could
-
పెట్రోల్ షాకింగ్ ప్రైస్: లీ. రూ.30 దిగువకు
-
పెట్రోల్ షాకింగ్ ప్రైస్: లీ. రూ.30 దిగువకు
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలకు సంబంధించిన షాకింగ్ అంచనాలు వెలువడ్డాయి. రాబోయే అయిదేళ్లలో లీటర్ పెట్రోల్ ధర రూ.30 ల కంటే దిగువకు పతనం కానుందట. అమెరికన్ ఫ్యూచరిస్ట్ టోనీ సెబా ప్రకారం ఐదు సంవత్సరాలకు లీటరు పెట్రోల్ రూ. 30 కంటే తక్కువకే కొనుగోలు చేయొచ్చని తెలుస్తోంది. సోలార్ పవర్ కు భారీగా డిమాండ్ పుంజుకోనుందని అంచనావేసిన సెబా తాజాగా చమురు ధరలపై తన అంచనాలను వెల్లడించా రు. ప్రపంచ ప్రస్తుత టెక్నాలజీ పెట్రోలుపై ఆధారపడటాన్ని తగ్గించనుందని తెలిపారు. సెబా ప్రకారం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కారణంగా చమురు డిమాండ్ గణనీయంగా పతనం కానుంది. ముఖ్యంగా చమురు బ్యారెల్ ధర త్వరలోనే 25 డాలర్లకు దిగిరానుంది. ఇది 2020 నాటికి చమురు గిరాకీ 100 మిలియన్ బారెల్స్‌కు, పది సంవత్సరాలలో 70 మిలియన్ బారెల్స్ పడిపోతుందని సెబా అంచనా. పాతకార్లు వినియోగంలోకి ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారీగా పెరగనుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించడంతో పాటు, ఈ వాహనాల ధరలు కూడా బాగా దిగిరానున్నాయని సెబా చెబుతున్నారు. అలాగే 2030నాటికి 95శాతం ప్రజలు ప్రయివేటు వాహనాలను స్వస్తి చెబుతారని, దీంతో ఆటో మొబైల్ పరిశ్రమ తుడిచుపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు విద్యుత్తు వాహనాల రాకతో ప్రపంచ ఆయిల్ పరిశ్రమ కుదేలవుతుందని అంచనావేశారు. కాగా సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకుడు, స్టాన్‌ఫర్డ్ కాంటినెనింగ్ స్టడీస్ ప్రోగ్రాంలో డిస్ప్ప్షన్ అండ్ క్లీన్ ఎనర్జీలో బోధకుడుగా ఉన్నారు సెబా. సౌర శక్తి మీద సేబా ఊహ నిజం కావడంతో చమురు ధరల భవిష్యత్తు పై అంచనాలు కూడా నిజంకావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ అంచనాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ ఇటీవలి వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. 2030 నాటికి భారతదేశం లో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయని ప్రకటించారు. అలాగే 15 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారు విక్రయించబడదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. -
కనీవినీ ఎరుగని సంపద ఆయన సొంతం కానుందట!
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (61) సరికొత్త అధ్యాయాన్ని సృష్టించనున్నారు. తాజా పరిశోధన ప్రకారం రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ గా ఆయన నిలవనున్నారు. అప్రతిహతంగా పెరుగుతున్న ఆయన సంపద ఆయన్ని అగ్రస్థానంలో నిలబెడుతుందని అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఆక్స్ ఫామ్ పరిశోధనలో తేలింది. 915. 6 బిలియన్ డాలర్ల ఆదాయంతో 2042 నాటికి ప్రపంచంలో మొట్టమొదటి కుబేరుడుగా నిలవనున్నాడు. స్వచ్ఛంద సంస్థలకు, బిల్ మెలిండా ఫౌండేషన్ కు భూరి విరాళాలుగా ఇస్తున్నా కూడా ఆయన ప్రపంచ అత్యంత ధనికుడిగా నిలవబోతున్నారని అంచనా వేసింది. ఆయన ఆదాయ వృద్ధి ఇలాగే కొనసాగితే.. ఇంకా పెద్దమొత్తంలో దానాలు చేయకుండా వుంటే ఆయనకు 86 ఏళ్లు వచ్చేటప్పటికీ కనీవినీ ఎరుగని సందప ఆయన సొంతం కానుందని వ్యాఖ్యానించింది. ఆక్స్ ఫామ్ అంచనాల ప్రకారం ప్రపంచంలో తరువాతి 25 సంవత్సరాల్లో బిల్ గేట్స్ ట్రిలియనీర్ గా అవతరించన్నారని పేర్కొంది. గేట్స్ 2006 లో మైక్రోసాఫ్ట్ కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేనాటికి అతని నికర ఆస్తి విలువ 50 బిలియన్లు డాలర్లుగా ఉందని తెలిపింది. 2009 నుంచి 11 శాతం వృద్ధి చెందుతుందన్న సంపద 2016 నాటికి ఆ సంపద 75 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని ఆక్స్ ఫామ్ లెక్కలు వేసింది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం బిల్ గేట్స్ ప్రస్తుత నికర ఆదాయం విలువ 84 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు ప్రపంచంలోని మొత్తం సంపదలో సగభాగం కేవలం ఎనిమిది మంది కుబేరుల చేతుల్లోనే ఉందని ఆక్స్ ఫామ్ ఇటీవల తేల్చింది. 360 కోట్ల జనాల(ప్రపంచ జనాభాలో సగం)సంపద కలిపితే ఎంత పరిమాణం ఉంటుందో అంత సంపద ఆ ఎనిమిది మంది సొంతమని ఓ రిపోర్ట్ లో చెప్పింది. మార్చి 2016 లో ప్రచురితమైన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం, వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇండిటెక్స్ స్థాపకుడు అమానికో ఒర్టెగా, కార్లోస్ స్లిమ్, అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ అధిపతి మార్క్ జకర్బర్గ్, మాజీ న్యూ యార్క్ నగర మేయర్ మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ ఒరాకిల్ లారీ ఎల్లిసన్ అత్యంత ధనికులుగా నిలిచిన సంగతి తెలిసిందే. -
ఇక డయాలసిస్ కష్టాలు తీరినట్టేనా?
వాషింగ్టన్: కిడ్నీలు పూర్తిగా చెడిపోయి.. డయాలసిస్ చికిత్సపై ఆధారపడి జీవించే రోగులకు ఇక ఆ కష్టాలు తీరినట్టే. ఇలాంటి వారికోసం ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు పరిశోధకులు. తీవ్రమైన కిడ్నీవ్యాధితో బాధపడుతూ..రక్తశుద్ధి కోసం డయాలసిస్ చేయించుకునే పేషంట్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. వీటికి తోడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేమీకాదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫూడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక కృత్రిమ కిడ్నీని రూపొందించింది. ప్రామాణిక డయాలసిస్ చికిత్సా పద్ధతికి స్వస్తి చెపుతూ నూతన సాంకేతిక పద్ధతితో ఆర్టిఫిషీయల్ కిడ్నీని తయారు చేశారు. కన్వెన్షనల్ డయాలసిస్ లో మిషీన్ నడుస్తున్నంత సేపు ..పేషెంట్ మంచానికి పరిమితమై ఉండాలి... రకాల రకాల ట్యూబులతో రోగి శరీరానికి అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రక్రియ మొత్తం ఒక రోజంతా నడుస్తుంది. కానీ ఈ ధరించడానికి వీలుగా రూపొందించిన ఈ కృత్రిమ కిడ్నీ మూలంగా....పేషెంట్ ఫ్రీగా తిరగొచ్చనీ, ట్యూబుల బాధ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. డయాలసిస్ సెషన్స్ ను తగ్గించవచ్చని, దీని ద్వారా అదనపు చికిత్స ప్రయోజనాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఆహారం ఆంక్షలు లేకపోవడంతోపాటూ చికిత్స సమయంలో బాధల్నీ,తీవ్రమైన దుష్ప్రభావాలను నిరోధించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ కృత్రిమ పరికరంద్వారా వ్యర్థ ఉత్పత్తులను, అదనపు నీరు, ఉప్పు లను సమర్ధవంతంగా తొలగించగలదని చెప్పారు. యూరియా, క్రియాటినిన్ మరియు భాస్వరం తదితర వ్యర్థాలను సాధారణం మూత్రపిండాల్లోలాగానే ఫిల్టర్ చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. లాస్ ఏంజిల్స్ లో సేడార్-సినై మెడికల్ సెంటర్ కు చెందిన విక్టర్ గురా దీన్ని ఆవిష్కరించారు. ధరించగలిగిన కృత్రిమ కిడ్నీ నమూనా పరికరాన్ని సీటెల్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ లో రోగులపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగ ఫలితాలను జేసీఐ ఇన్సైట్స్ జర్నల్ లో ప్రచురించారు. ఈ తరహాలో వేరియబుల్ ఆర్టీఫిషియల్ కిడ్నీ ఆవిష్కరణ, దీని ప్రయోగ ఫలితాలు మరింత నూతన డయాలసిస్ టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.