బరిలో మంత్రి ఇందర్‌జీత్, నటుడు రాజ్ బబ్బర్
గట్టి పోటీ ఇస్తున్న గాయకుడు రాహుల్ యాదవ్
గురుగ్రాం. మిలీనియం సిటీ. దేశ రాజధానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం. బహుళజాతి కంపెనీలకు నిలయం. శనివారం పోలింగ్ జరగనున్న ఈ లోక్‌సభ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, జేజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి రావు ఇందర్‌జీత్ సింగ్, కాంగ్రెస్ నుంచి నటుడు రాజ్ బబ్బర్, జేజేపీ నుంచి హర్యాన్వీ గాయకుడు రాహుల్ యాదవ్ హోరాహోరీ తలపడుతున్నారు...
మిలీనియం సిటీగా పేరొందిన గురుగ్రాంలో ఫార్చ్యూన్ 500 జాబితాలోని 250కి పైగా కంపెనీలున్నాయి. పెప్సికో, నెస్లే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలున్నాయి. ఇంతటి కీలక నగరంలో మౌలిక సదుపాయాల కొరత ప్రధాన సమస్య. వర్షాకాలంలో ఇది కొట్టొచి్చనట్టు కని్పస్తుంటుంది. నీటి ఎద్దడి, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, ట్రాఫిక్ రద్దీ స్థానికులను ఆందోళనపరిచే అంశాల్లో కొన్ని మాత్రమే. గురుగ్రాం లోక్‌సభ స్థానంలో ఏకంగా 25.3 లక్షల మంది ఓటర్లున్నారు. ఓటర్లపరంగా హరియాణాలో ఇదే అతి పెద్ద లోక్‌సభ స్థానం. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఓటర్ ఇన్ క్యూ యాప్, ఓటర్లకు పోలింగ్ ఆహా్వనాలు, బహుళ అంతస్తుల సొసైటీల్లో పోలింగ్ బూత్‌ల ఏర్పాటు వంటివి చేశారు.
ముక్కోణపు పోటీ...
కేంద్ర మంత్రి రావ్ ఇందర్‌జీత్ సింగ్ గురుగ్రాం నుంచి ఐదుసార్లు గెలిచారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు బీజేపీ పట్టణ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకే అహిర్వాల్‌కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కెపె్టన్ అజయ్ సింగ్ యాదవ్‌ను పక్కన పెట్టి రాజ్ బబ్బర్‌కు టికెటిచి్చంది. ఈ స్థానంలో కాంగ్రెస్ యాదవేతర అభ్యర్థిని నిలబెట్టడం ఇదే మొదటిసారి. ఇది హరియాణా కాంగ్రెస్‌లో అసంతృప్తికి కారణమైంది. 2019లో ఓడిన అజయ్ సింగ్ యాదవ్ కూడా బబ్బర్ ఎంపికపై అసంతృప్తితో ఉన్నారు. యాదవ్ ఓట్లను రాబట్టుకునేందుకు జననాయక్ జనతా పార్టీ వ్యూహాత్మకంగా రాపర్ సింగర్ రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్‌పురియాకు టికెటిచి్చంది.
విమర్శల హోరు...
బబ్బర్ అభ్యరి్థత్వాన్ని కాంగ్రెస్ ప్రకటించగానే ఆయనపై ‘ఔట్ సైడర్’ ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. దీన్ని రాజ్ బబ్బర్ గట్టిగానే తిప్పికొడుతున్నారు. దేశ విభజన తరువాత తన కుటుంబం అంబాలాకు చేరుకుందని, గురుగ్రాం, ఫరీదాబాద్‌ల్లో తమ బంధువులున్నారని చెబుతున్నారు. ‘మై బాహారీ నహీ హూ’ అని ప్రతి సభలోనూ ప్రత్యేకంగా చెబుతున్నారు. హరియా ణాకు భారీగా ఆదాయం సమకూరుస్తున్నా గురుగ్రాంలో మౌలిక సదుపాయాలే లేవంటూ బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ నగరంలో జరిగిన అభివృద్ధంతా తన హయాంలో జరిగిందేనని ఇందర్‌జీత్ అంటున్నారు. ఆయన తరఫున కూతురు ఆర్తి సింగ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుకోసమే తాను పోటీ చేస్తున్నానని ఫజిల్‌పురియా చెబుతున్నారు. పక్కా లోకల్ పార్టీ అయిన జేజేపీకే ఓటేయాలన్న ఆయన అభ్యర్థనకు మంచి స్పందనే వస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment