న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్‌సీఆర్‌ఏ) చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఆక్స్‌ఫాం ఇండియా సంస్థపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కోనున్న రెండో స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫాం. అమన్ బిరదారీ అనే సంస్థపైనా సీబీఐ దర్యాప్తుకు హోం శాఖ గత నెల సిఫార్సు చేయడం తెలిసిందే.
పలు సంస్థలు, ఇతర ఎన్జీవోలకు విదేశీ ‘సాయాన్ని’ ఆక్స్‌ఫాం బదిలీ చేసినట్టు హోం శాఖ గుర్తించింది. అమన్ బిరదారీకీ కొంత మొత్తం పంపిందని సమాచారం.ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు నిధుల బదిలీ, కన్సల్టెన్సీ మార్గంలో తరలింపుకు పాల్పడిందని ఐటీ సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment