oxfam
-
Oxfam Inequality Report 2024: డబ్బు ఉన్నవారు.. లేనివారికి మధ్య ఇంత తేడా..!
ప్రపంచంలో ఆదాయం, సంపదపరంగా తీవ్ర అసమానతలు రాజ్యమేలుతున్నాయని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. దాంతో ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక విధానాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, దిగువ శ్రేణివారి పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన తొలి అయిదుగురి నికర సంపద విలువ, కొవిడ్ మహమ్మారి వ్యాపించిన 2020 తర్వాత రెట్టింపునకు పైగా పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. అదే సమయంలో 500 కోట్లమంది మాత్రం మరింత పేదరికంలోకి వెళ్లారని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ఆక్స్‌ఫామ్ ‘ఇనీక్వాలిటీ ఇంక్.’ పేరుతో రిపోర్ట్ విడుదల చేసింది. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. కంపెనీ లాభాలు పెరిగినా.. ఉద్యోగాల్లో కోత అతిపెద్ద కంపెనీల్లో డెబ్భై శాతం సంస్థల్లో ఒక బిలియనీర్ సీఈఓ ఉన్నారు. ఈ కంపెనీలు 10.2 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నాయి. అంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల జీడీపీల కంటే అధిక సంపద వీరి వద్దే ఉంది. గత మూడేళ్లలో 148 పెద్దకంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను నమోదు చేశాయి. ఏటా సగటున 52 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు లక్షల మంది ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. 500 కోట్ల మంది పేదలు.. ప్రపంచంలోని అగ్రగామి అయిదుగురు ధనవంతులు ఇలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2020 నుంచి 405 బిలియన్ డాలర్ల (రూ.33.61 లక్షల కోట్ల) నుంచి 464 బిలియన్ డాలర్లు (రూ.38.51 లక్షల కోట్లు) పెరిగి 869 బిలియన్ డాలర్ల (రూ.72.12 లక్షల కోట్ల)కు చేరింది. అంటే గంటకు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.116 కోట్ల) చొప్పున వీరు సంపదను పోగేసుకున్నారు. ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 లక్షల కోట్ల డాలర్ల అదనపు సంపదను పోగేసుకున్నారు. ఇదే సమయంలో 500 కోట్ల మంది సామాన్యులు మాత్రం మరింత పేదలయ్యారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచం వీరిలో నుంచి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్ల సంపద)ను చూడడానికి ఒక దశాబ్దం పడుతుంది. పేదరికం మాత్రం మరో 229 ఏళ్లకు గానీ అంతం కాదు. భారీగా తగ్గిన కార్పొరేట్ పన్నులు.. ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉండగా.. తాజాగా అది 23.1 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేని వేతనాలు.. ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ.. సంపద మాత్రం 69 శాతం వీటి దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు. ఇదీ చదవండి: మురికివాడ రూపురేఖలు మార్చనున్న అదానీ..? మహిళల కంటే పురుషుల వద్దే అధికం.. ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు(రూ.8.23 కోట్లు) ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగింతలు అధికం. -
Oxfam: దేశంలో 77శాతం సంపద ఎక్కడుందంటే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత జీడీపీ వృద్ధి ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఒక వైపు మన జీడీపీ పెరుగుతుంటే, మరోవైపు ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం దేశ సంపదలో 77శాతం కేవలం 10శాతం ధనవంతుల చేతిలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో 119 మంది బిలియనీర్లు ఉన్నారు. వారి సంపద గత పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. రోజుకు కనీసం 70 మంది కొత్తగా మిలియనీర్లు అవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు విద్య, వైద్య ఖర్చులు భరించలేక దేశీయంగా ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. ఇండియాలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపైనా సరైన దృష్టి సారించాలి. లేకుంటే, ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయి, దేశ ఆర్థిక పురోగతి దెబ్బతింటుందని నివేదిక చెబుతుంది. -
‘ఆక్స్‌ఫాం’పై దర్యాప్తుకు కేంద్రం సిఫార్సు
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఆక్స్‌ఫాం ఇండియా సంస్థపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కోనున్న రెండో స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫాం. అమన్ బిరదారీ అనే సంస్థపైనా సీబీఐ దర్యాప్తుకు హోం శాఖ గత నెల సిఫార్సు చేయడం తెలిసిందే. పలు సంస్థలు, ఇతర ఎన్జీవోలకు విదేశీ ‘సాయాన్ని’ ఆక్స్‌ఫాం బదిలీ చేసినట్టు హోం శాఖ గుర్తించింది. అమన్ బిరదారీకీ కొంత మొత్తం పంపిందని సమాచారం.ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు నిధుల బదిలీ, కన్సల్టెన్సీ మార్గంలో తరలింపుకు పాల్పడిందని ఐటీ సర్వేలో తేలింది. -
భారత అపర కుబేరుల సంపద.. దిమ్మతిరిగి పోయే వాస్తవాలు
మన దేశంలో ధనికుల సంపద.. దాని గురించి దిమ్మ తిరిగి పోయే వాస్తవాలు ఒక అధ్యయనం వెల్లడించింది. భారత్ లో సంపన్నులు 1 శాతం ఉంటే.. దేశం మొత్తం సంపద లో 40 శాతం వాళ్ళ దగ్గరే ఉంది. ఇక సగం జనాభా దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమే!!.. దావోస్ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్ ఎకనమిక్స్ ఫోరమ్ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోని తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రారంభమైన స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో మనదేశ సంపన్నుల వివరాలు, వారి వద్ద ఉన్న సంపదతో ఏమేమి చేయొచ్చో పొందుపరిచింది. పిల్లలను బడుల్లో చేర్పించవచ్చు టాప్ 100 భారతీయ బిలియనీర్లకు 2.5 శాతం పన్ను విధించడం లేదా టాప్ 10 భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించడం వల్ల పేదరికం కారణంగా చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్పించవచ్చని తెలిపింది. అదాని అవాస్తవిక లాభాలపై ట్యాక్స్ విధిస్తే ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. 128.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో భారత్‌కు చెందిన గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. అయితే అదానీ 2017 నుంచి 2021 వరకు సంపాదించిన అవాస్తవిక లాభాలపై ఒక్కసారి ట్యాక్స్ విధిస్తే 1.79లక్షల కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తాన్ని సంవత్సరానికి ఐదు మిలియన్లకు పైగా భారతీయ ప్రాథమిక పాఠశాల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేందుకు సరిపోతుంది. పోషక ఆహార లోపం తగ్గించొచ్చు పోషకాహార లోపం.. చిక్కిపోయిన (ఐదేండ్లలోపు పిల్లలు) (ఎత్తుకు తగ్గ బరువులేని పిల్లలు), ఎదుగుదలలేని పిల్లలు (వయస్సుకు తగ్గ ఎత్తులేని పిల్లలు) పిల్లల మరణాలు వంటి నాలుగు పారామీటర్స్ ఆధారంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచీ)-2022లో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేయగా భారత్ 107వ స్థానాన్ని దక్కించుకుంది. తాజా ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ నివేదికలో.. భారత్‌లో ఉన్న బిలియనీర్లలో ఒక్కసారి 2శాతం ట్యాక్స్ విధిస్తే రూ.40,423కోట్లను సమీకరించవచ్చు. ఆ మొత్తంతో వచ్చే మూడేళ్లలో దేశ మొత్తంలో పోషక ఆహార లోపంతో బాధపడుతున్న వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించవచ్చు. 1.5 రెట్లు ఎక్కువ భారత్‌లో ఉన్న 10 మంది బిలియనీర్లపై ఒక్కసారి 5శాతం ట్యాక్స్ విధిస్తే రూ.1.37లక్షల కోట్లు సమీకరించవచ్చు. ఆ మొత్తం ఎంతంటే? 2022-23లో కేంద్ర సంక్షేమ పథకాలైన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ (రూ.86,200 కోట్లు), మినిస్ట్రీ ఆఫ్ ఆయిష్ (రూ.3,050 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ. పురుషుడి సంపాదన రూపాయి, మహిళ సంపాదన 63 పైసలు లింగ అసమానతపై నివేదిక ప్రకారం..ఒక పురుషుడు రూపాయి సంపాదిస్తే.. అందులో మహిళ సంపాదించేది 63 పైసలు సంపద రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్లు తమ సంపద 121 శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్ల మేర పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ తెలిపింది. 3శాతం జీఎస్టీ వసూళ్లు మరోవైపు, 2021-22లో దేశ వ్యాప్తంగా మొత్తం రూ. 14.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. ఆ జీఎస్టీ దేశంలోని అట్టడుగు వర్గాల నుంచి 64 శాతం వస్తే, భారత్‌లో ఉన్న టాప్ 10 బిలియనీర్ల నుంచి కేవలం 3శాతం జీఎస్టీ వసూలైంది. పెరిగిపోతున్న బిలియనీర్లు భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 కాగా 2022 నాటికి 166కు పెరిగిందని ఆక్స్‌ఫామ్ తెలిపింది. ఆక్సోఫామ్ ఆధారాలు ఎలా సేకరించిందంటే దేశంలోని సంపద అసమానత, బిలియనీర్ల సంపదను పరిశీలించేందుకు ఫోర్బ్స్,క్రెడిట్ సూయిస్ వంటి దిగ్గజ సంస్థల నివేదికల్ని ఆక్సోఫామ్ సంపాదించింది.అయితే నివేదికలో చేసిన వాదనలను ధృవీకరించడానికి ఎన్ఎస్ఎస్, యూనియన్ బడ్జెట్ పత్రాలు, పార్లమెంటరీ ప్రశ్నలు మొదలైన ప్రభుత్వ నివేదికలు ఉపయోగించింది. చివరిగా::: అవాస్తవిక లాభాలంటే వాణిజ్య భాషలో అవాస్తవిక లాభాలంటే ఉదాహరణకు..రమేష్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ కంపెనీకి చెందిన ఓక్కో స్టాక్‌ను రూ.100 పెట్టి కొనుగోలు చేస్తే.. ఆ స్టాక్ విలువ ప్రస్తుతం రూ.105లకు చేరుతుంది. అలా పెరిగిన రూ.5 అవాస్తవిక లాభాలంటారు. చదవండి👉 చైనాపై అదానీ సెటైర్లు, ‘ఇంట కుమ్ములాటలు.. బయట ఏకాకి!’ -
గుర్తింపులేని పార్టీలపై ఐటీ కన్ను.. దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో దాడులు
న్యూఢిల్లీ: రిజిస్టర్ అయినా గుర్తింపులేని రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఆదాయ పన్ను శాఖ మూకుమ్మడి దాడులు జరిపింది. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లోని 110 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. చట్టవ్యతిరేక మార్గాల్లో పొందిన నిధుల గురించీ దర్యాప్తు కొనసాగుతోంది. నమోదైన గుర్తింపులేని రాజకీయ పార్టీలు పన్ను ఎగివేతకు పాల్పడ్డాయని, వాటి చట్టవ్యతిరేక ఆర్థిక లావాదేవీల గుట్టుమట్లు తేల్చేందుకు కేసులు నమోదుచేసి ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్), ఎక్స్‌ఫామ్ ఇండియా, ఒక మీడియా ఫౌండేషన్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. విదేశీ నిధుల(నియంత్రణ)చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై దాడులు చేశారు. రాజకీయ పార్టీల సారథులు, పార్టీలతో సంబంధమున్న సంస్థల ఆదాయ వనరులు, వ్యయాలపై అధికారులు ఆరాతీస్తున్నారు. నేరుగా తనిఖీచేసినపుడు ఆయా పార్టీలు మనుగడలో లేవని తేలడంతో 198 పార్టీలను ఈసీ ఇటీవల ఆర్‌యూపీపీ జాబితా నుంచి పక్కన పెట్టి ఐటీ శాఖకు సమాచారమిచ్చింది. నగదు విరాళాలు, కార్యాలయాల చిరునామాల అప్‌గ్రేడ్, పదాధికారుల జాబితా ఇవ్వడం, పారదర్శకత పాటించడంలో విఫలమైన 2,100 పార్టీలపై ఈసీ చర్యలు తీసుకుంటోంది. -
Oxfam Report: డబ్బు వెల్లువలా వస్తూనే ఉంది, కానీ..
కరోనా మహమ్మారి కోరలు చాచిన రెండేళ్లలో (2020, 2021) సంవత్సరాల్లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల సంపద రెట్టింపైనట్టు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రకటించింది. Oxfam Davos 2022 నివేదిక ప్రకారం.. అంతకుముందు 14 ఏళ్లలో పెరిగిన దానితో పోలిస్తే కరోనా టైంలోనే ఇది మరింతగా వృద్ధి చెందినట్టు గణాంకాలను విడుదల చేసింది. అదే సమయంలో పేదరికం, అసమానతలు తారాస్థాయికి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేసింది. బిలియనీర్.. బిలియన్ డాలర్, అంతకు మంచి సంపద ఉన్నవాళ్లు. 2021లో భారత్ విషయానికొస్తే బిలియనీర్ల సంపద రెట్టింపునకు పైగా పెరిగింది. అంతేకాదు బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి.. 142 మందికి చేరుకుంది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 40 మంది బిలియనీర్లు చేరారు!. ఈ వివరాలను ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021లో 142 మంది భారత బిలియనీర్ల వద్ద ఉమ్మడిగా ఉన్న సంపద విలువ 719 బిలియన్ డాలర్లు. అంటే.. దాదాపు 53 లక్షల కోట్ల రూపాయలకుపైనే. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద అయితే ఉందో.. 98 మంది సంపన్నుల దగ్గరా అంతే మేర (రూ.49 లక్షల కోట్లు) ఉంది. ►భారత్ లోని టాప్ 10 (విలువ పరంగా) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ పాఠశాల, ఉన్నత విద్యను 25 ఏళ్లపాటు ఉచితంగా అందించొచ్చు. ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది. ►భారత్ లోని టాప్ 98 ధనవంతులపై ఒక్క శాతం సంపద పన్నును వసూలు చేసినా ఆయుష్మాన్ భారత్ పథకానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవచ్చు. ► రెండో వేవ్ ఇన్ఫెక్షన్ టైంలో ఆరోగ్య మౌలిక వసతులు, అంత్యక్రియలు, శ్మశానాలే ప్రధానంగా నడిచాయి. ► భారత్‌లో అర్బన్ అన్ఎంప్లాయిమెంట్ విపరీతంగా పెరిగిందని(కిందటి మేలో 15 శాతం), ఆహార అభద్రత మరింత క్షీణించింది. ► సంపద పునఃపంపిణీ పాలసీలను సమీక్షించాలని గ్లోబల్ ఆక్స్‌ఫామ్ దావోస్ నివేదిక భారత ప్రభుత్వానికి సూచిస్తోంది. ►గౌతమ్ అదానీ.. భారత్‌లో అత్యధికంగా అర్జించిన వ్యక్తిగా ఉన్నారని, ప్రపంచంలోనే ఈయన స్థానం ఐదుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. అదానీ 2021 ఏడాదిలో 42.7 బిలియన్ డాలర్ల సంపదను జత చేసుకున్నట్లు.. మొత్తం 90 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముకేష్ అంబానీ 2021లో 13.3 బిలియన్ డాలర్లు వెనకేసుకోగా.. ఈయన మొత్తం సంపద విలువ 97 బిలియన్డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే.. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ పేజ్, సెర్జీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్, లారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ టాప్ 10 ప్రపంచ సంపన్నులుగా ఆక్స్ ఫామ్ నివేదిక పేర్కొంది. ►ఈ పది మంది అత్యంత సంపన్నులు రోజూ మిలియన్ డాలర్ల చొప్పున (రూ.7.4కోట్లు) ఖర్చు పెట్టుకుంటూ వెళ్లినా, సంపద కరిగిపోయేందుకు 84 ఏళ్లు పడుతుందని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది. ► అసమానతలు కరోనా సమయంలో ఎంతలా విస్తరించాయంటే.. ఆరోగ్య సదుపాయాల్లేక, ఒకవేళ ఉన్నా అవి అందుబాటులోకి రాక రోజూ 21,000 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడుస్తున్నారు. ►కరోనా దెబ్బకు 16 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►స్టాక్ ధరల నుంచి.. క్రిప్టో, కమోడిటీస్ అన్నింటి విలువా పెరుగుతూ వస్తోంది. ►ప్రపంచంలోని 500 మంది ధనికులు 1 ట్రిలియన్ డాలర్ల సంపదను వెనకేసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ చెబుతోంది. -
ఆ 63 మంది సంపద మన బడ్జెట్ కంటే అధికం
దావోస్ : భారత్‌లో 63 మంది బిలియనీర్ల సంపద 2018-19 కేంద్ర బడ్జెట్ (రూ 24.42 లక్షల కోట్లు) కంటే అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. దేశంలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల సంపద 70 శాతం జనాభా 95.3 కోట్ల మంది వద్ద ఉన్న సంపద కంటే నాలుగు రెట్లు అధికమని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కు చెందిన హక్కుల సంస్థ ఆక్స్‌ఫాం నివేదిక వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతోందని ఆర్థిక అసమానతలు ఎంతలా విస్తరించాయో ఆక్స్‌ఫాం కళ్లకు కట్టింది. డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సమావేశానికి ముందు టైమ్ టూ కేర్ పేరుతో ఆక్స్‌ఫాం ఈ నివేదికను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2,153 మంది బిలియనీర్ల సంపద విశ్వవ్యాప్తంగా 60 శాతంగా ఉన్న 460 కోట్ల మంది వద్ద పోగుపడిన సంపద కంటే అధికమని తెలిపింది. దశాబ్ధంలో బిలియనీర్ల సంఖ్య రెట్టింపవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు మరింత పెరగడం ఆందోళనకరమని నివేదిక పేర్కొంది. ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు సరైన విధానపరమైన చర్యలు అవసరమైని, కేవలం కొన్ని ప్రభుత్వాలే దీనికి కట్టుబడిఉన్నాయని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ముఖ్యంగా పేద మహిళలు, చిన్నారుల శ్రమకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని, వారి ప్రయోజనాలను పణంగా పెట్టి సంపన్నులు పైమెట్టుకు చేరుతున్నారని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. టెక్నాలజీ కంపెనీ సీఈవో తీసుకునే వార్షిక వేతనాన్ని ఇంటి పనులు చేసే మహిళా కార్మికురాలు అందుకోవాలంటే ఏకంగా 22,227 సంవత్సరాలు పడుతుందని నివేదిక అంచనా వేసింది. మహిళలు, చిన్నారులు చేస్తున్న పనులకు సరైన వేతనం దక్కడం లేదని పేర్కొంది. పేదరికం, అసమానతలను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను సమీకరించడంలో ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులపై భారీగా పన్నులను వడ్డించడంలో విఫలమవుతున్నాయని తెలిపింది. -
ఒకశాతం కుబేరుల చేతుల్లో 52 శాతం దేశ సంపద!
దావోస్: భారత్‌లో ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నాయని, దీనిని నివారించకపోతే భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని అంతర్జాతీయ హక్కుల సంఘం.. ఆక్స్‌ఫామ్ హెచ్చరించింది. కుబేరుల సంపద అంతకంతకూ పెరిగిపోతుండగా, జనాభాలో సగం మందికి కూడా కనీస అవసరాలు తీరడం లేదని ఈ సంస్థ తాజా నివేదిక పేర్కొంది. ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్–డబ్ల్యూఈఎఫ్) ఆరంభం కావడానికి ముందు ఆక్స్‌ఫామ్ సంస్థకీ నివేదిక విడుదల చేసింది. పేదలు, ధనవంతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోతోందని, దీనిని నివారించే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఈడీ విన్నీ బ్యాన్ఇమా కోరారు. పెరుగుతున్న అసమానతలు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా అశాంతి ప్రబలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ►భారత కుబేరుల సంపద గత ఏడాది రోజుకు రూ.2,200 కోట్లు చొప్పున పెరిగింది. ప్రపంచ కుబేరుల సంపద 12 శాతం లేదా రోజుకు 250 కోట్ల డాలర్ల మేర ఎగసింది. ప్రపంచంలోని పేదల సంపద మాత్రం 11 శాతం క్షీణించింది. ►మన దేశంలోని అత్యంత ఐశ్వర్యవంతుల సంపద 39 శాతం వృద్ధి చెందగా, జనాభాలో సగ భాగం సంపద 3 శాతమే పెరిగింది. ►భారత్‌లో అత్యంత పేదలైన 13.6 కోట్ల మంది(జనాభాలో పది శాతం) 2004 నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయే ఉన్నారు. ►వృద్ధి చెందుతున్న భారత సంపదను కొందరు కుబేరులే అనుభవిస్తున్నారని, కానీ పేదలు ఒక పూట కూడా గడవని, పిల్లలకు మందులు కూడా కొనివ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నా రు. ఇది ఇలాగే కొనసాగితే, భారత సామాజిక, ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుంది. ►భారత జాతీయ సంపదలో 77.4% 10 శాతం అత్యంత ధనికుల చేతుల్లోనే ఉంది. 1% కుబేరుల చేతుల్లోనే 52% జాతీయ సంపద ఉంది. ► జనాభాలోని 60 శాతం మంది చేతిలో కేవలం 4.8 శాతం సంపద మాత్రమే ఉంది. ► 9 మంది అత్యంత సంపన్నుల సంపద దేశ జ నాభాలోని సగం మంది సంపదతో సమానం. ► 2022 నాటికి భారత్‌లో రోజుకు 70 మంది కొత్త కుబేరులు పుట్టుకొస్తారని అంచనా. ►గత ఏడాది కొత్తగా 18 మంది బిలియనీర్లు అవతరించారు. దీంతో భారత్‌లోని బిలియనీర్ల సంఖ్య 119కు పెరిగింది. వీరందరి సంపద తొలిసారిగా గత ఏడాది 40,000 కోట్ల డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు పెరిగింది. ►2017లో 32,550 కోట్లుగా ఉన్న బిలియనీర్ల సంపద గత ఏడాది 44,010 కోట్ల డాలర్లకు పెరిగింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత బిలియనీర్ల సంపద ఒక్క ఏడాది ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ►భారత కేంద్ర ప్రభుత్వం, భారత్‌లోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వైద్య, ప్రజారోగ్యం, పారి శుధ్యం, నీటి సరఫరాల కోసం రూ.2,08,166 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇది భారత అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ సంపద (రూ.2.8 లక్షల కోట్లు) కంటే కూడా తక్కువే. ఇంటిపని @10 లక్షల కోట్ల డాలర్లు ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఇంటిపని విలువ సుమారుగా 10 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని ఓక్స్ఫామ్ తెలిపింది. టర్నోవర్ పరంగా చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ ఆపిల్ టర్నోవర్‌కు ఇది 43 రెట్లు అని ఈ సంస్థ పేర్కొంది. భారత్‌లో గృహిణులు చేసే ఇంటిపని, పిల్లల సంరక్షణ విలువ జడీపీలో 3.1 శాతానికి సమానం. ఇలాంటి పనుల కోసం మహిళలు గ్రామాల్లో ఐదున్నర గంటలు, పట్టణాల్లో ఐదు గంటలు చొప్పున వెచ్చిస్తున్నారు. ఇలాంటి పనుల కోసం పురుషులు మాత్రం ఒక్క అరగంట మాత్రమే కేటాయిస్తున్నారు. ►వేతన వ్యత్యాసం స్త్రీ, పురుషుల మధ్య 34 శాతంగా ఉంది. ►డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ జండర్ గ్యాప్‌ఇండెక్స్‌లో భారత ర్యాంక్ 108గాఉంది. 2006తో పోల్చితే ఇది పది స్థానాలు పడిపోయింది. ►సంపన్న భారతీయుల విషయంలో కూడా స్త్రీలు బాగానే వెనకబడి ఉన్నారు. భారత్‌లో మొత్తం 119 మంది కుబేరులుండగా, వీరిలో స్త్రీల సంఖ్య 10% కూడా లేదు. కేవలం 9 మంది సంపన్న మహిళలే ఉన్నారు. మాంద్యం లేదు.. కానీ.. ప్రపంచ వృద్ధిపై ఐఎంఎఫ్ చీఫ్ లగార్డ్ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ఏమంత ఆశావహంగా లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) వెల్లడించింది. అయితే ప్రస్తుతం తలెత్తిన సమస్యలు తక్షణ మాంద్యాన్ని సూచించడం లేదని ఐఎమ్ఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డే వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వృద్ధి సంబంధిత సమస్యల పరిష్కారానికి విధాన నిర్ణేతలు, ప్రభుత్వాలు సమగ్రమైన, సహకారాత్మకమైన తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరముందని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సదస్సు డబ్ల్యూఈఎఫ్సమావేశంలో మాట్లాడారు. సంస్కరణలకు తగిన సమయం.. వివిధ దేశాలు తమ ప్రభుత్వాల రుణ భారాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లగార్డే సూచించారు. గణాంకాల ఆధారంగా కేంద్రబ్యాంక్‌ల విధానాలు ఉండాలని, ఒడిదుడుకులను తట్టుకునేలా కరెన్సీ మారక విలువలుండాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, లేబర్ మార్కెట్ అంశాల్లో సంస్కరణలకు ఇదే తగిన సమయమని వివరించారు. భారత కంపెనీలే ముందు... నాలుగో పారిశ్రామిక విప్లవం సంబంధిత సమస్యల పరిష్కారంలో ఇతర దేశాల కంపెనీల కంటే భారత కంపెనీలే ముందున్నాయని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ పేర్కొంది. భవిష్యత్తులో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉద్యోగులకు భారత కంపెనీలు తగిన శిక్షణనిస్తున్నాయని ‘డెలాయిట్ రెడీనెస్ రిపోర్ట్’ వెల్లడించింది. అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని 2019 ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రభుత్వం, వ్యాపారం, స్వచ్చంద సేవా సంస్థలు, మీడియా అంశాల పరంగా చూస్తే, అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. భారత్ బ్రాండ్లు మాత్రం అత్యంత స్వల్ప విశ్వసనీయ బ్రాండ్లుగా నిలిచాయి. ప్రతిభలో అంతంత మాత్రమే.. గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్‌లో ఈ ఏడాది భారత్ ఒక స్థానం ఎగబాకి 80వ స్థానానికి చేరింది. ఇన్సీడ్ బిజినెస్ స్కూల్, టాటా కమ్యూనికేషన్స్, ఏడెక్కో గ్రూప్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగింది. చైనా పాత్రను భర్తీ చేసేది మనమే... ప్రపంచ ఆర్థిక వృద్ధిలో చైనా పాత్రను భర్తీ చేయగలిగే సత్తా భవిష్యత్తులో భారత్‌కు ఉందని స్పైస్‌జెట్ సీఈఓ అజయ్ సింగ్ చెప్పారు. భారత్‌లో అధికారంలో ఎవరు ఉన్నా, ఆర్థిక విధానాలపై ఏకాభిప్రాయం ఉంటుందని, వృద్ధి జోరు కొనసాగుతుందని, భారత్‌కు ఉన్న వినూత్నమైన ప్రయోజనం ఇదేనని పేర్కొన్నారు. వృద్ధి జోరు కొనసాగుతుందని డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో చెప్పారు. -
చారిటీలో సెక్స్ స్కాండల్.. నటి గుడ్‌బై!
లండన్: ప్రముఖ చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్ రాయబారిగా తప్పుకుంటున్నట్టు తాజాగా బ్రిటిష్ నటి మిన్నీ డ్రైవర్ వెల్లడించారు. తాజాగా ఆక్స్‌ఫామ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సెక్స్ స్కాండల్‌లో ప్రమేయమున్నట్టు తాజాగా వెలుగుచూడటం దుమారం రేపుతోంది. 2010లో హైతీలో భూకంపం వచ్చిన నేపథ్యంలో అక్కడ బాధితులకు సహాయం చేసేందుకు వెళ్లిన ఆక్స్‌ఫామ్ సీనియర్ సిబ్బంది.. విరాళాల సొమ్మును వ్యభిచారిణులపై తగిలేసినట్టు తాజాగా వెలుగుచూసింది. దీనిపై సంస్థ రాయబారిగా ఉన్న మిన్నీ తీవ్రంగా స్పందించారు. ఈ సెక్స్ స్కాండల్ ఆరోపణలు తనను కకావికలం చేశాయని, తనకు తొమ్మిదేళ్ల వయస్సు నుంచి ఈ స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నానని, సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తులే మహిళలను వాడుకున్నారని తెలియడం కలిచివేస్తోందని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆక్స్‌ఫామ్ ప్రతినిధి తెలిపారు. హైతీలో భూకంప బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన సీనియర్ ఎయిడ్ వర్కర్స్ వేశ్యలతో గడిపారని, ఈ విషయాన్ని గుట్టుగా ఉంచేందుకు ఆక్స్‌ఫామ్ సంస్థ ప్రయత్నించిందని తాజాగా వెలుగుచూసింది. అంతేకాకుండా సౌత్ సూడాన్‌లోనూ లైంగిక దాడుల విషయంలో సంస్థ సరిగ్గా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. -
కనీవినీ ఎరుగని సంపద ఆయన సొంతం కానుందట!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (61) సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనున్నారు. తాజా పరిశోధన ప్రకారం రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా ఆయన నిలవనున్నారు. అప్రతిహతంగా పెరుగుతున్న ఆయన సంపద ఆయన్ని అగ్రస్థానంలో నిలబెడుతుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఆక్స్ ఫామ్ పరిశోధనలో తేలింది. 915. 6 బిలియన్ డాలర్ల ఆదాయంతో 2042 నాటికి ప్రపంచంలో మొట్టమొదటి కుబేరుడుగా నిలవనున్నాడు. స్వచ్ఛంద సంస్థలకు, బిల్ మెలిండా ఫౌండేషన్ కు భూరి విరాళాలుగా ఇస్తున్నా కూడా ఆయన ప్రపంచ అత్యంత ధనికుడిగా నిలవబోతున్నారని అంచనా వేసింది. ఆయన ఆదాయ వృద్ధి ఇలాగే కొనసాగితే.. ఇంకా పెద్దమొత్తంలో దానాలు చేయకుండా వుంటే ఆయనకు 86 ఏళ్లు వచ్చేటప్పటికీ కనీవినీ ఎరుగని సందప ఆయన సొంతం కానుందని వ్యాఖ్యానించింది. ఆక్స్ ఫామ్ అంచనాల ప్రకారం ప్రపంచంలో తరువాతి 25 సంవత్సరాల్లో బిల్ గేట్స్ ట్రిలియనీర్ గా అవతరించన్నారని పేర్కొంది. గేట్స్ 2006 లో మైక్రోసాఫ్ట్ కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేనాటికి అతని నికర ఆస్తి విలువ 50 బిలియన్లు డాలర్లుగా ఉందని తెలిపింది. 2009 నుంచి 11 శాతం వృద్ధి చెందుతుందన్న సంపద 2016 నాటికి ఆ సంపద 75 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని ఆక్స్ ఫామ్ లెక్కలు వేసింది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం బిల్ గేట్స్ ప్రస్తుత నికర ఆదాయం విలువ 84 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు ప్రపంచంలోని మొత్తం సంపదలో సగభాగం కేవలం ఎనిమిది మంది కుబేరుల చేతుల్లోనే ఉందని ఆక్స్ ఫామ్ ఇటీవల తేల్చింది. 360 కోట్ల జనాల(ప్రపంచ జనాభాలో సగం)సంపద కలిపితే ఎంత పరిమాణం ఉంటుందో అంత సంపద ఆ ఎనిమిది మంది సొంతమని ఓ రిపోర్ట్ లో చెప్పింది. మార్చి 2016 లో ప్రచురితమైన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం, వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇండిటెక్స్ స్థాపకుడు అమానికో ఒర్టెగా, కార్లోస్ స్లిమ్, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ అధిపతి మార్క్ జకర్బర్గ్, మాజీ న్యూ యార్క్ నగర మేయర్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ ఒరాకిల్ లారీ ఎల్లిసన్ అత్యంత ధనికులుగా నిలిచిన సంగతి తెలిసిందే.