Foreign Funding
-
గోవాలో హై డిమాండ్ వేటికంటే..
పర్యాటక రంగంలో వృద్ధికి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అధిక నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు (HNI), విదేశీ పెట్టుబడిదారులకు గోవా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆసక్తిగా కనిపిస్తోంది. హాలిడే హోమ్‌లు, స్టేయింగ్ రూమ్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. అధిక అద్దె రాబడి, స్థిరమైన జీవనం సాగించేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు, డెవలపర్ల ప్రకారం గోవాలోని బ్రాండెడ్ హోటళ్లు, రెంటల్ విల్లాలు పీక్ సీజన్లో పూర్తిగా బుక్ అవుతున్నాయి. ఈ కేటగిరీల్లో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని కొనుగోలు దారులు భావిస్తున్నారు. సుస్థిర జీవనానికి ప్రాధాన్యమిచ్చే హెచ్ఎన్ఐలకు గోవా(Goa Realty)లోని పర్యావరణ అనుకూల గేటెడ్ కమ్యూనిటీలు ఆకర్షణీయంగా తోస్తున్నాయి.అంజునా, అర్పోరా, బగా, కలంగుటే, కాండోలిమ్, వాగ్తోర్ వంటి ప్రాంతాలతో సహా గోవా నార్త్ బీచ్ పోర్చుగీస్ పరిసరాలు, ప్రసిద్ధ రెస్టారెంట్లు, హోటళ్లు, బీచ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్విదేశీ పెట్టుబడిదారులు(foreign funds) తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యంగా విస్తరించడానికి గోవాలోని నాణ్యమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు అద్దె ఆదాయాన్ని సృష్టించడానికి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ఓ విదేశీ సంస్థ గోవాలోని ప్రతిష్టాత్మక హోటల్‌ను కొనుగోలు చేసే చివరి దశలో ఉంది. యాక్సిస్ ఈకార్ప్ సీఈఓ ఆదిత్య కుష్వాహా మాట్లాడుతూ..‘దేశీయ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆకర్షణ గోవా రియల్టీ వ్యాపారం మరింత మెరుగుపడేలా చేస్తోంది. స్థిరంగా అద్దె వస్తుండడంతో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని తెలిపారు. -
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
న్యూఢిల్లీ: 2014 నుంచి 2022 కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందినట్లు దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం హోంమంత్రిత్వశాఖకు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA), ప్రజా ప్రాతినిధ్య చట్టం(RPA), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) నిబంధనలను ఆప్ ఉల్లంఘించించి.. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ కెనడా సహా వివిధ దేశాల్లో ఉన్న దాతల నుంచి ఆప్ ఈ మొత్తాన్ని స్వీకరించినట్లు ఈడీ వెల్లడించింది. అయితే విదేశీ దాతల వివరాలతోపాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఈప్ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. దాతల వివరాలను తప్పుగా ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు పేర్కొంది. ఆప్, పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తన దర్యాప్తుల్లో వెల్లడైందని ఆప్ తెలిపింది. అంతేగాక 2016లో కెనాడాలో నిధుల సేకరణ కార్యక్రమంలో సేకరించిన నిధులను, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌తో సహా పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది. అనికేత్ సక్సేనా (ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్), కుమార్ విశ్వాస్ (ఒకప్పటి ఆప్ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్), కపిల్ భరద్వాజ్ (అప్పటి ఆప్ సభ్యుడు), దుర్గేష్‌తో సహా వివిధ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఇ-మెయిల్‌లలోని విషయాల ద్వారా ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. -
ఎఫ్‌పీఐల భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ ఇటువైపు చూస్తున్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్ చేశారు. డెట్ మార్కెట్లో రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. మొత్తం మీద భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 3.4 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. 2020–21లో ఏకంగా రూ. 2.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఆ మరుసటి సంవత్సరం రూ. 1.4 లక్షల కోట్లు, ఆ తర్వాత 2022–23లో రూ. 37,632 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 2023–24లో భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సానుకూలంగా కొత్త ఏడాది.. కొత్త ఆర్థిక సంవత్సరంపై కూడా అంచనాలు కాస్త సానుకూలంగానే ఉన్నాయని భారత్‌లో మజార్స్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ భరత్ ధావన్ తెలిపారు. పురోగామి పాలసీ సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాల కారణంగా దేశంలోని ఎఫ్‌పీఐల ప్రవాహం స్థిరంగా కొనసాగవచ్చని పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అంశాల కారణంగా మధ్యమధ్యలో ఒడిదుడుకులు ఉండవచ్చన్నారు. -
‘ఆక్స్‌ఫాం’పై దర్యాప్తుకు కేంద్రం సిఫార్సు
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఆక్స్‌ఫాం ఇండియా సంస్థపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కోనున్న రెండో స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫాం. అమన్ బిరదారీ అనే సంస్థపైనా సీబీఐ దర్యాప్తుకు హోం శాఖ గత నెల సిఫార్సు చేయడం తెలిసిందే. పలు సంస్థలు, ఇతర ఎన్జీవోలకు విదేశీ ‘సాయాన్ని’ ఆక్స్‌ఫాం బదిలీ చేసినట్టు హోం శాఖ గుర్తించింది. అమన్ బిరదారీకీ కొంత మొత్తం పంపిందని సమాచారం.ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు నిధుల బదిలీ, కన్సల్టెన్సీ మార్గంలో తరలింపుకు పాల్పడిందని ఐటీ సర్వేలో తేలింది. -
అమృత్‌పాల్‌కు ఐఎస్ఐ లింకులు!
చండీగఢ్: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్‌పాల్‌సింగ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్ సింగ్ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) ఏర్పాటుకు దల్జీత్ ప్రయత్నిస్తున్నట్లు తేలింది. మరోవైపు అమృత్‌పాల్ దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా ఉండగా అతనికి ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు. ‘‘భారత్‌లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్ పెడ్లర్ల మద్దతుంది. అమృత్‌పాల్ వాడే మెర్సిడెజ్ కారు రావెల్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్‌దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్‌ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు. ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్‌పాల్ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్ సింగ్ సహా ఐదుగురు ఆదివారం అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు పెట్టారు. భారత కాన్సులేట్‌పై దాడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తానీ అనుకూలవాదులు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆవరణలో ఖలిస్తానీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బ్రిటన్‌లో లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీవాదులు తొలగించిన ఘటనపై కేంద్రం తీవ్ర నిరసన తెలిపింది. -
మూడేళ్లలో రూ.2,430 కోట్లు
న్యూఢిల్లీ: గత మూడేళ్లకాలంలో భారతీయ ఎన్జీవో సంస్థలు విదేశాల నుంచి విరాళాల రూపంలో రూ.2,430.80 కోట్లను స్వీకరించాయని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు చెప్పారు. 2019–20లో రూ.727.1 కోట్లు, 2020–21కాలంలో రూ.798.1 కోట్లు, 2021–22కాలంలో రూ.905.5 కోట్ల విరాళాలు పొందాయని పేర్కొన్నారు. ఈ నెల పదోతేదీ నాటికి దేశవ్యాప్తంగా 16,383 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 15వేల సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికలను సమర్పించాయి. కొన్ని సంస్థల నిధుల దుర్వినియోగం/ నిధుల మళ్లింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో చర్యల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. -
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి విదేశీ నిధుల లైసెన్స్‌ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్(ఆర్జీఎఫ్)కి ఉన్న విదేశీ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్‌ని కేంద్రం రద్దు చేసింది. ఇది గాంధీ కుటుంబాలకు చెందిన ప్రభుత్వేతర సంస్థ. ఐతే ఈ సంస్థ విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించిందని, అందువల్ల ఈ లైసెన్స్‌ని రద్దు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూలై 2020లో ఎంహెచ్ఏ దీనిపై ఒక కమిటి నియమించి, వారి ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేగాదు లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్జీఈఎఫ్ కార్యాలయానికి నోటీసులు జారీ చేశామని కూడా తెలిపింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఫౌండేషన్‌కి చైర్ పర్సన్ కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంట్ సభ్యులు రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు ట్రస్ట్ సభ్యులు. ఈ ఫౌండేషన్‌ని 1991లో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫౌండేషన్ 1991 నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు మద్దతుతో సహా అనేక క్లిష్టమైన సమస్యలపై పనిచేసింది. పైగా విద్యా రంగానికి సంబంధించి పలు సేవలు అందించింది. (చదవండి: తెలంగాణలోకి రాహుల్ యాత్ర.. జోడో యాత్ర ఇలా కొనసాగుతుంది..) -
పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షమి, హమీద్ జమాన్, సైఫ్ నియాజీని శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు. ఇమ్రాన్‌పై కేసు పెట్టాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా సంబంధిత అధికారులను ఆదేశించారని ఆ దేశ మీడియా తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. అనధికారికంగా వెబ్సైట్ నిర్వహిస్తూ విదేశాల నుంచి నిధుల సమకూర్చుకున్నారనే ఆరోపణలతో మొదట పీటీఐ నేత సైఫుల్లా నియాజిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైం విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత కాసేపటికే మరికొంతమంది నేతలను అరెస్టు చేసింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు! -
స్వచ్ఛంద సంస్థల్లో రూ. 49 వేల కోట్ల విదేశీ నిధులు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 18 వేలకు పైగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) కలసి మూడేళ్లలో రూ. 49 వేల కోట్లుకు పైగా విదేశీ నిధుల్ని పొందాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2017–18లో రూ. 16,940.58 కోట్లు, 2018–19లో రూ. 16,525.73 కోట్లు, 2019–20లో రూ. 15,853.94 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ భాగ స్వామ్య నియంత్రణ సవరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)–2020 చట్టానికి ముందు ఎఫ్సీఆర్ఏ ఖాతాలను ఐచ్ఛికంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. అయితే సవరణ చట్టం వచ్చాక దగ్గర్లో ఉన్న ఎస్బీఐలో ఎఫ్సీఆర్ఏ ఖాతా తెరవడాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. 2021 జూలై 31న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ప్రకారం మొత్తం 18,377 గుర్తింపు పొందిన ఎఫ్సీఆర్ఏ ఖాతాలు ఉన్నాయి. పోలీస్ కస్టడీలో 348 మంది మృతి.. గత మూడేళ్లలో పోలీసుల కస్టడీలో 348 మంది వ్యక్తులు మరణించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. మరో 5,221 మంది జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మరణించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలవారీగా చూస్తే 2018–20 మధ్య ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ కస్టడీలో 23, జ్యుడీషియల్ కస్టడీలో 1,295 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో పోలీస్ కస్టడీలో 34, జ్యుడీషియల్ కస్టడీలో 407 మంది మరణించారు. పశ్చిమబెంగాల్లో పోలీస్ కస్టడీలో 27, జ్యుడీషియల్ కస్టడీలో 370 మంది మరణించారు. -
గోల్డెన్ టెంపుల్‌కు విదేశీ నిధులు: అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు విదేశీ నిధులను అనుమతించడంపై హోం మంత్రి అమిత్‌షా స్పందిచారు. విదేశీ సహకార (రెగ్యులేషన్) చట్టం, 2010పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్‌షా అన్నారు. ఇది సిక్కు సమాజ అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి తెలియజేస్తుంది’ అని తెలిపారు. ‘శ్రీ హర్మందిర్ సాహిబ్ వద్ద విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం, 2010పై ఒక మార్గదర్శకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది మన సిక్కు సోదరీమణుల అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి ప్రదర్శిస్తుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘శ్రీ దర్బార్ సాహిబ్ ఆశీర్వాదం మనకు బలాన్ని ఇస్తుంది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సంగత్ సేవ చేయలేకపోయింది. శ్రీ హర్ మందిర్ సాహిబ్‌కు ఎఫ్సీఆర్ఏను అనుమతిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంగత్, శ్రీ దర్బార్ సాహిబ్ల సేవ బంధాన్ని మరింత పటిష్టం చేసిన క్షణం’ అని అమిత్‌షా తన క్యాప్షన్‌లో జోడించారు. ਸੇਵਕ ਕਉ ਸੇਵਾ ਬਨਿ ਆਈ ॥ PM @narendramodi ji is blessed that Wahe Guru ji has taken Seva from him. The decision on FCRA at the Sri Harmandir Sahib is a pathbreaking one which will once again showcase the outstanding spirit of service of our Sikh sisters and brothers. — Amit Shah (@AmitShah) September 10, 2020 పంజాబ్‌లోని సచ్‌ఖండ్ శ్రీ హర్మాందిర్ సాహిబ్-దర్బార్ సాహిబ్‌కు 2010లో విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం కింద ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇది సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశీ నిధులును సేకరించడానికి వీలు కల్పిస్తుంది. కొంత మంది వ్యక్తులు లేదా సంఘాలు విదేశీ సహకారం పొందటానికి, విదేశీ నిధుల వినియోగాన్ని నియంత్రించడానికి విదేశీ సహకార చట్టాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించింది. విదేశీ నిధులను పక్కదోవ పట్టించడానికి చెక్ పెట్టేందుకు 2010లో ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని పార్లమెంట్ అమలు చేసింది. చదవండి: కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు -
తబ్లీగ్ జమాత్ చీఫ్‌పై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: తబ్లీగ్ జమాత్ చీఫ్, నిజాముద్దీన్ మర్కజ్‌కు చెందిన మౌలానా సాద్‌కు హవాలా మార్గంలో విదేశాల నుంచి వచ్చిన విరాళాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొనసాగిస్తోంది. నిజాముద్దీన్‌లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన మౌలానా సాద్ పై ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం హవాలా మార్గంలో మౌలానాకు విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేసింది. దీంతో తాజాగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు, ఈడీ, ఐటీ విభాగాల నుంచి మౌలానాకు అందిన విదేశీ విరాళాలపై సమాచారాన్ని సేకరించారు. తబ్లీగ్ జమాత్ విదేశీ విరాళాల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న మౌలానా సన్నిహితుడైన ముర్సలీన్‌ను మే 16న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. చదవండి: 82 మంది విదేశీయులపై చార్జీషీటు దాఖలు జమాత్ ట్రస్టుకు విదేశీ విరాళాలు హవాలా మార్గంలో స్వీకరించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలడంతో సీబీఐ రంగంలోకి దిగి మౌలానా సాద్ పై దర్యాప్తు సాగిస్తోంది. మర్కజ్ ట్రస్ట్‌తోపాటు మౌలానా సాద్‌పై సీబీఐ చర్యలు తీసుకోనుంది. అంతకుముందు మర్కజ్ విరాళాలపై కీలక పత్రాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మార్చి 13 తరువాత మార్కాజ్ లోపల ఉన్న వేలాది మంది భారతీయులను, విదేశీయులను దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ధిక్కరించడానికి మౌలానా సాద్ ప్రోత్సహించారని ఆరోపణలున్నాయి. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన 4,300 మంది వ్యక్తులు మర్కజ్లో జరిగిన కార్యక్రమానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు సూచిస్తున్నాయి. చదవండి: ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం -
డిజిటల్ మీడియాలో విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డిజిటల్ మీడియాతో పాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పూర్తి స్థాయిలో అనుమతించే దిశగా మరో విడత సంస్కరణలపై కసరత్తు చేస్తోంది. వీటిలో భాగంగా బొగ్గు, కాంట్రాక్ట్ తయారీ రంగానికి సంబంధించి కూడా ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేయనుంది. కేంద్ర క్యాబినెట్ త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంట్రాక్ట్ తయారీ రంగంలో కూడా 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే ప్రతిపాదన కేంద్రం పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రస్తుతం తయారీ రంగంలోకి ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. వీటి ప్రకారం తయారీదారు భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తులను ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోనక్కర్లేకుండా హోల్‌సేల్, రిటైల్ (ఈ–కామర్స్ సహా) మార్గాల్లో విక్రయించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి కాంట్రాక్ట్ తయారీ విభాగం ప్రస్తావన లేకపోవడంతో అస్పష్టత ఉంది. ఏవియేషన్, మీడియా (యానిమేషన్ మొదలైన విభాగాలు)బీమాసహా ప్రస్తుతం నిబంధనలను మరింత సరళతరం చేయడంపై దృష్టి సారిస్తోందని సమాచారం. -
మీడియా, ఏవియేషన్ రంగాల్లో ఎఫ్‌డీఐ
సాక్షి, న్యూఢిల్లీ : సంస్కరణల వేగం పెంచి పెట్టుబడుల వెల్లువను ప్రోత్సహించేలా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు చర్యలు ప్రకటించారు. మీడియా, ఏవియేషన్ రంగాల్లో ఎఫ్‌డీఐకి అనుమతిని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఇస్రో సామర్ధ్యాన్ని వినియోగించుకునేందుకు కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 7 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇస్తామని అన్నారు. -
సెన్సెక్స్ రికార్డుస్థాయికి చేరేముందు...
ప్రపంచ స్టాక్ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఈ కారణంగా గతవారం పెద్ద ర్యాలీ జరిపిన భారత్ స్టాక్‌సూచీలు ఆల్‌టైమ్ రికార్డుస్థాయికి కేవలం 3 శాతం దూరంలో ఉన్నాయి. మరోవైపు అటు విదేశీ, ఇటు స్వదేశీ ఫండ్స్ ఫెవరేట్ రంగమైన బ్యాంకింగ్ సూచి గతేడాది నెలకొల్పిన రికార్డుస్థాయిని అవలీలగా అధిగమించేసి, ఏ రోజుకారోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తిరిగి కఠిన వైఖరిలోకి మారకపోతే...ఇక్కడి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు–అంచనాలతో సంబంధం లేకుండా ర్యాలీ కొనసాగే అవకాశాలున్నాయని అత్యధికశాతం బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 15తో ముగిసిన వారంలో అనూహ్యంగా ర్యాలీ జరిపిన బీఎస్ఈ సెన్సెక్స్ 38,250 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంకంటే 1,353 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించి, 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 29 నాటి రికార్డు గరిష్టస్థాయి 38,989 పాయింట్ల స్థాయివరకూ ర్యాలీ చేయడానికి అవసరమైన కీలక అవరోధాల్ని అన్నింటినీ సెన్సెక్స్ గతవారం అధిగమించినట్లే. అయితే లాభాల స్వీకరణ కారణంగా రికార్డుస్థాయిని చేరేముందు చిన్న విరామాలు వుండవచ్చు. ఈ కోణంలో.... ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే తొలుత 38,250–38,420 పాయింట్ల శ్రేణి వద్ద ఆగవచ్చు. అటుపైన ముగిస్తే 38,580 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన 38,730–38,989 పాయింట్ల శ్రేణి వరకూ పరుగు కొనసాగవచ్చు. ఈ వారం తొలి స్టాప్ వద్ద బ్రేక్పడితే 37,700 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 10,345 గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,487 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 392 పాయింట్ల భారీ లాభంతో 11,427 పాయింట్ల వద్ద ముగిసింది. గతేడాది ఆగస్టు 28 నాటి రికార్డు గరిష్టస్థాయి అయిన 11,760 పాయింట్ల వద్దకు చేరేందుకు సాంకేతికంగా కీలక అవరోధమైన 11,345 పాయింట్ల స్థాయిని గతవారం అవలీలగా నిఫ్టీ అధిగమించింది. ఈ కారణంగా రానున్న రోజుల్లో కొత్త రికార్డుల సాధనకు మార్గం సుగమమయ్యింది. ఈ క్రమంలో ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్ కొనసాగితే వెనువెంటనే 11,490–11,525 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 11,605 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 11,700–11,760 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం 11,490–11, 525 పాయింట్ల శ్రేణిని దాటలేకపోతే 11,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతును పొందవచ్చు. ఈ లోపున ముగిస్తే 11,275 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. -
విదేశీ విరాళాలపై సవరణకు ఓకే
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల విదేశీ విరాళాలపై తనిఖీ అవసరం లేదన్న సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. 21 సవరణలతో కూడిన 2018 ఆర్థిక బిల్లును విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ బుధవారం చర్చ లేకుండానే ఆమోదించింది. వాటిలో విదేశీ సంస్థల నుంచి పార్టీలు విరాళాలు స్వీకరించడాన్ని నిషేధిస్తూ చేసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్ట (ఎఫ్సీఆర్ఏ) సవరణ కూడా ఒకటి. 1976 నుంచి పార్టీలు విదేశాల నుంచి పొందిన నిధులపై ఎలాంటి సమీక్ష, తనిఖీ ఉండకూడదనేది ఈ సవరణ ఉద్దేశం. పార్టీలు విదేశీ విరాళాలు స్వీకరించడాన్ని సులభతరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం 2016 ఆర్థిక బిల్లు ద్వారా ఎఫ్సీఆర్ఏ చట్టానికి సవరణ చేసింది. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా 1976 నుంచి పొందిన విరాళాలకు తనిఖీ అవసరం లేదంటూ మరో సవరణ చేసింది. ‘2016 ఆర్థిక చట్టంలోని సెక్షన్ 236 తొలి పేరాలో ఉన్న 26 సెప్టెంబర్ 2010కు బదులుగా 5 ఆగస్టు 1976ని మార్చాం’అని లోక్‌సభ వెబ్సైట్ పేర్కొంది. ఈ సవరణ ఎఫ్సీఆర్ఏ ఉల్లంఘన కేసులో దోషులంటూ 2014 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో వేసిన అప్పీళ్లను ఉపసంహరించుకున్నాయి. -
ఇదో వింత వ్యాధి
వాషింగ్టన్ : నిద్రలో కలలు రావటం.. కలవరపాటుకు గురికావటం సహజం. కానీ, మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి నిద్రలేచాక అకస్మాత్తుగా ‘పొరుగు’భాషలో మాట్లాడితే ఎలా ఉంటుంది. అరిజోనాకు చెందిన మిచెల్లె మైర్స్(45) పరిస్థితి అలాగే ఉంది. ఫారిన్ అస్సెంట్ సిండ్రోమ్ తో ఆమె బాధపడుతోంది. ఒక్కోసారి ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అప్పుడు ఆమె నిద్రలోకి జారుకుంటుంది. ఆపై మెలుకువ వచ్చేసరికి అసలు వ్యవహారం మొదలవుతుంది. స్వతహాగా అమెరికన్ అయిన ఆమె వేరే వేరే భాషల్లో మాట్లాడుతుంది. అసంకల్పితంగా ఆమె నోటి నుంచి పర భాష పదాలు దొర్లుతుంటాయి. గతంలో ఆస్ట్రేలియన్, ఐరిష్ భాషలు ఆమె మాట్లాడారు. అయితే అది రెండు వారాలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఓ రోజు నుంచి ఆమె బ్రిటీష్ భాష మొదలుపెట్టి రెండేళ్లు మాట్లాడారు. దీనికి గల కారణాలను పరిశోధకులు వివరిస్తున్నారు. ‘మనిషి మెదడులో భాషలను గుర్తించే ఓ కేంద్ర విభాగం(బేసల్ గ్యాంగ్లియాన్) ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు.. లేదా షాక్ తగిలినప్పుడు పదాల ఉచ్ఛరణ అన్నది వారికి తెలీకుండానే మారిపోతుంది. అలా వారి ప్రమేయం లేకుండానే వేరే భాషలు మాట్లాడుతుంటారు. కానీ, అది తాము సాధారణంగా మాట్లాడే భాషే అని వారనుకుంటారు. ఆ ప్రభావం కొన్ని గంటలు ఉండొచ్చు.. లేదా ఏళ్ల తరబడి ఉండొచ్చు. దీనినే ఫారిన్ అస్సెంట్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తుంటార’ని షెలియా బ్లూమ్ స్టెయిన్ అనే భాషావేత్త వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. 2010లో వర్జీనియాకు చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహా సమస్యతో బాధపడినట్లు ది వాషింగ్టన్ పోస్టు తన కథనంలో వివరించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇలాంటివి 60 కేసులు నమోదు అయినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. -
బ్యాంక్ ఖాతాలు తెరవండి
న్యూఢిల్లీ: విదేశీ విరాళాలు స్వీకరించే ఎన్జీవోలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులు నెలలోగా ప్రభుత్వం నిర్దేశించిన 32 బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలను ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్ఎంఎస్)తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) 2010 ప్రకారం విదేశీ విరాళాలను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడకూడదని తెలిపింది. కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల్లో ఎస్బీఐ, విజయ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 10వేల ఎఫ్ఆర్సీఏ గుర్తింపు పొందిన ఎన్జీవోలు ఉన్నాయి. -
విదేశీ విరాళాలపై నిషేధం
జాబితాలో జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీ, ఇగ్నో న్యూఢిల్లీ: విదేశాల నుంచి విరాళాలు అందుకుంటూ రిటర్నులు దాఖలు చేయని పలు ప్రతిష్టాత్మక సంస్థలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్), ఐఐటీ ఢిల్లీ తదితర సంస్థలు విదేశాల నుంచి విరాళాలు అందుకోకుండా హోంశాఖ నిషేధం విధించింది. విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ)చట్టం–2010 ప్రకారం ఈ సంస్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆదాయ, వ్యయాలను సమర్పిం చాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించనందునే ఈ చర్య తీసుకున్నట్లు హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎఫ్సీఆర్ఏ చట్టం ప్రకారం విదేశీ విరాళాల వివరాలను ఎఫ్సీఆర్ఏ వెబ్సైట్లో నమోదు చేయకపోతే రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయడం కుదరదన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్, ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో), లేడీ ఇర్విన్ కళాశాల, గాంధీ పీస్ ఫౌండేషన్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, సాయుధ బలగాల ఫ్లాగ్‌డే ఫండ్, డా.రామ్మనోహర్ లోహియా ఇంటర్నేషనల్ ట్రస్ట్, శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ల రిజిస్ట్రేషన్‌ను ఎఫ్సీఆర్ఏ చట్టం కింద రద్దు చేసినట్లు వెల్లడించారు. 2010–11 నుంచి 2014–15 వరకు ఐదేళ్ల కాలానికి ఈ సంస్థలేవీ తమ ఆదాయ, వ్యయాలను సమర్పించలేదని పేర్కొన్నారు. -
'ఆప్ నిధులపై విచారణ జరిపించండి'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి విదేశాల్లో ఎవరి నుంచి నిధులు వస్తున్నాయో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆప్ రెబల్ లీడర్ కపిల్ మిశ్రా చెప్పిన విషయాలన్నింటిపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరపాలని కోరింది. దేశ విద్రోహ శక్తుల నుంచి ఆప్‌కు నిధులు ఏవైనా వస్తున్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరపాలని పేర్కొంది. ఆప్ అధ్యక్షుడు ఆరవింద్ కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా లెక్కలేనన్ని ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నాయకుడు మాకెన్ అన్నారు. కపిల్‌తో పాటు నీల్ కూడా గతంలో కేజ్రీపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. అయితే, పోలీసులు ఇంతవరకూ కేజ్రీపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వేర్పాటువాదుల నుంచి ఆప్ నిధులను తీసుకుంటోందని గతంలో కాంగ్రెస్ లీడర్ ఆనంద్ శర్మ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆప్‌కు విదేశాల నుంచి వస్తున్న నిధులపై విచారణ జరిపించాలని మాకెన్ డిమాండ్ చేశారు. ఏయే గ్రూప్‌ల నుంచి ఆప్‌కు నిధులు అందుతున్నాయన్న విషయాన్ని బయటపెట్టాలని కూడా కోరారు. -
కేజ్రీవాల్‌కు మరో షాక్.. విదేశీ విరాళాలపై ఆరా
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కష్టాలు వీడటం లేదు. తిరుగుబాటు జెండా ఎగరేసిన కుమార్ విశ్వాస్ ఎన్నాళ్లు పార్టీలో ఉంటారో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. మరోవైపు ఆ పార్టీకి వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ విరాళాల విషయమై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఆ పార్టీ ఉల్లంఘించిందన్న అనుమానంతోనే ఈ ప్రశ్నలు తలెత్తినట్లు తెలిసింది. ఈ చట్టం నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు వెళ్లాయి. అయితే... ఈ నోటీసులు సర్వసాధారణంగా వెళ్లేవేనని, అన్ని పార్టీలనూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటామని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని పార్టీలనూ వాళ్లకు వస్తున్న విరాళాల గురించిన వివరాలు అడుగుతుంటామని, అందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా వెళ్లాయని తెలిపారు. అయితే.. తమ వద్ద దాచడానికి ఏమీ లేదని, అధికారులకు తాము అన్నివిధాలా సహకరిస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. పార్టీ స్థాపించే సమయంలో తమవద్ద డబ్బులు లేనందున విరాళాలు ఇవ్వాలని ఆప్ విజ్ఞప్తి చేయడంతో.. చాలామంది దాతలు ముఖ్యంగా విదేశాల నుంచి కూడా భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చారు. 2013 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఆప్ విరాళాలపై విచారణ జరిపింది గానీ అప్పట్లో అక్రమాలు ఏవీ బయటపడలేదు. -
ఆ నిధుల సేకరణ వివరాలు చెప్పండి
న్యూఢిల్లీ: విదేశాల నుంచి సేకరించిన నిధుల వివరాలను తెలియజేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కేంద్ర హోం శాఖ కోరింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) కింద ఆప్‌కు నోటీసు జారీ చేసింది. విదేశీ నిధుల సేకరణపై రాజకీయ పార్టీలకు మామూలుగా పంపే నోటీసుల్లో భాగంగా ఆప్‌కు జారీ చేశామని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పినట్టు పీటీఐ వార్త సంస్థ వెల్లడించింది. ఇది షోకాజ్ నోటీసు కాదని ఆయన స్పష్టం చేశారు. ఆప్ ఇచ్చే సమాధానాన్ని చూసిన తర్వాతే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆప్ సేకరించిన విరాళాలపై పలు ఆరోపణలు వచ్చాయి. విదేశాల్లో మూలాలున్న ఉగ్రవాద సంస్థల నుంచి ఆప్ విరాళాలు సేకరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆప్ వరుసగా పరాజయం పాలైంది. -
ఎస్బీఐ రూ.3,400 కోట్ల సమీకరణ
డాలర్ల రూపంలో విదేశీ బాండ్ల జారీ ముంబై: దేశీ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ... 50 కోట్ల డాలర్ల(దాదాపు రూ.3,400 కోట్లు) నిధుల సమీకరణ కోసం విదేశీ బాండ్ల జారీకి తెరతీసింది. డాలర్ రూపంలో ఈ నిధులను సమీకరించింది. ఇష్యూ 3 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయిందని.. ఐదేళ్ల కాల పరిమితి గల ఈ బాండ్లకు వడ్డీరేటు 3.306 శాతంగా నిర్ణయించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదేళ్లలో 10 బిలియన్ డాలర్ల మధ్యకాలిక బాండ్ల జారీలో భాగంగా ఈ బాండ్ల ఇష్యూను చేపట్టింది. లండన్‌లోని బ్రాంచ్ ద్వారా ఎస్బీఐ ఈ నిధులను సమీకరిస్తోందని, బాండ్లను సింగపూర్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో లిస్ట్ చేయనున్నట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. ప్రతిపాదిత 50 కోట్ల డాలర్ల బాండ్ ఇష్యూకి మూడు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు(ఎస్ అండ్ పీ, మూడీస్, ఫిచ్) ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను ఇచ్చాయి. ఎస్బీఐ చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో విదేశీ మార్కెట్లో డాలర్ బాండ్ల జారీ ద్వారా 30 కోట్ల డాలర్లను సమీకరించింది. అంతక్రితం 2014లో 125 కోట్ల డాలర్ల డాలర్ బాం డ్లను జారీచేసింది. ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా ప్రతిపాదిత 10 బిలియన్ డాలర్లలో ఇప్పటివరకూ ఎస్బీఐ 3.5 బిలియన్ డాలర్లను సమీకరించింది. -
నియంత్రణలు పాటిస్తేనే విదేశీ నిధులు!: భట్టాచార్య
కోల్‌కతా: విశ్వసనీయతను కొనసాగించడంతోపాటు విదేశీ నిధులను ఆకర్షించేందుకు బ్యాంకులు నియంత్రణ పరమైన నిబంధనలను అనుసరించాల్సిందేనని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ‘‘లిక్విడిటీ కవరేజ్ రేషియో, సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రుణాల వర్గీకరణ వంటి విధానాలను బ్యాంకులు పాటించాలి. దేశంలో నిధుల కొరత లేదని చెప్పలేం. కాబట్టి బ్యాంకులు ఈ ప్రమాణాల్ని పాటించాలి. విశ్వసనీయతను కాపాడుకుంటూ విదేశీ నిధులను రాబట్టాలి ’’ అని ఫిక్కీ నిర్వహించిన బ్యాంకింగ్ సదస్సులో అరుంధతి వ్యాఖ్యానించారు. ‘నేడు బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న అది పెద్ద సవాలు నిధుల లభ్యతే. అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్ కుప్పకూలిపోవడమే ఈ పరిస్థితికి కారణం. అంతర్జాతీయంగా పునరుద్ధరించిన రుణాలను ఒత్తిడితో కూడిన ఆస్తులుగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం పునరుద్ధరించబడిన వాటిని స్టాండర్డ్ ఆస్తులుగా పరిగణిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. -
రీట్స్ నిబంధనల సరళీకరణ!
♦ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం ♦ విదేశీ ఫండ్ మేనేజర్ల నిబంధనల కూడా సరళీకరణ ♦ రెండు సంప్రదింపుల పత్రాలు విడుదల చేసిన సెబీ ముంబై: రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్) నిబంధనలను, విదేశీ ఫండ్ మేనేజర్లు సంబంధించిన నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సరళీకరించనున్నది. భారత క్యాపిటల్ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇన్వెస్టర్లు, రియల్టర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రీట్స్ నిబంధనలను సరళీకరించనున్నది. విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనల సరళీకరణ కారణంగా మరిన్ని విదేశీ ఫండ్లు మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అంచనా. రీట్స్, విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనల సరళీకరణపై రెండు వేర్వేరు సంప్రదింపుల పత్రాలను సెబీ విడుదల చేసింది. ఈ సంప్రదింపుల పత్రాలపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిబంధనలను రూపొందిస్తుంది. శుక్రవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ మేరకు సెబీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే 2015-16 సెబీ వార్షిక నివేదిక కూడా ఆమోదం పొందింది. 20 శాతం పెట్టుబడులకు ఓకే ...నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో రీట్స్ ప్రస్తుతం తన నిధుల్లో 10 శాతం వరకూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పరిమితిని 20 శాతం వరకూ పెంచాలని సెబీ ప్రతిపాదిస్తోంది. రీట్స్‌కు స్పాన్సరర్ల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచింది. రీట్స్‌పై సెబీ తాజా ప్రతిపాదనల పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిబంధనల కారణంగా ఏడాదిలోపు రీట్స్ వస్తాయని నిపుణులంటున్నారు. ఈ ప్రతిపాదనల వల్ల రీట్స్ నుంచి భారత రియల్టీ మార్కెట్లో అవసరమైన నిధులు వస్తాయని సీబీఆర్ఈ సౌత్ ఏషియా సీఎండీ అన్షుమన్ మ్యాగజైన్ చెప్పారు. మరోవైపు భారత్‌లో నియమితులయ్యే విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనలను కూడా సెబీ సరళీకరించనున్నది. విదేశీ ఫండ్ మేనేజర్లు పోర్ట్‌ఫోలియో మేనేజర్లుగా వ్యవహరించడానికి వీలుగా నిబంధనలను సరళీకరించాలని సెబీ ప్రతిపాదిస్తోంది. -
మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ : బ్యాంకులకు కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, తప్పించుకున్న తిరుగుతున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు విజయ్ మాల్యాను ఆదేశించింది. మాల్యా విదేశీ ఆస్తులతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆస్తుల ప్రకటనలో ఎలాంటి జాప్యం చేయొద్దని, ఈ వివరాలను గడువులోగా బ్యాంకులకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్ లతోకూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా విజయ్ మాల్యా భార్య, పిల్లల ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ కోరిన పిటిషన్ తిరస్కరించింది. మరోవైపు ఈ ఆదేశాలను విజయ్ మాల్యాపై ఎలాంటి క్రిమినల్ చర్యలకు వాడుకోకూడదని అతని తరఫున లాయర్ సీఎస్ వైద్యనాథన్ సుప్రీంను కోరారు.