న్యూఢిల్లీ: గత మూడేళ్లకాలంలో భారతీయ ఎన్‌జీవో సంస్థలు విదేశాల నుంచి విరాళాల రూపంలో రూ.2,430.80 కోట్లను స్వీకరించాయని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు చెప్పారు. 2019–20లో రూ.727.1 కోట్లు, 2020–21కాలంలో రూ.798.1 కోట్లు, 2021–22కాలంలో రూ.905.5 కోట్ల విరాళాలు పొందాయని పేర్కొన్నారు.
ఈ నెల పదోతేదీ నాటికి దేశవ్యాప్తంగా 16,383 ఎన్‌జీవో సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 15వేల సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికలను సమర్పించాయి. కొన్ని సంస్థల నిధుల దుర్వినియోగం/ నిధుల మళ్లింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో చర్యల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment