంచి 2018 జనవరి వరకు బ్యాంకు క్యాషియర్‌గా జైపాల్‌రెడ్డి పనిచేశాడు. అయితే మొదట్లో ఖాతాదారులు బ్యాంకులో డబ్బులు జమచేస్తే వారికి సరైన రశీదు ఇచ్చేవాడు. కానీ డబ్బులు మాత్రం ఖాతాలో వేయకుండా తన అవసరాలకు వాడుకునే వాడు. ఇలా మొదలైన ఈ వ్యవహారం ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ మొదలు పెట్టాడు. బ్యాంకులో డిపాజిట్ చేసిన కోట్ల రూపాయలకు నకిలీ రశీదులు, బాండ్లు ఇచ్చేవాడు. డిపాజిట్‌దారులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని వస్తే తానే ఇచ్చావేడు. ఇలా ఖాతాదారుల సొమ్మును అడ్డగోలుగా తన అవసరాలకు వాడుకునేవాడు. ఈ వ్యవహారానికి బ్యాంకు మేనేజర్, ఇతర సిబ్బంది సహకరించారు. -
అగ్రిగోల్డ్ ఆస్తుల పత్రాలు అందజేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తుల పత్రాలన్నింటినీ ఎస్సెల్ గ్రూప్‌నకు అందజేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఎస్సెల్ గ్రూపు కోరిన మేరకు సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రిగోల్డ్ సీనియర్ న్యాయవాది ఎల్.రవిచంద్ర తెలిపారు. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు తాకట్టులో ఉంటే సంబంధిత పత్రాలను బ్యాంకులు ఎస్సెల్ గ్రూపునకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు–అప్పుల పత్రాలు అందుబాటులో లేకుంటే సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా సేకరించి అందజేయాలని అగ్రిగోల్డ్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది. -
కార్తీకి సుప్రీంలో చుక్కెదురు
-
కార్తీకి సుప్రీంలో చుక్కెదురు
► సీబీఐ విచారణకు హాజరవకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ► లుకౌట్ నోటీసుల అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై స్టే న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి కేసుల్లో సీబీఐ విచారణకు హాజరు కాకుండా విదేశాలకు వెళ్లవద్దని కోర్టు ఆదేశించింది. అలాగే కార్తీపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లుకౌట్ నోటీసుల్ని నిలిపివేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ‘అతను దోషి అవునా.. కాదా! అన్న అంశం జోలికి మేం పోలేదు. కార్తీ విచారణకు హాజరై సహకరిస్తాడా? లేదా? అన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. విచారణకు హాజరుకావాలని సీబీఐ కోరింది. మీరు హాజరు కాలేదు. మొదట విదేశాల్లో ఉన్నానని చెప్పారు. అక్కడి నుంచి వచ్చాక కూడా విచారణకు సహకరించలేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. విచారణకు హాజరై కార్తీ తన విశ్వసనీయతను నిరూపించుకోవాలంది. కార్తీ తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమ ణియంపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపిం చింది. ‘కార్తీ అరెస్టుకు ఎలాంటి ఉత్తర్వులు లేవు. అతన్ని అరెస్టు చేసే ఆలోచన కూడా లేదు. అయినా విచారణకు ఎందుకు దూరం గా ఉన్నారు.? అలాగే ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మాత్రమే మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తారు. కానీ మీరు అలా చేయలేదు. అంటే అరెస్టు గురించి మీరు భయపడడం లేదు’ అని పేర్కొంది. విచా రణకు ఎప్పుడు హాజరవుతారో సమయం తెలపాలని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో కార్తీకి, మరో నలుగురికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది. విదేశాలకు అనుమతిలో... కక్షిదారు నుంచి వివరాలు తీసుకుని కోర్టుకు సమర్పిస్తానని, అదే సమయంలో కార్తీ రక్షణ విషయంలో సుప్రీంకోర్టు భరోసా ఇవ్వాలని సుబ్రమణియమ్ కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ‘కొందరు ప్రముఖ వ్యక్తులకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి విషయంలో కోర్టుకు చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. వెళ్లిన వారు ఇంకా తిరిగి రాలేదు’ అని పేర్కొంది. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసును ఉదహరిస్తూ.. మలేసియా వెళ్లేందుకు అనుమతించిన వ్యక్తులు తిరిగి రాలేదని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా కార్తీ, ఇతరులపై జారీ చేసిన లుకౌట్ నోటీసులపై మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల్ని నిలిపివేస్తూ.. ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్‌ను చట్ట పరిధికి లోబడి పరిష్కరించాలని సూచించింది. ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్‌పై తుది ఉత్తర్వుల కోసం కార్తీ ప్రయత్నాలు కొనసాగించాలని, ఒకవేళ అత ను విజయం సాధిస్తే విచారణను నిలిపి వేస్తామని సుప్రీం తెలిపింది. అయినా అతను విదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. -
సీబీఐ ఎంక్వైరీ కోరుతూ పోలీసులపై రాళ్లదాడి
జైపూర్: రాజస్థాన్‌లోని నాగౌర్‌లో బుధవారం సాయంత్రం జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా, 20కి పైగా పోలీసులు గాయపడ్డారు. తమ కుమారుడిని పోలీసులు అన్యాయంగా చంపేశారని ఆరోపిస్తూ గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ సింగ్ ఫ్యామిలీ సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. గత జూన్ 24న పోలీసుల ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ సింగ్ మృతిచెందాడు. అయితే అతడి కుటుంబసభ్యులు ఆనంద్ అంత్యక్రియలు నిర్వహించకుండా.. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టి భద్రపరిచారు. అప్పటినుంచీ గ్యాంగ్‌స్టర్ తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఆందోళన చేపట్టారు. కర్ఫ్యూ విధించిన నాగౌర్‌తో పాటు బికనీర్ సహా నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గ్యాంగ్‌స్టర్ ఆనంద్ తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులుకు సమాచారం అందించినా ఉద్దేశపూర్వకంగానే ఎన్కౌంటర్ చేసి చంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ తర్వాత ఇంటికి మృతదేహం తరలించగా అంత్యక్రియలు చేయకుండా ఫ్రీజర్‌లో ఉంచారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. జూన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ కొందరు ఆందోళనకారులు, గ్యాంగ్‌స్టర్ మద్ధతుదారులు రెచ్చిపోయారు. నాగౌర్‌లో పోలీసులపై రైల్వై స్టేషన్లు, రద్దీ రోడ్లు అంటూ పలు జంక్షన్ల వద్ద రాళ్లదాడికి పాల్పడ్డారని ఓ ఉన్నతాధికారి ఎన్ఆర్కే రెడ్డి తెలిపారు. మొదట ర్వైల్వే ట్రాక్స్ మీద అడ్డుగా ఉండి రాకపోకలకు ఇబ్బంది కలిగించడంతో కొన్ని సర్వీసులు రద్దు కాగా, మరికొన్ని రైళ్ల రూట్లను మార్చారు. ఆందోళనకారులు చెలరేగి పోలీసులపై రాళ్లదాడికి పాల్పడగా 20 మంది పోలీసులు గాయపడ్డట్లు సమాచారం. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా, గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పై 1992-2017 మధ్యకాలంలో 40 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరు హత్య కేసులునట్లు పోలీసులు చెబుతున్నారు. జైపూర్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన హత్య కేసుకిగానూ 2012లో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. 2015లో అజ్మీర్‌లో కోర్టు నుంచి జైలుకు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి నాటకీయంగా గ్యాంగ్‌స్టర్ ఆనంద్ తప్పించుకున్నాడు. అప్పటినుంచీ అతని కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. మరోవైపు ఏ ఆదాయ వనరు లేకున్నా నిందితుడి పేరిట రెండు అపార్ట్మెంట్లు, విలువైన భూములున్నాయని.. ఓ కూతురు దుబాయిలో చదువుకుంటోందని పోలీసులు వెల్లడించారు. -
ఎస్ఐల ఆత్మహత్యలపై సీబీఐ విచారణ
జరపాలని జీవన్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కుకునూర్‌పల్లి ఎస్సైలుగా పనిచేస్తూ ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణాలు ఏమిటో,కారకులు ఎవరో తేల్చడానికి సీబీఐ విచారణ జరపాలని సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి , రామకృష్ణారెడ్డి మృతిపై న్యాయ విచారణ జరిపించడం ద్వారా సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు పోలీసులను గుప్పె ట్లో పెట్టుకోవడం, అనేక అంశాల్లో వారిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత శాంతియుతంగా ధర్నా చేసినవారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగు తున్నదన్నారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిగితే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించకపోతే టీఆర్ఎస్తో బీజేపీ చేతులు కలిపినట్టేనని అన్నారు. -
హవాలాపై సీబీ‘ఐ’
నరసాపురం : విశాఖ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం గురువారం నరసాపురంలో దాడులు జరిపింది. పట్టణంలో పేరుమోసిన బంగారం వ్యాపారి దుకాణం, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిం చింది. వేకువజాము నుంచి రాత్రి 7 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. దాడుల విషయాన్ని సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. సీబీఐ డీఎస్పీ, మరో 9మంది సిబ్బంది వేకువజామునే నరసాపురం చేరుకుని, వాహనాలను గోదావరి గట్టు సమీపంలో పార్కింగ్ చేశారు. ఉదయం 5 గంటల సమయంలో కాలినడకన అతని ఇంటికి చేరుకున్నారు. కొందరు ఇంట్లో, మరికొందరు అతడి జ్యూయలరీ షాపులో సోదాలు చేశారు. స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తర్వాత గాని ఇక్కడకు వచ్చింది సీబీఐ అధికారులన్న విషయం తెలియలేదు. హవాలా కేసులో భాగంగానే.. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన రూ.1,300 కోట్ల హవాలా కుంభకోణానికి సంబంధించిన కేసులో భాగంగానే సీబీఐ అధికారులు సోదాలు చేసినట్టు తెలిసింది. హవాలా కేసుకు సంబంధించి వడ్డి మహేష్, అతని స్నేహితుడు శ్రీనివాస్‌ను ఇటీవల విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉన్నట్టు దర్యాప్తులో తేల్చారు. అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్న సందర్భంగా వారిచి్చన సమాచారంతో నరసాపురంలో కూడా దాడులు చేసినట్టు సమాచారం. ఈ కేసులో రూ.650 కోట్ల మేర హవాలా లావాదేవీలు సాగి నట్టు ముందుగా విశాఖ పోలీసులు తేల్చారు. అయితే ఈ మొత్తం రూ.1,300 కోట్ల మేర ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సీబీసీఐడీ పర్యవేక్షిస్తున్న ఈ కుంభకోణం కేసు వ్యవహారం రూ.వందల కోట్లలో ఉండటంతో సీబీఐ అధి కారులు రంగప్రవేశం చేసినట్టు భావిస్తున్నారు. సోదాల సందర్భంగా కీలక వివరాలు సేకరించిన అధికారులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు వారు ఏ కేసుకు సంబంధించి వచ్చారు, ఎవరెవరిని విచారించారనే విషయాలు వెల్లడించ లేదు. మొత్తానికి వందలాది కోట్ల రూపాయల హవాలా కేసు వ్యవహారం విశాఖ నుంచి నరసాపురం చేరింది. సీబీఐ దాడులు పట్టణంలో సంచలనం రేకెత్తించాయి. ముఖ్యంగా బులియన్ వ్యాపారులు హడలిపోయారు. -
మధుకర్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలి
సీఎంకు తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలోని మంథని మధుకర్ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించి దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఇది కచ్చితంగా కులదురహంకార హత్యేనని తమ పార్టీ నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు గురువారం రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. మధుకర్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. హత్య అనంతర పరిణామాలు, పోలీసుల పాత్ర, అధికారపార్టీ స్థానిక నేతల తీరును గమనిస్తే దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు చౌరస్తాలో తొలగించిన అంబేడ్కర్ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ప్రతిష్టించాలన్నారు. -
సీబీఐ విచారణకు సిద్ధమా.?
-
సీబీఐ విచారణకు సిద్ధమా?
ప్రశ్నపత్రాల లీకేజీలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ - సీబీఐ అయితేనే మంత్రి నారాయణ పాత్ర బట్టబయలవుతుంది సాక్షి, అమరావతి: ‘పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ విచారణకు సిద్ధమా? సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సాక్షి ఆధారాలను సీబీఐకి ఇచ్చి.. విచారణకు పూర్తిగా సహకరిస్తుంది. తప్పులను కట్టడి చేయాలనే తపన ఉండాల్సిన ముఖ్యమంత్రి.. వ్యవహారాన్ని పక్కదోవ పట్టించి మంత్రులను రక్షించడానికి యత్నిస్తున్నారు. దమ్మూ ధైర్యం ఉంటే మా సవాల్‌ను స్వీకరించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాల్ విసిరారు. శాసనసభలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. నాలుగు సార్లు వాయిదా అనంతరం మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేసిన అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి సీఎం చంద్రబాబు, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజులు అడుగడుగునా అడ్డుతగిలేందుకు వారికీ అవకాశమిచ్చారు.. వారు వ్యక్తిగత దూషణలకు దిగుతూ కవ్వించినా జగన్ సంయమనం కోల్పోలేదు. లీకేజీ వ్యవహారంపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ.. సీఎం వ్యవహారశైలిపై వ్యంగ్యాస్త్రాలను విసురుతూ.. ప్రభుత్వ తీరును కడిగిపారేశారు.వివిధ అంశాలను ఎత్తిచూపుతూ అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేశారు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను.. సీఎం చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావించిన జగన్ ‘‘చంద్రబాబు తరచూ నా చదువులు గురించి మాట్లాడుతారు.. నీ మాదిరిగా నేను వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడలేను.. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను.. పదో తరగతిలో.. ఇంటర్మీడియట్లో.. డిగ్రీలో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను. నీ మాదిరిగా ఎంఫిల్ చేయకుండానే చేసినట్లు చెప్పుకోను. నీ మాదిరిగా పీహెచ్డీ డీస్‌కంటిన్యూ చేయలేదు.. ప్రపంచంలో ఇంత దరిద్రమైన ఇంగ్లీషు ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే మాట్లాడగలరని పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు.. నీ ఇంగ్లీషు ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసుకో.. ప్రజలను నమ్మించలేకపోతే గందరగోళానికి గురిచేయడమే చంద్రబాబు వ్యక్తిత్వం.’’ అని ఘాటుగా స్పందించారు. -
బినామీ కనుకే ‘నారాయణ’ను రక్షిస్తున్నారా?
-
బినామీ కనుకే ‘నారాయణ’ను రక్షిస్తున్నారా?
చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రశ్న ⇒ టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది... ⇒ ప్రాథమిక సాక్ష్యాధారాలున్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? ⇒ యాజమాన్యాన్ని వదిలేసి చిరుద్యోగులపై చర్యలేమిటి? సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారాన్ని కప్పిపుచ్చుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన శాసనసభ లాబీల్లోని తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నపత్రం లీకేజీ జరిగిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే బదులుగా చిరుద్యోగులను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు నారాయణ బినామీ అన్న ప్రచారం జరుగుతోందని, అందుకే ప్రభుత్వం నారాయణను కాపాడుతోందా అన్న అనుమానాలు న్నాయని ఆయన చెప్పారు. ప్రాథమిక సాక్ష్యాధారా లున్నా ఈ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణను ఎందుకు జరిపించడం లేదని జగన్ ప్రశ్నించారు. వివరాలు ఆయన మాటల్లోనే..... ‘‘ఈ ఏడాది ఆరున్నర లక్షల మంది పరీక్షలు రాస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. కానీ ప్రభుత్వం ఏ మాత్రం లెక్కలేనట్లుగా వ్యవహరి స్తోంది. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టంగా తెలిసి పోయింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఇచ్చిన రోజు వారీ నివేదికను శాసనసభలో చూపిస్తూ ప్రస్తావించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో.. ‘నెల్లూరు జిల్లా విద్యా శాఖాధికారి ప్రశ్నపత్రం లీకయినట్లుగా పేర్కొన్నారు’ అని ప్రస్తావించారు. ప్రశ్నపత్రం 4,238వ కేంద్రం, నారాయణ హైస్కూలు– నెల్లూరు నుంచి లీకైనట్లు తెలిపారు. అంతే కాదు, ఆ కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్‌పై విచారణకు ఆదేశించామని టెలీకాన్ఫ రెన్స్‌లో వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నామని చెప్పారు. అయినా ప్రభు త్వం అంగీకరించలేదు. మేం అసెంబ్లీలో ఈ అంశం పై గొడవ చేసి, నివేదిక ప్రతిని చూపించాక మంత్రి గంటా ఢిల్లీ నుంచి విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. లీకేజికి వాడిన సెల్ ఫోన్ ఒక అటెండర్దని తేల్చినట్లు వివరించారు. నేనడుగుతున్నది ఒక్కటే.. ఆ అటెండరు ఏ స్కూలు యాజమాన్యానికి చెందిన వాడు? ఆ సెల్‌ఫోను ఏ యాజమాన్యానిది? అసలు అటెండర్ ఇలాంటి పని ఎందుకు చేస్తాడు? అటెండ ర్కు ఉన్న ఆసక్తి ఏమిటి? తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి అతనెందుకు రిస్క్ తీసుకుంటాడు? యాజమా న్యాలు చెప్పాయి కాబట్టి, సెల్ఫోన్లు పరీక్షా కేంద్రం లోకి అనుమతించారు కాబట్టి దాని సాయంతో ప్రశ్నపత్రం ఫొటో తీసి వాట్సాప్‌లో మిగిలిన వీరి ప్రతినిధులకు ఆ డేటాను పంపించి ఉంటాడు. వారు ఆ ప్రశ్నలకు సమాధానాలు రూపొందించి పంపార నేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఫలితాలను తారుమారు చేసే కార్యక్రమం కాదా? ఇలా చేయడం అంటే యాజమాన్యాలు పరీక్షా ఫలితా లను తారుమారు చేయడమే కదా? రాత్రింబవళ్లు కష్టపడిన విద్యార్థులకు ర్యాంకులు రావు. ఇంత అడ్డ గోలుగా వ్యవహారం జరిగింది. ఒక్క నెల్లూరులోనే కాదు, మడకశిరలో కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో హిందూపురంలోని నారాయణ పాఠశాలకు చెందిన ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు. (ఫోటోలు చూపుతూ) చూడండి ఇది పోలీసు స్టేషను.. ఇందులో ముత్యాలు స్టేషన్ దగ్గర ఉన్న దృశ్యం కనిపిస్తోంది. ముత్యాలును అదుపులోకి తీసుకుని తరువాత వదలి వేశారు. తెలుగు, హిందీ, సైన్సు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు మనకు తెలిశాయని, జరుగుతున్నది వాస్తవమేనని ఏకంగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కూడా నివేదిక ఇచ్చారు. నారాయణ, చంద్రబాబుకు బినామీ అంటున్నారు! నారాయణ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి అయిన నారాయణ సీఎం చంద్రబాబుకు బినామీ అని, వైద్య కళాశాలలో ఆయనకు భాగస్వామ్యం ఉందనే ప్రచారం బలంగా ఉంది. నారాయణ, విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడనే విషయం అందరికీ తెలుసు. అసలు నారాయణను ఎందుకు మంత్రి చేశారో తెలియదు. నారాయణకు, చంద్రబాబుకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఎలాంటివి అంటే.. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా లేకపోయినా బాబు ఏకంగా మంత్రిని చేశారు. ఆ తరువాతనే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. బాబుకు నారాయణ బినామీ అనే ప్రచారం ఉంది. ఎవరినడి గినా ఇదే చెబుతున్నారు. అంతా కలిసి నారాయణను ఇంత దారుణంగా రక్షిస్తూ విద్యావ్యవస్థను దిగజారు స్తున్నారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు సంబంధించిన ఇంత ముఖ్యమైన ఉదంతంపై తక్షణం స్పందించాల్సిన సీఎం 30వ తేదీ తరువాత సభలో ప్రకటన చేస్తారట. అప్పటికి పరీక్షలన్నీ పూర్తిగా అయిపోతాయి. ఇదెలా ఉందంటే.. ఇల్లు తగుల బడుతూ ఉంటే ఫైర్‌ఇంజన్ తక్షణమే రాదు, ఇల్లంతా తగులబడిన తరువాత వస్తుందన్నట్లుగా ఉంది. ఈ విషయంలో యాజమాన్యాలను వదలి వేసి అటెండర్లు, ఇన్విజిలేటర్లు వంటి చిన్న ప్రాణుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుని మొత్తం కేసును తప్పు దోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? లీకేజీ చేయాల్సిన అవసరం చిరుద్యోగులకు ఏముంటుంది అని ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఈ వ్యవహారాన్ని మొత్తం యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకు అనిపించడం లేదు? అటెండర్ల మీదనో ఇన్విజిలేటర్ల మీదనో కేసులు పెట్టి వ్యవహారాన్నంతా మూసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? ఫలితాలన్నీ ప్రకటించేశాక నారాయణ పాఠశాలకు 1 మొదలు 100 ర్యాంకులు వచ్చేశాక అపుడు దయదలచి స్టేట్మెంట్ ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే.... రోమ్ నగరం తగులబడి పోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్లుగా ఉంది. తగులబడి పోతున్న ఈ అంశంపై చర్చ పెడితే ఒక సానుకూల సందేశం ప్రజల్లోకి వెళుతుందని మేం ఎంత చెప్పినా వినలేదు. గతంలో మంత్రులు రాజీనామాలు చేశారు గతంలో ప్రశ్నపత్రాలు లీకైనపుడు అప్పటి మంత్రులు రాజీనామాలు చేసిన సంఘటనలున్నాయి. అంతే కాదు, ముఖ్యమంత్రులు సీబీఐ విచారణకు కూడా ఆదేశించారు. ఇపుడెందుకు జరుగడం లేదు? చంద్రబాబుకు ఈ వ్యవహారంలోని వారిపై ఆసక్తి లేకపోతే ఎందుకు మంత్రులను బర్తరఫ్ చేయరు? సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? మేం ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చాం, 344 నిబంధన కింద స్వల్ప వ్యవధి చర్చనూ కోరాం. ఆ సమయంలో సభలో ముఖ్యమంత్రి లేరు. ఇద్దరు మంత్రులూ లేరు. నారాయణ మాత్రం కొంత సేపు ఉండి వెళ్లి పోయారు. విచారణలు ఫార్సుగా మారాయి.. దేవుడే రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్రంలో అనేక ఉదంతాలపై వేసిన విచారణలు ఒక ఫార్సుగా తయారయ్యాయి. పుష్కరాల్లో మరణాలపై ఓ విచారణ కమిషన్‌ను వేశారు. అది కూడా సిటింగ్ జడ్జి ఆధ్వర్యంలో వేయలేదు. వీళ్లకు కావల్సిన మనిషితో రిటైర్డు జడ్జితో వేశారు. అది ఏమైందో ఇప్పటి వరకూ తేలలేదు. ఎందుకు తేల్చరు అంటే ఇందులో చంద్రబాబే దోషి అని తేలుతుంది కాబట్టి. అగ్రిగోల్డ్ కుంభకోణం విషయంలోనూ అంతే. హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తే దాన్ని పట్టించుకోలేదు. లీకేజి వ్యవహారాన్ని కూడా సీబీఐకి అప్పగిస్తేనే లోతు పాతులు తెలుస్తాయన్నాం. అసలు ఈ అంశం చర్చకే రానివ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలి.... (సభలో ఉండి ఈ విషయం చెప్పవచ్చు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించినపుడు) మీరే చూస్తున్నారుగా... అసలు మమ్మల్ని మాట్లాడినిస్తే కదా! సీబీఐ విచారణ ఎందుకు జరిపించరు? ఇన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలున్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే కదా వారు లోతుల్లోకి వెళ్లి సెల్ఫోన్ల నుంచి ఎవరెవరికి మెసేజ్‌లు పెట్టారు, వీళ్లంతా ఎన్ని కేంద్రాల్లో ఇలా చేశారు అనేది తెలిసేది? -
‘బెయిల్ రద్దు చేయండి’
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో వైఎస్ జగన్మోహన్రెడ్డికి గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ మంగళవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు డీఐజీ చంద్రశేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోరడంతో విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి వాన్‌పిక్, ఇందూ టెక్‌జోన్ చార్జిషీట్లలో సాక్షిగా ఉన్న పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రమాకాంత్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వూ్యను సాక్షి టీవీలో ప్రసారం చేశారని, పేపర్లో ప్రచురించారని, ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. కొమ్మినేని... ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయితే, కొమ్మినేని శ్రీనివాసరావు తెలుగునాట ప్రముఖ జర్నలిస్టు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ, టీవీ5 వంటి మీడియా సంస్థలలో సుదీర్ఘకాలం పని చేసి ప్రస్తుతం సొంతంగా బ్లాగ్ నడుపుతున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కూడా ఉన్నారు. సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొమ్మినేని వారం వారం నిర్వహి స్తున్న ‘మనసులో మాట’ కార్యక్రమంలో భాగంగా రమాకాంత్‌రెడ్డిని ఇంటర్వూ్య చేశారు. ఈ ఇంటర్వూ్య పట్ల సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
జేఎన్‌యూలో సమానత్వం లేదు
⇒ ఫేస్బుక్లో ముత్తు కృష్ణన్ ఆఖరి పోస్ట్ ⇒ అతని మరణంపై సీబీఐ దర్యాప్తు కోరిన కుటుంబ సభ్యులు న్యూఢిల్లీ, సాక్షి, చెన్నై: జేఎన్‌యూలో సమానత్వానికి చోటులేదని సోమవారం ఆత్మహత్య చేసుకున్న దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ మార్చి 1న తన చివరి ఫేస్బుక్ పోస్ట్‌లో ఆవేదన చెందాడు. వర్సిటీ పరిపాలనా కార్యాలయం ముందు నిరసనలను నిషేధిస్తూ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను తప్పుపట్టాడు. సమానత్వాన్ని నిరాకరిస్తే ప్రతీదాన్ని నిరాకరించినట్లేనన్నాడు. పీహెచ్డీ, ఎంఫిల్ కోర్సుల ప్రవేశాల విధానాల్లో చేసిన సవరణలను విమర్శించాడు. ముత్తు కృష్ణన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయడానికి ఎయిమ్స్ ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డును నియమిస్తూ ఆ ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసుల కథనాలను కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తన కుమారుడి మృతికి దారితీసిన కారణాలు తెలుసుకునేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన తండ్రి జీవానందం డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అతని మృతదేహాన్ని తీసుకునేది లేదని ముత్తు కృష్ణన్ కుటుంబం స్పష్టం చేసింది. ముత్తు కృష్ణన్ మృతి పట్ల తమిళనాడు సీఎం పళనిస్వామి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రగులుతున్న తమిళనాడు: కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారం తమిళనాట ఆగ్రహ జ్వాలలు రగుల్చుతోంది. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళాభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తు కృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు టీనగర్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. -
మెరుగైన ఫలితాల కోసం సూచనలు
అగ్రి, అక్షయగోల్డ్ కేసుల్లో న్యాయవాదులను కోరిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్‌లఆస్తుల వేలానికి సంబంధించి మెరుగైన ఫలితాల కోసం సూచనలు, సలహాలు తెలియచేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం పిటిషనర్లను, అగ్రి, అక్షయ గోల్డ్ యాజమాన్యాలను కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో 32 లక్షల మంది డిపాజిటర్లను సంతృప్తిపరి చేలా చర్యలు తీసుకోవడం అసాధ్యంలా కనిపిస్తోందని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ యాజమా న్యాలు డిపాజిట్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి, తిరిగి చెల్లించ కుండా ఎగవేశాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
పన్నీర్ దీక్ష
► కుట్రపూరిత కుటుంబం నుంచి రక్షిద్దాం ► మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ప్రతిజ్ఞ ► జయ మరణంపై న్యాయ విచారణ కోరుతూ రాష్ట్రవ్యాప్త దీక్షలు అమ్మకు ద్రోహం చేసి, బహిష్కరణకు గురైన వారి చేతిలో నేడు అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వం చిక్కుకున్నాయని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఆశయాలకు విరుద్ధమైన వ్యక్తుల నుంచి అన్నాడీఎంకేను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పన్నీర్‌సెల్వం బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. పన్నీర్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుంచి పన్నీర్ ప్రసంగిస్తూ ఎంజీఆర్ అన్నాడీఎంకేను ఒక మక్కల్ ఇయక్కం(ప్రజల సంస్థ)గా స్థాపించారన్నారు. ఆయన బాటలో జయలలిత సైతం ‘ప్రజల కోసం నేను... ప్రజల వల్ల నేను’ అనే నినాదంతో పాలన అందించారని తెలిపారు. జయ స్థానంలో సీఎంగా తాను సైతం అలాంటి పాలనకే పాటుపడ్డానని చెప్పారు. అయితే రాష్ట్రంలో నేడు అలాంటి పరిస్థితులు లేవని, అమ్మ ఆశయాలు తల్లకిందులయ్యాయని అన్నారు. అమ్మ చేతిలో బహిష్కరణకు గురైన వారంతా పార్టీ, ప్రభుత్వ పెద్దలుగా మారిపోయారని చెప్పారు. ‘అక్కా... నీకు ద్రోహం చేసినవారితో ఇక నా సంబంధాలు తెంచుకుంటాను, రాజకీయాలు, పార్టీ, పదవులకు దూరంగా ఉంటాను’ అని లిఖిత పూర్వకంగా జయ వద్ద క్షమాపణలు కోరిన శశికళ వ్యవహారం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అమ్మ బహిష్కరించిన వారి చేతిలో నుంచి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడేందుకే ధర్మయుద్ధాన్ని ప్రారంభించానని పన్నీర్ సెల్వం వివరించారు. అమ్మను చూసేందుకు అడ్డుకున్నారు అపోలో ఆసుపత్రిలో జయకు 74 రోజుల పాటూ చికిత్స అందిస్తే ఒక్కరోజు కూడా తాను చూసేందుకు అవకాశం కలగలేదని, ఎన్నోసార్లు ప్రయత్నించినా శశికళ, ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ మనుషులు అడ్డుకున్నారని తెలిపారు. అపోలోకు వచ్చేపోయే వారి జాబితాను సిద్ధం చేసేందుకే ఆరుగురిని నియమించారని చెప్పారు. చిన్నపాటి వ్యాధులతో అడ్మిటైన అమ్మకు సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏమిటి, సంక్లిష్టమైన వ్యాధులపై చికిత్సకు విదేశాలకు తరలించాలని తాను సూచించినా శశికళ పట్టించుకోలేదని చెప్పారు. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువచ్చానని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ చేసిన ప్రకటన సత్యదూరమని పన్నీర్‌సెల్వం అన్నారు. ఆయన ఆ ప్రకటనను ఉపసంహరించుకోకుంటే కోర్టులో కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. జయ మరణంలోని మర్మంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలో న్యాయ విచారణ లేదా సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. దీక్షలకు భారీ స్పందన సీఎంగా రాజీనామా చేసిన నాటి నుంచి అమ్మ మరణం అనుమానాస్పదమేనని చెబుతూ వస్తున్న పన్నీర్‌సెల్వం ఏకంగా నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకోవడం అధికార అన్నాడీఎంకే వర్గాన్ని కలవరపెట్టింది. గత నెల 27వ తేదీనే దీక్షకు దరఖాస్తు చేసుకున్నా పోలీసులు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల క్రితం మరోసారి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందారు. చెన్నై చేపాక్ స్టేడియం వద్ద తలపెట్టిన దీక్షను ఎగ్మూరులోని రాజారత్తినం స్టేడియంకు మార్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు దీక్షలు ప్రారంభించాల్సి ఉండగా 9 గంటలకే పన్నీర్‌సెల్వం ఆయన మద్దతుదారులతో కలసి చేరుకున్నారు. అప్పటికే భారీ సంఖ్యలో జనసందోహం ఏర్పడింది. సరిగ్గా 10 గంటలకు పన్నీర్‌సెల్వం దీక్షలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షా శిబిరం నుంచి చేసిన ప్రసంగాల్లో అమ్మ పాలనను వివరిస్తుండగా పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకం, ముఖ్యంగా మహిళలు కన్నీరు పెట్టారు. పన్నీర్‌సెల్వం వైపు ధర్మం ఉందని నటుడు మనోబాల తనను కలిసిన మీడియా వారితో అన్నారు. చెన్నై శివార్లు ఆవడి, సేలం, నామక్కల్, కోయంబత్తూరు, నాగర్‌కోవిల్, తిరుచ్చిరాపల్లి, అరియలూరు తిరునెల్వేలి, తూత్తుకూడి, తంజావూరు, తిరువారూరు, ఈరోడ్, మధురై, వేలూరు, కడలూరు, విళుపురం తదితర మొత్తం 32 జిల్లాల్లో సైతం పన్నీర్‌సెల్వం అనుచరులు నిరాహార దీక్షలు నిర్వహించారు. ప్రతిచోట పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు పెట్టారు. చికిత్స పత్రాలను వెల్లడించాలి: దీప జయకు అపోలో ఆసుపత్రిలో అందించిన పలురకాల చికిత్సలకు ముందు అనుమతి పత్రాలపై సంతకాలు పెట్టినవారి పేర్లు బయటపెట్టాలని ఆమె మేనకోడలు, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధినేత్రి దీప బుధవారం విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే జయ మరణ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించేందుకు సంతకం చేసిన కుటుంబ సభ్యులెవరో తేలాల్సి ఉందని ఆమె అన్నారు. ఆసుపత్రిలో రోగికి చికిత్స ప్రారంభించే ముందు బంధువులతో సంతకం తీసుకోవడం ఆనవాయితీ, దీని ప్రకారం వీటన్నింటిపై సంతకం చేసిన వారు ఎవరో తేలేందుకు, మరణంపై నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం న్యాయ విచారణ అవసరమని ఆమె అన్నారు. -
మా బిడ్డను చంపేశారు...
విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన శ్రీ చైతన్య కళాశాల వద్ద ఉద్రిక్తత బాధితులకు మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి రామవరప్పాడు (గన్నవరం): శ్రీ చైతన్య కళాశాలలో మృతి చెందిన విద్యార్థి సుబ్బారెడ్డి బంధువులు మంగళవారం ఆందోళన చేశారు. మా బిడ్డ మృతికి కళాశాల యాజమాన్యం కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని కళాశాలకు చెందిన రామన్ భవన్–4లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆనం సుబ్బారెడ్డి మృతి సోమవారం మృతి చెందిన విషయం విదితమే. వైఎస్సార్ జిల్లా నుంచి సుమారు 30 మంది మృతుడి బంధువులు కళాశాల వద్దకు చేరుకుని తొలుత ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నతనం నుంచి చదువులో ముందుండే సుబ్బారెడ్డిని కళాశాల నిర్వాహకులు వెనుకంజలో ఉన్నాడనటం అవాస్తమంటూ సాధించిన మార్కుల లిస్టులను మృతుడి తల్లిదండ్రులు సుబ్బారెడ్డి, రాధమ్మలు విలేకరులకు చూపించారు. తోటి విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ మా బిడ్డ చనిపోవడానికి కారణమంటూ ఆరోపించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే తలను గోడకేసి కొట్టి, భవనంపై నుంచి తోసేసినట్లుగా ఉందని తమ అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పటమట సీఐ కెనడి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి కొలుసు పార్థసారథి విద్యార్థి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించి, కళాశాల ప్రిన్సిపాల్‌తో చర్చించారు. మార్కులు తక్కువ వస్తాయంటూ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని యాజమాన్యం చెబుతుందని, మృతుడి బంధువులు మాత్రం సుబ్బారెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తబరుస్తున్నారన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అనుమానాలకు తావిస్తుందని పోలీసు ఉన్నాతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. ఈ ఘటనను పోలీసు కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లతానని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి కైలే అనీల్ కుమార్, నిడమానూరు గ్రామ యువజన నాయకుడు చేకూరి చక్రి ఉన్నారు. -
దీక్షకు సిద్ధం
► రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు ► జిల్లా కేంద్రాల్లో నిరసన ► సీబీఐ విచారణకు పట్టు జయలలిత మరణం మిస్టరీ గుట్టురట్టు లక్ష్యంగా సీబీఐ విచారణకు పట్టుబడుతూ బుధవారం నిరాహరదీక్షకు మాజీ సీఎం పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు దీక్షలకు పన్నీరు శిబిరం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, పన్నీరును పంటినొప్పి వెంటాడుతుండడం గమనార్హం. సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న పరి ణామాలపై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు ఎగుర వేసిన పన్నీరుసెల్వం ఇక, అన్నాడీఎంకే తనదేనని ధీ మా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గ ప్రయత్నాలను ఓ వైపు వేగవంతం చేశారు. మరో వైపు అమ్మ జయలలిత ఆశీస్సులతో ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు తీవ్రంగానే పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమ్మ జయలలిత మరణంలో అనుమానాలు ఉన్నాయంటూ రోజుకో ఆరోపణలను పన్నీరు సెల్వం శిబిరం గుప్పిస్తూ వస్తోంది. ఆరోపణలు, అనుమానాలపై సీబీఐ ద్వారా విచారణ చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు పన్నీరుసెల్వం నిర్ణయించారు. ఒక రోజు దీక్షకు కేంద్రం దిగిరానిపక్షంలో తదుపరి అడుగులకు కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. నేడు నిరాహర దీక్ష: బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరాహరదీక్షకు పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. ఆ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ముందస్తుగా ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఎమ్మెల్యేల మద్దతు లేకున్నా, కేడర్ బలం తన వెంటే అని చాటుకునేందుకు తగ్గట్టుగా ఈ దీక్షల విజయవంతానికి కసరత్తులు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దీక్ష సాగనుంది. చెన్నైలో చేపాక్కం వద్ద దీక్ష చేపట్టేందుకు నిర్ణయించినా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం వద్దకు వేదికను మార్చారు. ఇక్కడ జరిగే దీక్షకు పన్నీరుసెల్వం నేతృత్వం వహించనున్నారు. పన్నీరు శిబిరంలోని ముఖ్య నాయకులు ఈ వేదిక మీదుగా తమ గళాన్ని వినిపించనున్నారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో దీక్షల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సేలంలో కలెక్టరేట్ వద్ద, కోయంబత్తూరులో శివానంద కాలనీ, తిరుప్పూర్‌లో కుమరన్ పాళయం, తిరునల్వేలిలో కొత్త బస్టాండ్, తంజావూరులో హెడ్ పోస్టాఫీసు, తూత్తుకుడి ఎంజీఆర్ దిడల్, తిరుచ్చి ఉలవర్ సందై వేదికగా దీక్షలు జరగనున్నాయి. పన్నీరుకు పంటి నొప్పి: దీక్షకు సిద్ధమైన వేళ పన్నీరుకు పంటి నొప్పి వెంటాడుతోంది. మంగళవారం ఆయనకు తీవ్రనొప్పి రావడంతో వైద్యుల్ని సంప్రదించి చికిత్స పొందారు. దీంతో అన్ని అపాయింట్ మెంట్లను రద్దు చేశారు. పన్నీరు కోసం పలు ప్రాంతాల నుంచి మద్దతుదారులు వచ్చినా, ఎవర్నీ ఆయన కలవలేదు. పార్టీ ముఖ్య నాయకులు గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరం వద్ద ఉండి, దీక్ష ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. -
నయీమ్‌తో పోలీసుల విందుపై స్పందించాలి
రాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు సీపీఐ నేత నారాయణ లేఖ సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసుల వివరాలు బహిర్గతం చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మకు ఆదివారం ఆయన లేఖ రాశారు. నయీమ్ ఉదంతాలపై సీబీఐ విచారణ చేయించాలని తాను కోర్టులో పిల్ వేస్తే...ప్రభుత్వం మాత్రం సిట్‌తో సరిపో తుందని చెప్పిందని గుర్తుచేశారు. నయీమ్‌తో పోలీసు ఉన్నతాధికారులు విందు భోజనాలు చేస్తున్న ఫొటోలు బహిర్గతమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని అన్నారు. ఇప్పటికైనా నయీమ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇది చతుర్ముఖ దుష్ట పాలన
అవినీతి, అసమర్థ, అసత్య, అప్రజాస్వామిక పాలన నడుస్తోంది: వైఎస్ జగన్ (సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి ప్రతినిధి ఏలూరు) ‘‘రాష్ట్రంలో చతుర్ముఖ దుష్టపరిపాలన జరుగుతోంది. దీనికి చరమగీతం పాడేందుకు మేధావులు, యువకులు కదలిరావాలి. గ్రామస్థాయి నుంచి ప్రతిఒక్కరూ సన్నద్ధం కావాలి’’ అని ప్రతిపక్షనేత, వైఎస్సాసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. అవినీతి, అసమర్థత, అసత్యాలు, అప్రజాస్వామికమనే నాలుగుపాదాల దుష్టపరిపాలన సాగుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వందలాదిమంది నాయకులు, వేలాదిమంది అనుచరులతో పార్టీలోకి చేరిన సందర్భంగా జరిగిన సభలో జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ, అబద్ధాల, అప్రజాస్వామిక పాలన ఏ విధంగా సాగుతున్నదో సోదాహరణంగా వివరించారు. రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడిలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని, చివరకు గుడిభూములను కూడా వదలడం లేదని జగన్ విమర్శించారు. అవినీతికి పాల్పడడం వల్లే సీబీఐ విచారణ జరిపిస్తారని చంద్రబాబు భయపడి కేంద్రానికి ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారని ఎద్దేవాచేశారు. రైతులకిచ్చే రుణాల లక్ష్యాలు చేరుకోకపోయినా బ్యాంకర్లను అడిగే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేకపోతున్నారన్నారు. రైతుల భూములు ఎలా లాక్కోవాలనేదానిపైనే కేబినెట్ సమావేశాలలో చర్చిస్తున్నారు తప్ప రైతులకు మేలు చేద్దామన్న ఆలోచనే చేయడం లేదని జగన్ విమర్శించారు. ఇంకా ఆయనేమన్నారంటే.. అవినీతి పాలనే బాబు ఘనత.. ‘‘రాష్ట్రంలో అవినీతి పాలన ఎంత గొప్పగా జరుగుతుందో నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) ఈ మధ్యనే నివేదిక ఇచ్చింది. దేశంలో 29 రాష్ట్రాలుంటే మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పాలనలో అవినీతిలో నంబర్ 1గా ఉందని చెప్పింది. బాబు పాలన కేవలం వ్యవస్థలను, మనుషులను, మీడియాను మేనేజ్ చేయడం.. తద్వారా ప్రజలను గొప్పగా మోసం చేయడం. ► ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సూట్‌కేసులో డబ్బులు పెట్టుకుని పోవడం, కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయినా ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోవడం, జైలుకు పోకపోవడం ఎక్కడన్నా చూశామా? ఎక్కడా జరగదు. చంద్రబాబుకు మాత్రమే అది సాధ్యం. ► అవినీతి పాలన ఏ లెవల్లో ఉందంటే రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తాడు. అయినా చర్యలుండవు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే.. రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని తెలిసీ.. ఇక్కడ కాదు అక్కడెక్కడో రాజధాని వస్తుంది నూజివీడులోనో, నాగార్జునా యూనివర్సిటీ ప్రాంతంలోనో వస్తుందని చెబుతాడు. చంద్రబాబు బినామీలంతా రాజధాని వచ్చే చోట తక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేస్తారు. ఓ ఏడెనిమిది నెలల తర్వాత రాజధాని ఇక్కడే వస్తుందని చెప్పి చంద్రబాబు డిక్లేర్ చేస్తారు. దాంతో రైతులంతా నష్టపోతారు. చంద్రబాబు, ఆయన బినామీలు మాత్రం బాగా సంపాదించుకుంటారు. ► రాజధాని పేరుతో స్విస్ చాలెంజ్ అని చెప్పి చంద్రబాబు తనకు నచ్చిన సింగపూర్ సంస్థలకు వేల ఎకరాల భూములు కేటాయిస్తాడు. రైతుల దగ్గర చౌకగా బలవంతంగా లాక్కుని నచ్చిన సంస్థలకు ఇష్టం వచ్చిన రేట్లకు కమీషన్లు తీసుకుని భూములు కేటాయిస్తాడు. ► ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇవాళ నీళ్లు కాదు.. అవినీతి డబ్బు పారుతోంది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రత్యేక జీవోలు (జీవో22) తెస్తాడు. ఈపీసీ కాంట్రాక్టర్లకు డబ్బు ఇవ్వాల్సిన పనిలేకపోయినా కమీషన్లు మాట్లాడుకుని నచ్చిన వాళ్లకు రేట్లు పెంచేసి చెక్కులిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే అంచనా వ్యయం రూ.16 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు పెంచేశాడు. కాంట్రాక్టరు పనిచేయలేకపోతే తీసేసి కొత్తగా టెండర్లను పిలవాల్సి ఉన్నా ఆ పనిచేయడు. కారణం కొత్త టెండర్లు పిలిస్తే రేట్లు తగ్గించాల్సి వస్తుందన్న భయం. ఈ రెండున్నరేళ్లలో పెట్రోలు, డీజిల్, సిమెంటు, స్టీలు రేట్లు తగ్గాయి. ఇసుక కూడా ఫ్రీగా వస్తోంది. అయినా కాంట్రాక్టులకు కొత్త టెండర్లను పిలవడు. ఎందుకంటే తనకు కమీషన్లు తగ్గిపోతాయన్న భయం. ఒకవైపు పోలవరం అంచనా వ్యయం పెంచుతాడు. మరోవైపున అన్యాయమైన కాంట్రాక్టర్లని తెలిసినా వారిని కొనసాగనిస్తాడు. తనకు నచ్చిన కాంట్రాక్టరను, బినామీలను సబ్ కాంట్రాక్టర్లుగా తెస్తాడు. ఇంత దారుణంగా అవినీతి జరుగుతోంది. ► మద్యం షాపుల నుంచి డిస్టిలరీల వరకు అవినీతే. విద్యుత్ కొనుగోలు కోసం బొగ్గు కొనుగోలులో అవినీతి. చివరకు గుడి భూములను కూడా వదలిపెట్టలేదు. చెన్నైలోని సదావర్తి భూములను వెయ్యి కోట్లకు పైగా విలువున్న భూములను ముష్టివేసినట్లు రూ. 22 కోట్లకు తన బినామీలకు కట్టబెడతాడు. కనకదుర్గమ్మ గుడి భూములను కూడా వదలిపెట్టలేదు. విజయవాడ నడిబొడ్డున తనకు నచ్చినవాళ్లకు కమీషన్లు తీసుకుని కారుచౌకగా లీజుకు ఇచ్చేస్తున్నాడు. ► రాజధానిలో తాత్కాలిక భవనాలు, తాత్కాలిక సెక్రటేరియట్ల పేరుతో ఖర్చు చేస్తాడు. మనం ఇల్లు కట్టుకోవాలంటే అడుగు రూ.1,500 మించదు. కానీ తాత్కాలిక భవనాలకు అడుగుకు రూ.10,000 ఇస్తున్న చంద్రబాబు కాంట్రాక్టరకు దోచిపెడుతూ కమీషన్లు తీసుకుంటున్నాడు. ఏ వీధిలో చూసినా ఇసుక దొంగలు, వాడవాడలా మట్టి దొంగలు కనిపిస్తారు. ప్రభుత్వ పనులు నామినేషన్ పద్ధతిలో అయినవాళ్లు చేసుకునేలా జీవోలు తెస్తున్నాడు. ► గ్రామ స్థాయిలో జన్మభూమి నుంచి దొంగలు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల నుంచి దొంగలు. జిల్లా స్థాయిలో మంత్రుల నుంచి దొంగలు. కేబినెట్ స్థాయిలో ఏకంగా ఓ ముఖ్యమంత్రే దొంగతనం చేస్తున్నాడు. కన్సల్టెంట్లంటాడు నామినేషన్ పద్ధతిలో ఇష్టం వచ్చిన రీతిలో ఇస్తూ కమీషన్లు గుంజుతాడు. రాజధానికి ఒక్కరోజు భూమిపూజకు రూ.400 కోట్లు ఖర్చు. పుష్కరాలకు 12 రోజులకు రూ.3వేల కోట్లు నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించి కమీషన్లు తీసుకున్నాడు. చివరకు దేవుని సొమ్ము అవినీతి చేయకూడదన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు. మూడు రోజులపాటు సైన్స్ ఫెస్టివల్‌కి రూ.200 కోట్లు ఖర్చు పెడతాడు. ► మామూలు విమానాల్లో చంద్రబాబు ప్రయాణం చేయడు. ప్రైవేటు విమానాల్లోనే సింగపూర్, జపాన్, దుబాయ్, స్విట్జర్లాండ్ పోతాడు. ఇక్కడివాళ్లతో లావాదేవీలు చేస్తే దొరికిపోతామని, మోదీ మొట్టికాయలేస్తాడన్న భయం ఉంది. బయట దేశాలకు పోతే ఎవరికీ తెలియకుండా డాలర్లు తీసుకోవచ్చని తెల్లచర్మం, తెల్ల జుట్టు ముద్దంటాడు. అసమర్థ పాలనకు నిదర్శనాలెన్నో.. ► ఈ సంవత్సరం ఖరీఫ్‌కు బ్యాంకర్లందరూ క్రాప్లోన్లు రూ.36వేల కోట్లు, టర్మ్ రుణాలు రూ.12 వేల కోట్లు మొత్తంగా రూ.48 వేలకోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రూ.28 వేల కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ సంవత్సరం రబీ పంట విషయానికొస్తే రూ. 24,640 కోట్లు పంటరుణాలు, రూ.9,800 కోట్లు టర్మ్ రుణాలు.. మొత్తంగా రూ. 35 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇచ్చింది కేవలం రూ. 5 వేల కోట్లు. కనీసం ఆ బ్యాంకర్లను పిలిచి ఎందుకింత దారుణంగా చేస్తున్నారని అడిగే దమ్ము – ధైర్యం చంద్రబాబుకు లేవు. ► రబీలో పంట విస్తీర్ణం రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల హెక్టార్లలో పంట వేయాల్సి ఉంటే.. 13 లక్షల హెక్టార్లలో కూడా పంట వేయని పరిస్థితి. ఇంత దారుణంగా రైతులు బతుకుతున్నా ఏ రోజూ కూడా చంద్రబాబు కేబినెట్ మీటింగుల్లో రైతుల గురించి మాట్లాడడు. ఆలోచన చేయడు. కేబినెట్ మీటింగ్ జరిగితే చంద్రబాబు ఆలోచించేదేమిటంటే.. రైతుల భూములు ఎలా లాక్కోవాలా అని. ► తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన పరిస్థితుల్లో కేసీఆర్‌ను నిలదీయాల్సి వస్తే బొక్కలో పెడతాడని భయపడి పక్కరాష్ట్రం కృష్ణా, గోదావరి జలాలను అట్నుంచటే పంపులు పెట్టి తీసుకుపోతున్నా అడగలేకపోతున్నాడు. అంతటి అసమర్థ పాలన చూస్తున్నాం. ► సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా అధికార, ప్రతిపక్షం ఒక్కటై రాష్ట్రాన్ని విడగొడుతూ విభజన రోజు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశాయి. ఆ హోదా ఎందుకు ఇవ్వడం లేదు? మా పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? అని అడిగే దమ్ము– ధైర్యం చంద్రబాబుకు లేవు. గట్టిగా మోడీని అడిగితే పైన చెప్పుకున్న అవినీతి వ్యవహారాలపై సీబీఐ చేత విచారణ చేయించి బొక్కలో పెడతాడన్న భయం చంద్రబాబుకు. ► విభజన చట్టంలో మనకు దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ఫ్యాక్టరీ, విశాఖలో రైల్వే జోన్, గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీప్రాజెక్టు పెడతామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎంత ఖర్చయినా పూర్తిగా మేమే భరిస్తాం.. పూర్తి చేస్తాం అన్నారు. ఇవేవీ ఇవ్వకపోయినా, మోసం చేస్తున్నా వాళ్లేదో గొప్పగా ఇచ్చినట్లు చంద్రబాబు దానికో కలర్ ఇచ్చి ఒక ప్యాకేజీ పేరుపెట్టి ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్ పెడుతున్నాడు. ప్రత్యేకహోదాను ఫణంగా పెడుతున్నాడు. ► ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు ఓ మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని నడిరోడ్డులో లాక్కుని వచ్చినా వాళ్లపై చర్య తీసుకోలేడు. ఇదే జిల్లాలో కొద్దిరోజుల క్రితం విద్యార్థిని హత్య జరిగినా, దాని వెనక తెలుగుదేశం ఎమ్మెల్యేలున్నారని పేపర్లలో వస్తున్నా నిందితులపై చర్య తీసుకునే దమ్ము – ధైర్యం చంద్రబాబుకు లేవు. ► ఆరోగ్యశ్రీ పూర్తిగా పడకేసింది. 108 నంబర్ డయల్ చేస్తే కుయ్కుయ్కుయ్మంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చేది. ఎంత పెద్ద ఆపరేషనయినా కార్పొరేట్ ఆసుపత్రిలో చేయించి ఆ పేదవాడిని చిరునవ్వుతో ఇంటికి చేర్చేది. ఇవాళ అంబులెన్స్ ఎపుడొస్తుందో తెలియదు. ఆసుపత్రుల బకాయిలు 8 నెలల నుంచి ఇవ్వడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. 104 కు ఫోన్‌చేస్తే గ్రామాల్లో వృద్ధులకు మందులు దొరికేవి. షుగర్ పరీక్షలు జరిగేవి. ఇవాళ డ్రైవర్లకు జీతాలివ్వలేని పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నడిపిన అపర సంజీవని ఆరోగ్యశ్రీని ఇప్పుడు నడపలేని అసమర్థ పాలనను చూస్తున్నాం. ► బీసీలకు ఇస్త్రీ పెట్టెలిచ్చి, కత్తెరలిచ్చి వారిపై ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటాడు. పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలంటే, పేదరికం పోవాలంటే పేదవాని కొడుకు ఇంజనీరో డాక్టరో కావాలి. పెద్ద పెద్ద చదువులు చదవాలి. చదివించడానికి పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పెద్ద చదువైనా నేను చదివిస్తా అని దివంగత నేత వైఎస్ ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో పేదవాడిని చదివించా డు. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే ఫీజులు రూ. 80వేలు, లక్ష, లక్షా ఇరవైవేల స్థాయికి పోయాయి. కానీ పిల్లలకు బాబు ముష్టివేసినట్లు రూ.30 వేలు కూడా ఇవ్వడం లేదు. లక్ష ఫీజులో రూ. 30 వేలు పోతే మిగిలిన రూ.70 వేలకు ఇల్లు, పొలం అమ్ముకోవలసిన పరిస్థితి. అలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా నడపలేని అసమర్థ పాలన ఇది. ► రైతులు తమ కాళ్ల మీద నిలబడాలి, రైతులకు నీళ్లందాలి అని దివంగత నేత వైఎస్ ప్రాజెక్టులన్నిటిలో 80శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన 20శాతం పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ పాలన ఇది. ► మూడేళ్లు కావస్తోంది. ఒక్క గ్రామంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించలేని పాలన ఇది. వైఎస్ఆర్ సువర్ణయుగంలో దేశమంతా కలిపి 48లక్షల ఇళ్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే దేశంతో పోటీపడి 48 లక్షల ఇళ్లు కట్టిన పాలన అది. అలాంటి పాలన ఇవ్వలేని అసమర్థ పాలన ఇది.’’అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నేడు కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన గన్నవరం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల పరిశీలన సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నియోజక వర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. పంట నష్టపోయిన బాధిత రైతులను కలుసుకుం టారు. ఇటీవల వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పు డు గన్నవరం విమానాశ్రయంలో మినుము రైతులు ఆయనను కలిశారు. తమ పంటలు దెబ్బ తిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన జగన్ వారి గ్రామాల్లో పర్యటించి, దెబ్బతిన్న పంటల ను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం గన్నవరం నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. -
శశికళ x శశికళ పుష్ప
- ప్రధాన కార్యదర్శి శశికళకు పుష్ప నుంచి సవాలు - జయ మరణం వెనుక మిస్టరీపై సీబీఐ విచారణకు పట్టు - పార్టీ పదవికి శశికళ అర్హురాలు కాదని.. ఆ పదవికి పోటీ చేస్తానని ప్రకటన - నామినేషన్ పత్రాల కోసం పార్టీ ఆఫీస్‌కు వెళ్లిన ఆమె భర్తపై పార్టీ శ్రేణుల దాడి సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళకు అదే పార్టీకి చెందిన బహిష్కృతనేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పతో సవాళ్లు తప్పేట్లుగా లేవు. ఇరువురి మధ్య రాజకీయ చిచ్చు రగులుతోంది. ఒకప్పుడు జయలలిత ప్రాపకం సంపాదించిన శశికళ పుష్ప.. ఆ తరువాత ఆమె ఆగ్రహాన్ని చవిచూశారు. రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన ఆమె చివరకు అవమానకర రీతిలో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇందుకు శశికళే కారణమని రగిలిపోతున్న పుష్ప.. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఒప్పుకునేది లేదని ప్రకటిస్తున్నారు. పుష్ప రాజకీయ ప్రస్థానమిలా.. 1976 మే 22న తూత్తుకూడిలో జన్మించిన శశికళ పుష్ప 2011–14 మధ్య కాలంలో తూత్తుకూడి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. మొదటినుంచీ అన్నాడీఎంకేకు విశ్వాసపాత్రురాలు కావడంతో 2014లో జయలలిత ఆమెను రాజ్యసభ సభ్యురాలిని చేశారు. అన్నాడీఎంకేలో ఉంటూ డీఎంకే ఎంపీ తిరుచ్చి శివతో ఆమె స్నేహంగా ఉంటున్నట్లు జయలలిత అనుమానించారు. చిన్న తప్పును సైతం క్షమించే అలవాటులేని జయలలిత.. శశికళ పుష్పను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. తన అనుయూయుల ద్వారా రహస్యంగా ఈ సమాచారం అందుకున్న శశికళ పుష్ప తనకు, తిరుచ్చి శివకు మధ్య స్నేహం లేదని నిరూపించుకునేందుకు ఈ ఏడాది జూలై 30న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అందరూ చూస్తుండగా ఆయన చెంపపై కొట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన జయలలిత ఆగస్టులో శశికళ పుష్పను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇదంతా శశికళ కుట్రగా పుష్ప ధ్వజం అయితే ఇదంతా జయ నెచ్చెలి శశికళ తనపై చేస్తున్న కుట్రగా శశికళ పుష్ప ధ్వజమెత్తారు. శశికళ తనను మంచిగా పోయెస్‌గార్డెన్‌కు పిలిపించుకుని బలవంతంగా తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారని, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సైతం ఆమె బెదిరించినట్లుగా పుష్ప ఆరోపించారు. ఇద్దరు శశికళల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న నెలరోజుల్లోనే జయలలిత అస్వస్థతకు గురికావడం, మరణించడం జరిగిపోయింది. శశికళపై అప్పటికే ఆగ్రహంతో ఉన్న శశికళ పుష్ప.. జయలలిత మరణం వెనుకనున్న మిస్టరీని సీబీఐ విచారణ జరిపించడం ద్వారా వెలికితీయాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ అర్హురాలు కాదంటూ ధ్వజమెత్తడమేగాక తాను ఆ పదవికి పోటీచేయనున్నట్లు ప్రకటించారు. నామినేషన్ పత్రాలకోసం ఈనెల 28న అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్‌పై పార్టీ శ్రేణులు తీవ్రంగా దాడిచేసి గాయపరిచాయి. అంతేగాక గురువారం నాటి సర్వసభ్య సమావేశానికి హాజరుకాకుండా లింగేశ్వరన్ను పోలీసులు రహస్యప్రదేశంలో దాచిపెట్టారు. అన్నాడీఎంకే కార్యాలయానికి వెళ్లిన తన భర్త ఆచూకీ తెలియట్లేదని పుష్ప హైకోర్టులో పిటిషన్ వేయడంతో పోలీసులు గురువారం సాయంత్రం అంటే అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ముగిశాక విడిచిపెట్టారు. ఇలాంటి అనేక పరిణామాలతో శశికళ, శశికళ పుష్ప మధ్య రాజకీయ చిచ్చు రగులుతోంది. -
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి స్థానాన్ని దక్కించుకునేందుకు ఆధిపత్యపోరు మొదలైంది. ఒకవైపు శశికళ మద్దతు కూడగడుతుండగా మరోవైపు దివంగత జయలలిత మేనకోడలు దీపకు తమిళనాడు దక్షిణాది జిల్లాల నేతలు బాసటగా నిలుస్తున్నారు. శశికళకు పార్టీలోని దేవర్ సామాజిక వర్గం మద్దతు పలుకుతుండగా, నాడార్లు అవకాశం కోసం చూస్తున్నారు. తంబిదురై నేతృత్వంలో 49 మంది పార్టీ ఎంపీలు మంగళవారం శశికళను కలిసి సంఘీభావం తెలిపారు. 21న పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించండి..: దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ‘తమిళనాడు తెలుగు యువశక్తి’ సంస్థ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అపోలో ఆసుపత్రిని ప్రతివాదులుగా చేర్చింది. ఆమె ఆసుపత్రిలో ఉన్న కాలంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ జరపాలని కోరింది. -
విష్ణుప్రియ కేసులో సీబీఐ విచారణ
సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వాదన తిరస్కృతి చెన్నై: డీఎస్పీ విష్ణుప్రియ మృతి కేసు విచారణ సీబీఐకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారి మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే విష్ణుప్రియ మృతికి ఆధారాలు ఉన్నాయని ఆమె తండ్రి వాదిస్తుంటే, సీబీసీఐడీ విచారణకే మొగ్గు చూపడం ఏమిటో? అని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అప్పీలును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ దృష్ట్యా కేసు మిస్టరీ ఛేదించేందుకు సీబీఐ వర్గాలు రంగంలోకి దిగడం ఖాయమైంది. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో గతేడాది కులాంతర ప్రేమ వ్యవహారంలో ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న డీఎస్పీ విష్ణుప్రియ తీవ్ర ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అదే సమయంలో విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. ఉన్నతాధికారుల వేధింపులకు ఆమె బలైనట్టు, గోకుల్ రాజ్ హత్య కేసు విచారణను అడ్డుకునే రీతిలో సాగిన ప్రయత్నాలకు విష్ణుప్రియ బలైనట్టుగా సంకేతాలు ఏర్పడ్డాయి. దీంతో కేసును సీబీసీఐడీకి అప్పగించారు. రాష్ట్ర పోలీసులు విచారిస్తే, వాస్తవాలు బయటకు రావని, ఈ కారణాల దృష్ట్యా, సీబీఐకు అప్పగించాలని విష్ణుప్రియ తండ్రి రవి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ విచారణకు డివిజన్ బెంచ్ స్పందించింది. పూర్వాపరాలను విచారించడమే గాకుండా, త్వరితగతిన విచారణ ముగించి నివేదిక సమర్పించాలని, సీబీసీఐడీకి డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయితే, కోర్టు గడువును సీబీసీఐడీ వర్గాలు సద్వినియోగం చేసుకోలేదని చెప్పవచ్చు. దీంతో సీబీసీఐడీ ద్వారా ఒరిగేది శూన్యమేనని గ్రహించిన డివిజన్ బెంచ్ విష్ణుప్రియ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ గత నెల ఆదేశాలు వెలువరించింది. అంతేగాకుండా, మూడు నెలల్లో దర్యాప్తు ముగించి కోర్టు ముందు నివేదిక ఉంచాలని సూచించారు. అయితే, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీసీఐడీ విచారణ ముగింపు దశలో ఉన్న సమయంలో, కొత్తగా సీబీఐ విచారణ అవసరం లేదన్న వాదనను సుప్రీంకోర్టు ముందు ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సోమవారం సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఉన్నతాధికారి మృతి కేసులో విచారణ తీరు ఇదేనా..? అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. ఇక, మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నామని పేర్కొంటూ, సీబీఐ విచారణకు మద్దతుగా నిలవడం విశేషం. ఈ తీర్పు మేరకు సీబీఐ విచారణ పగ్గాలు చేపట్టి, ఇచ్చిన గడువులోపు నివేదికను కోర్టుకు సమర్పించాలని సూచిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిరస్కరించడమే గాకుండా, ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
అమ్మపై కుట్ర
సీబీఐ విచారణకు ఎంపీ శశికళ పుష్ప డిమాండ్ శశికళ పథకం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కుట్రపన్నుతున్నారని ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. అక్రమంగా జయ సంతకాన్ని ఫోర్జరీ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటూ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సోమవారం ఆమె ఒక లేఖను పంపారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ జయలలిత నెచ్చెలి శశికళపై ఆమె పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. జయలలిత అనారోగ్యానికి దారితీసిన పరిస్థితుల్లో సీబీఐ విచారణ అవసరమని శశికళ పుష్ప డిమాండ్ చేశారు. శశికళ, నటరాజన్ వారి కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున వారందరినీ అపోలో నుంచి పంపించేయాలన్నారు. అన్నాడీఎంకే దిశగా కాంగ్రెస్ గత పదేళ్లుగా డీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఇపుడు అన్నాడీఎంకే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతల వైఖరి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేతపుచ్చుకునేందుకు శశికళ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తంజావూరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకొంది. అన్నాడీఎంకేకు ఒక జాతీయ పార్టీ అండదండలు అవసరమని భావిస్తున్న శశికళ.. కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా రావడం శశికళ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు. -
ఓటుకు కోట్లు, నయీం కేసుల్ని సీబీఐకి అప్పగించాలి
వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు, హత్యలు, అక్రమాలకు పాల్పడిన నయీం కేసు... రెండింటినీ సీబీఐ విచారణకు అప్పగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య తాజాగా ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలు చేశారని, అలాగే క్రూరమైన దారుణాలకు పాల్పడిన నయీంను పెంచిపోషించింది చంద్రబాబేనని సర్వత్రా వినిపిస్తోందని, కీలకమైన ఈ అంశాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. బాబు ముఖ్యమైన ఈ రెండంశాలపై మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రాప్రాంతంలోని థియేటర్లన్నింటి పైనా నయీం పట్టుందని సినీ నిర్మాత ఒకరు వెల్లడించారు. తనను నయీం బెదిరిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వద్దకెళితే ‘అతను ప్రమాదకారి సెటిల్ చేసుకో..’ అని చెప్పారంటూ వచ్చిన వార్తలకూ సమాధానమివ్వాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. సింధు కష్టం చంద్రబాబు ఘనతా! సింధు కష్టపడి, తన కృషి, పట్టుదలతో ఒలింపిక్స్‌లో వెండిపతకాన్ని గెలిస్తే ఆ ఘనతను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రతి పన్నెండేళ్లకు పుష్కరాలు రావడం సర్వసాధారణమని, వాటినీ తానే తెచ్చానని సీఎం చెప్పుకోవడం వింతగా ఉందని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా పుష్కరాల పేరిట చంద్రబాబు, ఆయన పార్టీవారు కోట్లాది రూపాయలు దోచేసుకున్నారని దుయ్యబట్టారు. -
సీబీఐచే విచారణ చేపట్టాలి
సర్కార్ అసమర్థత వల్లే ఎంసెట్ -2 లీక్ సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలి బీజేవైఎం డిమాండ్.. ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం సంగారెడ్డి టౌన్: ఎంసెట్ -2 ప్రశ్నపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నూరు విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. లీక్ విషయం బహిర్గతం అయ్యే వరకు ప్రభుత్వానికి తెలవకపోవడం సిగ్గుచేటన్నారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టబొమ్మను బీజేవైఎం నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ -3 నిర్వహణను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు మందుల నాగరాజు, నాయకులు విజయ్ కుమార్, సంధీర్‌రెడ్డి, సతీష్‌గౌడ్, రమేష్, తరున్, సాయి, విష్ణు, నాగరాజ్, పండు తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడితోనే ఏఎస్పీ ఆత్మహత్య
దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ.. సత్యమంగళంలో కన్నీటి వీడ్కోలు సాక్షి, విశాఖపట్నం/ సేలం(తమిళనాడు): ‘విధి నిర్వహణలో మూడు నెలలుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాను.. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు..’ అని గురువారం తుపాకీ పేలి మృతి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ తన చివరి లేఖలో పేర్కొన్నారు. లేఖతో పాటు అక్కడ లభించిన ఆధారాలను బట్టి కూడా ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని కేసు విచారణ చేపట్టిన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తెలిపారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ ఏఎస్పీ శశికుమార్ తన రివాల్వర్తోనే కాల్చుకున్నారని, బయట నుంచి ఎవరో వచ్చి హత్య చేశారనేందుకు ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ‘మూడు నెలలుగా ఫెయిల్యూర్స్‌తో తీవ్ర డిప్రెషన్లో ఉన్నాను.. నేను ఈ డిపార్ట్మెంట్కు పనికిరాను.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఐయామ్ సారీ’ అని శశికుమార్ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని డీఎస్పీ వెల్లడించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యాకే కచ్చితమైన నిర్ధారణకు రాగలమన్నారు. అయితే ఇది ముమ్మాటికీ హత్య అంటూ శశికుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.పథకం ప్రకారం శశికుమార్‌ను హత్య చేశారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగాను, అధికారికంగాను కక్ష కట్టిన కొందరు హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణకు చర్యలు తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా తమిళనాడులోని స్వగ్రామం ఈరోడ్ జిల్లా సత్యమంగళంలో శుక్రవారం శశికుమార్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
వీడని పాస్‌పోర్ట్ మిస్టరీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై, నంగనల్లూరు 48వ వీధిలో ఒక పోస్టల్ బాక్స్ ఉంది. ఈ పోస్టల్ బాక్స్‌లో ప్రజలువేసే ఉత్తరాలను సేకరించేందుకు ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు తపాలాశాఖ ఉద్యోగి వచ్చేవారు. ఎప్పట్లాగే ఈ నెల 2 న సాయంత్రం ఉత్తరాల సేకరణకై వచ్చిన తపాలాశాఖ ఉద్యోగి రాజా పోస్టల్‌బాక్స్‌లో 23 పాస్‌పోర్టులు పడి ఉండడాన్ని చూసి ఖంగుతిన్నాడు. వాటన్నింటినీ ప్లాస్టిక్ పేపరులో చుట్టచుట్టి పడేశారు. వీటిని తపాలాశాఖ ఉన్నతాధికారులకు అప్పగించాడు. ఈ నెల 6న మరో 15 పాస్‌పోర్టులు, శుక్రవారం సాయంత్రం 13 పాస్‌పోర్టులు వేసి ఉండటాన్ని గుర్తించాడు. పోస్టల్ అధికారి అమృతలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పళవంతాంగల్ పోలీసులు మొత్తం 51 పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని పరంగిమలై సహాయ పోలీస్ కమిషనర్ కల్యాణ్‌కు అప్పగించగా విచారణ సాగుతోంది. ఆ పాస్‌పోర్టులను తిరువనంతపురం, హైదరాబాద్, తిరుచ్చిరాపల్లి, చెన్నై, విశాఖపట్టణం, ముంబయి, సింగపూరు, మధురై, యూఏ ఈ, కౌలాలంపూర్ తదితర చోట్ల జారీ చేసినట్టు గుర్తించారు. తొలి దశ విచారణలో 23 పాస్‌పోర్టులు ఎవరికి చెందినవో గుర్తించారు. వాటిలో ఒకటి అమెరికాలో ఉండే ఒక చిన్నారి పాస్‌పోర్టుగా తేలింది. పాస్‌పోర్టులోని చిరునామా ను పట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి విచారించగా విమానాశ్రయంలో తాము పోగొట్టుకున్నామని తెలిపారు. దీనిపై పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి బంగారు బిస్కెట్లను అక్రమ రవాణా చేసే వారు పోలీసులకు భయపడి పాస్‌పోర్టులను ఇలా పారవేశారా? అని అనుమానిస్తున్నారు. ఐదేళ్ల క్రితం పోయినవి, ఆరు నెలల క్రితం పోయిన పాస్‌పోర్టులు ఒకేసారి ఎలా పోస్టల్‌బాక్స్‌లో వచ్చి పడ్డాయనే అనుమానం పోలీసు బుర్రలను తొలిచేస్తోంది. అలాగే మండల పాస్‌పోర్టు అధికారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఉండగా పాస్‌పోర్టుల కేసు విచారణలో సీబీఐ అధికారులు రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు మాత్రమే సీబీఐ విచారణ జరుగుతుందని అన్నారు. పోస్టల్ బాక్సులో 51 పాస్‌పోర్టుల లభ్యంపై అందులోని చిరునామా ప్రకారం ముగ్గురిని పిలిపించి విచారించారు. వారు విమానాశ్రయంలో పాస్‌పోర్టులను పోగొట్టుకున్నట్లు చెప్పారు. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా మిగిలిన 48 మందికి పోలీసులు సమన్లు పంపారు. వీరందరిని విచారణ జరిపిన తరువాతనే ఒక నిర్ధారణకు రాగలమని ఆయన తెలిపారు. -
కాపులపై కక్షకట్టి వర్గాలు సృష్టిస్తున్న బాబు
శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య సాక్షి, హైదరాబాద్: కాపులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి ఆ కులస్తుల మధ్యే వర్గాలను సృష్టిస్తూ అన్నిరకాలుగా హింసిస్తున్నారని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. పీసీసీ నేతలు సాకే శైలజానాథ్, జంగా గౌతం, సూర్యానాయక్‌లతో కలిసి ఆయన శుక్రవారం ఇందిర భవన్లో మీడియాతో మాట్లాడారు. కాపులకు ఆరు నెలల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి రెండేళ్లయినా వాటి గురించి పట్టించుకోకపోవడంతో బాబుపై నమ్మకం లేక ముద్రగడ శాంతియుతంగా ఆందోళనకు దిగితే తప్పా? అని ప్రశ్నించారు. తునిలో రైలుకు నిప్పు పెట్టడంలో కూడా ప్రభుత్వ పాత్ర ఉందనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయన్నారు. తుని సంఘటనలో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణకు ఆదేశిస్తే వాటి వెనక చంద్రబాబు పాత్ర ఉందా? లేదా? అనే విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. -
పోలీస్ టెర్రర్!
వందల మంది పోలీసుల్ని పంపి ముద్రగడను అరెస్టు చేయడం దారుణం: వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: ‘‘సామాజిక సమస్యను రాజకీయం చేసి.. శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి.. పక్కదోవ పట్టించడం చంద్రబాబునాయుడు నైజం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాన్నే అమలు చేయండని ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టారు. మాట ఇచ్చింది.. మోసం చేసింది చంద్రబాబే.. మోసం చేస్తున్నారని ప్రశ్నించడమే తప్పా? ఒక చిన్న గ్రామంలో ఓ ఇంట్లో దీక్ష చేస్తోన్న ముద్రగడ మీదకు వందలాది మందిని పంపి అరెస్టు చేయడం దారుణం. రాష్ట్రంలో అత్యంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు రాజ్యంతో భయం సృష్టించే కార్యక్రమాన్ని చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు టైజానికి నాంది పలికారు’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో గురువారం ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రసారం చేస్తున్న సాక్షి టీవీతోపాటు మరో రెండు టీవీచానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని తప్పుపట్టారు. ఇది ఎమర్జెన్సీని తలపిస్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాస్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విశ్వరూప్ తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ఏమన్నారంటే.. ఏ స్థాయికైనా దిగజారుతారు.. ‘‘రాజకీయాలకోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతారు. ఎన్నికల్లో మాట చెప్పడం.. అవసరం తీరాక దగ్గరుండి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు, మోసం చేస్తారా? అంటూ ప్రజల తరఫున ఎవరైనా నిలదీస్తే వారిపై బండలు వేస్తారు. సీఎం స్థాయి వ్యక్తి, సీఎం రేసులో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పవచ్చా? జవాబుదారీతనం(అకౌంటబులిటీ) లేకపోతే ఎలా? నాయకుల్లో జవాబుదారీతనం రావాలన్నా, వ్యవస్థలో మార్పు రావాలన్నా ప్రజలు తిరగబడాలి. చీపుర్లు చూపించాలి. అప్పుడే నాయకులకు భయం ఉంటుంది. నాయకుల్లో, వ్యవస్థలో మార్పు వస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదాన్నే చేయండని ముద్రగడ దీక్ష చేపట్టారు. ఓ చిన్న గ్రామంలో ఒక చిన్న ఇంట్లో దీక్ష చేస్తోన్న ముద్రగడ ఇంటికి వందలాది మంది పోలీసులను పంపారు. గ్రామ జనాభా కన్నా పోలీసులే అధికంగా ఉన్నారు. పోలీసు బలంతో నిరంకుశంగా ముద్రగడను అరెస్టు చేయడం దారుణం. ముద్రగడ కుమారుడిని నిర్దాక్షిణ్యంగా పోలీసులు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇంతకంటే దారుణముందా? భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తారా? అనుకూల మీడియాకు ముద్రగడ వార్తలను ప్రసారం చేయొద్దంటూ ఆదేశాలిచ్చిన చంద్రబాబు ఏకపక్షంగా ఎమర్జెన్సీని తలపిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తూ సాక్షి టీవీతోపాటు మరో రెండు చానళ్ల ప్రసారాలను కట్ చేయడం దారుణం. మీడియా ప్రసారాలను నిలిపేయడం సరికాదు. ఈరోజున సాక్షి చానల్ ప్రసారాలను కట్ చేశారు. భవిష్యత్తులో మిగిలిన చానళ్లను కట్ చేయరు అని చెప్పడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటిరోజు. అందరూ కలసికట్టుగా ప్రభుత్వ చర్యలను ఖండించాలి. సాక్షి చానల్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఎన్నో వార్తలను ప్రసారం చేసినా.. ఏ ఒక్క చానల్‌ను కట్ చేయలేదు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు చానళ్లు ఉన్నాయి.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరో పార్టీకి చెందిన చానల్‌ను కట్ చేసిన సందర్భాలు లేవు. రాష్ట్రంలో కొత్త సంప్రదాయానికి చంద్రబాబు తెరలేపడం దారుణం. ఇది మంచి సంప్రదాయం కాదు. దీన్ని అందరూ ఖండించాలి. భయోత్పాతం సృష్టిస్తున్నారు.. ఒక సామాజిక సమస్యను రాజకీయం చేసి.. శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించి పక్కదోవ పట్టించడం చంద్రబాబు నైజం. ఎస్సీ వర్గీకరణ విషయంలో బాబు ఏం చేశారు.. కులాలమధ్య చిచ్చుపెట్టారు. ఇప్పుడు ఒకే కులంలోనే ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతున్నారు. వాగ్దానం చేసింది. మోసం చేసింది చంద్రబాబే. మోసం చేస్తారా? అని ప్రజల తరఫున నిలదీసే వారిపై దొంగ కేసులు పెట్టి భయోత్పాతం సృష్టిస్తున్నారు. సామాజిక సమస్యపై ముద్రగడ చేస్తోన్న ఉద్యమానికి మద్దతివ్వడం తప్పా? ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి.. అవసరం తీరాక మోసం చేస్తే తిరగబడక ప్రజలు ఏం చేస్తారు? సీబీఐ విచారణకు సిద్ధమా? విధ్వంసాల చరిత్ర చంద్రబాబుదే. తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్సులు ధ్వంసం చేయండి.. రైళ్లు దగ్ధం చేయండి.. విధ్వంసం సృష్టించండి అంటూ చంద్రబాబునాయుడు ఫోన్లు చేశారని ముద్రగడే చెప్పారు. పరిటాల రవి హత్య జరిగిన సమయంలోనూ, ఎన్టీ రామారావు దిగిపోయిన సమయంలోనూ విధ్వంసాలు సృష్టించాలని చంద్రబాబే ఆదేశించారని ముద్రగడ చెప్పారు. అలాంటి చంద్రబాబుకు తుని ఘటనపై మాట్లాడే నైతిక హక్కు లేదు. తుని ఘటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే తుని ఘటనపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. తన చెప్పుచేతల్లోనే ఉండే సీఐడీతో తనకు నచ్చనివారిపై దొంగ కేసులు పెట్టించి.. ఇబ్బంది పెట్టడం సరికాదు.. సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. తుని ఘటనలో చంద్రబాబు పాత్ర వెల్లడవుతుంది’’ అని జగన్ అన్నారు. తుని ఘటనలో విధ్వంసానికి పాల్పడింది రాయలసీమకు చెందిన వ్యక్తులేనని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపిస్తే ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారినే సీఐడీ అరెస్టు చేస్తోన్న అంశాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా జగన్ బదులిస్తూ.. ప్రజల తరఫున నిలదీసే వారిపై బండలు వేయడం చంద్రబాబు నైజమని, తుని ఘటనపై థర్డ్ పార్టీ.. సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని, తుని విధ్వంసంలో చంద్రబాబు పాత్ర బయటపడుతుందని స్పష్టీకరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, అరెస్ట్ చేసిన ముద్రగడను విడుదల చేయాలని, కట్ చేసిన సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: సి.రామచంద్రయ్య
తెలుగు దేశం ప్రభుత్వం కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఏపీ శాసన మండలి విపక్ష నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కాపురిజర్వేషన్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిన్నారని అన్నారు. తుని ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయనీ..దీనిపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి వరకూ కడప రౌడీలు తుని ఘటన వెనుక ఉన్నారని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు గోదావరి జిల్లా నాయకులను అరెస్టు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పై కాపులకు నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. ఇప్పటి కైనా టీడీపీ లోని కాపు నాయకుల చేత విమర్శలు చేయించే పని ఆపి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. -
మరిన్ని పనామా పత్రాల విడుదల
పనామా సిటీ: ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) తాజాగా 2 లక్షలకుపైగా ‘పనామా’ పత్రాలను సోమవారం రాత్రి ఆన్లైన్లో విడుదల చేసింది. www.offshoreleaks.icij. org వెబ్సైట్లో ఇవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 3.6 లక్షల మంది వ్యక్తులు, కంపెనీల పేర్లు వీటిలో ఉన్నాయని ఐసీఐజే సభ్యులు తెలిపారు. పనామాకు చెందిన ప్రైవేట్ లా సంస్థ మొసాక్ ఫోన్సెకా సంస్థ నుంచి తీసుకున్న సమాచారం ఈ పత్రాల్లో ఉంది. ‘సీబీఐ విచారణపై స్పందనేంటి!’ న్యూఢిల్లీ: పనామా పత్రాల్లో పేర్లున్న భారతీయులపై సీబీఐ విచారణ జరపాలని వచ్చిన ఒక పిటిషన్‌పై స్పందన ఏమిటో తెలపాలని సుప్రీం కోర్టు భారత ప్రభుత్వాన్ని కోరింది. న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన దరఖాస్తును విచారించిన కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. పనామా పత్రాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న 500 భారతీయ సంస్థల రహస్యాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో ఒక మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఇప్పటికే ఏర్పాటు చేసింది. -
బాబుపై సీబీఐ విచారణకు కేంద్రం సానుకూలం
♦ హోం మంత్రితో భేటీ అనంతరం వెల్లడించిన జగన్ ♦ చంద్రబాబు పాలనపై ఆయనకే నమ్మకం లేదు ♦ అందుకే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించడం లేదు ♦ ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఆయనకు లేదు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని తాము చేసిన విజ్ఞప్తికి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుంభకోణాలను ఆధారాలు, జీవోలతో సహా ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకంలో పేర్కొన్న అంశాలపై సీబీఐ విచారణ చేయించాలని తాము విజ్ఞప్తి చేశామని తెలిపారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును హోం మంత్రికి వివరించానని చెప్పారు. ఈ అంశం మీదా విచారణకు ఆదేశించాలని కోరామన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల బృందం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మంగళవారం ఆయన నివాసంలో కలిసింది. పార్టీ ప్రజాప్రతినిధుల బృందానికి హోం మంత్రి దాదాపు అరగంట సమయం కేటాయించారు. అనంతరం హోం మంత్రి నివాసం వెలుపల విపక్ష నేత జగన్ విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నారంటే... డ్వాక్రా అక్కచెల్లెమ్మలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా మోసం చేశారో చెప్పాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలిస్తామని, ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఏ రకంగా మోసం చేశారో వివరించాం. సమాజంలోని అన్ని వర్గాలను అన్ని రకాలుగా బాబు మోసం చేసిన తీరును తెలిపాం. మోసాల ఫలితంగా నెలకొన్న ప్రజల కోపాగ్ని నుంచి దృష్టి మరల్చడానికి.. అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును వివరించాం. అవినీతి సొమ్ముతో కొనుగోలు చేయడంతో పాటు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే అంశం మీద విచారణ చేయించమని విజ్ఞప్తి చేశాం. ఆధారాలతో సహా ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకంలో పేర్కొన్న కుంభకోణాలపైనా సీబీఐ విచారణకు ఆదేశించమని కోరాం. ‘పట్టపగలు ఇంతింత డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉండదు. ప్రశ్నించాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రశ్నించకపోవడం అన్యాయం. కచ్చితంగా ఈ అంశాల మీద విచారణ జరిపించాలి’ అని విన్నవించాం. మా వినతులపై హోం మంత్రి సానుకూలంగా స్పందించారు. ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పుస్తకాన్ని బాగా తిరగేశారు. అన్ని అంశాలను పరిశీలించారు, చదువుకున్నారు. విభజన హామీలు నెరవేర్చమని కోరాం రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు... ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం.. తదితర హామీలను నెరవేర్చమని హోం మంత్రికి వినతిపత్రం సమర్పించాం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్ ఏర్పాటు హామీలను నెరవేర్చమని కోరాం. ప్రత్యేక హోదాకు బదులుగా డీలిమిటేషన్ చేయమని చంద్రబాబు అడిగితే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. సొంత పాలనపై బాబుకు నమ్మకం లేదు ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన బాబు ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పచ్చకండువా కప్పుతున్నారు. తన పాలనపై నమ్మకం లేని పరిస్థితుల్లో దిగజారుడు పనులు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి లేదా అనర్హులుగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లకుండా మోసం చేస్తున్నారు. ప్రలోభపెట్టి తీసుకున్న ఎమ్మెల్యేలను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఓట్లు వేయిస్తామనే నమ్మకం లేకే వారితో రాజీనామా చేయించడం లేదు. -
అన్బునాథన్ ఇంట్లో ఓ సినీనటి నగ్న వీడియో
సాక్షి ప్రతినిధి, చెన్నై : కరూర్ జిల్లా గిడ్డంగిలో తనిఖీల ఉదంతం ఇంకా కలకలం రేపుతూనే ఉంది. తవ్వేకొద్దీ అనేక విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అనేక కేసుల్లో చిక్కుకున్న అన్బునాథన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్‌పోర్టు సీజ్ చేయాలని ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిర్ణయించారు.కరూరు జిల్లాలోని మంత్రి నత్తం విశ్వనాథన్ అనుచరుడు, అన్నాడీఎంకే నేత అన్బునాథన్కు చెందిన గిడ్డంగి, ఫాంహౌస్లపై ఈనెల 22వ తేదీన ఫ్లయింగ్ స్క్వాడ్, ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.4.77 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేంద్రప్రభుత్వ చిహ్నాన్ని వాడుకోవడం, అక్రమాలకు అంబులెన్స్ వాహనాన్ని వాడుకోవడం తదితర కేసులు అతనిపై బనాయించారు. స్వాధీనం చేసుకున్న సొమ్ముపై లెక్కల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా అన్బునాథన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బినామీ మహరాజు: కేసు విచారణకు సహకరించకుండా అన్బునాథన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన వ్యవహారాలపై అధికారులు కూపీలాగే పనిలో పడ్డారు. ముగ్గురు ప్రముఖ మంత్రులకు బినామీ మహరాజుగా వ్యవహరిస్తూ వారి కార్యకలాపాలతోపాటు స్వలాభాలు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు మంత్రుల వేలాది కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో విదేశీ బ్యాంకుల్లో పెట్టుబడులు, విదేశాల్లో ఆస్తులు, రాష్ట్రంలో కాలేజీలు, పాఠశాలలు స్థాపించినట్లు సమాచారం. ప్రస్తుత ఎన్నికల తరుణంలో అన్నాడీఎంకే తరఫున నగదు బట్వాడా బాధ్యతలను అన్బునాథన్కే అప్పగించారని అంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం రూ.10 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ అన్బునాథన్ అని పరిశీలిస్తే...దిండుగల్లు జిల్లాకు చెందిన ఇతను కొన్నేళ్ల క్రితం కరూరుకు వచ్చి స్థిరపడ్డాడు. చోరీకి గురైన వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, నకలీ ఆర్సీ బుక్ తయారుతో ఖరీదైన రేటుకు అమ్మే వ్యాపారాలు చేసేవాడని తెలిసింది. ఇలా 2003 నుండి 2010 వరకు అన్బునాథన్ ఆదాయం రూ.3 కోట్లు మాత్రమే. ఆ తరువాతనే ఇతను కోట్లకు పడగలెత్తినట్లు చెబుతున్నారు. కోట్లకు ఎదగడం వెనుక ముగ్గురు మంత్రుల సహాయ సహకారాలు ఉన్నాయని భావిస్తున్నారు. అన్బునాథన్ సూచించిన విదేశాలకు ప్రభుత్వ పర్యటనగా సదరు మంత్రులు వెళతారు. ఇలా థాయ్‌లాండ్‌లోని ఒక హోటల్లో విందు, విలాసాలు సాగుతాయి. తిరుచ్చికి చెందిన ఒక ఆడిటర్ ద్వారా సింగపూరులోని మరో ఆడిటర్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. సింగపూర్ ఆడిటర్ ద్వారా మూడు దేశాల్లో ముగ్గురు మంత్రులకు చెందిన సొమ్ముతో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. దుబాయ్‌లో రూ.1500 కోట్లు ఒక హాస్పిటల్ కోసం పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. అలాగే తమిళనాడులో రూ.20 కోట్లతో ప్లాస్టిక సంచుల తయారీ పరిశ్రమ, ఒక మెట్రిక్యులేషన్ పాఠశాల కొనుగోలు చేశారు. అన్బునాథన్ సోదరి భర్త ప్రమాదంలో మృతి చెందడం, అలాగే మరికొందరు మరణాల వెనుక మర్మందాగి ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఒక సినీనటితో అన్బునాథన్ అత్యంత సన్నిహితంగా ఉండే వీడియో దృశ్యాలు అతని రెండు సెల్ఫోన్లలో రికార్డు చేసి ఉన్నాయని, ఆ రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుంటే ముగ్గురు మంత్రులు వివరాలు, అన్బునాథన్తో నడిపిన లావాదేవీలు బైటపడతాయనే సమాచారాన్ని ఎన్నికల అధికారులకు, పోలీసులకు కొందరు ఉప్పు అందించారు. కరూరు ఉదంతంపై ఆదాయపు పన్నుశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ అతనికి చెందిన గిడ్డంగి, ఫాం హౌస్‌ల తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై అన్బునాధన్ను విచారించాల్సి ఉంది, అయితే అతను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ అంతుపట్టడం లేదని తెలిపారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో పాస్‌పోర్టును సీజ్‌చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పాస్‌పోర్టు సీజ్ చేయాలంటే తమిళనాడు హోంశాఖ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించాల్సి ఉందని అన్నారు. పాస్‌పోర్ట్ సీజ్ చేసేందుకు అవసరమైన ఎఫ్ఐఆర్ను అందజేయాల్సిందిగా వేదారణ్యం పోలీసులను కోరామని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాల్సిందే: కరుణానిధి అన్నాడీ ఎంకే అండదండలతో అన్బునాధన్ సాగించిన అరాచకాలు బైటపడలే సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే అధినేత కరుణానిధి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తిరువారూరులో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కరూరులో వేలాది కోట్ల రూపాయాలను దాచిపెట్టిన అన్బునాధన్ కార్యకలాపాలు ఏమిటీ, ఎన్ని హత్యకేసుల్లో నిందితుడు అనే విషయాల జోలికి తాను వెళ్లడం లేదని అన్నారు. సీబీఐ విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చి కోర్టు బోనులో నిలబెట్టవచ్చని అన్నారు. -
సీబీఐ విచారణ జరిగితే కృష్ణలో మునుగుతారు
‘అమరావతి’ రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘రాష్ట్ర రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని అడుగుతున్నారు. అదే జరిగితే భూములిచ్చిన రైతులు కృష్ణానదిలో మునగాల్సిందే. 20 ఏళ్లయినా ఆ విచారణ ఎటూ తేలదు. దీనివల్ల రాజధాని నిర్మాణం ఆగిపోతుంది. భూములు విచారణలో ఉండడం వల్ల రైతులు వాటిలో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. రాజధానిలో ఏ చిన్న ఆందోళన జరిగినా నష్టపోయేది రైతులే’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలోని ఒక గదికి ఆయన సోమవారం తెల్లవారుజామున ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. రైతులిచ్చిన భూములు అలాగే ఉన్నాయని, వారి వాటా ప్లాట్లు వారికి ఇస్తామని చెప్పారు. సచివాలయాన్ని ప్రారంభించి, అందులోకి ప్రవేశించిన తర్వాత రెండో విడత రైతు రుణమాఫీ కోసం రూ.3,200 కోట్లు మంజూరు చేసి, మే నెలలో డబ్బు విడుదల చేసే ఫైల్‌పై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. పండ్ల తోటల రైతులకు రుణమాఫీ కింద రూ.375 కోట్లు, మొదటి విడత రుణమాఫీ బకాయిలు రూ.195 కోట్లను ఈ నెలలోనే విడుదల చేస్తామన్నారు. డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి కోసం రూ.2,400 కోట్లు మంజూరు చేసి, వాటిని జూన్‌లో ఇస్తామన్నారు. వీటన్నింటికి సంబంధించిన ఫైల్‌పై కొత్త సచివాలయంలో సంతకం చేశానని వెల్లడించారు. సారవంతమైన భూమిని రాజధానికి వాడుకోవడం వల్ల ఆహార సమస్య వస్తుందని కొందరు చెబుతున్నారని, ఇక్కడి నీటిని రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. అమరావతికి వచ్చినవారికి 30 శాతం హెచ్ఆర్ఏ ‘‘రాజధానికి భూములిచ్చిన మెట్ట ప్రాంతాల్లోని రైతులు ఇంకా అదనంగా 50 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని అడుగుతున్నారు, ఆ మేరకు ఇస్తాం. వచ్చిన డబ్బును తాత్కాలిక ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టకుండా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు మాకు సహకరించాలి. వారిని సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకుంటాం. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చినవారు గర్వపడేలా వారి భవిష్యత్తు ఉంటుంది. అమరావతికి వచ్చే ఉద్యోగులతో వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులే పనిచేయిస్తాం. వారికి 30 శాతం హెచ్ఆర్ఏ ఇస్తాం. మొదటి విడతగా ఒక సంవత్సరంలో ఐదు వేల ఇళ్లు కట్టించి ఇస్తాం. మిగిలిన వారికి తర్వాత ఎలా ఇళ్లు ఇవ్వాలో ఆలోచిస్తాం. పత్రికా విలేకరులకూ గౌరవనీయమైన స్థానం ఇస్తాం. వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. విలేకరులు పాజిటివ్ వార్తలు రాయాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరం వైపున కుర్చీ సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషానికి ముఖ్యమంత్రి సచివాలయం నాలుగో బ్లాకులోని ఒక గదిలోకి రిబ్బన్ కత్తిరించి ప్రవేశించారు. అనంతరం విష్వక్సేన, వాస్తు పూజలు, గణపతి హోమంలో పాల్గొన్నారు. ఆ గదిలో ఉత్తరం వైపున ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని రెండోవిడత రుణమాఫీ నిధుల మంజూరు ఫైల్‌పై సంతకం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా పాలు పొంగించిన మహిళకు పట్టుచీర ఇచ్చారు. ఆ తర్వాత ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎవరైనా భూములివ్వాల్సిందే.. ఇవ్వకపోతే భూసేకరణే సభ ముగిసిన తర్వాత వెంకటపాలేనికి చెందిన రైతు మువ్వా నాగేశ్వరరావు తన భూమిని సమీకరణకు ఇవ్వాలనుకుంటున్నానని, మాట్లాడొచ్చా అని సీఎంను అడిగాడు. ఆయన అనుమతించడంతో నాగేశ్వరరావు మాట్లాడాడు. తాను వైఎస్సార్ సీపీ వాడినని, ఎకరం పొలం ఉంటే తన కూతురికి 30 సెంట్లు, కొడుక్కి 30 సెంట్లు ఇచ్చి తాను 30 సెంట్లు తీసుకున్నానని చెప్పాడు. ఈ భూమంతా తన పేరిటే ఉందని, కొంత సమీకరణకు ఇచ్చానని, కానీ కౌలు ముగ్గురికీ కాకుండా ఒక్కరికే ఇస్తామంటున్నారని తెలిపాడు. కౌలు మూడు వాటాలుగా ఇస్తే మిగిలిన భూమిని కూడా సమీకరణకు ఇస్తానన్నాడు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఒక్కరి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేశారు. ఒక్కరికి వెసులుబాటు ఇస్తే గతంలో భూములిచ్చిన వారు ఇబ్బంది పడతారని చెప్పారు. ఎవరైనా సరే రాజధానికి భూములు ఇవ్వాల్సిందేనని, ఇవ్వకపోతే భూసేకరణ ద్వారా తీసుకుంటామని హెచ్చరించారు. -
సీబీఐ విచారణకు ఆదేశించండి
వక్ఫ్ బోర్డు అక్రమాలపై నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర మైనార్టీ కమిషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వక్ఫ్‌బోర్డు ఆస్తులు, భూముల అన్యాక్రాంతం, అక్రమ బదలాయింపులు, అధికార దుర్వినియోగాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టును రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఆశ్రయించనుంది. ఈ మేరకు సోమవారం హైకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు, వక్ఫ్‌బోర్డు, సీఈవోలతో పాటు సుమారు 11 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ రాష్ట్ర మైనార్టీ కమిషన్‌తో పాటు వ్యక్తిగతంగా చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూముల అన్యాక్రాంతం, దుర్వినియోగం, వేలాది ఎకరాల అక్రమ బదలాయింపులు, తదితర అక్రమాలపై కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. వాటిలో మచ్చుతునకగా 15 కేసులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపించగా.. భారీగా అక్రమాలు, కుంభకోణాలు వెలుగు చూశాయని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో 40 శాతానికి పైగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయినట్లు తేలిందన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు, ఆస్తుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలకు సిఫార్సులు చేసే విధంగా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో కమిషన్ విజ్ఞప్తి చేసింది. లేకుంటే మిగతా ఆస్తులు, భూములు కూడా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. -
సీబీఐ విచారణ జరపాలి
దళిత బాలిక అత్యాచారంపై రాహుల్ జైపూర్: రాజస్తాన్‌లో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బార్మెర్ జిల్లా తిర్మోహి గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌తో కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై విశ్వాసం కోల్పోయిందని రాహుల్ చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలోలాగే ఈ కేసునూ అణచిపెట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. తన కుమార్తెకు న్యాయం జరగాలనే తండ్రి కోరుకుంటున్నాడని తెలిపిన రాహుల్.. సీబీఐకి కేసు అప్పగించడం ద్వారా ఇక ఆ కేసులో న్యాయం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. -
సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?
పాత శ్రీకాకుళం: ప్రజా దేవాలయమైన అసెంబ్లీలో రౌడీ రాజకీయాలు చేయడం టీడీపీ నాయకులకే చెల్లిందని వైఎస్సాఆర్ సీపీ హైపర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని విచారణ చేయించారని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నాన్ని అధికార పార్టీ మానుకోవాలన్నారు. రెండు లక్షల కోట్లు ఎలా..? రెండు ఎకరాల ఆస్తితో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు రెండు లక్షల కోట్ల ఆస్తికి ఎలా అధిపతి అయ్యారని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో తన పా త్ర లేదని దేవునిపై ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. అసెంబ్లీలో స్పీకర్ కూడా టీడీపీ కార్యకర్తలాగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మూజువాణి ఓటు ప్రవేశపెట్టకుం డానే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ శాసనసభ సమావేశాలను పక్కదారి పట్టించడం ఆయనకే చెల్లిందన్నారు. అచ్చెన్నాయుడికి ఇంకా మాట్లాడే పద్ధతి రాదని, ఆయనకు ధైర్యం ఉంటే మళ్లీ ఎన్నికలు జరిపించి కొత్తగా చేరిన ఎమ్మెల్యేలను గెలిపించాలని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సాఆర్ సీపీ నాయకులు టి.కామేశ్వరి, కేఎల్ ప్రసాద్, ఎస్.వెంకట్రావు, ఎస్.నారాయణరావు, కోరాడ రమేష్, మండవల్లి రవి తదితరులు పాల్గొన్నారు. -
విచారణంటే భయమెందుకు?
ముద్దాయి ముఖ్యమంత్రేనంటున్న ప్రతిపక్షనేత ♦ ఆధారాలు ఇవ్వాల్సింది ఎవరికి? ♦ ముద్దాయికి ఆధారాలడిగే హక్కు ఉంటుందా? ♦ ఏ తప్పూ చేయకపోతే విచారణకు నిలబడవచ్చుకదా? ♦ సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు ప్రభుత్వం వెనుకంజ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అధికార పగ్గాలు చేపట్టిన ఇరవై నెలల వ్యవధిలో పాల్పడిన 20 రకాల కుంభకోణాలు, రాజధాని భూ దందాపై ప్రతిపక్షనాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు పట్టుబడుతుంటే దానిని పక్కదారి పట్టించేందుకు అధికారపక్షం అడుగడుగునా ప్రయత్నించడం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యింది. ప్రతి కుంభకోణానికి సంబంధించి స్పష్టమైన ఆధారాల గురించి సభలో ప్రస్తావిస్తున్నా ఆధారాలుంటే ఇవ్వండి పరిశీలిస్తా.. చర్యలు తీసుకుంటా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే అదే చెబుతుండటం చూసి సీనియర్ పార్లమెంటేరియన్లు విస్తుపో తున్నారు. అధికారపక్షం గానీ, ముఖ్యమంత్రి కానీ ఏ తప్పూ చేయకపోతే విచారణకు భయపడటమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఆధారాలను అడగడమేమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు ముద్దాయి మీరే కదా? ‘‘అసలు ముద్దాయి మీరే. మీ పైనే ఆరోపణలున్నాయి. రాజధాని భూ దందాపైన అయితేనేమి... 20 రకాల కుంభకోణాల విషయంలో అయితేనేమి... ఆరోపణలు మీ పైనే వస్తుంటే మీరు ఆధారాలడగడమేమిటి? మీరు చర్యలు తీసుకుంటాననడమేమిటి? మీకు ధైర్యముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి’’ అని జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అయితే ఆధారాలుంటే ఇవ్వాలి లేదంటే వారిపైనే చర్యలు తీసుకోవాలి అని అధికారపక్ష సభ్యులు సభలో అనేక రకాల విమర్శలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఆధారాలు ఇవ్వడమేమిటి? ఇదొక పనికిమాలిన వాదన కాదా? ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే విచారణ జరిపిస్తామంటే జనం నవ్విపోరా? ప్రతిపక్ష నేత డిమాండ్ చేసినట్లుగా సీబీఐ విచారణకు ఆదేశించడానికి ఎందుకు అధికారపక్షం జంకుతున్నట్లు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు బైటపడతాయని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. రాజధానిపై విచారణకు జంకెందుకు? ఉదాహరణకు రాజధాని కుంభకోణాన్నే తీసుకుంటే.. ‘‘లింగమనేని రమేష్ భూములు పూలింగ్‌కు ఇస్తామన్నా నేనే వద్దన్నా ’’ అని స్వయంగా ముఖ్యమంత్రి మీడియా ముందు చెబుతున్నారు. ఒకపక్క రైతుల ను బెదిరించి మూడు పంటలు పండే భూములను పూలింగ్ పేరుతో లాక్కున్న ప్రభుత్వం తమ బినామీలు, అయినవారు భూములు ఇస్తామన్నా పూలింగ్‌లో తీసుకోవడం లేదు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?. ఎకరం భూమి ఇచ్చే రైతుకు కొన్ని గజాల నివాసస్థలం, వాణిజ్య స్థలం ఇచ్చి.. మీ బినామీలకు మాత్రం మొత్తం ఎకరం అంతా విలువైన భూమిగా మిగల్చడం ఏం న్యాయం బాబూ? ఇది మీకు నేరంగా అనిపించడం లేదా? రాజధాని ఎక్కడ వస్తుందో మీ మంత్రులకు, బినామీలకు ముందుగానే చెప్పి వారు అమరావతి ప్రాంతంలో భూములు కారుచౌకగా కొనుక్కున్న తర్వాత రాజధాని ప్రకటించడం నిజం కాదా? అది మీకు నేరంగా కనిపించడం లేదా? వారు డబ్బులిచ్చి భూములు కొనుక్కుంటే తప్పేమిటి అని ఇపుడు అడుగుతున్నారు. రాజధాని ప్రాంతంలో 4.09 ఎకరాల భూమి రూ. 12 లక్షలకు వస్తుందా? రాజధాని గురించి తెలియని రైతు దగ్గర కారుచౌకగా మీరు కొట్టేయడం అన్యాయం కాదా? అధికార రహస్యాలను కాపాడతానని ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరు చేసిన ప్రమాణాలకు ఇది విరుద్ధం కాదా? ఈ వ్యవహారంలో విచారణ జరిపించాలని అడుగుతుంటే మీరు జంకుతుండడం చూస్తేనే మీరు నేరం చేశారని అర్ధం కావడం లేదూ? ఏ తప్పూచేయకపోతే భయమెందుకు? మీరు ఏ తప్పూ చేయలేదన్న ధైర్యం మీకు ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చుగదా? కనీసం సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించయినా మీ నిజాయితీని రుజువు చేసుకోవచ్చు కదా? సోమవారం నాడు సభలో చర్చనీయాంశంగా మార్చిన జెన్కో ఉదంతాన్ని తీసుకుంటే... సోలార్ టెండర్ల వ్యవహారంలో గోల్మాల్ జరిగిందని ప్రతిపక్షం ఆరోపించడం నిజం కాదా? ఇదే తరహా బిడ్డింగ్‌లో ఎన్టీపీసీలో 17 మంది మిగలగా జెన్కోలో ఐదుగురే మిగిలారు. థర్మల్‌లో ముగ్గురు మాత్రమే మిగిలారు. మీరు కోరుకున్న కంపెనీలకే టెండర్లు దక్కడం కోసం టెయిలర్ మేడ్ నిబంధనలు తెరపైకి తీసుకువచ్చినందున ఆ విషయం బైటపడుతుందని మీరు భయపడుతున్నారు. ప్రైమాఫేసీ ఆధారాలున్నాయని ప్రతిపక్షం ఢంకా భజాయించి చెబుతోంది. ఏ తప్పూ జరక్కపోతే ప్రభుత్వం విచారణకు సిద్ధపడాలని, లేదంటే ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్లేనని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వాదిస్తోంది. విచారణకు సిద్ధపడకపోతే ప్రభుత్వ నిజాయితీని శంకించాల్సి ఉంటుందని విమర్శకులం టున్నారు. -
‘అవినీతి’పై ఊగిపోయిన సీఎం
సోలార్, కృష్ణపట్నంపై ఆరోపణలు నిరూపించాలి: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నారు? మర్యాద నేర్చుకోండి. ఆరోపణలు చేయడం కాదు, నిరూపించుకోవాలి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఊగిపోయారు. ఆరోపణలు నిరూపించే వరకు సభ జరక్కూడదన్నారు. సోమవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. సీబీఐ విచారణ జరిపించాలన్న విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్‌ను పక్కనబెట్టి అవినీతి ఆరోపణలపై ఆధారాలు చూపాలంటూ చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ‘కోరలు తీస్తా, రౌడీయిజాన్ని అణచివేస్తా’ వంటి పదాలతో విరుచుకుపడ్డారు. ‘జెన్కో, సోలార్‌పవర్, కృష్ణపట్నం, వీటీపీఎస్‌కు ఎక్కువ ఇచ్చామట.. ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేయవచ్చో కనిపెట్టిన కృష్ణప్రసాద్‌కు ఏదో అప్పనంగా కట్టబెట్టామంటున్నారు. సోలార్, వీటీపీఎస్, కృష్ణపట్నంపై సవాల్ విసురుతున్నా.. వీళ్లు నిరూపిస్తారా? నిరూపించలేకుంటే వాళ్ల నాయకుని చేత ఈ హౌస్‌కు రానని చెప్పిస్తారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సోలార్, కృష్ణపట్నం ప్రాజెక్టులకు ఒప్పందాలే కుదరకపోతే రూ.7 వేల కోట్ల అవినీతి జరిగిందంటారా? పేపర్లలో రాసి కోర్టుల్లో కేసులు వేసి మమ్మల్ని నిరూపించుకోమంటారా?’ అని ప్రశ్నించారు. ‘ఏయ్, ఏంటది? మీ దివాళాకోరుతనం ఏంటీ? నేను సవాల్ చేస్తున్నా.. ధైర్యం, దమ్ము ఉంటే సోలార్, కృష్ణపట్నం, వీటీపీఎస్‌లో అవినీతిపై ఆధారాలు చూపండి. మీది దోపిడీ పార్టీ, పనికిమాలిన పార్టీ. రౌడీయిజం చేస్తే సహించం. కోరలు తీస్తాం తప్ప వదిలే ప్రసక్తే లేదు..’ అంటూ గుడ్లురిమారు. (సభలో గందరగోళం) ఆ తర్వాత మళ్లీ ప్రసంగిస్తూ... ‘కృష్ణపట్నం, సోలార్‌పై అవినీతి ఆరోపణలను నిరూపించాలి. లేకుంటే వాళ్లపై చర్య తీసుకోవాలి. ఆ తర్వాతే సభ ముందుకు పోవాలి..’ అని అన్నారు. ‘మీ తండ్రి నాపైన 26 కేసులు పెట్టారు. 23 విచారణలు జరిపించారు. మీ తండ్రే ఏమీ చేయలేకపోయారు. ఇక నీ లాంటి వాళ్లు ఏమి చేస్తారు?’ అంటూ విపక్ష నేత జగన్‌పై చంద్రబాబు పరుషపదజాలంతో దూషణలకు దిగారు. -
రాజధాని భూదందాపై సీబీఐ విచారణ జరిపించాలి
ఏలేశ్వరం: రాజధాని భూ దందాపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం శ నివారం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో పార్టీపతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఏలేశ్వరంలోని బాలాజీచౌక్ వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే వరుపుల పార్టీపతాకాన్ని ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల భూములతోపాటు అసైన్డ్ భూములను మంత్రులు, టీడీపీ నేతలు అక్రమంగా కొనుగోలు చేశారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. నిరుద్యోగభృతిపై అసెంబ్లీలో మంత్రి మాటమార్చడం సిగ్గుచేటన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీనేతలు శిడగం వెంకటేశ్వరరావు, అలమండ చలమయ్య, సామంతుల వెంకటేశ్వరరావు, బదిరెడ్డి గోవిందు, పసల సూరిబాబు, మలకల వేణు తదితరులు పాల్గొన్నారు. పెద్దనాపల్లిలో... వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో పెద్దనాపల్లి గ్రామంలో పార్టీ అవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీపతాకాన్ని ఎగురవేశారు. ఎంపీపీ అయిల సత్యవతి, ఎంపీటీసీ సభ్యుడు బీశెట్టి వెంకటరమణ, జి. గంగాధర్, ఎం. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా?
ఆమదాలవలస : చారిత్రక మలుపు కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆమదాలవలస పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ అమలు చేసి పేదలకు ఉన్నత విద్య, కార్పొరేట్ వైద్యం చేరువ చేశారని చెప్పారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతను ఆదుకున్నారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి వెలకట్టలేదని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని భూములపై సీబీఐ దర్యాప్తునకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.