
యాక్సెస్ నౌ నివేదికలో వెల్లడి
సైనిక దేశాల్లో మయన్మార్ టాప్
ఇంటర్నెట్ షట్‌డౌన్‌లో ఇండియా వరుసగా ఆరో ఏడాది టాప్‌లో నిలిచింది. ఎక్కువసార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన ప్రజాస్వామ్య దేశాల్లో మనమే ముందున్నాం. డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ నౌ (Access Now) తాజా నివేదిక ప్రకారం.. గతేడాది అంటే 2024లో వేర్వేరు కారణాలతో మనదేశంలో 84 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు. అయితే 2023తో పోల్చుకుంటే భారత్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్లు బాగా తగ్గాయి. 2023లో 116 సార్లు ఇంటర్నెట్ ఆపేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాలు ఉన్న 54 దేశాల్లో గతేడాది 296 పర్యాయాలు ఇంటర్నెట్ సేవలపై షట్‌డౌన్ విధించడం జరిగింది. 2023లో 39 దేశాల్లో 283 సార్లు ఇంటర్నెట్ నిలివేసిన ఘటనలు (internet shut downs) నమోదయ్యాయి.
భారత్ (India) కంటే మయన్మార్‌లో ఎక్కువ సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. 2024లో అక్కడ 85 పర్యాయాలు ఇంటర్నెట్ బంద్ చేశారు. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం ఉందన్న విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకే అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక మన దాయాది దేశం పాకిస్థాన్‌లో 21 సార్లు ఇంటర్నెట్ నిలిపివేసింది. ఆ దేశ చరిత్రలో ఇన్నిసార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేయడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా 19 పర్యాయాలు ఇంటర్నెట్ రాకుండా చేసింది. ఇందులో ఏడు సార్లు ఉక్రెయిన్‌లోనే ఇంటర్నెట్ ఆపేసింది. యుద్ధం, హింసాత్మక ఘటనల కారణంగా 2024లో ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో 103 సందర్భాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు.
మణిపూర్‌లో అత్యధికం
మనదేశంలో గతేడాది కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 16 రాష్ట్రాల్లో కనీసం ఒకసారైనా ఇంటర్నెట్‌ను నిలిపివేయడం జరిగింది. కల్లోలిత మణిపూర్‌లో అత్యధికంగా 21 పర్యాయలు ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. హరియాణా(12), జమ్మూకశ్మీర్(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆందోళన కార్యక్రమాలతో 41 సార్లు, మతఘర్షణలతో 23 సార్లు, ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల సమయంలో ఐదు పర్యాయాలు ఇంటర్నెట్ నిలిపివేశారు.
తరచుగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గ్లోబల్ లీడర్‌షిప్ కోసం ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఇటీవల ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023,టెలికాం సస్పెన్షన్ రూల్స్ 2024 గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయానికి గల కారణాలను సమీక్షించడానికి చట్టంలో స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాలు లేవని విమర్శకులు వాదించారు.
చదవండి: ఒహియో గవర్నర్ రేసు.. వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
కూడా ఆయన నివేదిక ఆందోళనలను లేవనెత్తింది, ఇది 1885 టెలిగ్రాఫ్ చట్టం నుండి వలసరాజ్యాల కాలం నాటి నిబంధనలను నిలుపుకుంది. షట్‌డౌన్ ఆర్డర్‌లను సమీక్షించడానికి చట్టంలో స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగాలు లేవన్న విమర్శలు బలంగా వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment