రెండున్నర గంటల సినిమా కోసం నెలల తరబడి కష్టపడుతుంటారు సినీస్టార్స్. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసే కార్మికులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఇలా అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సినిమా విజయవంతంగా నిర్మితమవుతుంది. కొన్నిసార్లు సినిమా చిత్రీకరణలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
అంబాసిడర్ కారులో..
తాజాగా అలాంటి ఓ సంఘటనను బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ పంచుకున్నాడు. 1984లో ఉత్సవ్ సినిమా వచ్చిందిగా.. అప్పుడు జరిగిందీ సంఘటన. నేను, నా భార్యగా నటించిన అనురాధ పటేల్, శశి కపూర్, అతడి కుమారుడు కునాల్ కపూర్.. మేమంతా హడావుడిగా అంబాసిడర్ కారులో బెంగళూరులోని ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నాం.
కారు అద్దాలు ధ్వంసం
ఇంతలో ఓ వ్యక్తి రోడ్డుపై అడ్డంగా రావడంతో మా కారు ఢీ కొట్టింది. ఇది చూసిన గ్రామస్తులు వెంటనే మా కారువైపు పరిగెత్తుకొచ్చారు. కారు అద్దాలు పగలగొట్టారు. శశి కపూర్‌ను కాలర్ పట్టుకుని లాగారు. కునాల్‌ను కొట్టారు. మా వెంట ఉన్న నటుడు రాజేశ్‌ను జుట్టు పట్టుకుని లాగి తల నరికేస్తామని బెదిరించారు.
చెట్టు కింద కూర్చుని చాయ్..
మా కారు ఢీ కొట్టిన వ్యక్తి చెట్టు కింద కూర్చుని చాయ్ తాగుతూ నవ్వుతున్నాడు. అతడు తన భాషలో ఏదేదో మాట్లాడుతున్నాడు. అది మాకేం అర్థం కాలేదు.. కానీ చాలా భయమేసింది. తర్వాత అక్కడినుంచి ఎలాగోలా తప్పించుకున్నాం అని పేర్కొన్నాడు. కాగా శేఖర్ సుమన్ నటించిన తొలి సినిమా ఉత్సవ్. ఈ మూవీలో నురాధ పటేల్‌తో పాటు రేఖ హీరోయిన్‌గా నటించింది.
చదవండి: డబ్బు కోసమే పెళ్లి? వరలక్ష్మి స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment