త్రిముఖ పోటీలో నెగ్గేదెవరో చెప్పడం కష్టమే | Hope India gets good government, says Shekhar Suman | Sakshi
Sakshi News home page

త్రిముఖ పోటీలో నెగ్గేదెవరో చెప్పడం కష్టమే

Published Tue, Mar 25 2014 4:24 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

త్రిముఖ పోటీలో నెగ్గేదెవరో చెప్పడం కష్టమే - Sakshi

త్రిముఖ పోటీలో నెగ్గేదెవరో చెప్పడం కష్టమే

లోక్సభ ఎన్నికల తర్వాత దేశానికి మంచి ప్రభుత్వం రావాలని బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ ఆశించారు. ముంబైలో మంగళవారం నాడు నిర్వహించిన ఎన్నారై ఆఫ్ ద ఇయర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశానికి ఈరోజు ఎలాంటి ప్రభుత్వం అవసరమో అలాంటిది రావాలని ఆశిద్దామని అన్నారు. 2009 ఎన్నికలలో శేఖర్ సుమన్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయం తెలిసిందే.

రాబోయే ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉంటాయని, అచ్చం మూడు సినిమాలు ఒకేరోజు విడుదలైతే బాక్సాఫీసు వద్ద ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాగే ఇప్పుడూ ఉంటుందని అన్నారు. ఇలాంటి ఎన్నికలు ఇంతకుముందు ఎన్నడూ జరగలేదని చెప్పారు. ఈసారి నరేంద్ర మోడీ హవా ఉందని అనుకుంటున్నారని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ హవా కూడా ఉందంటున్నారని, మరోవైపు కాంగ్రెస్ కూడా ఉండటంతో త్రిముఖ పోటీ తప్పకపోవచ్చని తెలిపారు. ఇలాంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది చెప్పడం కష్టమేనని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement