సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసనల వెనుక కశ్మీరీ ఆందోళనకారులు ఉన్నారని అన్నారు. ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా కశ్మీర్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల వెనుక ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. వారి కారణంగానే 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. యూపీ, బిహార్‌లో జరిగిన దాడుల్లో అక్కడి స్థానిక యువత ఎవరూ పాల్గొనలేదని అంతా కశ్మీర్ నుంచి వచ్చిన వారేనని అన్నారు. ఈ ఘటనలకు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కూడా మద్దతు తెలిపాయని మంత్రి విమర్శించారు.
కాగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా యూపీ, బిహార్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 16కు పైగా నిరసనకారులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment