internet shutdown
-
ఇంటర్నెట్ షట్‌డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా?
ఈ ఏడాది ప్రథమార్థంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్డౌన్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది. ఈ ఇంటర్నెట్ షట్డౌన్లు దాదాపు 118 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 968 కోట్లు) విదేశీ పెట్టుబడుల నష్టానికి కారణమయ్యాయని, 21,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ లాభాపేక్షలేని ఇంటర్నెట్ సొసైటీ తన నివేదిక 'నెట్‌లాస్'లో పేర్కొంది. ఇంటర్నెట్ నిషేధ ప్రభావం ఉత్పత్తి నష్టానికే పరిమితం కాదని, నిరుద్యోగ రేటులో మార్పు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోల్పోవడం, భవిష్యత్తులో షట్డౌన్ల ప్రమాదాలు, పని చేసేవారి జనాభా మొదలైన అంశాలపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ఇంటర్నెట్ షట్డౌన్లు అశాంతిని అణచివేస్తాయని, తప్పుడు సమాచార వ్యాప్తిని ఆపివేస్తాయని లేదా సైబర్ సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తాయని ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. కానీ ఇంటర్నెట్ షట్డౌన్లు ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని అని నివేదిక పేర్కొంది. అల్లర్లను నియంత్రించడానికి భారత్ ఇంటర్నెట్ షట్డౌన్లను ఒక సాధనంగా ఉపయోగించడం వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకు భారతదేశానికి 16 శాతం షట్‌డౌన్ రిస్క్ ఉందని, ఇది 2023 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని తెలిపింది. ఇంటర్నెట్ షట్డౌన్ల వల్ల ఈ-కామర్స్ వ్యాపారాలు స్తంభిస్తాయి. తద్వారా కాలాధారమైన లావాదేవీలు నష్టాలను మిగుల్చుతాయి. నిరుద్యోగాన్ని పెంచుతాయి. వ్యాపార సంస్థలు, కస్టమర్ల కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగిస్తాయి. కంపెనీలకు ఆర్థికంగా నష్టాలను మిగిల్చడమే కాకుండా పరపతికి భంగం కలిగిస్తాయని నివేదిక ఉద్ఘాటించింది. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
ఇంటర్నెట్ షట్‌డౌన్: వరుసగా ఐదోసారి భారత్ టాప్!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ షట్డౌన్ల విషయంలో ప్రపంచంలోlo భారతదేశం మరోసారి టాప్‌లో నిలిచింది. 2022లో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్డౌన్లు విధించిన దేశంగా భారత్ నిలిచింది, ఇది వరుసగా ఐదోసారి అని ఇంటర్నెట్ అడ్వకేసీ వాచ్డాగ్ యాక్సెస్ నౌ మంగళవారం తెలిపింది, న్యూయార్క్‌కు చెందిన యాక్సెస్ నౌ అనే సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదు చేయబడిన 35 దేశాల్లో 187 ఇంటర్నెట్ షట్డౌన్లలో, 84 భారతదేశంలోనే కావడం గమనార్హం. ఈ 84 లో 49 సార్లు జమ్మూకాశ్మీర్‌లో జరిగాయని యాక్సెస్ నౌ తన నివేదికలో తెలిపింది. రాజకీయ అస్థిరత, హింస కారణంగా కాశ్మీర్లో కనీసం 49 సార్లు ఇంటర్నెట్ యాక్సెస్‌కు అంతరాయం కలిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఆగస్ట్ 2019లో భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదాని రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీరు, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఫిబ్రవరి 2022లో మూడు రోజుల పాటు కర్ఫ్యూ- షట్డౌన్ల కోసం 16 బ్యాక్-టు-బ్యాక్ ఆర్డర్లు ఉన్నాయఅని వాచ్డాగ్ నివేదిక జోడించింది. అయితే ఈ విషయంలో ఇండియా టాప్‌లో ఉన్నప్పటికీ 2022లో 100 కంటే తక్కువ షట్డౌన్లు విధించడం 2017 తర్వాత ఇదే తొలిసారి అని నివేదిక వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ జాబితాలో రష్యా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత కనీసం 22 సార్లు రష్యా సైన్యం ఇంటర్నెట్ యాక్సెస్‌ను ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని పేర్కొంది. ప్రభుత్వానికి వ్యతిరేక ప్రదర్శనలతో 2022లో అధికారులు 18 ఇంటర్నెట్ షట్డౌన్లను విధించిన జాబితాలో ఉక్రెయిన్ తరువాత ఇరాన్ అనుసరించింది. గత ఏడాది సెప్టెంబరు 16న పోలీసు కస్టడీలో 22 ఏళ్ల కుర్దిష్-ఇరానియన్ మహిళ మహ్సా అమినీ మరణించిన తర్వాత గత పతనం ఇరాన్లో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుఅమినిని టెహ్రాన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె మరణించడం ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
అస్సాం-మేఘాలయ బార్డర్ చిచ్చు.. ఆరుగురి మృతి.. ఇంటర్నెట్ బంద్
సరిహద్దులో కాల్పుల ఘటన ఉద్రిక్తతలతో మేఘాలయ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఏడు జిల్లాల్లో 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అసోం(పూర్వ అస్సాం)-మేఘాలయ సరిహద్దు వెంట జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మరణించారు. దీంతో.. సోషల్ మీడియాలో వందతులు వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ జైంటియా హిల్స్ వద్ద అక్రమ కలప రవాణాను అడ్డుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసులు-ఫారెస్ట్ అధికారులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయకు చెందిన వ్యక్తులతో పాటు ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఓ ఫారెస్ట్ గార్డు చనిపోయినట్లు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం వెల్లడించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఈ ఉదయం(మంగళవారం) 10.30 నుంచి 48 గంటలపాటు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపిన మేఘాలయ పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు వెల్లడించారు. మరోవైపు అసోం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మంగళవారం ఉదయం అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో అస్సాం-మేఘాలయ సరిహద్దులో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో.. మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లా ముఖో వైపు అక్రమంగా కలప తరలిస్తున్న టింబర్‌ను అసోం అటవీ శాఖ బృందం అడ్డుకుంది. ఈ క్రమంలో వాళ్లు పారిపోయే క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ సిబ్బంది జిరికెండింగ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత.. మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం ప్రాంతంలో అక్కడకు వచ్చారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని అస్సాం పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉండగా.. మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు భద్రతను పెంచారు. ఐదుగురు కూడా బుల్లెట్ గాయాలతో మరణించారా లేదా మరేదైనా ఆయుధం తగలడంతో మృతిచెందారా? అసోం ఫారెస్ట్ మరణానికి కారణం ఏంటన్న దానిపై అసోం పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అస్సాం గార్డులే మొదటగా టింబర్ల టైర్లను కాల్చారని చెప్తున్నారు. నలుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఫారెస్ట్ గార్డు గాయపడి మరణించినట్లు సమాచారం. 1972లో మేఘాలయ అస్సాం నుండి వేరు అయ్యింది. అప్పటి నుంచి అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ నడుస్తూనే వస్తోంది. ఇరు రాష్ట్రాలు గతేడాది ఆగస్టులో మూడు ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ఈ సమస్య పరిష్కారానికి సిద్ధం అయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు.. ఓ డ్రాఫ్ట్ రెజల్యూషన్‌ను హోం మంత్రి అమిత్ షాకు జనవరి 31వ తేదీన సమర్పించాయి. ఒప్పందాల నడుమే ఉద్రిక్తతలు ఇరు రాష్ట్రాలకు సంబంధించి 884.9 కిలోమీటర్ల సరిహద్దు వెంట 12 వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఆరింటికి సంబంధించి పరిష్కారం కోసం మార్చి నెలలో.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఒక ఒప్పందం చేసుకున్నారు. దీంతో.. ఐదు దశాబ్దాల నాటి వివాదాన్ని ఓ కొలిక్కి వస్తుందని అంతా అనుకున్నారు. ఇక.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ ఒప్పందం చారిత్రాత్మకమని, సంతకంతో 70% వివాదం పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో మిగిలిన ప్రాంతాల్లో వివాదాన్ని పరిష్కరించేందుకు శర్మ, సంగ్మా చర్చలు జరిపారు. అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈలోపు.. అస్సాం 18.51 స్క్వేర్ కిలోమీటర్లు, మేఠాలయా 18.21 స్క్వేర్ కిలోమీటర్లు ఉంచేసుకోవాలని ప్రతిపాదించాయి. తొలిదశలో 36 గ్రామాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది కూడా. ఇదిలా ఉంటే.. మిజోరాంతోనూ గతంలో ఇలాగే సరిహద్దు విషయంలో ఘర్షణలు తలెత్తాయి. 2021లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు అస్సాం పోలీసులు దుర్మరణం పాలయ్యారు. -
ఇంటర్నెట్ నిలిపివేతకు ప్రొటోకాల్ ఉందా: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో ఇష్టారాజ్యంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడానికి ఏదైనా ప్రొటోకాల్ ఉందా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్లో తరచుగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేస్తున్నారని ఆరోపిస్తూ సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు నోటీసు జారీ చేసింది. సాఫ్ట్వేర్ లా సెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించింది. ప్రొటోకాల్ ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని పేర్కొంది. నాలుగు రాష్ట్రాలకు నోటీసు ఇవ్వడం లేదని తెలిపింది. -
ఇంటర్నెట్ షట్డౌన్లో టాప్ ఎవరంటే?
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ షట్డౌన్లో వరుసగా నాలుగో ఏడాది మన దేశం టాప్‌లో నిలిచింది. ఏ దేశానికి అందనంత ఎత్తులో ఉంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా 34 దేశాలలో కనీసం 182 సార్లు ఇంటర్నెట్ను మూసివేశారు. ఇందులో ఇండియావే 106 ఉన్నాయని టెక్ పాలసీ థింక్ ట్యాంక్ ‘యాక్సెస్ నౌ’ తన నివేదికతో పేర్కొంది. ఆందోళనలను అరికట్టడం, ఆన్లైన్ మోసాలను నిరోధించే క్రమంలో గతేడాది భారత్‌లో 106 పర్యాయాలు ఇంటర్నెట్ను నిలిపివేయగా.. జమ్మూకశ్మీర్లోనే 85 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు. 2020తో పోల్చుకుంటే ఈ సంఖ్య కొంచెం తక్కువగా ఉంది. 2020లో భారత్‌లో 109 పర్యాయాలు ఇంటర్నెట్ బంద్ చేశారు. 2021 ఇంటర్నెట్ షట్‌డౌన్ జాబితాలో భారత్ తర్వాతి స్థానాల్లో మయన్మార్, సూడాన్, ఇరాన్ ఉన్నాయి. మయన్మార్‌లో కనీసం 15 సార్లు ఇంటర్నెట్ నిలిపివేశారు. సూడాన్, ఇరాన్ దేశాల్లో ఐదేసి పర్యాయాలు ఇంటర్నెట్ షట్‌డౌన్ నమోదయింది. (క్లిక్: క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో) సీమాంతర ఉగ్రవాదం ఎక్కువగా ఉండే జమ్మూకశ్మీర్‌లో నియంత్రణల కారణంగా అక్కడ ఎక్కువగా ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదవుతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్న సందర్భాల్లో రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శి, కేంద్ర హోం సెక్రటరీ అభ్యర్థనల మేరకు ఇంటర్నెట్ను నిలిపేస్తుంటారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155 సందర్భాలలో ఇంటర్నెట్ను నిలిపివేయగా.. భారత్‌లో 109 సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేశారు. (క్లిక్: ఈ ఏడుగురు అద్భుతం.. మీ అందరికీ సలామ్!) -
యెమెన్ జైలుపై సౌదీ వైమానిక దాడి
దుబాయ్: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహించే ఒక జైలుపై సౌదీ ఆధ్వర్యంలో శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో వందమందికి పైగా గాయపడడం, చనిపోవడం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు యెమెన్‌లోని హోడైడా నగరంలో ఉన్న కమ్యూనికేషన్ సెంటర్‌పై వైమానిక దాడి జరగడంతో దేశమంతా ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో సౌదీ, యూఏఈపై హౌతీ రెబల్స్ డ్రౌన్ దాడులు పెరిగాయి. వీటికి ప్రతీకారంగా అరబ్ దేశాల కూటమి ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. సదా నగరంలోని జైలుపై జరిగిన దాడిలో గాయపడిన వారిని రక్షించే కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు రెడ్‌క్రాస్ సంస్థ ప్రకటించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ విషయమై హౌతీ వర్గాలు ఇంకా స్పందించలేదు. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ దాడులు బాగ్దాద్: ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు. సిరియాలోని అతిపెద్ద జైలుపై దాదాపు 100మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు గురువారం రాత్రి దాడి జరిపగా, ఇరాక్‌లో ఆర్మీ బ్యారక్‌పై శుక్రవారం విరుచుకుపడ్డారు. ఇరాక్‌లో జరిగిన దాడిలో 11మంది ఇరాకీ సైనికులు చనిపోగా, సిరియా జైలు దాడిలో ఏడుగురు కుర్దిష్ సైనికులు, 23 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల కాలంలో రెండు దేశాల్లో ఐసిస్ స్లీపర్ సెల్స్ చురుగ్గా పనిచేయడం ఆరంభించి పలువురు ఇరాకీ, సిరియన్ల మృతికి కారణమవుతున్నాయి. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ దగ్గరలోని సైనిక శిబిరంపై ఐసిస్‌లు తుపాకులతో విరుచుకుపడ్డారు. దీంతో శిబిరంలో నిద్రిస్తున్న ఒక లెఫ్టినెంట్ సహా 10మంది సైనికులు చనిపోయారు. మరోవైపు సిరియాలో ఇటీవల ఐసిస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇందుకు ప్రతీకారంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా గ్వేరియన్ జైలుపై దాడికి దిగారు. ఆ సమయంలో జైల్లో 3వేలమంది ఐసిస్ మిలిటెంట్లున్నారని కుర్దిష్ డెమొక్రాటిక్ బలగాల ప్రతినిధి ఫర్హాద్ షామి చెప్పారు. దాడికి ముందు జైల్లో ఉగ్రవాదులు తిరుగుబాటు చేసి పారిపోయేందుకు యత్నించారని, ఇదే సమయంలో జైలు బయట ఒక కారుబాంబు పేలిందని జైలు వర్గాలు తెలిపాయి. దాడికి దిగిన ఉగ్రవాదుల్లో సిరియన్లు లేరని, వీరంతా విదేశీయులని తెలిపారు. దాడి అనంతరం తప్పించుకున్న 89 మంది ఉగ్రవాదులను తిరిగి పట్టుకున్నారు. 2017లో ఇరాక్, 2019లో సిరియాల్లో ఐసిస్ ఓడిపోయింది. అప్పటినుంచి ఇలా మెరుపుదాడులకు దిగడం ఆరంభించింది. దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాక్ మిలటరీ ప్రతిజ్ఞ చేసింది. -
ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. జుకర్‌బర్గ్ పుట్టి ముంచిన ఆ ఒక్కడు!
WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్పై పడగా.. ట్విటర్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్‌డౌన్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్. అతని వల్లే.. ఇక ఫేస్బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్లో సరదా మీమ్స్‌తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్).. ఇంటర్నెట్కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్‌వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది. Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored. — Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021 చదవండి: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ చదవండి: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం -
ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు
సాక్షి /న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సదుపాయంపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఇంటర్నెట్ ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ఈ–బిజినెస్ నిర్వహించడం ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ద్వారా ఎక్కువగా జరుగుతోందని, ఆ సేవల్ని నిరవధికంగా నిలిపివేయకూడదని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్పై విధించిన ఆంక్షల్ని వారంలోగా సమీక్షించాలని కశ్మీర్ పాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఇంటర్నెట్ తదితరాలపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ వాక్యాలతో.. ‘‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన శకం, వెల్లివిరిసిన విజ్ఞానం, బ్రహ్మజెముడులా అజ్ఞానం, స్వర్గానికి రాచబాట పుచ్చుకున్న జనం నడుస్తున్నారు నరకానికి’’అంటూ చార్లెస్ డికెన్స్ రాసిన రెండు మహానగరాలు(ఏ టెల్ ఆఫ్ టూ సిటీస్) నవలలోని వాక్యాలను జస్టిస్ ఎన్వీ రమణ తన తీర్పులో ఉటంకించారు. భూతల స్వర్గంగా కశ్మీర్ మన హృదయాల్లో నిలిచినప్పటికీ, ఈ అందమైన ప్రాంతపు చరిత్ర హింస, తీవ్రవాదంతో కూడుకొని ఉంది’ అని వ్యాఖ్యానించారు. పౌరుల స్వేచ్ఛను, వారి భద్రతను సమతుల్యం చేయడమే కోర్టుల పని అని ఆయన పేర్కొన్నారు. ‘భావప్రకటనా స్వేచ్ఛ, ఏదైనా వృత్తిని చేపట్టే స్వేచ్ఛ, ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(1)(జీ) రక్షణ కల్పిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ తన 130 పేజీల తీర్పులో పేర్కొన్నారు. ప్రాథమిక హక్కుల్ని కాలరాయకూడదు సీఆర్పీసీ 144వ సెక్షన్ ద్వారా జారీ చేసే ఉత్తర్వులు ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తాయని, వాటిపై నిరవ«ధికంగా ఉక్కుపాదం మోపకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ అధికారాన్ని అతిగా వినియోగిస్తే అక్రమాలకు దారితీస్తుందని పేర్కొంది. అత్యవ సర సేవలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలతో పాటుగా ప్రభుత్వ వెబ్సైట్లు, ఈ బ్యాంకింగ్ రంగంలో ఇంటర్నెట్ను తక్షణమే పునరుద్ధరించా లని ఆదేశించింది. ఇంటర్నెట్ సౌకర్యం ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. కశ్మీర్లో విదేశీ రాయబారుల పర్యటన జమ్ము: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా అమెరికా సహా 15 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. అక్కడ వివి«ధ పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల్ని కలుసుకొని మాట్లాడారు. కశ్మీర్ చీఫ్ సెక్రటరీ బీవీఆర్ సుబ్రహ్మణియన్, డీజీపీ దిల్బాగ్ సింగ్‌లతో కూడిన అత్యున్నత స్థాయి బృందం కశ్మీర్ లోయలో పరిస్థితుల్ని దౌత్యవేత్తలకు వివరించింది. పౌర సంఘాల ప్రతిని«ధుల్లో ఎక్కువ మంది తాము ఆర్టికల్ 370కి మద్దతు ఇస్తున్నట్టుగా దౌత్యవేత్తలకు తెలిపారు. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్‌తో సహా వీరంతా శ్రీనగర్‌లో ఏడు గంటలకు పైగా గడిపారు. మోదీ సర్కార్‌కు పెద్ద ఝలక్ : కాంగ్రెస్ ఇంటర్నెట్ సదుపాయం ప్రజల ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పడం ద్వారా సుప్రీంకోర్టు మోదీ సర్కార్‌కు గట్టి ఝలక్ ఇచ్చిందని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజల అసమ్మతి జ్వాలల్ని నిషే«ధాజ్ఞల ద్వారా ఎక్కువ కాలం తొక్కి పెట్టి ఉంచలేరని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. మోదీ సర్కార్ చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సుప్రీం తీర్పు ద్వారా 2020లో తొలి దెబ్బ తగిలిందన్నారు. మొదటిసారిగా సుప్రీంకోర్టు కశ్మీర్ ప్రజల మనోభావాలపై మాట్లాడిందని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు. -
గంటకు దాదాపు రూ.రెండున్నర కోట్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్ను నిలిపివేయడం వల్ల నెట్వర్క్ కంపెనీలు భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. గంటకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు నష్టపోతున్నట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ శుక్రవారం వెల్లడించారు. సీవోఏఐలో ఎయర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు సభ్యులుగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోనలు మరింత పెరగకుండా ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాల్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో టిక్‌టాక్, ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా వదంతులు వ్యాప్తిచెందడాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వ వర్గాల విశ్లేషణ. ఓ అధ్యయనం ప్రకారం ఇండియాలో సగటు ఇంటర్నెట్ వినియోగం నెలకు 10 జీబీ. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాకుండా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా యాప్‌లకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన డేటా వినియోగం ప్రకారం టెల్కోలకు జరుగుతున్న నష్టాన్ని లెక్కిస్తే ఇంచుమించుగా గంటకు రెండున్నర కోట్లుగా తేలిందని రాజన్ వివరించారు. మరోవైపు సీఏఏపై వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తరచూ నెట్ సేవలను నిలిపివేయడంపై నెట్ ప్రియులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కేనన్న కేరళ హైకోర్టు తీర్పును వారు ఉటంకిస్తున్నారు. చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్ @ 100 లోయలో ఇంటర్నెట్ ఎప్పుడు? -
ఇంటర్నెట్ షట్‌డౌన్ @ 100
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రికార్డు స్థాయిలో వివిధ సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తాజాగా ఉత్తరప్రదేశ్‌లో 21 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చర్చకు దారి తీస్తోంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమబెంగాల్లో ఇప్పటికే చాలాసార్లు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ► డిసెంబర్ 19న రాజధాని ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. ► జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసినపుడు అంటే ఆగస్టు 5న నిలిపేసిన ఇంటర్నెట్ సేవల్ని ఇప్పటివరకు చాలాచోట్ల పునరుద్ధరించలేదు. ► ఇటీవల వివాదాస్పద బాబ్రీమసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువడ్డానికి ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. ► 2012 నాటికి కశ్మీర్లో ఒకట్రెండు జిల్లాలకే పరిమితమైన ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది 2019 వచ్చేసరికి 14 రాష్ట్రాలకు చేరుకుంది. ► నిరసనలు, ఆందోళనలు జరిగిన ప్రతీసారి తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికే ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పౌరులకు ఉండే ఒక సదుపాయాన్ని రద్దు చేయడం ప్రాథమిక హక్కుని కాలరాయడమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ► అంతేకాదు ఇలా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం వల్ల భారత్‌కి 2012–2017 మధ్య 300 కోట్ల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని ఓ అంచనా. గతంలోనూ.. ► భారత్‌లో తొలిసారిగా 2010లో గణతంత్ర వేడుకకు ముందు కశ్మీర్ లోయ ప్రాంతంలో ఇంటర్నెట్, ఫోన్ సేవలను ప్రభుత్వం ఆపేసింది. ► 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని సైన్యం మట్టుబెట్టాక కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ► 2016లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాల్యాండ్ ఆందోళనలు ఉధృతంగా ఉన్నపుడు 100 రోజులు ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు. ► 2015లో గుజరాత్లో పటీదార్ల ‘రిజర్వేషన్’ల ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. -
ప్రభుత్వానికి ఆ హక్కు ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ మా జన్మహక్కు అంటూ యంగ్ జనరేషన్ నినదిస్తోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ యువత ప్రభుత్వాలకు సవాలు విసురుతోంది. ఇంటర్నెట్ను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేరళ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దేశంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాల సేవలను తొలగిస్తోంది. దీనిపై యువత తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు చోటుచేసుకున్నా.. ప్రభుత్వం వెంటనే చేపడుతున్న అత్యవసర చర్య ఇంటర్నెట్ నిలిపివేత. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ఘటనలు అందరికీ తెలిసిందే. ఆర్టికల్ 370తో మొదలుకొని ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజాగ్రహం కారణంతో ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేస్తోంది. 2012 నుంచి దేశ వ్యాప్తంగా 374 సార్లు ఈ సేవలను ప్రభుత్వం కట్‌చేసింది. ముఖ్యంగా గడిచిన ఏడాదిలో కాలంలో (2019) వివిధ ప్రాంతాల వారిగా చూస్తే 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవల నుంచి పౌరులను దూరం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో ఆగస్ట్ 5న కశ్మీర్ వ్యాప్తంగా అంతర్జాల సేవలను అక్కడి పౌరులకు ప్రభుత్వం నిరాకరించింది (కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది). ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండటం, సోషల్ మీడియా వేదికగా అల్లర్లకు పిలువునివ్వడం వంటి చర్యలను నివారించడానికే ఈ నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ఎన్ఆర్సీ, సీఏఏకు ఆందోళనల నడుమ ఎక్కడ నిరసనలు వినిపించినా ప్రభుత్వం వెంటనే ఇంటర్ నెట్‌ను నిలిపివేస్తోంది. ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా సీఏఏపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం ప్రార్థనల దృష్ట్యా యూపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని నిలిపివేసింది. నిరసనలను పర్యవేక్షించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపింది. పశ్చిమ యూపీలోని బిజ్నోర్, బులంద్ షహర్, ముజఫర్‌నగర్, మీరట్, ఆగ్రా, ఫిరోజాబాద్, సంభల్, అలీగఢ్, ఘజియాబాద్, రాంపూర్, సీతాపూర్, కాన్పూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ను కట్‌చేశారు. దీంతో ప్రభుత్వ చర్యలపై పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కల్పించిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. ఇంటర్నెట్ సేవలకు పౌరుల ప్రాథమిక హక్కు అని 2016లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పలువురు గుర్తుచేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కూడా చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు.. కాగా ఇంటర్ నెట్ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుగా కేరళ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఇంటర్ నెట్ నిలిపివేయడం అంటే పౌర హక్కులకు విఘాతం కల్పించడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం 20 లక్షల మంది పేద కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.1548 కోట్ల ఖర్చుతో చేపట్టిన కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్టు 2020 డిసెంబరు నాటికి పూర్తికానుంది. కాగా 2018 నాటికి దేశంలో 48 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 68 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే దేశంలో సగానికిపైగా జనాభా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరికైనా ఎక్కడైనా ఇంటర్నెట్ నిరాకరించడం అంటే..పౌరుల ప్రాథమిక హక్కును కాలరాయడమే అని పేర్కొంది. భవిష్యత్తులో దేశంలోని ప్రతి రాష్ర్ట ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సి ఉంటుందని సంకేతాలిచ్చింది. కాగా ఇంటర్నెట్ను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. -
ఆందోళనలు.. అరెస్ట్‌లు
న్యూఢిల్లీ: ‘పౌర’ ఆగ్రహం తీవ్రమవుతోంది. ఆందోళనలపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. పలు పట్టణాలు, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. యూపీ, బిహార్‌ల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆందోళన ల్లో పాల్గొన్న లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, నీలోత్పల్ బసు, బృందా కారత్, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ను, మొబైల్ సేవలను నిలిపేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రంగా నిలిచిన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కేరళ, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం తథ్యమని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఢిల్లీలో.. 144 సెక్షన్ విధించినప్పటికీ నిరసనకారులు వెనక్కుతగ్గలేదు. వేలాదిగా ఎర్రకోట, జంతర్‌మంతర్, మండిహౌజ్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. 1975 నాటి ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దారుణంగా ఉందని మండిహౌజ్ వద్ద ఆందోళనల్లో పాల్గొని అరెస్టైన సీపీఎం నేత ఏచూరి అన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా కొన్ని గంటల పాటు కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సహా అన్ని మొబైల్ సేవలను నిలిపేశారు. ‘నిర్భయ’ ఆందోళనలు, అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలోనూ పోలీసులు ఇంతటి చర్య తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లో.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో రణరంగమైంది. నగరవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఒక పోలీస్ ఔట్‌పోస్ట్ వెలుపల వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సంబల్ ప్రాంతంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సును తగలపెట్టారు. బిహార్‌లో.. వామపక్ష విద్యార్థులు రోడ్లను, రైల్వే ట్రాక్‌లను నిర్బంధించి నిరసన తెలిపారు. పట్నాలో మాజీ ఎంపీ పప్పు యాదవ్ నేతృత్వంలోని జన అధికార పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై టైర్లను తగలబెట్టి వాహనాలను అడ్డుకున్నారు. జహానాబాద్‌లో సీపీఐఎంఎల్ కార్యకర్తలు రోడ్ రోకో నిర్వహించారు. మహారాష్ట్రలో.. ముంబైలోని క్రాంతి మైదాన్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, పలు ఇతర పార్టీలు ‘హమ్ భారత్ కే లోగ్’ పేరుతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో వేలాదిగా పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే మైదానం నుంచి 1942లో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా’ నినాదం ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 94 ఏళ్ల జీజీ పారిఖ్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలోనూ పాల్గొని చరిత్ర సృష్టించారు. పశ్చిమబెంగాల్లో.. కోల్‌కతాలో వరుసగా నాలుగోరోజు ముఖ్యమంత్రి మమత బెనర్జీ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో స్వయంగా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మోదీ సర్కారును సవాలు చేశారు. ఈ రెఫరండంలో ఓడిపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఇద్దరి మృతి మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, పోలీసులపై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారని, వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. బెంగళూరు, హుబ్బలి, కలబుర్గి, హాసన్, మైసూర్, బళ్లారిల్లో విపక్షాలు, ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బెంగళూరులో ఆందోళనల్లో పాల్గొన్న రామచంద్ర గుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం అప్రజాస్వామికమని గుహ విమర్శించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అప్రమత్తంగా ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు గుహ అరెస్ట్ దృశ్యం -
2018లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ షట్‌డౌన్
కశ్మీర్లో కల్లోలం.. ఇంటర్నెట్ కట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్ డౌన్ సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్ ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం న్యూఢిల్లీ/వాషింగ్టన్: పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్‌లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి.భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్ హౌస్ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది. ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్ షట్డౌన్లు మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, ఫోన్ సేవల్ని నిలిపివేశారు. ► 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హన్ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ► కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్ ఇంకా వాడకంలోకి రాలేదు. ► 2016లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ► 2015లో గుజరాత్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ పటీదార్ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ► గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ అయింది. ఏ ఏడాది ఎన్నిసార్లు 2017 79 2018 134 2019 90 2012 నుంచి లెక్కల్ని చూసుకుంటే 360సార్లకు పైగా దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. హోంశాఖకి అధికారాలు ప్రజల భద్రత కోసం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, ఆంక్షలు విధించడానికి 2017లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని కొన్ని నిబంధనల్ని చేర్చారు.. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ, హోంశాఖ కార్యదర్శులకు తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసే అధికారం ఉంటుంది. అయితే అయిదు రోజుల తర్వాత పరిస్థితుల్ని తప్పనిసరిగా సమీక్షించాలి. ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ సభ్యుడు ప్రణేష్ ప్రకాశ్ అంటున్నారు. -
కాస్గంజ్లో తీవ్ర ఉద్రిక్తత
-
కాస్గంజ్లో అసలేం జరిగింది..?
లక్నో : మతఘర్షణల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లతో పశ్చిమ ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతోంది. కాస్గంజ్ జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో విద్యార్థి సంఘాలు ర్యాలీ హింస్మాత్మకంగా మారి చందన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం చందన్ అంత్యక్రియల అనంతరం ర్యాలీ చేపట్టిన ఆందోళనకారులు ఒక్కసారిగా తమ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఓ బస్సు, మూడు దుకాణాలను, ఇతర వాణిజ్య సముదాయాలను తగలబెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్లు అదనపు డీజీ ఆనంద్ ప్రకటించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని, సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలించామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా 49 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆదివారం ఉదయం మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణకు దారి తీసిన పరిస్థితి... గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాస్గంజ్ హెడ్‌క్వార్టర్స్‌లో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం సంయుక్తంగా తిరంగా ర్యాలీ చేపట్టింది. ఇంతలో మరో వర్గానికి చెందిన కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' అనే నినాదాలు చేయటంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోగా.. చందన్‌గుప్తా అనే యువకుడు చనిపోయాడు. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. అయితే పోలీసు కాల్పుల్లోనే వారు గాయపడ్డారంటూ వదంతులు వ్యాపించటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అల్లర్లను అదుపు చేసేందుకు భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాజ్గంజ్ జిల్లా కలెక్టర్ ఆర్పీ సింగ్ ను ఫోన్ లో సంప్రదిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మరోవైపు అల్లర్ల ఘటన దురదృష్టకరమని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. -
ఇంటర్నెట్ షట్డౌన్కు మార్గదర్శకాలు
ఇంటర్నెట్ షట్‌డౌన్.. ఈ పదం ఇటీవల మన దేశంలో బాగా సాధారణ మైపోయింది. కొన్ని సమస్యాత్మక పరిస్థితుల్లో ప్రతికూల వార్తలు వ్యాపించకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడమే ‘ఇంటర్నెట్ షట్‌డౌన్’. కేంద్ర ప్రభుత్వం తొలిసారి దీనికి సంబంధించి మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ప్రజా భద్రత లేదా ప్రజల అవసరాల రీత్యా టెలికాం సర్వీసుల తాత్కాలిక నిలిపివేత మార్గదర్శకాలు–2017 ప్రకారం.. జిల్లా కలెక్టర్లు, మేయర్లు వంటి స్థానిక నిర్ణయాధికారులు ఇంటర్నెట్ షట్డౌన్కు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాత్రమే ఉత్తర్వులు జారీ చేయాలి. అత్యవసరం అయితే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి పొందిన సంయుక్త కార్యదర్శి, ఆ పైస్థాయి అధికారి మాత్రమే ఈ ఉత్తర్వులు ఇవ్వగలరు. అయితే వీటిని 24 గంటల్లోగా హోం శాఖ కార్యదర్శి తప్పకుండా సమీక్షించాలి. రాష్ట్రస్థాయిలో అయితే సెక్రటరీ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ది హోం డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేయాలి. అత్యవసరంలో అయితే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి పొందిన సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారి మాత్రమే ఆర్డర్స్ ఇవ్వగలరు. వీటిని సైతం 24 గంటల్లో హోం శాఖ కార్యదర్శి తప్పకుండా సమీక్షించాలి. ఇంటర్నెట్ షట్‌డౌన్ ఉత్తర్వులు ఎస్పీ స్థాయి పోలీసు అధికారికి మాత్రమే ఇవ్వాలి.