Shekhar Suman
-
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
రెండున్నర గంటల సినిమా కోసం నెలల తరబడి కష్టపడుతుంటారు సినీస్టార్స్. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసే కార్మికులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సినిమా విజయవంతంగా నిర్మితమవుతుంది. కొన్నిసార్లు సినిమా చిత్రీకరణలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.అంబాసిడర్ కారులో..తాజాగా అలాంటి ఓ సంఘటనను బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ పంచుకున్నాడు. 1984లో ఉత్సవ్ సినిమా వచ్చిందిగా.. అప్పుడు జరిగిందీ సంఘటన. నేను, నా భార్యగా నటించిన అనురాధ పటేల్, శశి కపూర్, అతడి కుమారుడు కునాల్ కపూర్.. మేమంతా హడావుడిగా అంబాసిడర్ కారులో బెంగళూరులోని ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నాం.కారు అద్దాలు ధ్వంసంఇంతలో ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డంగా రావడంతో మా కారు ఢీ కొట్టింది. ఇది చూసిన గ్రామస్తులు వెంటనే మా కారువైపు పరిగెత్తుకొచ్చారు. కారు అద్దాలు పగలగొట్టారు. శశి కపూర్‌ను కాలర్ పట్టుకుని లాగారు. కునాల్‌ను కొట్టారు. మా వెంట ఉన్న నటుడు రాజేశ్‌ను జుట్టు పట్టుకుని లాగి తల నరికేస్తామని బెదిరించారు.చెట్టు కింద కూర్చుని చాయ్..మా కారు ఢీ కొట్టిన వ్యక్తి చెట్టు కింద కూర్చుని చాయ్ తాగుతూ నవ్వుతున్నాడు. అతడు తన భాషలో ఏదేదో మాట్లాడుతున్నాడు. అది మాకేం అర్థం కాలేదు.. కానీ చాలా భయమేసింది. తర్వాత అక్కడినుంచి ఎలాగోలా తప్పించుకున్నాం అని పేర్కొన్నాడు. కాగా శేఖర్ సుమన్ నటించిన తొలి సినిమా ఉత్సవ్. ఈ మూవీలో నురాధ పటేల్‌తో పాటు రేఖ హీరోయిన్గా నటించింది.చదవండి: డబ్బు కోసమే పెళ్లి? వరలక్ష్మి స్ట్రాంగ్ కౌంటర్ -
ఎక్కువరోజులు బతకలేడు అని డాక్టర్లు చేతులెత్తేశారు: నటుడు
చాలాకాలం తర్వాత హీరామండి: ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్‌తో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు నటుడు శేఖర్ సుమన్. హీరామండి సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా శేఖర్ తన జీవితంలోని ఓ సంఘటనను పంచుకున్నాడు.తిరగని ఆస్పత్రి లేదు'మా నాన్న ఒక డాక్టర్.. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆయన తన మనవడిని కాపాడలేకపోయాడు. నా కొడుకు ఆయుష్కు అరుదైన వ్యాధి సోకడంతో ఎక్కువరోజులు బతకలేడని వైద్యులు తేల్చి చెప్పేశారు. తనను ఎలాగైనా బతికించుకోవాలని ఆస్పత్రుల చుట్టూ తిరిగాను. ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ దగ్గరకు వెళ్లాను. బాబాల దగ్గరకు కూడా వెళ్లాను. బౌద్ధమతాన్ని స్వీకరించాను. కానీ ఎటువంటి అద్భుతాలు జరగలేదు.నా కుమారుడు కళ్లముందే..గుండె మార్పిడి చేయాలన్నారు. అయితే రిస్క్ ఎక్కువ అని చెప్పడంతో అందుకు ఒప్పుకోలేదు. నా కుమారుడు కళ్లముందే చావుకు దగ్గరవుతుంటే ఏమీ చేయలేకపోయాను. అతడు ఎనిమిది నెలలు మాత్రమే బతకగలడు అని చెప్పారు. కానీ వాడు నాలుగేళ్లదాకా జీవించాడు. చివరి రోజుల్లో తను ఏవేవో ఊహించుకునేవాడు. నా చేతులతో మోసుకెళ్లితన దుస్థితి చూసి దేవుడిని తనతోపాటు తీసుకెళ్లమని కోరుకోక తప్పలేదు. తన అవస్థ చూడలేకపోయాం. అలా పదకొండేళ్ల వయసులో తను ఊపిరి వదిలేశాడు. ఆ రోజు నిర్జీవంగా పడి ఉన్న అతడిని నా చేతులతో మోసుకెళ్లి అంత్యక్రియలు జరిపాము అని చెప్తూ ఎమోషనలయ్యాడు.చదవండి: సింపుల్‌గా ఐశ్వర్య రజనీకాంత్ గృహప్రవేశ వేడుక.. పిల్లలతో అదే ఇంట్లో! -
నన్ను, నా కొడుకును ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూశారు: నటుడు
బాలీవుడ్లో కొందరి రాజకీయాలను తట్టుకోలేకే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యానంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియాంక చోప్రా. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో తనకు అవకాశాలు రాకుండా చేసి ఓ మూలకు నెట్టేయడానికి ఓ గ్రూప్ ఏర్పాటైందని పేర్కొంది. ఈ పొలిటికల్ గేమ్స్ ఆడలేకే హాలీవుడ్‌కు మకాం మార్చానంది. ఈ వ్యాఖ్యలు బీటౌన్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో నటుడు శేఖర్ సుమన్ సైతం బాలీవుడ్లో రాజకీయాలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రియాంక వ్యాఖ్యలు నన్నేమీ షాక్‌కు గురి చేయలేదు. ఇండస్ట్రీలో ఎలాంటి కుళ్లు రాజకీయాలుంటాయో అందరికీ తెలుసు. మిమ్మల్ని అణిచివేసి, అంతం చేసేవరకు వదలరు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో జరిగింది ఇదే! ఇంకా చాలామందికి జరిగింది. దాన్ని తట్టుకోవాలి, లేదంటే వదిలేయాలి. ప్రియాంక బాలీవుడ్‌ను వదిలి వెళ్లిపోవాలనుకుంది. నిజంగా తను మంచి పని చేసింది. హాలీవుడ్లో భారత్ తరపునుంచి గ్లోబల్ ఐకాన్‌గా నిలబడింది' అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో.. 'సినీ ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు వ్యక్తులు నాకు, నా కొడుకు అధ్యాయన్‌కు అవకాశాలు రాకుండా చేశారు. మాకు వ్యతిరేకంగా పని చేసి ఎన్నో ప్రాజెక్టుల నుంచి తప్పించారు. మమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూశారు. ఈ గ్యాంగ్స్టర్లు తాచుపాము కంటే కూడా ప్రమాదకరమైనవాళ్లు. కానీ అసలు నిజమేంటంటే.. వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమ్మల్ని ఆపలేరు' అని రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'అధ్యాయన్ మంచి నటుడు.. ఓటీటీ మాధ్యమాల ద్వారా అయినా తన ప్రతిభ నిరూపించుకోగలడు.. కానీ శేఖర్ సర్ చాలా గ్రేట్. ఆ రోజుల్లో ఓటీటీ వంటి మాధ్యమాలు లేవు. అయినా కష్టపడి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు', 'మీలాంటి లెజెండ్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే బాధగా ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శేఖర్ సుమన్.. భూమి, హార్ట్లెస్, చలో, రణ్‌భూమి, తేరే బినా క్యా జీనా, వో ఫిర్ ఆయేగి, సంసార్, ఉత్సవ్, నాచే మయూరి వంటి సినిమాల్లో నటించాడు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా, వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. I know of atleast 4ppl in the industry who have ganged up to have me n adhyayan removed from many projects.i know it for sure.These 'gangsters' have a lot of clout and they are more dangerous than a rattle snake.But the truth is they can create hurdles but they cannot stop us. — Shekhar Suman (@shekharsuman7) March 30, 2023 It will happen to others too.That's the way the cookie crumbles in the industry.Take it or leave it.and Priyanka decided to leave.and thank God she did.for now we have a true-blue global icon representing India in https://t.co/cleRR7DGsL they say every cloud has a silver lining. — Shekhar Suman (@shekharsuman7) March 30, 2023 -
‘విలాసవంతమైన ఇల్లు.. నీకింత డబ్బు ఎక్కడిది’
ముంబై: బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. విలాసవంతమైన తన ఇంటికి సంబంధించిన ఫొటోలపై ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘అంతగా అవకాశాలు లేకపోయినా, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది’’ అని ట్రోల్ చేశాడు. ఇక ఇందుకు శేఖర్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. కఠిన శ్రమకోర్చి, నిజాయితీగా, ఎంతో కష్టపడి సంపాదించాను అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతేగాకుండా తన సినీ ప్రయాణానికి సంబంధించి వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఆర్టికల్స్ ఫొటోలను కూడా షేర్ చేసి దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. కాగా నాటక రంగంలో ప్రవేశం ఉన్న శేఖర్ సుమన్ బుల్లితెరతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముంబైలో నివసించే అతడు కొన్నేళ్ల క్రితం తన కలల ఇంటిని అందంగా ముస్తాబుచేసుకున్నాడు. భార్యతో కలిసి తానే ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నాడు. ఈ విషయం గురించి శేఖర్ సుమన్ ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘నీకు ప్రతిభ ఉండి, హార్డ్‌వర్క్ చేయగలిగే సామర్థ్యంతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే కచ్చితంగా ఒక అందమైన, విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు. నెగిటివిటికి ఎంత దూరంగా ఉంటే మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుంది’’ అని తనను ట్రోల్ చేసేవారికి కౌంటర్ ఇచ్చాడు. చదవండి: బాలీవుడ్ ఫేక్ అంటున్న ప్రముఖ నటుడు -
‘గత నెల సుశాంత్ 50 సిమ్‌లు మార్చాడు’
పట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు వారాలకు పైనే అయినప్పటికి.. ఇంకా అతడి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు.. బాలీవుడ్ స్టార్లపై విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలో టెలివిజన్ హోస్ట్, నటుడు శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లోని బంధుప్రీతి వల్ల సుశాంత్ మరణించలేదని.. ఇండస్ట్రీలోని గ్యాంగ్‌ల వల్లే అతడు ఆత్యహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కలిసిన శేఖర్ సుమన్ దీని గురించి చర్చించానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కంటికి కనిపించే దాని కంటే ఎక్కువగా ఏదో జరిగినట్లు సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటిని గమనిస్తే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి’ అన్నారు. అంతేకాక ఓ సిండికేట్, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయని అన్నారు. ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిండికేట్‌లో భాగస్వాములైన స్టార్లందరు తనకు తెలుసని.. కానీ సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదన్నారు.(‘సుశాంత్ మరణాన్ని ముందే ఊహించా’) ‘సుశాంత్ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్ కార్డులు మార్చాడు. ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు. వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా తెలియాలి. బంధుప్రీతి వల్ల సుశాంత్ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలోనే గ్యాంగ్‌ల వల్లే సుశాంత్ మరణించాడు’ అంటూ శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ సింగ్ కుటుంబాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరామర్శించకపోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.(‘నా భర్త కూడా బాధితుడే.. నేను చూశాను’) -
‘సుశాంత్ మరణాన్ని ముందే ఊహించా’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబాన్ని కలిసేందుకు పట్నా వెళుతున్నట్లు టెలివిజన్ హోస్ట్, నటుడు శేఖర్ సుమన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. సోమవారం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సుశాంత్ తండ్రిని కలిసేందుకు నా స్వస్థలమైన పట్నాకు వెళ్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అంతేగాక సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు కూడా సుశాంత్ మృతిపై స్పందిస్తూ ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించాను అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: సీబీఐ విచారణకు ఫోరం) ‘‘సుశాంత్ ఆత్మహత్యను నేను ముందుగానే ఊహించాను. అతడు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలా అని సుశాంత్‌ది సాధారణ మరణమని ఎవరూ భావించకండి. దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలి. సుశాంత్‌కు న్యాయం జరిగేవరకు పోరాడదాం’ అంటూ ఆయన ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. కాగా జూన్ 14 సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణానికి బాలీవుడ్ పేరుకుపోయిన బంధుప్రీతి(నెపోటిజం) కారణమంటూ స్టార్‌కిడ్స్, ప్రముఖ దర్శకనిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంతేగాక స్టార్‌కిడ్స్ సినిమాలను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు. (సుశాంత్ మృతి మీకు వేడుకలా కనిపిస్తోందా!) Im going to my hometown Patna to meet Sushant's father and pay my respect to him and the CM Shri Nitish Kumar and all the admirers and fans of Sushant to press upon #CBIEnquiryForSushant #justiceforSushantforum @NitishKumar — Shekhar Suman (@shekharsuman7) June 28, 2020 -
జస్టిస్ ఫర్ సుశాంత్
బాలీవుడ్లో బయటినుంచి వచ్చేవారికన్నా వారసులకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుందని, ఇక్కడ బంధుప్రీతి బాగా ఉంటుందని పలువురు ప్రముఖులు బాహాటంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్‌సింగ్ ఆత్మహత్యకు ఇదో కారణం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే ఫోరమ్ ఏర్పాటు చేసినట్లు నటుడు శేఖర్ సుమన్ ట్వీటర్లో పేర్కొన్నారు. ‘‘మంచి ప్రతిభ, బలమైన సంకల్పం ఉన్న సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం నన్ను నిరాశకు గురిచేసింది. అతని ఆత్మహత్యకు గల కారణాలను కొందరు దాస్తున్నారు. వాటన్నింటినీ మా ఫోరమ్ వెలుగులోకి తీసుకొస్తుంది. తన ఆత్మహత్యపై సీబీఐ విచారణకు మా ఫోరమ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ ఫోరమ్ పోరాడుతుంది. సినీ పరిశ్రమలోని గ్రూపు రాజకీయాలను, నిరంకుశత్వాన్ని అంతమొందించేందుకు పని చేస్తాం’’ అన్నారు. ఇప్పటికి మూడు సినిమాలు బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణం ఆధారంగా తెరకెక్కనున్న సినిమాల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. ఈ నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత షామిక్ మౌలిక్ దర్శకత్వంలో సుశాంత్ జీవితం ఆధారంగా ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు విజయ్‌శేఖర్ గుప్తా ప్రకటించారు. దర్శకుడు నిఖిల్ ఆనంద్ కూడా సుశాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. తాజాగా సుశాంత్ జీవితం ఆధారంగా ‘సుశాంత్’ అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు సునోజ్ మిశ్రా. ఇంతకుముందు ‘గాంధీ గిరి’, ‘శ్రీనగర్’ చిత్రాలను డైరెక్ట్ చేశారు సునోజ్ మిశ్రా. ‘సుశాంత్’ చిత్రం గురించి సనోజ్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోని వేధింపుల వల్ల కఠిన నిర్ణయాలు తీసుకున్నవారందరికీ సంబంధించినదే ఈ చిత్రం. రోడ్ ప్రొడక్షన్, సనోజ్ మిశ్రా ఫిల్మ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ముంబై, బీహార్ లొకేషన్స్‌లో మేజర్ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
‘జస్టిస్ ఫర్ సుశాంత్’ ఫోరం ఏర్పాటు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనూహ్య మృతిపై సీబీఐ విచారణే ధ్యేయంగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అనే ఫోరం ఏర్పాటు చేశారు. సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణకు ఈ ఫోరం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన ట్విటర్లో వెల్లడించారు. దాంతోపాటు సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన మాఫియాకు వ్యతిరేకంగా జస్టిస్ ఫర్ సుశాంత్ ఫోరం పోరాడుతుందని అన్నారు. బలమైన సంకల్పం, ప్రతిభ కలిగిన సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం తనను ఎంతగానే నిరాశ పరిచిందని తెలిపారు. (చదవండి: నన్ను చాలా టార్చర్ చేశారు) అతని అర్ధాంతర ముగింపునకు గల కారణాలను కొందరు దాస్తున్నారని, తమ ఫోరం వాటన్నింటినీ వెలుగులోకి తీసుకొస్తుందని అన్నారు. సినీ పరిశ్రమలో నిరంకుశత్వం, గ్రూపు రాజకీయాలు అంతమొందించేందుకు పనిచేస్తామని, అందరి సహకారం కావాలని కోరారు. కాగా, జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ముంబై పోలీసులు విచారిస్తున్నారు. (మొదట్లో నన్ను ‘గోల్డ్ డిగ్గర్’ అంటుండేవారు: కంగనా) Im forming a Forum called #justiceforSushantforum.where i implore just about ev one to pressurize the govt to launch a CBI inquiry into Sushant's death,raise their voices against this kind of tyranny n gangism and tear down the mafias.i solicit your support. — Shekhar Suman (@shekharsuman7) June 23, 2020 -
కంగనాతో డేటింగ్ చేసి మావాడు తప్పుచేశాడు
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, నటుడు ఆధ్యయన్ సుమన్‌ల వివాదంపై చివరకు అతని తండ్రి, బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో శేఖర్ సుమన్ మాట్లాడుతూ.. కంగనాతో డేటింగ్ చేసి తన కొడుకు తప్పు చేశాడని చెప్పాడు. కంగనా గురించి కొన్ని విషయాలు గతంలో తెలుసుకున్నామని, ఆమెకు దూరంగా ఉండాల్సిందిగా అప్పట్లో ఆధ్యయన్ను హెచ్చరించామని తెలిపాడు. తన కొడుకు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని, కంగనాతో రిలేషన్ వద్దని సూచించినట్టు చెప్పాడు. కంగనా క్షుద్రపూజలు చేసేదని ఆధ్యయన్ చేసిన వ్యాఖ్యలను శేఖర్ సుమన్ తోసిపుచ్చాడు. ఆధ్యయన్ ఆ విధంగా ఎప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చాడు. మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కంగనాల మధ్య కొనసాగుతున్న వివాదంపై స్పందించేందుకు ఆయన నిరాకరించాడు. ఇది వారిద్దరికీ సంబంధించిన విషయమని, వారిద్దరి మధ్య ఏం జరిగిందన్నది వారికి మాత్రమే తెలుసునని, ఇతరులు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని అన్నాడు. కంగనా కంటే హృతిక్ వందరెట్లు పెద్ద స్టార్ అని, అతనికి పబ్లిసిటీ అవసరంలేదని చెప్పాడు. మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్, కంగనా విడిపోయాక పరస్పరం కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మెయిల్స్ విషయంపై ఇద్దరూ లీగల్ నోటీసులు కూడా ఇచ్చుకున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగా కంగనా మాజీ ప్రేమికుడు ఆధ్యయన్ జోక్యం చేసుకుంటూ ఆమె క్షుద్రపూజలు చేసేదని బాంబు పేల్చాడు. ఈ నేపథ్యంలో శేఖర్ సుమన్ స్పందించాడు. -
త్రిముఖ పోటీలో నెగ్గేదెవరో చెప్పడం కష్టమే
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశానికి మంచి ప్రభుత్వం రావాలని బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ ఆశించారు. ముంబైలో మంగళవారం నాడు నిర్వహించిన ఎన్నారై ఆఫ్ ద ఇయర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశానికి ఈరోజు ఎలాంటి ప్రభుత్వం అవసరమో అలాంటిది రావాలని ఆశిద్దామని అన్నారు. 2009 ఎన్నికలలో శేఖర్ సుమన్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉంటాయని, అచ్చం మూడు సినిమాలు ఒకేరోజు విడుదలైతే బాక్సాఫీసు వద్ద ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాగే ఇప్పుడూ ఉంటుందని అన్నారు. ఇలాంటి ఎన్నికలు ఇంతకుముందు ఎన్నడూ జరగలేదని చెప్పారు. ఈసారి నరేంద్ర మోడీ హవా ఉందని అనుకుంటున్నారని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ హవా కూడా ఉందంటున్నారని, మరోవైపు కాంగ్రెస్ కూడా ఉండటంతో త్రిముఖ పోటీ తప్పకపోవచ్చని తెలిపారు. ఇలాంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది చెప్పడం కష్టమేనని వ్యాఖ్యానించారు.