కంగనాతో డేటింగ్ చేసి మావాడు తప్పుచేశాడు | Adhyayan made a mistake by dating Kangana, says Shekhar Suman | Sakshi
Sakshi News home page

కంగనాతో డేటింగ్ చేసి మావాడు తప్పుచేశాడు

Published Fri, May 6 2016 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

కంగనాతో డేటింగ్ చేసి మావాడు తప్పుచేశాడు

కంగనాతో డేటింగ్ చేసి మావాడు తప్పుచేశాడు

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, నటుడు ఆధ్యయన్ సుమన్ల వివాదంపై చివరకు అతని తండ్రి, బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో శేఖర్ సుమన్ మాట్లాడుతూ.. కంగనాతో డేటింగ్ చేసి తన కొడుకు తప్పు చేశాడని చెప్పాడు. కంగనా గురించి కొన్ని విషయాలు గతంలో తెలుసుకున్నామని, ఆమెకు దూరంగా ఉండాల్సిందిగా అప్పట్లో ఆధ్యయన్ను హెచ్చరించామని తెలిపాడు. తన కొడుకు శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని, కంగనాతో రిలేషన్ వద్దని సూచించినట్టు చెప్పాడు.

కంగనా క్షుద్రపూజలు చేసేదని ఆధ్యయన్ చేసిన వ్యాఖ్యలను శేఖర్ సుమన్ తోసిపుచ్చాడు. ఆధ్యయన్ ఆ విధంగా ఎప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చాడు. మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కంగనాల మధ్య కొనసాగుతున్న వివాదంపై స్పందించేందుకు ఆయన నిరాకరించాడు. ఇది వారిద్దరికీ సంబంధించిన విషయమని, వారిద్దరి మధ్య ఏం జరిగిందన్నది వారికి మాత్రమే తెలుసునని, ఇతరులు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని అన్నాడు. కంగనా కంటే హృతిక్ వందరెట్లు పెద్ద స్టార్ అని, అతనికి పబ్లిసిటీ అవసరంలేదని చెప్పాడు.

మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్, కంగనా విడిపోయాక పరస్పరం కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మెయిల్స్ విషయంపై ఇద్దరూ లీగల్ నోటీసులు కూడా ఇచ్చుకున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగా కంగనా మాజీ ప్రేమికుడు ఆధ్యయన్ జోక్యం చేసుకుంటూ ఆమె క్షుద్రపూజలు చేసేదని బాంబు పేల్చాడు. ఈ నేపథ్యంలో శేఖర్ సుమన్ స్పందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement