ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షమి, హమీద్ జమాన్, సైఫ్ నియాజీని శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు.
ఇమ్రాన్‌పై కేసు పెట్టాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా సంబంధిత అధికారులను ఆదేశించారని ఆ దేశ మీడియా తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా పేర్కొంది.
అనధికారికంగా వెబ్‌సైట్ నిర్వహిస్తూ విదేశాల నుంచి నిధుల సమకూర్చుకున్నారనే ఆరోపణలతో మొదట పీటీఐ నేత సైఫుల్లా నియాజిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైం విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత కాసేపటికే మరికొంతమంది నేతలను అరెస్టు చేసింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది.
చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment