WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్‌బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్‌బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్‌లు ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్‌పై పడగా.. ట్విటర్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్‌డౌన్ ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది.
ఫేస్‌బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్‌బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది.
సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్‌బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్‌బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్.
అతని వల్లే..
ఇక ఫేస్‌బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్‌లో సరదా మీమ్స్‌తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్‌ఎస్).. ఇంటర్నెట్‌కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్‌వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్‌లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్‌బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్‌బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్‌బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది.
Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored.
— Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021
Comments
Please login to add a commentAdd a comment