బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనూహ్య మృతిపై సీబీఐ విచారణే ధ్యేయంగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే ఫోరం ఏర్పాటు చేశారు. సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఈ ఫోరం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా జస్టిస్ ఫర్ సుశాంత్ ఫోరం పోరాడుతుందని అన్నారు. బలమైన సంకల్పం, ప్రతిభ కలిగిన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం తనను ఎంతగానే నిరాశ పరిచిందని తెలిపారు.
(చదవండి: నన్ను చాలా టార్చర్ చేశారు)
అతని అర్ధాంతర ముగింపునకు గల కారణాలను కొందరు దాస్తున్నారని, తమ ఫోరం వాటన్నింటినీ వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. సినీ పరిశ్రమలో నిరంకుశత్వం, గ్రూపు రాజకీయాలు అంతమొందించేందుకు పనిచేస్తామని, అందరి సహకారం కావాలని కోరారు. కాగా, జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ముంబై పోలీసులు విచారిస్తున్నారు.
(మొదట్లో నన్ను ‘గోల్డ్ డిగ్గర్’ అంటుండేవారు: కంగనా)
Im forming a Forum called #justiceforSushantforum.where i implore just about ev one to pressurize the govt to launch a CBI inquiry into Sushant's death,raise their voices against this kind of tyranny n gangism and tear down the mafias.i solicit your support.
— Shekhar Suman (@shekharsuman7) June 23, 2020
Comments
Please login to add a commentAdd a comment