కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రికార్డు స్థాయిలో వివిధ సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తాజాగా ఉత్తరప్రదేశ్‌లో 21 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చర్చకు దారి తీస్తోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికే చాలాసార్లు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
► డిసెంబర్ 19న రాజధాని ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు.
► జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసినపుడు అంటే ఆగస్టు 5న నిలిపేసిన ఇంటర్నెట్ సేవల్ని ఇప్పటివరకు చాలాచోట్ల పునరుద్ధరించలేదు.
► ఇటీవల వివాదాస్పద బాబ్రీమసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువడ్డానికి ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు.
► 2012 నాటికి కశ్మీర్‌లో ఒకట్రెండు జిల్లాలకే పరిమితమైన ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది 2019 వచ్చేసరికి 14 రాష్ట్రాలకు చేరుకుంది.
► నిరసనలు, ఆందోళనలు జరిగిన ప్రతీసారి తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికే ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పౌరులకు ఉండే ఒక సదుపాయాన్ని రద్దు చేయడం ప్రాథమిక హక్కుని కాలరాయడమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి.
► అంతేకాదు ఇలా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం వల్ల భారత్‌కి 2012–2017 మధ్య 300 కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని ఓ అంచనా.
గతంలోనూ..
► భారత్‌లో తొలిసారిగా 2010లో గణతంత్ర వేడుకకు ముందు కశ్మీర్ లోయ ప్రాంతంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను ప్రభుత్వం ఆపేసింది.
► 2016లో హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని సైన్యం మట్టుబెట్టాక కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి.
► 2016లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాల్యాండ్ ఆందోళనలు ఉధృతంగా ఉన్నపుడు 100 రోజులు ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు.
► 2015లో గుజరాత్‌లో పటీదార్‌ల ‘రిజర్వేషన్’ల ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇంటర్నెట్ షట్‌డౌన్ @ 100
Published Sat, Dec 28 2019 2:00 AM | Last Updated on Sat, Dec 28 2019 2:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment