
న్యూఢిల్లీ: ఎన్డీయే పక్షాలతో ఈనెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఈ మేరకు లేఖ రాశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్‌కూ లేఖ అందింది.
ఆయనతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఇప్పటికే భేటీ కావడం తెలిసిందే. బిహార్ మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ కూడా హాజరవుతారని సమాచారం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతస్థాయిలో ఎన్డీయే భేటీ జరగనుండటం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment