జమ్మూకశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన | After Normalcy Will Be Granted State Hood To Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని రాజ్యసభలో వెల్లడి

Published Wed, Jul 28 2021 2:46 PM | Last Updated on Wed, Jul 28 2021 2:52 PM

After Normalcy Will Be Granted State Hood To Jammu And Kashmir - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన లఢక్‌, కశ్మీర్‌లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆ ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో బుధవారం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆగస్ట్‌ 5, 2019న జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తు కల్పిస్తున్న 370, 35ఏ అధికరణలను కొట్టివేశారు. వాటిని రాజ్యాంగం నుంచి తొలగించి  జమ్మూకశ్మీర్‌, లఢక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే.

బీజేపీ ఎంపీ సస్మిత్‌ పాత్ర జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలపై ప్రశ్న వేశారు. రెండూ ప్రశ్నలకు కలిపి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 2020లో 59 శాతం ఉంటే జూన్‌ 2021 వరకు 32 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై నిరంతర నిఘా పెట్టినట్లు చెప్పారు. లోయలో కశ్మీరీ పండితుల పునరావాసం.. భద్రతపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 900 కశ్మీరీ పండిత్‌, డోగ్రా హిందూ కుటుంబాలు కశ్మీర్లో ఉన్నాయని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement