కనీవినీ ఎరుగని సంపద ఆయన సొంతం కానుందట! | Bill Gates could be the world's first trillionaire by 2042 | Sakshi
Sakshi News home page

కనీవినీ ఎరుగని సంపద ఆయన సొంతం కానుందట!

Published Wed, Jan 25 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

కనీవినీ ఎరుగని సంపద ఆయన సొంతం కానుందట!

కనీవినీ ఎరుగని సంపద ఆయన సొంతం కానుందట!

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (61) సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనున్నారు.  తాజా పరిశోధన ప్రకారం రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా  ఆయన  నిలవనున్నారు.   అప్రతిహతంగా పెరుగుతున్న ఆయన సంపద ఆయన్ని అగ్రస్థానంలో నిలబెడుతుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఆక్స్ ఫామ్ పరిశోధనలో  తేలింది.  915. 6 బిలియన్  డాలర్ల ఆదాయంతో  2042 నాటికి ప్రపంచంలో మొట్టమొదటి  కుబేరుడుగా నిలవనున్నాడు. స్వచ్ఛంద సంస్థలకు,  బిల్‌ మెలిండా ఫౌండేషన్ కు భూరి విరాళాలుగా ఇస్తున్నా కూడా ఆయన  ప్రపంచ అత్యంత ధనికుడిగా  నిలవబోతున్నారని  అంచనా వేసింది.  ఆయన ఆదాయ వృద్ధి ఇలాగే కొనసాగితే.. ఇంకా పెద్దమొత్తంలో దానాలు చేయకుండా వుంటే ఆయనకు 86 ఏళ్లు వచ్చేటప్పటికీ కనీవినీ ఎరుగని సందప ఆయన సొంతం  కానుందని వ్యాఖ్యానించింది.

ఆక్స్ ఫామ్ అంచనాల ప్రకారం  ప్రపంచంలో తరువాతి 25 సంవత్సరాల్లో  బిల్ గేట్స్  ట్రిలియనీర్ గా  అవతరించన్నారని పేర్కొంది.  గేట్స్ 2006 లో మైక్రోసాఫ్ట్ కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేనాటికి అతని నికర ఆస్తి విలువ  50 బిలియన్లు డాలర్లుగా ఉందని తెలిపింది.  2009 నుంచి  11 శాతం వృద్ధి చెందుతుందన్న  సంపద 2016 నాటికి ఆ సంపద 75  ట్రిలియన్  డాలర్లకు పెరిగిందని ఆక్స్ ఫామ్ లెక్కలు వేసింది.    ఫోర్బ్స్  అంచనా  ప్రకారం బిల్ గేట్స్   ప్రస్తుత  నికర ఆదాయం విలువ 84 బిలియన్ డాలర్లుగా ఉంది.


మరోవైపు ప్రపంచంలోని మొత్తం సంపదలో సగభాగం కేవలం ఎనిమిది మంది కుబేరుల చేతుల్లోనే ఉందని  ఆక్స్ ఫామ్ ఇటీవల తేల్చింది.  360 కోట్ల జనాల(ప్రపంచ జనాభాలో సగం)సంపద కలిపితే ఎంత పరిమాణం ఉంటుందో  అంత సంపద ఆ ఎనిమిది మంది  సొంతమని ఓ రిపోర్ట్ లో  చెప్పింది.

మార్చి 2016 లో ప్రచురితమైన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం, వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇండిటెక్స్ స్థాపకుడు అమానికో ఒర్టెగా, కార్లోస్ స్లిమ్, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ అధిపతి మార్క్ జకర్బర్గ్, మాజీ న్యూ యార్క్  నగర మేయర్ మైఖేల్ బ్లూమ్బెర్గ్ ఒరాకిల్ లారీ ఎల్లిసన్ అత్యంత ధనికులుగా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement