దానిలో చైనా ముందంజ.. భారత్ వెనుకంజ
దానిలో చైనా ముందంజ.. భారత్ వెనుకంజ
Published Fri, Mar 17 2017 11:29 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
వాషింగ్టన్ : భారత్, చైనా.. ప్రపంచంలో ఎక్కువగా పాపులర్ చెందిన దేశాలు. జనాభా పరంగా, అభివృద్ధి పరంగా ఈ రెండు పోటాపోటీగా దూసుకెళ్తుంటాయి. కానీ డిజిటల్ స్పేస్ లో మాత్రం భారత్, చైనాకు గట్టిపోటీని ఇవ్వలేకపోతుంది. 2013 నుంచి టెక్నాలజీ అందిపుచ్చుకునే దిశగా నడక ప్రారంభించిన ఈ రెండు దేశాల్లో చైనా శరవేగంగా దూసుకెళ్తుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో తెలిపింది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకంలో చైనా ముందంజలో ఉందని, 2016 వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉందని పేర్కొంది. సర్వే ప్రకారం చైనాలో 71 శాతం మంది ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నట్టు చెప్పగా... భారత్ లో మాత్రం 21 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నట్టు తెలిసింది.
68 శాతం మంది చైనీస్ దగ్గర సొంత స్మార్ట్ ఫోన్లుండగా.. భారత్ లో మాత్రం 18 శాతం మంది దగ్గరే సొంత ఫోన్లున్నాయి. 2013 నుంచి చైనాలో స్మార్ట్ ఫోన్ ఓనర్ షిప్ 31 శాతం జంప్ అయినట్టు వెల్లడైంది. కానీ అదేసమయంలో భారత్ మాత్రం 6 శాతమే పెరిగింది. బేసిక్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నవారు చైనాలో 98 శాతముంటే, భారత్ లో ఆ శాతం కేవలం 72 మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఓనర్ షిప్ లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతను కూడా ఈ సర్వే ఎత్తిచూపింది. 72 శాతం మంది పట్టణ చైనీస్ ప్రజలు సొంతంగా స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని, గ్రామీణ చైనీస్ లో 63 శాతం మంది సొంతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని సర్వే తెలిపింది. కానీ భారత్ లో ఈ శాతం మరింత దిగువ స్థాయిలో ఉంది. పట్టణ భారతీయ ప్రజలు 29 శాతం, గ్రామీణ ప్రజలు 13 శాతం మందే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ల వాడకంలో జెండర్ గ్యాప్ కూడా ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
Advertisement
Advertisement