triangular fight
-
Lok Sabha Election 2024: గురుగ్రాంలో ముక్కోణం
గురుగ్రాం. మిలీనియం సిటీ. దేశ రాజధానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం. బహుళజాతి కంపెనీలకు నిలయం. శనివారం పోలింగ్ జరగనున్న ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి రావు ఇందర్జీత్ సింగ్, కాంగ్రెస్ నుంచి నటుడు రాజ్ బబ్బర్, జేజేపీ నుంచి హర్యాన్వీ గాయకుడు రాహుల్ యాదవ్ హోరాహోరీ తలపడుతున్నారు... మిలీనియం సిటీగా పేరొందిన గురుగ్రాంలో ఫార్చ్యూన్ 500 జాబితాలోని 250కి పైగా కంపెనీలున్నాయి. పెప్సికో, నెస్లే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలున్నాయి. ఇంతటి కీలక నగరంలో మౌలిక సదుపాయాల కొరత ప్రధాన సమస్య. వర్షాకాలంలో ఇది కొట్టొచి్చనట్టు కని్పస్తుంటుంది. నీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, ట్రాఫిక్ రద్దీ స్థానికులను ఆందోళనపరిచే అంశాల్లో కొన్ని మాత్రమే. గురుగ్రాం లోక్‌సభ స్థానంలో ఏకంగా 25.3 లక్షల మంది ఓటర్లున్నారు. ఓటర్లపరంగా హరియాణాలో ఇదే అతి పెద్ద లోక్‌సభ స్థానం. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఓటర్ ఇన్ క్యూ యాప్, ఓటర్లకు పోలింగ్ ఆహా్వనాలు, బహుళ అంతస్తుల సొసైటీల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు వంటివి చేశారు.ముక్కోణపు పోటీ... కేంద్ర మంత్రి రావ్ ఇందర్జీత్ సింగ్ గురుగ్రాం నుంచి ఐదుసార్లు గెలిచారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు బీజేపీ పట్టణ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకే అహిర్వాల్కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కెపె్టన్ అజయ్ సింగ్ యాదవ్‌ను పక్కన పెట్టి రాజ్ బబ్బర్‌కు టికెటిచి్చంది. ఈ స్థానంలో కాంగ్రెస్ యాదవేతర అభ్యర్థిని నిలబెట్టడం ఇదే మొదటిసారి. ఇది హరియాణా కాంగ్రెస్‌లో అసంతృప్తికి కారణమైంది. 2019లో ఓడిన అజయ్ సింగ్ యాదవ్ కూడా బబ్బర్ ఎంపికపై అసంతృప్తితో ఉన్నారు. యాదవ్ ఓట్లను రాబట్టుకునేందుకు జననాయక్ జనతా పార్టీ వ్యూహాత్మకంగా రాపర్ సింగర్ రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్పురియాకు టికెటిచి్చంది.విమర్శల హోరు... బబ్బర్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ ప్రకటించగానే ఆయనపై ‘ఔట్ సైడర్’ ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. దీన్ని రాజ్ బబ్బర్ గట్టిగానే తిప్పికొడుతున్నారు. దేశ విభజన తరువాత తన కుటుంబం అంబాలాకు చేరుకుందని, గురుగ్రాం, ఫరీదాబాద్ల్లో తమ బంధువులున్నారని చెబుతున్నారు. ‘మై బాహారీ నహీ హూ’ అని ప్రతి సభలోనూ ప్రత్యేకంగా చెబుతున్నారు. హరియా ణాకు భారీగా ఆదాయం సమకూరుస్తున్నా గురుగ్రాంలో మౌలిక సదుపాయాలే లేవంటూ బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ నగరంలో జరిగిన అభివృద్ధంతా తన హయాంలో జరిగిందేనని ఇందర్జీత్ అంటున్నారు. ఆయన తరఫున కూతురు ఆర్తి సింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుకోసమే తాను పోటీ చేస్తున్నానని ఫజిల్పురియా చెబుతున్నారు. పక్కా లోకల్ పార్టీ అయిన జేజేపీకే ఓటేయాలన్న ఆయన అభ్యర్థనకు మంచి స్పందనే వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: రాజకీయ కథాకళి..కేరళ
కేరళ రాజకీయాల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములదే హవా. బీజేపీకి కేడర్ ఉన్నా ప్రజాదరణ అంతంతే. దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవని ఏకైక రాష్ట్రం కేరళే. అయినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ 13 శాతం ఓట్లు సాదించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 11.3 శాతానికే పరిమితమైంది. ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయడమే లక్ష్యంగా కాషాయదళం కష్టపడుతోంది.క్రిస్టియన్, ముస్లిం ఓటర్లకూ చేరువయ్యేందుకు ప్రయతి్నస్తోంది. ఫలితంగా పలు స్థానాల్లో పోటీ ఇప్పటికే త్రిముఖంగా మారింది. ఇక జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో మాత్రం పరస్పరం తలపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకూ శుక్రవారం రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాలపై ఫోకస్... త్రిసూర్రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటు డు సురేశ్ గోపి ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా నిలి చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన ఇక్కణ్నుంచే పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్ విజయం సాధించారు. అయితే అప్పట్లో ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆలస్యంగా గోపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈసారి కాంగ్రెస్ నుంచి వడకర ఎంపీ కె.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ సీఎం కె.కరుణాకరన్ కుమారుడు.నాలుగు పర్యా యా లు ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మురళీధరన్‌కు విన్నింగ్ మాస్టర్‌గా పేరుంది. సీపీఐ నుంచి మాజీ మంత్రి వి.ఎస్.సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. 35 శాతమున్న క్రిస్టియన్ ఓటర్లు నిర్ణాయకం కానున్నారు. 16 శాతమున్న ముస్లిం ఓట్లూ కీలకమే. ప్రధాని మోదీ ఇప్పటికే త్రిసూర్‌లో రోడ్డు షో జరిపారు. కరువన్నూర్ కో ఆపరేటివ్ బ్యాంక్ స్కాం అధికార ఎల్డీఎఫ్కు ఇక్కడ ప్రతికూలంగా మారనుందని అంచనా.పాలక్కాడ్బీజేపీ ఆశలు, ఆకాంక్షలకు పాలక్కాడ్ నియోజకవర్గం కీలకం కానుంది. కేరళలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్న ఏకైక మున్సిపాలిటీ ఇది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వీకే శ్రీకందన్ ఇక్కడ గెలిచారు. ఈసారి కూడా పార్టీ తరఫున ఆయనే బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి విజయ రాఘవన్‌కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.కృష్ణకుమార్ వరుసగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కృష్ణ కుమార్ 21.44 శాతం ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే గత మూడు సార్వత్రిక ఎన్నికల నుంచి ఇక్కడ బీజేపీ ఓటు శాతం పెరుగుతూ వస్తోంది.వయనాడ్ఇది 2009 లోక్‌సభ ఎన్నికల ముందు ఏర్పాటైన నియోజకవర్గం. అప్పటినుంచి ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడుస్తోంది. 2009, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎం.ఐ.షానవాజ్ గెలిచారు. 2019లో అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఖాయమని తేలడంతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వయనాడ్ నుంచీ బరిలో దిగారు. అమేథీలో ఓడినా ఇక్కడ ఆయన ఏకంగా 4.31 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.ఎన్డీఏ అభ్యరి్థ, బీడీజే (ఎస్) నేత తుషార్ వెల్లప్పల్లికి 78,000 ఓట్లు పోలయ్యాయి. ఈసారి మాత్రం రాహుల్‌కు ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగా లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. దాంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. అన్నీ రాజా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య. ఇక సురేంద్రన్ ఉత్తర కేరళలో గట్టి పట్టున్న నాయకుడు. 2019 ఎన్నికల్లో పతనంతిట్టలో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌కు 64.9 శాతం ఓటర్లు రాగా, సీపీఎంకు కేవలం 25.24 శాతం ఓట్లే లభించాయి. ఎన్నికల ముందే ఇక్కడ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కాంగ్రెస్ డీసీసీ జనరల్ సెక్రటరీ పీఎం సుధాకరన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఇక్కడ రోడ్ షోలు నిర్వహించారు. అమేథీ మాదిరిగానే వయనాడ్ నుంచి కూడా రాహుల్ పారిపోవడం ఖాయమంటూ ఎద్దేవా చేశారు. అట్టింగల్ఇక్కడ కూడా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ అదూర్ ప్రకాశ్‌ను కాంగ్రెస్ మరోసారి పోటీలో నిలిపింది. బీజేపీ తరఫున కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి వి.జోయ్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో అదూర్ 2,80,995 ఓట్లతో (38.34 శాతం) గెలిచారు. సీపీఎం అభ్యర్థి అనిరుద్ధ్ సంపత్‌కు 34.5 శాతం, బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌కు 24.97 శాతం ఓట్లు లభించాయి. అట్టింగల్‌లో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. పథనంతిట్టఇక్కడ కూడా త్రిముఖ పోటీ వాతావరణమే నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడైన అనిల్ ఆంటోనీని బీజేపీ బరిలో నిలిపింది. సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీకి కాంగ్రెస్ మరోసారి అవకాశమిచి్చంది. సీపీఎం తరఫున మాజీ మంత్రి థామస్ ఇజాక్ పోటీలో ఉన్నారు. తన కుమారుడు ఓడాలని కోరుకుంటున్నానని, ఆంటో ఆంటోనీదే విజయమని ఏకే ఆంటోనీ ప్రకటించడం విశేషం!శబరిమల ఆలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ప్రధాన అభ్యర్థులు ముగ్గురూ కేథలిక్స్ క్రైస్తవులే కావడం విశేషం! 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంటో ఆంటోనీ 37.11 శాతం ఓట్లతో సీపీఎం అభ్యర్థి వీణా జార్జ్‌పై 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి కె.సురేంద్రన్ 29 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే 2009 ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా 2014లో 16 శాతానికి, 2019లో 29 శాతానికి పెరిగాయి.కాసర్గోడ్సిట్టింగ్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితాన్ మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి సతీశ్ చంద్రన్‌పై ఆయన 1.4 లక్షల మెజారిటీతో గెలిచారు. బీజేపీ ఈ విడత ఎంఎల్ అశి్వనికి అవకాశమిచ్చింది. గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం మధ్యే ఉండనుంది. కొద్ది రోజులుగా సీపీఎం అభ్యర్థి ఎం.వి.బాలకృష్ణన్ పట్ల స్పష్టమైన మొగ్గు కన్పిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీకి ప్రజామద్దతు పెరుగుతోందని, మోదీ సర్కారుకు ఈసారి రాష్ట్ర ప్రజలు ఓటేస్తారని అశ్విని అంటున్నారు. కేరళలో తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో కూడా హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ నుంచి హాట్రిక్ వీరుడు శశిథరూర్ పోటీలో ఉండగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను బీజేపీ బరిలో దింపింది. ఎల్డీఎఫ్ సంకీర్ణం తరఫున పి.రవీంద్రన్ (సీపీఐ) తలపడుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
karnataka assembly election 2023: దేవెగౌడ సుడిగాలి పర్యటనలు
శివాజీనగర: త్రిముఖ పోరుగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ మరిన్ని సీట్లు ఒడిసిపట్టేందుకు ఆ పార్టీ చీఫ్ హెచ్డీ దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు. వచ్చే 11 రోజుల్లో 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 89 ఏళ్ల వయసులోనూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ పార్టీ శ్రేణులను, కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఎన్నికల సమరోత్సాహం పెంచనున్నారు. ‘ శుక్రవారం నుంచి మే ఎనిమిదో తేదీ దాకా 42 చోట్ల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటా. వయోభారం రీత్యా వారానికి ఒక్కరోజు మాత్రం కాస్తంత విరామం తీసుకుంటా. మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు వస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట ఇచ్చారు. కర్ణాటకలో వారు ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం కోసం ఇంకొందరు జాతీయస్థాయి నేతలతో ఈ విషయమై హెచ్డీ కుమారస్వామి మంతనాలు జరుపుతున్నారు’ అని దేవెగౌడ గురువారం బెంగళూరులో మీడియాతో చెప్పారు. ‘జాతీయరాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక రాజకీయాల్లోనూ ఆ మార్పులు తప్పనిసరి’ అని అన్నారు. ‘207 మంది పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు చోట్ల సీపీఎం అభ్యర్థులకు, మరో మూడు చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులకు మద్దతిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొంచెం తేడా వచ్చినా సీట్లు గల్లంతే.. ఆ మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోరులో మెజార్టీ అనేది ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ చిన్న పార్టీల జోరు పెరిగిపోతూ ఉండడంతో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కడం పరిపాటిగా మారింది. దాంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటునూ ఒడిసిపట్టడం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు కీలకంగా మారింది... అధికార వ్యతిరేకత, చిన్న పార్టీల జోరు ఈ రెండూ కర్ణాటక ఎన్నికల ఫలితాల్ని శాసిస్తున్నాయి. వరసగా రెండోసారి ఏ పార్టీకీ అధికారాన్ని కట్టబెట్టే సంప్రదాయం లేని కన్నడ నేలపై అత్యంత తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలవడం సాధారణంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 16 స్థానాల్లో విజేతలు 3 వేల కంటే తక్కువ మార్జిన్‌తో గట్టెక్కారు. గత ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 36% ఓట్లతో 104 స్థానాల్లో విజయం సాధిస్తే, 38% ఓట్లు సాధించిన కాంగ్రెస్ మాత్రం 80 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది! మన ప్రజాస్వామ్యంలోని ఈ వైచిత్రి కారణంగా అత్యధిక ఓట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే సవాల్‌గా మారింది. అందుకే ఈసారి పార్టీలన్నీ ఒక్క ఓటు కూడా పోకుండా క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తూ బూత్ మేనేజ్మెంట్కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మూడు ఎన్నికల ముచ్చట గత మూడు ఎన్నికల్లోనూ అన్ని పార్టీలకు స్వల్ప మార్జిన్ పెద్ద తలనొప్పిగా మారింది. 2008 ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 70 స్థానాల్లో ఎమ్మెల్యేలు 5 శాతం కంటే తక్కువ మార్జిన్‌తో గెలుపొందారు. అంటే 31% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొన్నట్టయింది. 2013 ఎన్నికల దగ్గరకి వస్తే 5 శాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపొందిన స్థానాల శాతం 30గా ఉంది. గత ఎన్నికల్లో 28% స్థానాల్లో హోరాహోరి పోరు నెలకొంది. గత మూడు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ, జేడీ(ఎస్) పార్టీల సగటు గెలుపు ఆధిక్యం 12 శాతం ఉండగా, కాంగ్రెస్‌కు 11 శాతం ఉంది. 1980ల వరకు ఏ రాష్ట్రంలోనైనా గెలుపు ఆధిక్యాలు చాలా ఎక్కువగా దాదాపుగా 30% అంతకంటే ఎక్కువ ఓట్లు ఉండేవి. తర్వాత ప్రాంతీయ పార్టీలు పెరగడం, పార్టీల సామాజిక సమీకరణలు వంటివి ప్రధానంగా మారి ఓట్ల ఆధిక్యానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. పార్టీల్లో టెన్షన్ టెన్షన్ ఈసారి ఎవరి ఓటు బ్యాంకుకి గండిపడుతుందా అని మూడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. మొత్తం 224 స్థానాలకు గాను అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ 25 స్థానాల్లో పోటీ చేయనుంది. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 100 స్థానాల్లో పోటీకి సన్నాహాలు చేస్తోంది. వీటితో కాంగ్రెస్, జేడీ(ఎస్)లకు నష్టమనే అంచనాలున్నాయి. బీజేపీని వీడిన గాలి జనార్దన రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. ఆప్ అన్ని స్థానాల్లోనూ పోటీ పడుతోంది. ఈ పార్టీల ప్రభావం గత ఎన్నికల్లో 5 వేల కంటే తక్కువ మెజారిటీ నమోదైన 30 సీట్లపై ఉంటుందని భావిస్తున్నారు. ‘‘ఏదైనా నియోజకవర్గంలో హోరాహోరి పోరు నెలకొన్నప్పుడు చిన్న పార్టీలు రెండు నుంచి మూడు వేలు ఓట్లు సంపాదించినా అది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. వారు ఎన్నికల్లో గెలవలేకపోయినా ఫలితాలను మార్చే సత్తా కలిగి ఉంటారు’’అని బెంగుళూరుకి చెందిన రాజకీయ విశ్లేషకుడు నరేంద్రపాణి అభిప్రాయపడ్డారు. నోటాకే ఎక్కువ ఓట్లు! 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)కే ఎక్కువ ఓట్లు రావడం విశేషం. వాటిలో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెసే నెగ్గింది. అలంద్, బాదామి, గడగ్, హిరెకెరూర్, కంగ్డోల్, మాస్‌కి, పావగడలో అభ్యర్థుల గెలుపులో ఓట్ల కంటే నోటాకే ఎక్కువ పడ్డాయి. ► 1985 నుంచి ఇప్పటివరకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే అత్యధిక స్థానాల్లో బొటాబొటి మెజార్టీతోనే నేతలు గట్టెక్కారు. ► 25 శాతానికి పైగా స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. విజేతలకు, పరాజితులకు మధ్య తేడా 5, అంతకంటే తక్కువ శాతమే ఉంది. ► గత మూడు దశాబ్దాల్లో కేవలం 5 శాతం స్థానాల్లో మాత్రమే భారీ మెజార్టీ నమోదైంది. ► విజేతలు, పరాజితులకు వచ్చిన ఓట్లు, వాటి మధ్య తేడాలను విశ్లేషిస్తే ఓటరు గాలివాటంగా పోకుండా ఎంతో మేధోమథనం చేసి ఓటేస్తున్నాడని తేటతెల్లమవుతుంది. ► మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులిద్దరికీ ఓట్లు 5 శాతం తేడా వస్తే హోరాహోరీగా పోరు సాగిందని, 20 శాతం కంటే ఎక్కువ ఉంటే ఓటరు నిర్ణయాత్మకంగా స్పందించారని అంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మేఘాలయలో ముక్కోణం
ఈశాన్య భారత్‌లో గిరిజన ప్రాబల్యం కలిగిన మేఘాలయాలో శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 60 అసెంబ్లీ స్థానాలున్న మేఘాలయలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 2న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పాత ప్రత్యర్థులైన కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా మళ్లీ హోరాహోరీగా తలపడుతున్నారు. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నేతృత్వం వహించి, 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నుంచి బరిలోకి దిగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. కిందటిసారి పోటీలో లేని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతుండడం విశేషం. 2018లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికార పీఠానికి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులంటూ ఎవరూ లేకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఎన్పీపీకి కాన్రాడ్ సంగ్మా, తృణమూల్ కాంగ్రెస్‌కు ముకుల్ సంగ్మా, కాంగ్రెస్‌కు విన్సెంట్ పాలా, బీజేపీకి ఎర్నెస్ట్ మారీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా ఎన్పీపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. అంతర్గత లుకలుకలతో అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమైంది. కూటమిలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ(యూడీపీ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(హెచ్ఎస్పీడీపీ), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. ఎండీఏలో అతిపెద్ద పార్టీ అయిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మరోసారి కుర్చీ దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే మేఘాలయలో 2013 తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న తొలి పార్టీగా ఎన్పీపీ రికార్డుకెక్కుంది. 18 మంది రాజీనామా 2018లో కేవలం 20 సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ.. యూడీపీ(6 సీట్లు), హెచ్ఎస్పీడీపీ(2 సీట్లు), పీడీఎఫ్(4 సీట్లు), బీజేపీ(2 సీట్ల)తోపాటు ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఎమ్మెల్యేల గోడదూకుళ్లు తదితరాలతో బలాబలాలు మారుతూ వచ్చాయి. 2021 నవంబర్‌లో ముకుల్ సంగ్మా నేతృత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు లేకుండాపోయారు. ఇటీవలే 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు, సొంత పార్టీలకు రాజీనామా చేశారు. టిక్కెట్లపై హామీ ఇచ్చే పార్టీలో చేరి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తృణమూల్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ వీరిలో ఉన్నారు. గిరిజన రాష్ట్రమైన మేఘాలయకు ప్రత్యేక హోదా ఉంది. దాంతో రాష్ట్రంలో ఖర్చు చేసే నిధుల్లో 90 శాతానికిపైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంటాయి. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడి రాజకీయాలను చాలావరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. చిన్నాచితక పార్టీలు ఏదో ఒక నినాదంతో ఎన్నికల్లో పోటీ చేయడం, ఒకటో రెండో స్థానాలు గెలుచుకొని, ఫలితాల అనంతరం నెంబర్ గేమ్‌లో వీలైనంత మేరకు లబ్ధి పొందడం పరిపాటిగా మారింది. మళ్లీ మాదే అధికారం: ఎన్పీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టించిందని, అందుకే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నామని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తేల్చిచెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదని, తాము మళ్లీ నెగ్గడం ఖాయమని ఎన్పీపీ రాష్ట్ర అధ్యక్షుడు డబ్ల్యూ.ఖార్లుఖీ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభావితం చేసే అంశాలేమిటి? ప్రభుత్వ వ్యతిరేకత: కాన్రాడ్ సంగ్మా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుండడం, నిధుల లేమితో ఆరోగ్య రంగం కునారిల్లుతుండడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది. సరిహద్దు రగడ: మేఘాలయ–అస్సాం నడుమ సరిహద్దు వివాదం రగులుతోంది. రెండు రాష్ట్రాల్లో సరిహద్దులో ఉన్న పలు తెగల మధ్య హింసాకాండ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని జనం ఆరోపిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం: అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి(ఎండీఏ) కూటమి విచ్ఛిన్నమై, పార్టీలు సొంతంగా పోటీ చేస్తుండడం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Election 2022: ఆకాశంలో సగం.. అవకాశాలే గగనం!
ఆకాశంలో సగం అంటూ గొప్పగా కీర్తించడమే తప్ప రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం పార్టీలు వెనుకంజ వేస్తున్నాయి. జనాభాలో దాదాపు సగం ఉన్న అతివలకు ఆ మేరకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. గుజరాత్లో శాసనసభ ఎన్నికల ముఖచిత్రం పరిశీలిస్తే నిరాశే మిగలడం ఖాయం. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా, మొత్తం 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో మహిళల సంఖ్య కేవలం 139 అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరిలో ఏకంగా 56 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండడం విశేషం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 మంది మహిళలు పోటీకి దిగారు, 13 మంది విజయం సాధించారు. అప్పట్లో 104 మంది మహిళలు డిపాజిట్ సైతం కోల్పోయారు. ‘ఆప్’ నుంచి ఆరుగురు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఈసారి అదృష్టం పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మహిళలకు పరిమిత సంఖ్యలోనే టిక్కెట్లిచ్చాయి. ఈ మూడు పార్టీల నుంచి కేవలం 38 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2017 ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి సంఖ్య పెరగడం కొంత ఊరటనిచ్చే విషయం. 2017లో బీజేపీ 12 మంది మహిళామణులకు టిక్కెట్లు ఇవ్వగా, ఈ ఎన్నికల్లో 18 మందికి అవకాశం కల్పించింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. 2017లో 10 మందికి, ఇప్పుడు 14 మంది ఆ పార్టీ టిక్కెట్లు లభించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళిత, గిరిజన మహిళలకు టిక్కెట్లు ఇచ్చాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో మహిళలు కేవలం ఆరుగురు. ఈ ఆరుగురిలో ముగ్గురు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. 13 స్థానాల్లో పోటీ చేస్తున్న ఆలిండియా మజ్లిస్ ఇత్తెహదూల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ చేస్తున్న ఇద్దరు మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ఒకరు ముస్లిం కాగా, మరో మహిళ దళిత వర్గానికి చెందినవారు. బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. 13 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన సీపీఎం ఒక మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపింది. ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని టిక్కెట్లు బీజేపీకి 9 మంది మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఐదుగురికి మొండిచెయ్యి చూపింది. నలుగురికి మరోసారి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్‌కు నలుగురు మహిళా సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నారు. వీరిలో ఇద్దరికి మళ్లీ అవకాశం కల్పించింది. 2017 ఎన్నికల కంటే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం సానుకూల అంశం. 2017లో బీజేపీ ఎస్సీ స్థానాల్లో ఇద్దరికి, ఎస్టీ స్థానాల్లో ఒక మహిళకు టిక్కెట్లు ఇవ్వగా, ఇప్పుడు ఎస్సీ స్థానాల్లో నలుగురికి, ఎస్టీ స్థానాల్లో ఇద్దరికి పోటీ చేసే అవకాశం కల్పించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎస్టీ మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఎస్సీలకు చోటు దక్కలేదు. ఈసారి నలుగురు ఎస్టీ, ఒక ఎస్సీ మహిళా అభ్యర్థి కాంగ్రెస్ టిక్కెట్లు దక్కించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముగ్గురు ఎస్టీ మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. బిల్లు ఆమోదం పొందితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితేనే ఎన్నికల్లో వారి సంఖ్య పెరుగుతుందని శాయాజీగంజ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమీ రావత్ చెప్పారు. ఉన్నత పదవుల్లో మహిళలను నియమించడంలో తమ పార్టీ ముందంజలో ఉందని గుజరాత్ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దీపికాబెన్ సర్వాదా వెల్లడించారు. ఒక గిరిజన మహిళను తమ పార్టీ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకుందని గుర్తుచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Elections 2022: బ్రాండ్ మోదీకే పరీక్ష!
గుజరాత్ అంటే మోదీ. మోదీ అంటే గుజరాత్. రాష్ట్రంలో మూడు దశాబ్దాలుగా ఇదే మాట వినిపిస్తోంది. ఆయన పేరే ఓ బ్రాండ్‌గా మారి బీజేపీకి అప్రతిహతంగా అధికారాన్ని అందిస్తోంది. కేజ్రీవాల్ తదితరుల సభల్లోనూ జనం మోదీ నామజపం చేయడం రాష్ట్రంలో ఆయన కరిష్మాకు నిదర్శనం. మరి ఈసారేం జరగనుంది? త్రిముఖ పోరులో మోదీ ఇమేజీ బీజేపీని మరోసారి గట్టెక్కించగలదా? సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న గుజరాతీయులు మళ్లీ మోదీ మంత్రమే జపిస్తారా? గుజరాత్లో 27 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీ ఉచిత హామీలు కమలనాథుల్ని కలవరపెడుతున్నాయి. కరోనా తాలూకు ఆర్థిక, సామాజిక సమస్యల నుంచి రాష్ట్రం ఇంకా బయట పడలేదు. రాష్ట్రంలో బీజేపీకి బలమైన నాయకులెవరూ లేకపోవడంతో ఈసారి కూడా గెలిపించే బాధ్యత మోదీ భుజస్కంధాలపైనే పడింది. ‘ఈ గుజరాత్ నేనే నిర్మించాను’ నినాదంతో ఎన్నికల్ని ఆయన తన చుట్టూ తిప్పుకుంటున్నారు. డిసెంబర్ 1, 5 రెండు దశల్లో జరిగే పోలింగ్‌కు ఓటర్ స్లిప్పులను స్వయంగా ఇవ్వడానికి మోదీ సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్ 28, 29ల్లో, డిసెంబర్ 2–3ల్లో ఆయన ఇంటింటికి వెళ్లి వాటిని పంచుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బ్రహ్మాస్త్రంగా కమలనాథులు భావిస్తున్నారు. ఇమేజ్ లేని సీఎంలు మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ సీఎంలుగా చేసిన ఎవరికీ ప్రజల్లో పేరు లేదు. ఆనందీ బెన్ పటేల్ హయాంలో పటీదార్ల ఉద్యమం ఎగిసిపడడం, పటీదార్ అయ్యుండీ ఆమె ఉద్యమాన్ని అణిచే చర్యలకు దిగి సొంత వర్గానికే దూరమయ్యారు. దాంతో విజయ్ రూపానీని సీఎంను చేశారు. కరోనాను ఎదుర్కోలేక ఆయనా దిగిపోయారు. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్‌ను రాష్టంలోనే చాలామంది గుర్తు పట్టరంటే అతిశయోక్తి కాదు. సన్నాఫ్ గుజరాత్ మోదీ ఈసారి ప్రచారంలో ప్రజలతో వ్యక్తిగత భావోద్వేగ బంధానికి ప్రాధాన్యమిస్తున్నారు. ‘నేను మీ కొడుకును. ఆశీర్వదించండి’ అంటూ ఓట్లడుగుతున్నారు. గత ఎన్నికల్లో అధికార వ్యతిరేకత, పటీదార్ల ఉద్యమ ప్రభావం, జీఎస్టీ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బీజేపీ 99 స్థానాలతో అధికారం నిలుపుకుందంటే కేవలం మోదీ కార్డుతోనే. అందుకే ఈసారీ హిందూత్వ, డబుల్ ఇంజన్ నినాదాలతో పాటు ‘ఇది నేను నిర్మించిన గుజరాత్’, ‘ఇవి గతిని మార్చే ఎన్నికలు’ అంటూ మోదీ ప్రచారం చేస్తున్నారు. సామూహిక వివాహాల్లో పాల్గొంటూ, ఆదివాసీల్లో కలిసిపోతూ ప్రచారం చేస్తున్నారు. కీలక సవాళ్లు మోదీకి ఈసారి సొంత పార్టీ నుంచే అసలు పరీక్ష ఎదురవుతోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన 17 మందికి టికెట్లివ్వడంతో పార్టీలో అసమ్మతి మొదలైంది. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ ఇప్పుడు ఆ పార్టీ వారినే ఇలా అక్కున చేర్చుకోవడమేంటని రెబెల్ నేతలంటున్నారు. కరోనా, చమురు ధరలు, ద్రవ్యోల్బణం తదితరాలతో మోదీ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తదుపరి ప్రధానిగా మోదీకి 53% మందే ఓటేశారు. ఒకప్పుడిది 70 శాతానికి పైగా ఉండేది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 2002లో 127 నెగ్గిన బీజేపీ 2007లో 117, 2012లో 116 సీట్లకుకు పరిమితమైంది. 2017లో 99తో సరిపెట్టుకుంది! ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టాలంటే గుజరాత్ ఎన్నికల్లో నెగ్గితీరాలి. అందుకే ఈ ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Election 2022: గుజరాత్లో ముక్కోణపు పోటీ!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరు మొదలయ్యింది. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆగమనంతో ఈసారి ముక్కోణపు పోటీ జరగబోతోంది. రాష్ట్రంలో దశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఎన్నికల పోటీ కొనసాగుతోంది. ఇప్పుడు ‘ఆప్’ సైతం ఆ రెండు పార్టీలకు సవాళ్లు విసురుతూ రణరంగంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేసింది. హిందుత్వ కార్డుతోపాటు డబుల్ ఇంజన్ సర్కారు, సుపరిపాలన కొనసాగింపు అంటూ అధికార బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు గుజరాత్లో తరచుగా పర్యటిస్తున్నారు. ఇటీవలి కాలంలో రూ.వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు మోదీ శంకస్థాపనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జనంపై హామీల వర్షం కురిపించారు. నరేంద్ర–భూపేంద్ర (గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్) భాగస్వామ్యానికి మళ్లీ పట్టం కట్టాలని కోరారు. ధరలు, నిరుద్యోగం పెరగడంతోపాటు మోర్బీ పట్టణంలో తీగల వంతెన దుర్ఘటన బీజేపీకి ఇబ్బందికరంగా పరిణమించింది. బిల్కిస్ బానో కేసులో దోషులకు శిక్ష తగ్గించడం, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, ప్రశ్నాపత్రాల లీక్ వల్ల పరీక్షలను వాయిదా వేయడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, వంటి సౌకర్యాలు కొరవడడం, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం దక్కకపోవడం, రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు అధ్వాన్నంగా మారడం, విద్యుత్ చార్జీలు పెరిగిపోవడం, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణ పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు బీజేపీని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో 1995 నుంచి చూస్తే మధ్యలో రెండేళ్లు మినహా(1996–1998) ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో నిస్తేజం మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ గుజరాత్లో నెగ్గడం బీజేపీకి అత్యంత కీలకం. వరుసగా ఆరు సార్లు గెలిచిన ఆ పార్టీ మరోసారి విజయంపై కన్నేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం కావడంతో బీజేపీ ఈసారీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో 27 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితం అవుతున్న కాంగ్రెస్ ఈసారి అధికార పక్షంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. అయితే, ప్రచార పర్వంలో వెనుకబడడం, పార్టీ జాతీయ నాయకులు ఇప్పటికీ గుజరాత్ వైపు కన్నెత్తి చూడకపోవడం ప్రతికూలంగా మారింది. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో తీరిక లేకుండా ఉన్నారు. రాష్ట్రంలో ప్రచారంలో ఆయన పాల్గొంటారా లేదా అనేది నిర్ధారణ కాలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 111, కాంగ్రెస్‌కు 62, ఎన్సీపీకి ఒకరు, భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ)కి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తోపాటు మరికొన్ని చిన్న పార్టీలు సైతం ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా గుజరాత్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. ‘ఆప్’ సంక్షేమవాదం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రివాల్ ఓటర్లపై సంక్షేమ వల విసురుతున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు. పంజాబ్‌ను చేజిక్కించుకొని ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌పై ఆశలు పెరుగుతున్నాయి. గుజరాత్లో పాగా వేస్తే జాతీయ స్థాయిలో తమ ప్రతిష్ట ఇనుమడించి, బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడం ఖాయమని ఆప్ భావిస్తోంది. సంక్షేమవాదాన్నే ఆ పార్టీ నమ్ముకుంది. నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు, పిల్లలకు ఉచిత విద్య, నిరుద్యోగ యువతకు భృతి, మహిళలు, కొత్త న్యాయవాదులకు ప్రతినెలా రూ.1,000 చొప్పున భత్యం వంటివి ‘ఆప్’ ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గుజరాత్లో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇతర పార్టీల కంటే ముందే ‘ఆప్’ ప్రచారం ప్రారంభించడం విశేషం. ఇప్పటికే 73 స్థానాల్లో అభ్యర్థులను సైతం ప్రకటించింది. -
పూర్వాంచలే కీలకం
త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల దృష్టి పూర్వాంచల్ (ఢిల్లీ తూర్పు ప్రాంతం) ఓట్లపైనే పడింది. అక్కడ వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. దీంతో వారి ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. దశాబ్దాల తరబడి ఈ వలసదారులు తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తమకు సంప్రదాయంగా మద్దతు ఇస్తున్న పంజాబీ, వైశ్య ఓటర్లపైనే ఆధారపడుతూ వీరిని నిర్లక్ష్యమే చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అత్యధికంగా పూర్వాంచల్ వర్గానికే టిక్కెట్లు ఇచ్చి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలు పూర్వాంచల్‌కు చెందినవారే కావడం విశేషం. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి గోపాల్ రాయ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, దిలీప్ పాండే, సోమ్‌నాథ్ భారతి వంటి వారు ఆప్‌లో ఉంటూ చక్రం తిప్పుతున్న ప్రధాన నాయకులు. ఈ పరిణామంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూడా పూర్వాంచల్ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. బీజేపీ వ్యూహమేంటి ? ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు మనోజ్ తివారీ చేతికి వచ్చాక పార్టీ వ్యూహాల్లో మార్పులు వచ్చాయి. ఆయన ఎక్కువగా పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. నితీశ్‌కుమార్‌కు చెందిన జనతా దళ్ (యునైటెడ్), రాం విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కమలనాథులు వలసదారులకు 10 టిక్కెట్లు ఇచ్చారు. వీరిలో పూర్వాంచల్‌కు చెందిన ఎనిమిది మంది, ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతవాసులు ఉంటున్న అనధికార కాలనీలన్నింటినీ కేంద్రం రెగ్యులరైజ్ చేసింది. అంతేకాదు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉంటే జరిగే ప్రయోజనంపైనే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కమలనాథుల బాటలోనే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించుగా బీజేపీ బాటలోనే నడుస్తూ పూర్వాంచల్‌తో పాటు ముస్లిం, మైనార్టీ ఓట్లను కూడా దక్కించుకునేలా ప్రణాళికలు రచించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ వలసదారులతో పాటు ముస్లింలకు కూడా సీట్లు ఇచ్చింది. బిహార్ వలసదారుల ఓట్లను సంపాదించుకోవడానికి ఆర్జేడీ నాలుగు స్థానాలు కేటాయించింది. మాజీ క్రికెటర్, బిహార్‌కు చెందిన కీర్తి ఆజాద్ కాంగ్రెస్‌లో పూర్వాంచల్ ఫేస్‌గా మారారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని తానే నిర్వహిస్తున్నారు. వలస ఓట్లను కాపాడుకునే ప్రయత్నాల్లో కేజ్రీవాల్ గత ఎన్నికల్లో వలసదారుల ఓట్లన్నీ గంపగుత్తగా పొందిన ఆప్ ఈసారి ఆ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వలసదారులు ఉండే కాలనీలకు సబ్సిడీ ధరలకే విద్యుత్ అందిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే నీళ్లు, కరెంట్ వంటివన్నీ తక్కువ ధరకే అందిస్తామన్న హామీతో గ్యారంటీ కార్డులు కూడా జారీ చేస్తోంది. ఈసారి కూడా అక్కడ 12 మందికి టిక్కెట్లు ఇచ్చింది. ఎన్నికల వేళ ఢిల్లీలో 300 ప్రాంతాల్లో అపాన్ పేరిట పూర్వాంచల్ ఫెస్టివల్ నిర్వహించింది. ఉత్తర బిహార్‌లో అత్యధికంగా మాట్లాడే మైథిలి భాషను ఢిల్లీ స్కూళ్లలో ఆప్షనల్‌గా ప్రవేశ పెట్టింది. పూర్వాంచల్ వాసుల చాత్ పండుగ కోసం యుమునా తీరం వెంట వెయ్యికి పైగా ఘాట్లను నిర్మించింది. -
హస్తినాపురాధీశ్వరుడెవరు?
రాజధాని ఢిల్లీలో ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరకపోవడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఆ రెండు పార్టీల కూటమి వైఫల్యం బీజేపీకి గెలుపు సోపానంగా మారుతుందనే అంచనాలు పెరిగిపోయాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లలోనూ ఘన విజయం సాధించి రాజధానిని క్లీన్ స్వీప్ చేసింది. అయితే కాంగ్రెస్, ఆప్ చేతులు కలిపితే ఆ రెండు పార్టీలు కలిపిన ఓటు షేర్‌తో బీజేపీని ఆరుస్థానాల్లో కట్టడి చేసి ఉండేవని ఒక అంచనా. ఇప్పుడు పొత్తు కుదరకపోవడంతో త్రిముఖ పోటీలో కమలనాథులే పై చేయి సాధిస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌కి చెందిన ఆప్ 2013లో రాజకీయ రంగస్థలంలోకి అడుగు పెట్టాక ఢిల్లీ ఓటర్ల్ల ఆలోచనా ధోరణి ఎన్నికల ఎన్నికలకి మారిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు కొనసాగి మూడు పార్టీలు ఓట్లను ఇంచుమించుగా సమానంగా పంచుకోవడంతో త్రిశంకు సభ ఏర్పడింది. బీజేపీ అత్యధిక సీట్లు సాధించినా, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది. తర్వాత ఏడాదికే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. బీజేపీ ఏడు లోక్‌సభ స్థానాలకు గాను అన్నింట్లోనూ విజయభేరి మోగించింది. అంతలోనే అసెంబ్లీ రద్దయింది. మళ్లీ 2015లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈసారి ఓటరు ఆప్‌కి బ్రహ్మరథం పట్టాడు. 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఎవరూ ఊహించని రీతిలో 54.3% ఓటు షేరుని సాధించి 67 స్థానాలను ఊడ్చేసింది. మిగిలిన మూడు స్థానాల్లో బీజేపీ నెగ్గింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. మళ్లీ రెండేళ్లకే సీన్ మారిపోయింది. 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఓటు షేర్ 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే ఏకంగా 28 శాతం తగ్గిపోయింది. కాంగ్రెస్ ఓటు షేరు మళ్లీ పెరిగింది. బీజేపీ 36శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ ఎన్నికలతో సార్వత్రిక ఎన్నికల్ని పోల్చి చూడలేము. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డులు కూడా ఢిల్లీ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ ప్రజలు ప్రధానిగా నరేంద్రమోదీని, సీఎంగా కేజ్రీవాల్‌ని కోరుకుంటున్నారని అర్థమవుతోంది. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం అటూ ఇటూ కానీ తీర్పు ఇచ్చి రాజకీయ విశ్లేషకుల్ని సైతం గందరగోళంలో పడేశారు. ఓటింగ్ శాతాన్ని ఎలా విశ్లేషించాలి ? ఢిల్లీ ఎన్నికల విశ్లేషణలో ఓట్ల శాతం కూడా ముఖ్యమైన అంశమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 65.1 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009 ఎన్నికలతో పోల్చి చూస్తే ఇది 14శాతం ఎక్కువ. దీని ప్రభావంతో భారత దేశం మొత్తమ్మీద సగటు ఓటింగ్ శాతం పెరిగింది. 2009లో 58.2% నుంచి 2014లో 66.4శాతానికి పెరిగింది. కొత్త పార్టీ ఎన్నికల బరిలో దిగడంతో అత్యధికంగా ఓటర్లు పోలింగ్ బూతులకు తరలి వచ్చారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఓట్ల శాతం మళ్లీ పెరిగితే, జనం నాడి పట్టుకోవడం కష్టమేనన్న అంచనాలున్నాయి. -
ఢిల్లీలో త్రిముఖ పోరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల పొత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్‌ల మధ్య నెలలుగా సాగుతున్న చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకూ ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ కూడా సోమవారం ఆరు స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ ఆసక్తి చూపినా, పంజాబ్, హరియాణ, చండీగఢ్ల్లోనూ పొత్తు ఉండాల్సిందేనంటూ ఆప్ పట్టుబట్టింది. ఇది కాంగ్రెస్‌కు నచ్చలేదు. పొత్తు కుదుర్చుకునేందుకు ఎన్నోసార్లు చర్చలు జరిపినా విషయం కొలిక్కిరాలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను సోమవారం ప్రకటించింది. గతంలో ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఈశాన్య ఢిల్లీ నుంచి, కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్‌ను న్యూఢిల్లీ నుంచి, తూర్పు ఢిల్లీ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీని కాంగ్రెస్ బరిలోకి దింపింది. దక్షిణ ఢిల్లీలో బరిలో దింపిన బాక్సర్ విజేందర్ 2008 బీజింగ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతక విజేత. బీజేపీ కూడా తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను తాజాగా ప్రకటించింది. గతంలోనే ఆ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా తూర్పు ఢిల్లీ నుంచి క్రికెటర్ గౌతం గంభీర్‌ను, న్యూఢిల్లీ నుంచి సిట్టింగ్ ఎంపీ మీనాక్షి లేఖిని బీజేపీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో మోదీ గాలి వీచిన కారణంగా ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ బీజేపీ గెలుచుకుంది. నామినేషన్ వేసిన ఆప్ అభ్యర్థులు.. ఆప్ అభ్యర్థుల్లో ఆరుగురు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న బల్వీర్ సింగ్ జఖర్ గత గురువారమే నామినేషన్ దాఖలు చేయగా, పత్రాలను అసంపూర్తిగా నింపడంతో మరోసారి నామినేషన్ వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆయనను కోరింది. బల్వీర్ సింగ్ మినహా మిగిలిన ఆప్ అభ్యర్థులందరూ సోమవారం నామినేషన్లు వేశారు. వీరందరూ వేర్వేరు చోట్ల నామినేషన్లు వేయగా, ఆప్ కీలక నేతలు వారి వెంట వచ్చారు. అంతకుముందు అభ్యర్థులందరూ రోడ్ షోలు నిర్వహించారు. మా ప్రభుత్వ విజయాలను వివరిస్తాం: షీలా ఢిల్లీలో, కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తామని ఈశాన్య ఢిల్లీ అభ్యర్థిని, మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ చెప్పారు. ఢిల్లీలో జరగనున్న త్రిముఖ పోరుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీలో, 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. -
హాత్రస్లో రంగు పడేదెవరికి..
హాత్రస్.. యూపీలోని ఒక కీలక నియోజకవర్గం. ఈ పేరు వినగానే అందరికీ రంగుల హోలీ పండుగ గుర్తొస్తుంది. యూపీలో హాత్రస్ రంగులకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఎన్నికల వేళ ఏ పార్టీకి రంగు పడుతుందా అన్న ఆసక్తి నెలకొంది. హాత్రస్లో అభివృద్ధి కంటే పేరు మార్పు శరవేగంగా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. రాష్ట్రంలో పార్టీ అధికారం మారిన ప్రతీసారి పేరుని మార్చి పారేస్తుంటారు. ఈ నేమ్ ఛేంజ్ పార్టీల మధ్య ఒక గేమ్‌గా మారింది. ఎన్నిసార్లు పేరు మార్చారంటే.. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఉండే హాత్రస్ పేరు మార్పు మొదటిసారిగా 1997లో జరిగింది. అప్పుట్లో యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాత్రస్‌ను మహామాయానగర్ అని మార్చి జిల్లా హోదా కల్పించారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం అధికారంలోకి రాగానే ములాయం సింగ్ యాదవ్ తిరిగి హాత్రస్ పేరుని పునరుద్ధరించారు. 2007లో మాయావతి అధికారంలోకి రాగానే మళ్లీ మహామాయానగర్ అని పిలవాలని హుకుం జారీ చేశారు. 2012లో అఖిలేష్ యాదవ్ సీఎం కుర్చీ ఎక్కగానే మళ్లీ పాత పేరునే పెట్టేశారు. ప్రస్తుతానికైతే హాత్రస్ పేరుతోనే ఈ జిల్లా కొనసాగుతోంది. ఇలా పార్టీ మారిన ప్రతీసారి పేరు మారుస్తుండటంతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. పేరు మార్చడానికి చూపించే శ్రద్ధ జిల్లా అభివృద్ధిలో ఎందుకు లేదని స్థానికులు నిలదీస్తున్నారు. హాత్రస్ దేనికి ప్రసిద్ధి అంటే.. ఈ నియోజకవర్గంలో హోలీ రంగుల తయారీయే అతి పెద్ద పరిశ్రమ. ఇక్కడ దొరికే ఇంగువ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందితే, ఆభరణాల్లో వాడే రంగురాళ్లకి గిరాకీ ఎక్కువే. ఇక బంగాళదుంప పంటకి పెట్టింది పేరు. కానీ ప్రాసెసింగ్ యూనిట్లు లేక చాలామంది రైతులు దుంపల్ని ఇప్పుడు సాగు చేయడం లేదు. రాజకీయ చరిత్ర ఎస్సీలకు రిజర్వు చేసిన హాత్రస్ లోక్‌సభ నియోజకవర్గంలో కమలనాథులదే ఎప్పుడూ హవా. ఇప్పటికే ఆరుసార్లు ఇక్కడ గెలిచిన బీజేపీ ఏడోసారి కూడా గెలుపు కోసం తహతహలాడుతోంది. 1996–2009 మధ్య కాలంలో బీజేపీకి చెందిన కిషన్ లాల్ దిలేర్ నాలుగుసార్లు గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్‌కి చెందిన సారిక బఘేల్ ఆ స్థానంలో గెలుపొందారు. తిరిగి గత ఎన్నికల్లో బీజేపీకి చెందిన రంజన్ కుమార్ దివాకర్ గెలుపొందారు. పోటీ ఎలా ఉందంటే.. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ, జాటవ్ సామాజిక వర్గానికి చెందిన రంజన్‌కుమార్‌ను పక్కన పెట్టి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కిషన్‌లాల్ దిలేర్ కుమారుడు రాజ్వీర్ సింగ్‌కు దిలేర్‌కు సీటు ఇచ్చింది. ఇక్కడ వల్మీకి వర్గం మద్దతు బీజేపీకి లభించకపోవచ్చని అంచనా. ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి రాంజీలాల్ సుమన్‌ను బరి లోకి దింపింది. ఫిరోజాబాద్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన సుమన్‌కు ఎస్సీ, జాటవులు, ముస్లింల మద్దతు లభించే అవకాశాలున్నాయి. దీనికి సాయం కూటమి ఓటు బ్యాంకుతో ఆయన పవర్ఫుల్ అభ్యర్థిగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున త్రిలోక్‌రామ్ దివాకర్ బరిలో ఉన్నారు. -
కాంగ్రెస్ అడ్డా.. ఎగిరేది ఏ జెండా
బిహార్‌లో ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏకైక నియోజకవర్గం కిషన్‌గంజ్. ఇక్కడి ఓటర్లలో 60–70 శాతం ముస్లింలే. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా వారే కావడంతో ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీయూ తమ అభ్యర్థులుగా ముస్లింలను నిలబెట్టాయి. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం కూడా ఈసారి బరిలో అభ్యర్థిని దింపింది. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ అది కూడా ముస్లింల మధ్యే జరుగుతోంది. కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానానికి మొత్తం 14 మంది పోటీ పడుతోంటే వారిలో ఎనమండుగురు ముస్లింలే కావడం గమనార్హం. బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ప్రత్యేకమైన ఈ కిషన్‌గంజ్ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలు(బహదూర్‌గంజ్, ఠాకూర్ గంజ్, కిషన్‌గంజ్, కొచదమన్, అమౌర్, బైసీ) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున డాక్టర్ జావేద్, జేడీయూ అభ్యర్థిగా మహ్మద్ అష్రఫ్, ఎంఐఎం నుంచి అక్తరుల్ హక్ ఇమామ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇంత వరకు ఒకే ఒక్కసారి ముస్లిమేతర అభ్యర్థి లఖన్‌లాల్ కపూర్ (1967) గెలిచారు. ఏప్రిల్ 18న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ‘హస్తం’ పట్టు నిలిచేనా? కిషన్‌గంజ్ కాంగ్రెస్ అడ్డాగా పేరొందింది. 1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడుసార్లు విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అస్రరుల్ హక్ బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ జైస్వాల్‌పై లక్షా 94 వేల ఓట్ల రికార్డు ఆధిక్యతతో గెలిచారు. 2009లో కూడా అస్రరుల్ హక్ 90 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు. హక్ గతేడాది డిసెంబర్లో గుండెపోటుతో కన్నుమూయడంతో కాంగ్రెస్ ఈసారి కిషన్‌గంజ్ ఎమ్మెల్యే జావేద్‌కు టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గం సంప్రదాయకంగా తమదే కాబట్టి ఈసారి కూడా తానే గెలుస్తానని కాంగ్రెస్ అభ్యర్థి జావేద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికల విజయాలతో ఉత్తేజం పొందిన పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో సత్తా చాటేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. ఎన్నికల బరిలో ఎంఐఎం ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీకి దిగుతోంది. ఎంఐఎం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అక్తరుల్ ఇమామ్ ఇక్కడ పోటీకి దిగడంతో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. సీమాంచల్ ఒవైసీగా పేరు పొందిన అక్తరుల్ ఇమామ్‌కు నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ముస్లిం పెద్దలుగా పరిగణించే అస్రరుల్ హక్, మహ్మద్ తస్లిముద్దీన్ మరణించడంతో ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఎంఐఎం బరిలో దిగింది. ఇమామ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తస్లిముద్దీన్ ఆయనను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం పోటీ వల్ల ముస్లింల ఓట్లు చీలిపోతాయని అది ఎన్డీఏ (జేడీయూ)కి లాభించే అవకాశం ఉందని స్థానిక ముస్లిం నేతలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధిపైనే జేడీయూ ఆశలు రాష్ట్రీయ జనతాదళ్ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. ఆర్జేడీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మహ్మద్ తస్లిముద్దీన్ గతంలో మూడుసార్లు(1996, 98, 2004) ఇక్కడి నుంచి గెలిచారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో (కిషన్‌గంజ్ నియోజకవర్గం ఈ ప్రాంతంలోనే ఉంది) ఉన్న 30 శాసనసభ సీట్లలో 13 అసెంబ్లీ స్థానాలు జేడీయూ గెలుచుకుంటే ఐదు బీజేపీకి దక్కాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ కాంగ్రెస్‌తో జతకట్టింది. ఇప్పుడది ఎన్డీఏలో ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే నియోజకవర్గంలో మొత్తం మీద ఎన్డీఏకే పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తమ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయాన్నందిస్తాయని జేడీయూ అభ్యర్థి అంటున్నారు. కానరాని సందడి కిషన్‌గంజ్ నియోజకవర్గం ఉన్న సీమాంచల్ ప్రాంతం భూటాన్, నేపాల్, పశ్చిమ బెంగాల్‌కు సరిహద్దులో ఉంది. దేశంలో అతి పేద జిల్లాగా గుర్తింపు పొందిన కిషన్‌గంజ్‌లో నిరుద్యోగం కీలక సమస్య. పట్టా పుచ్చుకున్న చాలామంది ఉద్యోగాల్లేక పొలం పనులు చేసుకుంటున్నారు. ‘మమ్మల్ని బాగుచేసే వారెవరూ లేరు. ఎవరొచ్చినా మా దరిద్రం తీరదు. మాకు ఉద్యోగాలు రావు. ఇక రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు’ అనేది ఇక్కడి సామాన్య జనాభిప్రాయం. అందుకే పోలింగ్ దగ్గర పడుతున్నా నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. -
‘గంజ్’లో జంగ్
అసోంలో కీలక ఆర్థిక, వాణిజ్య కేంద్రం కరీంగంజ్. బ్రిటిష్ పాలకులను ఎదిరించి చరిత్రలో నిలిచిన పోరుగడ్డ. బంగ్లాదేశ్–భారత్ మధ్య వారధిగా పరిగణించే ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) బరిలో నిలిస్తే, అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)తో కలిసి బీజేపీ పోటీకి దిగింది. త్రిపురకు ప్రవేశ ద్వారంగా పరిగణించే కరీంగంజ్ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు (కరీంగంజ్ నార్త్, కరీంగంజ్ సౌత్, కట్లిచెర్ర, పథర్‌కంజి, హయిలకంజి, బదార్పూర్, అల్గపూర్, రతబరి) ఉన్నాయి. ఏఐయూడీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎంపీ రాథేశ్యామ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. స్వరూప్ దాస్ కాంగ్రెస్ నుంచి, కృపానాథ్ మల్ల బీజేపీ కూటమి నుంచి తలపడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్‌దాస్‌కు కూడా నియోజకవర్గంలో పలుకుబడి ఉంది. అయితే, పోటీ ప్రధానంగా కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, బీజేపీ కూటమి మధ్యే ఉండనుంది. మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు. పుంజుకున్న ఏఐయూడీఎఫ్ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు మొత్తం ఓటర్లలో 35 శాతం ఉన్నారు. కరీంగంజ్ సహా ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో వారే నిర్ణయాత్మక శక్తి. సంప్రదాయకంగా వీరంతా కాంగ్రెస్ మద్దతుదారులు. 2005 సెప్టెంబర్‌లో జమాయిత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌ను ప్రారంభించడంతో ముస్లింలంతా అటు వైపు మళ్లారు. దాంతో కాంగ్రెస్ ముస్లింల ఆధిక్యత గల ప్రాంతాల్లో పట్టు కోల్పోయింది. 2009లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌గా పేరు మార్చుకున్న అజ్మల్ పార్టీ రాష్ట్ర ఎన్నికల బరిలో అడుగుపెట్టింది. ఫలితంగా ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఏఐయూడీఎఫ్ తన అభ్యర్థులను పోటీ పెట్టడం బీజేపీకి లాభించింది. క్రమంగా ఏఐ యూడీఎఫ్ బలం పుంజుకుని కాంగ్రెస్, బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా మారింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థి రాధేశ్యామ్ ఘన విజ యం సాధించారు. ఆయన ఏఐయూడీఎఫ్ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరిగింది. నాయకత్వం తీరు రాధేశ్యామ్‌కు నచ్చడం లేదని, దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఏఐయూడీఎఫ్ నుంచే పోటీ చేస్తుండటంతో ఈ వార్తలన్నీ నిరాధారాలని తేలిపోయింది. కాగా, రాథేశ్యామ్‌పై మెజారిటీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. నీటి సమస్యను పరిష్కరిస్తానని, సిల్చార్ నదిపై వంతెన నిర్మించేలా చూస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ తీరుకు నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నియోజకవర్గంలోని డజనుకుపైగా పంచాయతీలు ప్రకటించాయి. దీన్నిబట్టి ఏఐయూడీఎఫ్ విజయం అనుకున్నంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. చేజారిన ఓటు బ్యాంక్ సంప్రదాయకంగా అస్సాం కాంగ్రెస్‌కు కంచుకోట. 2005 వరకు రాష్ట్రంలోని ముస్లింలు ప్రధానంగా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. 1962 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పదిసార్లు ఇక్కడ నెగ్గిందంటే దానికి కారణం ముస్లింల ఓట్లేనని చెప్పవచ్చు. అయితే, 2005లో ఏఐయూడీఎఫ్ ఆవిర్భావంతో కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండిపడింది. 2009 ఎన్నికల్లోæ యూడీఎఫ్ బరిలో దిగడంతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయాయి. మరోవైపు బీజేపీ కూడా గట్టి అభ్యర్థులను పోటీ పెట్టింది. అయినా కూడా కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో గెలిచింది. 2014లో మాత్రం కాంగ్రెస్ ఏఐయూడీఎఫ్ చేతిలో పరాజయం పాలయింది. చేజారిన ముస్లింలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. మరోవైపు తేయాకు కార్మికుల సహాయంతో గట్టెక్కాలని కూడా పథకాలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్‌దాస్ ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకోగలరనేదే విజయావకాశాలను నిర్ధారిస్తుంది. పొత్తుపై బీజేపీ ఆశ కాంగ్రెస్ విముక్త ఈశాన్య భారతం లక్ష్యంగా బీజేపీ అస్సాం గణ పరిషత్, బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే బీజేపీ ఇక్కడ గెలిచింది. ఈ పొత్తుల సాయంతోనే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని వారు మండిపడుతున్నారు. ఒకటి రెండు మంచి పనులు చేపట్టినా అవి పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది. దీన్ని గుర్తించిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో తేయాకు కార్మికుల సామాజిక వర్గానికి చెందిన కృపానాథ్ మల్లను అభ్యర్థిగా ఎంపిక చేసింది. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న తేయాకు కార్మికుల ఓట్లు రాబట్టడమే దీని ఉద్దేశం.అయితే, ఏఐయూడీఎఫ్‌ను ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీ హవా బ్రహ్మాండంగా ఉన్నప్పుడే కరీంగంజ్‌లో ఆ పార్టీ యూడీఎఫ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు జాతీయ రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కమలనాధులు ఎంత వరకు నెగ్గుకు రాగలరో చూడాలి. ప్రధాన పార్టీల సంగతి ఇలా ఉంటే తృణమూల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చందన్ దాస్ కూడా పలుకుబడి ఉన్న వారే. పోటీలో ఉన్న పది మందికిపైగా ఇండిపెండెంటు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చే అవకాశం ఉంది. -
త్రిముఖ పోటీలో నెగ్గేదెవరో చెప్పడం కష్టమే
లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశానికి మంచి ప్రభుత్వం రావాలని బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ ఆశించారు. ముంబైలో మంగళవారం నాడు నిర్వహించిన ఎన్నారై ఆఫ్ ద ఇయర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశానికి ఈరోజు ఎలాంటి ప్రభుత్వం అవసరమో అలాంటిది రావాలని ఆశిద్దామని అన్నారు. 2009 ఎన్నికలలో శేఖర్ సుమన్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు రంగంలో ఉంటాయని, అచ్చం మూడు సినిమాలు ఒకేరోజు విడుదలైతే బాక్సాఫీసు వద్ద ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాగే ఇప్పుడూ ఉంటుందని అన్నారు. ఇలాంటి ఎన్నికలు ఇంతకుముందు ఎన్నడూ జరగలేదని చెప్పారు. ఈసారి నరేంద్ర మోడీ హవా ఉందని అనుకుంటున్నారని, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ హవా కూడా ఉందంటున్నారని, మరోవైపు కాంగ్రెస్ కూడా ఉండటంతో త్రిముఖ పోటీ తప్పకపోవచ్చని తెలిపారు. ఇలాంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది చెప్పడం కష్టమేనని వ్యాఖ్యానించారు.