Nityanand Rai
-
18న ఎన్డీఏ భేటీకి రండి
న్యూఢిల్లీ: ఎన్డీయే పక్షాలతో ఈనెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఈ మేరకు లేఖ రాశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్‌కూ లేఖ అందింది. ఆయనతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఇప్పటికే భేటీ కావడం తెలిసిందే. బిహార్ మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ కూడా హాజరవుతారని సమాచారం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతస్థాయిలో ఎన్డీయే భేటీ జరగనుండటం ఇదే తొలిసారి. -
మూడేళ్లలో రూ.2,430 కోట్లు
న్యూఢిల్లీ: గత మూడేళ్లకాలంలో భారతీయ ఎన్జీవో సంస్థలు విదేశాల నుంచి విరాళాల రూపంలో రూ.2,430.80 కోట్లను స్వీకరించాయని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు చెప్పారు. 2019–20లో రూ.727.1 కోట్లు, 2020–21కాలంలో రూ.798.1 కోట్లు, 2021–22కాలంలో రూ.905.5 కోట్ల విరాళాలు పొందాయని పేర్కొన్నారు. ఈ నెల పదోతేదీ నాటికి దేశవ్యాప్తంగా 16,383 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 15వేల సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికలను సమర్పించాయి. కొన్ని సంస్థల నిధుల దుర్వినియోగం/ నిధుల మళ్లింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో చర్యల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. -
81 మంది చైనా పౌరులకు నోటీసులు 117 మందికి బహిష్కరణ
న్యూఢిల్లీ: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రావు ఎంతమంది విదేశీయులపై చర్యలు తీసుకున్నారో వివరించారు. ఆయన మాట్లడుతూ...2019 నుంచి 2021 మధ్య కాలంలో భారత్‌లో వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉంటున్న సుమారు 81 మంది చైనా పౌరులకు భారత్‌ని వదిల వెళ్లేలా నోటీసుల, అలాగే మరో 117 మందిని మూడేళ్ల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు పైగా సుమారు 726 మంది చైనీయులను వీసా నిబంధనలను ఉల్లంఘంచిన ప్రతికూల జాబితాలో ఉన్నారని చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కి వచ్చే వారి రికార్డును ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. కొంతమంది విదేశీయులు నిర్లక్ష్యంతోనో లేక చికిత్స నిమిత్తంగానో లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో వీసా గడువు ముగిసిపోయినా ఉండిపోతున్నారని చెప్పారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ కాలం ఇక్కడ ఉండిపోతే జరిమాన విధించి వీసాను క్రమబద్ధీకరించడం లేదా గడువు పొడిగించడం జరుగుతుందన్నారు. అలా కాకుండా కావాలనే వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం ఉండిపోతే విదేశీయుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారత్‌ని వదిలి వెళ్లేలా నోటీసులు జారీ చేసి జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో మరో కేసు... ఎనిమిదికి చేరిన కేసులు) -
భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2021లో 1.6 లక్షల మంది పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపింది. గతేడాది 78,284 మంది ఇండియన్స్ అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశీ పౌరసత్వం వదులుకున్న వారిలో అమెరికా ఎన్నారైలే అత్యధికంగా ఉండటం విశేషం. ద్వంద్వ పౌరసత్వాన్ని మనదేశం అనుమతించదు. దీంతో విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ఒక దేశ పౌరసత్వం మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. కాగా, చైనాలో నివసిస్తున్న 362 మంది భారతీయులు కూడా స్వదేశీ సిటిజన్‌షిప్‌ను వదులుకుని చైనా పౌరసత్వం ఉంచుకున్నారు. వ్యక్తిగ కారణాల వల్లే స్వదేశీ పౌరసత్వాన్ని ప్రవాసులు వదులుకున్నారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. లోక్‌సభలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం తెలిపారు. కేంద్ర హోం శాఖ 2018లో పౌరసత్వ నిబంధనలను సవరించింది. విదేశీ పౌరసత్వాన్ని పొందడం, భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సంబంధించిన కాలమ్‌ను దరఖాస్తులో పొందుపరిచింది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల్లో 23,533 మంది, కెనడా నుంచి 21,597 మంది స్వదేశీ పౌరసత్వం వదులుకున్నారు. బ్రిటన్(14,637), ఇటలీ(5,986), నెదర్లాండ్స్ (2187), న్యూజిలాండ్( 2643), , సింగపూర్(2516), పాకిస్తాన్(41) నేపాల్(10) తదితర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆయా దేశాల పౌరసత్వాలను స్వీకరించారు. భారత పౌరసత్వం వదులుకున్న వారిలో 103 దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఉన్నారని కేంద్ర హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి. (క్లిక్: రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్) -
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్ళీ పాత పాట
-
విస్తుగొలిపే విషయాలు.. దేశంలో జుడీషియల్, పోలీసు కస్టడీ మరణాలు..
జీవితంలో గడిచిపోయిన ప్రతి క్షణం వెలకట్టలేనిది. ఆ కాలాన్ని తిరిగి ఇవ్వాలంటే.. అది ఎవరి వల్లా కాదు.. అయితే మన దేశంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నిర్దోషులు అనేక మంది ఉన్నారు. ఇంటారాగేషన్ పేరుతో ఒంట్లోని శక్తినంతా లాగేశాక.. చివరికి జీవచ్ఛవాల్లా ఉన్న వారిని నిర్దోషులుగా విడుదల చేయడం పరిపాటి. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పిన విషయాలు దేశంలో జైళ్ల పరిస్థితిని తెలియజేస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 3 సంవత్సరాలలో 348 మంది పోలీసు కస్టడీలో మరణించగా.. 5221 మంది జ్యుడీషియల్ కస్టడీలో మరణించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు. అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు కస్టడీలో 23 మంది చనిపోయారని, అదే సమయంలో జ్యుడీషియల్ కస్టడీలో 1295 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీఆర్బీ గణాంకాల్లో చాలా తేడాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గత 10 సంవత్సరాలలో, 1,004 మంది పోలీసుల కస్టడీలో మరణించారు. అందులో 40శాతం మంది సహజంగా లేదా అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 29శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ నివేదికలో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా చనిపోయారా? లేదా పోలీసుల చిత్రహింసల కారణంగానా..? అనేది స్పష్టం చేయలేదు. అలాగే పోలీస్ కస్టడీ మరణాలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల్లో చాలా తేడాలు ఉన్నాయి. నిందుతులు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే..! దీనిపై సామాజిక కార్యకర్త సమీర్ మాట్లాడుతూ.. "ఖైదీలను హింసించడాన్ని వ్యతిరేకిస్తున్న అనేక మంది అధికారులు పోలీసు శాఖలో ఉన్నారు. పోలీసులు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. అందువల్ల న్యాయస్థానాల ద్వారా నేరస్తులను విచారించడానికి చట్టపరమైన నిబంధనలను ఉపయోగిస్తారు. తీహార్ జైలులో ఓ ఖైదీ హత్యకు సంబంధించి డిప్యూటీ జైలర్, ఇతర జైలు సిబ్బంది పేర్లు బహిర్గతమయ్యాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చట్టం అటువంటి విషయాలపై స్పష్టంగా ఉంది. నిందితులు ఏ పదవిలో ఉన్నా ప్రాసిక్యూట్ చేస్తారు.’’ అని అన్నారు. క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వలేదు ఓ మానవ హక్కుల కార్యకర్త స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. సంబంధిత పోలీసు అధికారులపై కేసును ప్రభుత్వ అనుమతి తర్వాత మాత్రమే నమోదు చేయవచ్చు. అయితే ప్రభుత్వాలు దీనికి బహిరంగంగా అమలు చేయడానికి ఇష్టపడవు. ఇది ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సిగ్గుచేటు. పోలీసు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను అనుమానిత నేరస్థులుగా మాత్రమే పరిగణించాలి అంతే కానీ వారిని నిర్బంధంలో క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వదు. ఈ సమస్యపై దేశంలోని పోలీసులు, పరిపాలనా వ్యవస్థ సున్నితంగా ఉండడం అత్యవసరం’’ అని ఓ సామాజిక కార్యకర్త అన్నారు. కాగా హిందుస్తానీ బిరదారీ వైస్ ఛైర్మన్ విశాల్ శర్మ మాట్లాడుతూ.. ఏదైనా కస్టడీ మరణంపై పోలీసు శాఖ ద్వారానే సరైన నిష్పాక్షిక విచారణ జరగాలని పేర్కొన్నారు. అలాగే ప్రమేయం ఉన్న పోలీసులను చట్ట ప్రకారం శిక్షించాలని సూచించారు. -
స్వచ్ఛంద సంస్థల్లో రూ. 49 వేల కోట్ల విదేశీ నిధులు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 18 వేలకు పైగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) కలసి మూడేళ్లలో రూ. 49 వేల కోట్లుకు పైగా విదేశీ నిధుల్ని పొందాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2017–18లో రూ. 16,940.58 కోట్లు, 2018–19లో రూ. 16,525.73 కోట్లు, 2019–20లో రూ. 15,853.94 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ భాగ స్వామ్య నియంత్రణ సవరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)–2020 చట్టానికి ముందు ఎఫ్సీఆర్ఏ ఖాతాలను ఐచ్ఛికంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. అయితే సవరణ చట్టం వచ్చాక దగ్గర్లో ఉన్న ఎస్బీఐలో ఎఫ్సీఆర్ఏ ఖాతా తెరవడాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. 2021 జూలై 31న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ప్రకారం మొత్తం 18,377 గుర్తింపు పొందిన ఎఫ్సీఆర్ఏ ఖాతాలు ఉన్నాయి. పోలీస్ కస్టడీలో 348 మంది మృతి.. గత మూడేళ్లలో పోలీసుల కస్టడీలో 348 మంది వ్యక్తులు మరణించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. మరో 5,221 మంది జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మరణించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలవారీగా చూస్తే 2018–20 మధ్య ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ కస్టడీలో 23, జ్యుడీషియల్ కస్టడీలో 1,295 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో పోలీస్ కస్టడీలో 34, జ్యుడీషియల్ కస్టడీలో 407 మంది మరణించారు. పశ్చిమబెంగాల్లో పోలీస్ కస్టడీలో 27, జ్యుడీషియల్ కస్టడీలో 370 మంది మరణించారు. -
కశ్మీర్లో ఇద్దరే ఆస్తులు కొన్నారు? ఎందుకలా?
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు ఏమీ మారలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉన్న అధికరణాలను రద్దు చేసిన అనంతరం ఆస్తుల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. కేవలం ఇద్దరంటే ఇద్దరు ఆస్తులు కొనుగోలు చేసినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో మంగళవారం ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌కు 370 అధికరణను రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా 5 ఆగస్టు 2019లో ఏర్పాటుచేశారు. రద్దుకు ముందు కశ్మీర్ ప్రాంతంలో ఇతర ప్రాంతీయులు ఆస్తుల కొనుగోళ్లపై నిషేధం అమల్లో ఉండేది. అధికరణాల రద్దు అనంతరం ఇతర ప్రాంతాలవారు పెద్ద ఎత్తున వచ్చి ఆస్తులు కొనుగోలు చేస్తారని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం ఆశించిన మేర జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేయలేదు. ఆస్తుల కొనుగోళ్ల చట్టాలలో మార్పులు చేయడంతో కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లడ్డాఖ్లో దేశంలోని ఇతర పారిశ్రామికవేత్తలు, ఇతర వ్యాపారులు పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి కశ్మీర్ అభివృద్ధి బాట పడుతుందని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులు రాలేదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. అధికరణ 370 రద్దును కశ్మీర్ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీకి చెందిన పార్టీ నాయకులు కూడా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం భావించినట్టు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మారలేదు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఎవరూ ఆస్తుల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. పారిశ్రామికవేత్తలు కశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపడం లేదు. ఉగ్రవాదుల దాడుల భయం ఇంకా కొనసాగుతోంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వంటివి ఉండడంతో ప్రస్తుతం కశ్మీర్‌పై ఎవరూ దృష్టి సారించలేదు. -
తమిళనాడును రెండుగా విభజించలేం: కేంద్రం
సాక్షి, చెన్నై: తమిళనాడును రెండు ముక్కలు చేయాలనే ఉద్దేశం, ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కొంగునాడు గొడవకు ముగింపు పలికినట్టు అయింది. పరిపాలనా సౌలభ్యం నిమిత్తం చెన్నైకు ప్రత్యామ్నాయంగా మదురై కేంద్రంగా మరో రాజధాని అవశ్యం అంటూ, దక్షిణ తమిళనాడు కేంద్రంగా మరో రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే అన్న నినాదాలు తరచూ తెరపైకి రావడం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు, తిరుప్పూర్, సేలం, ఈరోడ్ జిల్లాలతో నిండిన కొంగునాడులో డీఎంకే పార్టీ ప్రభావం తక్కువే. మొదటి నుంచి ఇది అన్నాడీఎంకేకు కంచుకోటే. ఈ పరిణామాల నేపథ్యంలో కొంగునాడు నినాదం తెరపైకి కొన్ని నెలల క్రితం వచ్చింది. తమిళనాడు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ వర్గాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు, అక్కడి పెద్దలు దీనిపై పరిశీలన జరుపుతున్నట్టు తెలిసింది. కోయంబత్తూరు కేంద్రంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు కాబోతున్నట్టు, తమిళనాడును చీల్చేందుకు కేంద్రం దూకుడు పెంచినట్టుగా చర్చ, ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో మంగళవారం వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. ప్రస్తుతానికి నో.. ఎంపీలు పారివేందర్, రామలింగం లిఖిత పూర్వకంగా పార్లమెంట్ దృష్టికి తమిళనాడు చీలిక వ్యవహారం, కొంగునాడు ఏర్పాటు ప్రస్తావనను తీసుకెళ్లారు. తమిళనాడును రెండు ముక్కలు చేసే విధంగా స్పష్టమైన సమాధానం తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఇందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. తమిళనాడును రెండు రాష్ట్రాలు చేయడం, కొంగునాడు ఏర్పాటుపై ఎలాంటి పరిశీలన ప్రస్తుతం తమ వద్ద లేదని స్పష్టం చేశారు. దీంతో చాలా రోజుల నుంచి రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న కొంగునాడు ప్రస్తావనకు ముగింపు పలికినట్లు అయ్యింది. అయితే ప్రస్తుతానికి పరిశీలన లేకున్నా, భవిష్యత్తులో కేంద్రం దృష్టి పెట్టి తీరుతుందన్న వాదనలు తెరపైకి రావడం గమనార్హం. -
జమ్మూకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన లఢక్, కశ్మీర్‌లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆ ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో బుధవారం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆగస్ట్ 5, 2019న జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తు కల్పిస్తున్న 370, 35ఏ అధికరణలను కొట్టివేశారు. వాటిని రాజ్యాంగం నుంచి తొలగించి జమ్మూకశ్మీర్, లఢక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలపై ప్రశ్న వేశారు. రెండూ ప్రశ్నలకు కలిపి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 2020లో 59 శాతం ఉంటే జూన్ 2021 వరకు 32 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై నిరంతర నిఘా పెట్టినట్లు చెప్పారు. లోయలో కశ్మీరీ పండితుల పునరావాసం.. భద్రతపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 900 కశ్మీరీ పండిత్, డోగ్రా హిందూ కుటుంబాలు కశ్మీర్లో ఉన్నాయని వెల్లడించారు. -
రాష్ట్ర రాజధానిని నిర్ణయించడంలో కేంద్రం పాత్ర లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని కేంద్ర హోంశాఖ పునరుద్ఘాటించింది. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్ర రాజధాని ఎంపికలో నిర్దిష్ట విధాన ప్రక్రియ ఏదైనా ఉందా? ఉంటే ఆ వివరాలు ఇవ్వండి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తమ రాజధానులను ఎంపిక చేసుకున్న పద్ధతిని వివరించండి. ఈ ఎంపికలో కేంద్రం ఏదైనా పాత్ర పోషించగలదా? పోషించగలిగితే వివరాలు ఇవ్వండి..’ అంటూ కేశినేని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ‘ఒక రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర ఏమీ లేదు..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పునరుద్ఘాటించారు. -
జేఎన్‌యూ దాడి : ఏబీవీపీకి మంత్రి క్లీన్చిట్
సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూలో ఆదివారం సాయంత్రం ముసుగు దుండగులు విద్యార్ధులు, ఉపాధ్యాయులను చితకబాదిన ఘటనలో దర్యాప్తు సాగుతుండగానే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీవీపీకి క్లీన్చిట్ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ అనుబంధ సంస్ధలకు హింసకు పాల్పడేంతటి శక్తిసామర్థ్యాలు లేవని చెప్పుకొచ్చారు. విద్యార్ధుల భవితవ్యంతో చెలగాటం వద్దని కాంగ్రెస్, ఆప్‌లకు హితవు పలికారు. పరీక్షలకు హాజరయ్యే వారిని అడ్డుకోవద్దని జేఎన్‌యూ విద్యార్ధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జేఎన్‌యూ ఘటనపై విచారణ సాగుతోందని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.మరోవైపు జేఎన్‌యూ దాడికి తమదే బాధ్యతని హిందూ రక్షా దళ్ ప్రకటించింది. జేఎన్‌యూ కమ్యూనిస్టులకు అడ్డాగా మారిందని, జాతి వ్యతిరేక..హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వారు పాల్పడుతున్నందునే తమ కార్యకర్తలు క్యాంపస్‌లోకి చొచ్చుకువచ్చి దాడులు జరిపారని ఆ సంస్ధ నేత తోమర్ ఓ వీడియోలో వెల్లడించారు. చదవండి : జేఎన్‌యూ దాడి మా పనే -
ఆ దాడుల వెనుక అంతా కశ్మీరీలే
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల వెనుక కశ్మీరీ ఆందోళనకారులు ఉన్నారని అన్నారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా కశ్మీర్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల వెనుక ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. వారి కారణంగానే 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. యూపీ, బిహార్‌లో జరిగిన దాడుల్లో అక్కడి స్థానిక యువత ఎవరూ పాల్గొనలేదని అంతా కశ్మీర్ నుంచి వచ్చిన వారేనని అన్నారు. ఈ ఘటనలకు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కూడా మద్దతు తెలిపాయని మంత్రి విమర్శించారు. కాగా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా యూపీ, బిహార్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 16కు పైగా నిరసనకారులు మృతి చెందారు. -
మూక హత్యలపై కేంద్రం రియాక్షన్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మూక హత్యలను నిరోధించేందుకు కఠిన చట్టం అవసరమనే చర్చ ఊపందుకున్న క్రమంలో శాంతిభద్రతల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం రాజ్యసభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ పోలీసులు, శాంతి భద్రతల పర్యవేక్షణ రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర అంశాలని పేర్కొన్నారు. గత ఆరు నెలల కాలంలో మూక హత్యలు, సామూహిక దాడులు పెరిగాయా అని సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నేరాలను నియంత్రించడం, వాటిని గుర్తించడం, తమ యంత్రాంగం ద్వారా నేరస్తులను ప్రాసిక్యూట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని చెప్పుకొచ్చారు. దేశంలో మూకదాడులు, హత్యలకు సంబంధించి జాతీయ నేర రికార్డుల బ్యూరో నిర్ధిష్ట సమాచారం నిర్వహించడం లేదని తెలిపారు. -
‘ప్రత్యేక హోదా’ను ఆర్థిక సంఘానికి నివేదించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపచేయాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 26, 2019న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని, దీన్ని 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపామని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ అంశం ముగిసిన అధ్యాయమని చెబుతూ వచ్చిన కేంద్రం తాజాగా ఈ అంశాన్ని 15వ ఆర్థిక సంఘానికి నివేదించామని చెప్పడం కీలకమలుపుగా భావించవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన పలు ప్రశ్నలకు మంగళవారం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. తాజాగా మే 26న ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నుంచి వచ్చిన అభ్యర్థనను 15వ ఆర్థిక సంఘం పరిశీలనకు పంపాం..’ అని పేర్కొన్నారు. సమాధానాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలకు మధ్య 14వ ఆర్థిక సంఘం వ్యత్యాసం చూపలేదని, తద్వారా ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు. అయితే నీతిఆయోగ్ సిఫారసుల మేరకు ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నట్టు తెలిపారు. -
హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక తరగతి హోదా ఉనికే లేదని 14వ ఆర్థిక సంఘం తేల్చిచెప్పినట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ప్రత్యేక తరగతి హోదా అనేది ఇప్పుడు లేదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దీని స్థానంలో ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సమానంగా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు, విదేశీ ప్రాజెక్టులకు రీపేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ మేరకు 2015 నుంచి 2020 వరకు ప్రత్యేక సహాయం చేస్తాం. ఏపీ విభజన చట్టం అమలుపై ఇప్పటివరకు 23 సమీక్షా సమావేశాలు నిర్వహించాం. విభజన చట్టం అమలు కోసం ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. మౌలిక వసతుల ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం’’ అని వివరించారు. అంతకుముందు పార్లమెంట్లో చర్చలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, నిత్యానంద్ రాయ్ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ తదితర సీనియర్ అధికారులు మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు. -
నిత్యానంద వివాదాస్పద వ్యాఖ్యలు
పట్నా: బిహార్ బీజేపీ అధ్యక్షుడు, ఉజియర్పూర్ ఎంపీ నిత్యానంద రాయ్ ప్రధాని నరేంద్ర మోదీపై స్వామిభక్తి చాటుకుని వివాదంలో చిక్కుకున్నారు. మోదీని వేలెత్తి చూపే వారి చేతులు, వేళ్లు నరికేస్తామని వ్యాఖ్యానించి దుమారం రేపారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీ సొంత కుమారుడు పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారు. మనుషుల మధ్య అభిప్రాయబేధాలు సహజం. దేశంలో వాటికి విలువ ఇవ్వాల్సిందే. ఆయనకు(మోదీ)కి వ్యతిరేకంగా ఎవరైనా చేయి లేదా వేలెత్తి చూపితే వాటిని విరగొట్టేందుకు మేమంతా ఒక్కటవుతాం. నరడానికి కూడా వెనుకాడబోమ’ని వ్యాఖ్యానించారు. నిత్యానంద వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యానంద వ్యాఖ్యలను జేడీ(యూ) నాయకుడు అజయ్ అలోక్ సమర్థించారు. ఆయన మాటల్లోని భావోద్వేగాలు చూడాలని, ఆయన వాడిన మాటలు కాదని అన్నారు. నరేంద్ర మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని నిత్యానంద పేర్కొనడం గమనార్హం.