break down
-
పేషెంట్ క్రిటికల్.. సడన్‌గా ఆగిపోయిన అంబులెన్స్.. బైక్‌లతో నెట్టుతూ
న్యూఢిల్లీ: పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతడ్ని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈక్రమంలో రోడ్డు మధ్యలో అంబులెన్స్ సడన్‌గా ఆగిపోయింది. డ్రైవర్‌కు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఇద్దరు యువకులు బైక్‌లపై వచ్చారు. కాళ్లతో అంబులెన్సును నెట్టుతూ బైక్‌లను వేగంగా ముందుకు పోనిచ్చారు. ఇలా 12 కిలోమీటర్లు ప్రయాణించి రోగిని ఆస్పత్రికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ నేత తజీందర్ పాల్ బగ్గా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఢిల్లీ హరినగర్‌లోని డీడీయూ ఆస్పత్రి నుంచి ఆర్ఎంల్ ఆస్పత్రికి ఓ పేషంట్‌ను తరలిస్తుండగా.. అంబులెన్స్ ఆగిపోతే ఇద్దరు సిక్కు యువకులు సాయం చేశారని చెప్పుకొచ్చారు. బైక్‌పై కూర్చొని కాళ్లతో నెట్టుకుంటూ అంబులెన్సును ఆస్పత్రికి తీసుకెళ్లారని కొనియాడారు. While transferring a critical patient from DDU Hospital,Hari Nagar,Delhi to RML Hospital,the Ambulance broke down & was pushed by Two Sikh Motorcyclists for about 12 km at midnight. pic.twitter.com/4P5gs4eCrc — Tajinder Pal Singh Bagga (@TajinderBagga) December 21, 2022 చదవండి: కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు -
భువనేశ్వరి గురించి సభలో ఎవరూ పల్లెత్తు మాట అనలేదు..
సాక్షి, అమరావతి: పదవి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు నాడు మామ ఎన్టీఆర్‌ను, నేడు భార్యను అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్ర వారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిని ఏదో అన్నామని చెబుతున్నారు. ఆమెను నేను కానీ, మా పార్టీవాళ్లు కానీ ఏమీ అనలేదు. చేతులు జోడించి నమస్కరించి చెబు తున్నాం. మహిళలను అనే స్వభావం మాది కాదు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేసు ్తన్నారు. నాడు ఎన్టీఆర్‌ను అడ్డం పెట్టుకుని రాజ కీయాల్లో ఎదిగి, ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు. ఈ రోజు భార్యను అడ్డు పెట్టు కుని సానుభూతి పొందాలని డ్రామాలు చేస్తున్నారు. భువనేశ్వరిని అన్నట్టు ఆధారాలుంటే బయట పెట్టండి. ఈ విషయంలో భువనేశ్వరి కూడా చంద్రబాబును నిలదీయాలి. గతంలో సీఎం జగన్‌ను టీడీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టించి తిట్టించారు. ఆ సందర్భంగా జగన్ తనను ఎవరు.. ఏమని దూషించారో బహిరంగంగానే చెప్పారు. అదే మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి మేం ఏదైనా తప్పు మాట్లాడితే అసెంబ్లీలో రికార్డ్స్ లో ఉంటాయి కదా? బయటపెట్టండి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ, సానుభూతి కోసం దిగజారొద్దు. ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన టీడీపీ ఇప్పుడు ఏపీలోనూ కనిపించకుండా పోతోంది. అందుకే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో గుడ్డకాల్చి మాపై వేస్తున్నారు’ అని విమర్శించారు. -
కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: భగవంతుడి ఆశీర్వాదం, ప్రజలందరి దీవెన ఉన్నంతకాలమే ఎవరైనా అధికా రంలో ఉంటారని, రాజకీయాల్లో ఈ రెండూ అత్యంత ప్రధానమైన వని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రజ లకు మంచి చేసినంత కాలం వారికి దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి దీవెనలు ఉంటాయన్నారు. శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆవేశంగా సభనుంచి బయటకు వెళ్లిపోయాక... ఆ ఘటనపై సీఎం మాట్లాడారు. వ్యవసాయంపై, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతుండగా... సంబంధం లేని టాపిక్‌ను సభలోకి తీసుకొచ్చి చంద్రబాబే సభలో వాతావర ణాన్ని రెచ్చగొట్టారని, దాన్ని ఖండిస్తూ సహజంగానే అధికార పక్షం నుంచి కొంత మంది మాట్లాడారని, కానీ చంద్రబాబు చెబుతున్నటువంటి మాటలేవీ అధికార పక్షం నుంచి ఎవరూ మాట్లాడ లేదని ఆయన తెలియజేశారు. ఈ సంఘటనకు సంబం ధించి ముఖ్యమంత్రి సభలో ఏమన్నారంటే... ఆయనకు రాజకీయ ఎజెండానే ముఖ్యం ‘‘ఒకవైపు రైతుల అంశాలపై చర్చ జరుగుతోంది. వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతు న్నారు. కనక ఈ సమయంలో ప్రతిపక్షం సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కానీ చంద్రబాబు మాట్లాడిన తీరు, చేసిన డ్రామా అన్నీ మన కళ్లెదుటే కనబడ్డాయి. ఆ సమయంలో నేను సభలో లేను. వర్షాలపై కలెక్టర్లతో సమీక్షించాను. సభకు వచ్చాక జరిగిన పరాణామాలేంటో తెలుసు కున్నాను. నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రజలెలా ఉన్నా పర్వాలేదు. పొలిటికల్ అజెండానే ముఖ్యం. చంద్రబాబు మీద తాము వ్యతిరేకంగా ఉన్నామని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆయన కుప్పం సహా అన్ని చోట్లా ప్రజల వ్యతిరేకత చూశారు. శాసన మండలిలోనూ వారికున్న బలం పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్సీపీ బలం గణనీయంగా పెరిగింది. వైఎస్సార్సీపీకి చెందిన నా సోదరుడు, దళితుడు మండలి చైర్మన్‌గా రాబోతున్నారు. ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లి పోయా రు. ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడంలేదు.’’ వాతావరణాన్ని చెడగొట్టింది ఆయనే.. ‘‘చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ వాళ్లు అదే పనిగా ‘గొడ్డలి– బాబాయి... తల్లీ– చెల్లి’ అంటూ ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రత్యారోపణలుగా నాడు టీడీపీ హయాంలో జరిగిన వంగవీటి మోహన రంగా, మాధవరెడ్డిల హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖపై కూడా చర్చించాలని అధికార పార్టీ సభ్యులు అన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టారు కాబట్టే ఈ మాటలన్నారు. ఎక్కడా కుటుంబ సభ్యుల గురించి అధికార పక్ష సభ్యులు మాట్లాడ లేదు. నిజానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడింది చంద్రబాబే!. మా చిన్నాన్న, మా అమ్మ, మా చెల్లెలు గురించి చంద్రబాబే ప్రస్తావించారు. అధికార పక్షం నుంచి అలాంటి ప్రస్తావన ఏమీ లేదు. సభ రికార్డులు చూసినా ఇది అర్థం అవుతుంది’’. గోబెల్స్ ప్రచారంలో దిట్టలు ‘‘చంద్రబాబుకు ఉన్నట్టుగా ఈనాడు వంటి పెద్ద సంస్థ నాకు తోడుగా లేదు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక, టీవీ 5 లాంటి ఛానెల్ నాకు లేకపోవచ్చు. అబద్ధాన్ని నిజం చేయడానికి అంత మంది నాకు లేరు. గోబెల్స్ ప్రచారంతో వీళ్లు ఏ అబద్ధాన్నయినా నిజం చేయడానికి ప్రయత్ని స్తారు. స్క్రోలింగ్స్ వేస్తారు. మీడియాలో వీరి సం ఖ్యా బలం ఎక్కువ కాబట్టి ఏమైనా చేస్తారు. కానీ నిజాన్ని మాత్రం దాచలేరు. ప్రజలకు మంచి జరిగి నంత కాలం బాబు ఎన్ని డ్రామాలు చేసినా పట్టిం చుకోరు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంత కాలం ఈనాడు, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 ఎంత చంద్రబాబును మోసినా, అంతిమంగా మంచే విజయం సాధిస్తుంది’’. మన చేయితో మన కన్ను పొడుచుకుంటామా? ‘‘గొడ్డలి– బాబాయ్... తల్లీ– చెల్లి’’ అంటూ కుటుంబాల గురించి ప్రస్తావించింది చంద్రబాబే. మా చిన్నాన్న గురించి మాట్లాడటం న్యాయమా? వివేకానందరెడ్డి నాకు చిన్నాన్న. మా నాన్నకు సొంత తమ్ముడు. చంద్రబాబుకు కాదు. ఇంకోవైపు అవినాష్‌రెడ్డిపైనా ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్ మరో చిన్నాన్న కొడుకు. ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు? మన రెండు కళ్లు ఒకదాన్నొకటి పొడుచుకుంటాయా? మన చేతులు ఒకదాన్నొకటి నరుక్కుంటాయా? మన చేత్తో మన కంటినెందుకు పొడుచుకుంటాం? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నాం. మా చిన్నాన్న, అవినాష్‌రెడ్డి కూడా మాతోనే ఉన్నారు. మా చిన్నాన్నను ఓడించడం కోసం టీడీపీ చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీకావు. కడప జిల్లాలో అప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు మాకు ఎక్కువ మంది ఉన్నారు. మా పార్టీ నుంచి చిన్నాన్నను పోటీ పెడితే.. బలవంతంగా మా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు డబ్బులిచ్చి, ప్రలోభాలు పెట్టి, స్పెషల్ ఫ్లైట్లు పెట్టి, పోలీసులను పెట్టి, కుయుక్తులు పన్ని.. రకరకాలుగా అక్రమాలు చేసి ఓడించారు. అంత దారుణంగా ప్రవర్తించారు. మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే వాళ్లే చేసి ఉండాలి. అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి, వక్రీకరించి ఏదేదో చేస్తున్నారు. చివరకు మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ చేసి రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అయినా పైనా దేవుడు ఉన్నాడు.. ఆయనే చూస్తాడు’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. -
సభలో అరిచి.. బయట ఏడుపు..!
సాక్షి, అమరావతి: ఒకవైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుండగా... వ్యవసాయ రంగంపై, రైతు స్థితిగతులపై సమగ్రంగా చర్చిస్తున్న రాష్ట్ర శాసనసభలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ వైఖరితో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరకు ‘ఈ రోజు సభలో నా కుటుంబాన్ని గురించి, నా సతీమణి గురించి కూడా ఆరోపణలు చేశారు. సభలో వారి పేర్లను ప్రస్తావించారు’ అంటూ ఆవేశంగా అరుస్తూ సభ నుంచి బయటకు వచ్చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు... ఆ తరవాత బయట విలేకరుల సమావేశం పెట్టారు. తన భార్య గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తన కుటుంబంపై విమర్శల్ని సహించలేకపోతున్నానని చెబుతూ బోరుమని ఏడ్చారు. ఇక అసెంబ్లీకి వెళ్ళనని, ప్రజా క్షేత్రంలో తేల్చుకున్నాకే మళ్లీ సభలోకి అడుగుపెడతానని స్పష్టంచేశారు. మాట మాటకూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు... అసెంబ్లీలో మైక్ ఇవ్వలేదు కనకే ఈ విషయం బయట చెబుతున్నానని పేర్కొన్నారు. నిజానికి అసెంబ్లీలో చంద్రబాబు భార్య పేరు గానీ, ప్రస్తావన గానీ రానేలేదు. ఎవ్వరూ ఆయన కుటుంబం గురించి మాట్లాడలేదు కూడా. అయినా వ్యవసాయంపై చర్చ జరుగుతున్నపుడు ఇలా వ్యక్తిగత అంశాలెందుకు ప్రస్తావనకు వచ్చాయనే సందేహం ఎవరికైనా సహజం. అదెలా జరిగిందంటే.... టీడీపీ అడ్డంకులు ఉదయం 9కి సభ ప్రారంభం కాగానే ‘పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు’ అంశంపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్చేయగా వెంటనే ‘వ్యవసాయరంగం– రైతు సంక్షేమం’పై సభలో చర్చ మొదలైంది. 10 నిమిషాల తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు మళ్లీ సభలోకి వచ్చారు. రైతు సంక్షేమంపై చర్చలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రెండున్నర ఏళ్లగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికీ, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న చర్యలను వివరిస్తూ... ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వం రైతుల రుణమాఫీ, సున్నా వడ్డీ, ఇన్పుట్స్ సబ్సిడీ నిధుల కూడా మంజూరు చేయకుండా మోసం చేసిన తీరును అంకెలు, లెక్కలతో సహా వివరించారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయులు మంత్రి ప్రసంగానికి అడ్డుతగులుతూ తన సీట్లులో కూర్చొనే... పీఆర్పీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డిని, వైసీపీని ఉద్దేశించి కన్నబాబు చేసిన వ్యాఖ్యలున్న ఓ పేపరు కటింగ్‌ను ప్రదర్శించారు. దానికి మంత్రి సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేయటంతో వివాదానికి బీజం పడింది. దానికి కన్నబాబు స్పందిస్తూ... ‘మాట్లాడదాం.. దాంతో పాటు ఎన్టీఆర్‌ను చంద్రబాబు తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను సంఘ విద్రోహ శక్తిగా పేర్కొన్నారు. అయినా ఆ పార్టీలోని నేతలకు సిగ్గులేదు’ అని స్పందించారు. మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకొని.. ‘చంద్రబాబు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్బాలు పలకలేదా. మళ్లీ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తాననలేదా? మళ్లీ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి... ఇపుడు ఆయన ఫొటోలకు దండాలు పెట్టడం లేదా?’’ అని ప్రశ్నించారు. స్పీకర్ అనుమతితో మైకు తీసుకున్న బాబు... ‘బాబాయి– గొడ్డలి పోటు మొదలు తల్లికి చేసిన ద్రోహం వరకు అన్నీ చర్చిద్దాం. మేం స్పష్టంగా ఉన్నాం అధ్యక్షా...’ అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సీఎం జగన్ సభలో లేరు. వర్షాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి వెళ్లారు. జరిగే చర్చేంటి? ఈ మాటలేంటి?: బుగ్గన బాబు వ్యాఖ్యల అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ ‘అధ్యక్షా, రెండు రోజుల నుంచి సీమలో విపరీతమైన వర్షాలు, వరదలు. జరుగుతున్న చర్చ వ్యవసాయం మీద. ఈ వరద వల్ల ఆ నాలుగు జిల్లాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఇప్పుడు చర్చకు రాబోతోంది. చర్చకు, టీడీపీ వారు మాట్లాడే విధానానికి సంబంధం ఉందా?. వ్యక్తిగత అంశాలు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంత దూరం పోతుంది? అవసరమా ఇదంతా?’ అన్నారు. కన్నబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... డెయిరీ రంగంలోని సహకార సంఘాలను చంద్రబాబు తన సొంత డెయిరీలు హెరిటేజ్, సంగం కోసం క్రమపద్ధతిలో నాశనం చేశారన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే క్రమంలోనే అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. దీనికి చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. స్పీకరుతో వాగ్వాదానికి దిగుతూ... ఆంధ్రా కంపెనీలు అక్కర్లేదా? గుజరాత్ కంపెనీలే కావాలా? అని తనను, తన కుటుంబాన్ని కించపరుస్తున్నారని, వీళ్లు రెండోసారి అధికారంలోకి రారని శాపనార్ధాలు పెట్టారు. బాబాయి– గొడ్డలి.. తల్లీ చెల్లీ అంటూ టీడీపీ అరుపులు ఈ సమయంలో టీడీపీ సభ్యులు ‘బాబాయి– గొడ్డలి’, ‘తల్లీ, చెల్లీ’.. అని అదేపనిగా అరవటం మొదలెట్టారు. అధికార వైసీపీ సభ్యులు దీనికి సమాధానంగా ‘పార్టీ లేదు–బొక్కా లేదు’ (గతంలో అచ్చెన్నాయుడు అన్నమాటలివి) అంటూ అరిచారు. అంబటి రాంబాబు జోక్యం చేసుకుంటూ సభ అదుపు తప్పడానికి టీడీపీయే కారణమని, తనకు కొంత సమయమివ్వాలని అడిగారు. టీడీపీ నేతలు గట్టిగా... ‘అరగంట చాలా... గంట కావాల్నా’ అని అనడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాటన్న వ్యక్తిని ఉద్దేశించి ‘నువ్వొస్తే గంట కావాలి, అన్నీ చర్చిద్దాం’ అన్నారు. మల్లెల బాబ్జీ ఏం రాశారో గుర్తులేదా బాబూ? ఈ సమయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి లేచి... గొడవ మొత్తానికి కారణం చంద్రబాబేనని, వ్యవసాయంపై ప్రశాంతంగా సాగుతున్న చర్చను తప్పుదోవ పట్టించారని చెప్పారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన్ని ఉద్దేశించి మల్లెల బాబ్జీ (ఎన్టీఆర్‌పై హత్యాయత్నం చేసిన వ్యక్తి) ఏమి రాశారో చదువుకోవాలంటూ ఆ లేఖను స్పీకర్‌కు పంపించారు. బాబాయి– గొడ్డలంటూ ముఖ్యమంత్రిపై ఏవేవో ఆరోపణలు చేయాలని చూస్తారా? అని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు గందరగోళానికి తెరతీయటంతో స్పీకర్ తమ్మినేని 11.25 ప్రాంతంలో సభను వాయిదా వేశారు. ఆరంభించగానే... చంద్రబాబు ఆగ్రహం! సభ తిరిగి మధ్యాహ్నం 12.14కు ప్రారంభమైంది. కన్నబాబు ప్రసంగం కొనసాగిస్తుండగా... టీడీపీ సభ్యులు వస్తూనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తమ నాయకుడికి మైకు ఇవ్వాలని పట్టుబట్టారు. చంద్రబాబు కూడా తన సీటులో నుంచి లేచి నిలబడి మైకు ఇవ్వాలని గట్టిగా అరిచారు. దీంతో స్పీకర్ 12.17కి చంద్రబాబుకి మైకిచ్చారు. మహానాయకులతో కలిసి పని చేశా... 8వసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టా. 1978 నుంచి హేమాహేమీలతో పని చేశా. ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాం. కానీ ఇలాంటి అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. నా కుటుంబాన్ని, భార్యను కూడా సభలో ప్రస్తావించే పరిస్థితి వచ్చింది... అంటుండగా మైకు కట్ కావటంతో... ఆవేశంగా నమస్కారం పెట్టి అచ్చెన్నాయుడితో కలిసి బయటకు వెళ్లిపోయారు. బయట విలేకరుల సమావేశం పెట్టి భోరుమన్నారు. ఇదీ.. జరిగింది. బాబు కుటుంబం గురించి ఎవ్వరూ ప్రస్తావించకున్నా అదే కారణంతో ఇంత వివాదం జరగటం గమనార్హం!!. వీడియో తీయించి వదిలారు! సభలో మైక్ కట్ అయిన తరువాత చంద్ర బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతా! అంతవరకూ అడుగుపెట్టను!’’ అని అన్నారు. ఆ సమయం లో మైకు లేదు కనక ఆయన పక్కనున్న టీడీపీ సభ్యుడితో సెల్ ఫోన్లో వీడియో తీయించారు. ఆ వీడియోను క్షణాల్లో బయటకు లీక్ చేశారు. కాకపోతే విలేకరుల సమావేశంలో మాత్రం మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడ తాననే వ్యాఖ్యలు చేయ లేదు. ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాకే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పటం గమనార్హం. తల్లీ, చెల్లీ– బాబాయి, గొడ్డలి అన్నదే బాబు: బొత్స బాబు బృందం బయటకు వెళ్లిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల విషయాన్ని తీసుకు వచ్చిందీ, బాబాయి–గొడ్డలి, తల్లీ– చెల్లీ అన్న దే చంద్రబాబన్నారు. కావాలంటే రికార్డులు చూడాలని కోరారు. ’ఆయన గురించి ఆయనే మాట్లాడుకుని మమ్మల్ని అంటే ఎలా?’ అని ప్రశ్నించారు. బాబు లాగా తాము వెన్నుపోటు పొడవలేదన్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఆవేళ జగన్ సభ నుంచి బయటకు వెళ్లి అధికారం లోకి వచ్చిన తర్వాతే సభకు వచ్చారన్నారు. ’కానీ ఈ బాబు ఏమి చేశారు. తన వ్యక్తిగత సమస్యల కోసం, రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాలను తాకట్టుపెట్టేలా సభ నుంచి వెళ్లిపోయారు. వర్షాలతో ప్రజలు అల్లాడి పోతుంటే సీఎం జగన్ అధికారులతో సమీక్షించి చర్యలు చేపడుతుంటే కనీసం మాట మాత్ర మైనా ఈ పెద్దమనిషి ఏం చేద్దాం అని అడి గారా? తల్లీ చెల్లీ, బాబాయంటూ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారా? అదే మాట్లా డాలనుకుంటే నోటీసు ఇమ్మనండి.. మాట్లాడు కుందాం.. అలా చేయడానికి బదులు నేర తలంపుతో వ్యవహరించారు. రాష్ట్ర ప్రజలపై ఆయనకు శ్రద్ధ లేదు. అందువల్ల ప్రజానీకానికి నా విజ్ఞప్తి ఒక్కటే. చంద్రబాబు స్వార్ధప్రయో జనాల కోసం సభ నుంచి వెళ్లిపోయారని గమనించండి’ అని బొత్స చెప్పారు. -
నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్!
Shah Rukh Khan Emotional When He Meets Aryan Khan: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం అతడికి బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో షారుక్ ఖాన్ తొలిసారిగా ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్న కుమారుడిని కలిసి కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు సమాచారం. వీరి మధ్య గ్రిల్, గాజు గోడ అడ్డంగా ఉంది. ఇంటర్‌కామ్ ద్వారా వీరిద్దరూ మాట్లాడుకున్నారు.తండ్రిని నేరుగా చూడగానే ఆర్యన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయినట్లు సిబ్బంది వర్గాలు వెల్లడించాయి. దాదాపు15-20నిమిషాల వరకు వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ఆర్యన్ 'ఐ యామ్ సారీ' అని పదేపదే తండ్రికి చెప్పాడట. దీంతో తీవ్ర భావేద్వోగానికి లోనైన షారుక్ కన్నీళ్లు ఆపుకుంటూ..నేను నిన్ను నమ్ముతున్నానంటూ కొడుకులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతకుముందు కూడా తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడుతూ ఆర్యన్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. #WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbai pic.twitter.com/j1ozyiVYBM — ANI (@ANI) October 21, 2021 చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్ రోడ్డు జైల్లో ఆర్యన్‌ను కలుసుకున్న షారుక్ ‘లైగర్’ భామని విచారించనున్న ఎన్సీబీ -
ఫేస్బుక్, వాట్సాప్ డౌన్.. జుకర్‌బర్గ్ పుట్టి ముంచిన ఆ ఒక్కడు!
WhatsApp, Facebook, Instagram restore services after 6-hours of outage: ఫేస్బుక్ స్థాపించినప్పటికీ ఇప్పటిదాకా చూసుకుంటే.. సోమవారం(అక్టోబర్ 4న) తలెత్తిన సమస్య ఆ సంస్థకు భారీ నష్టాన్ని చేసింది. ఆరు గంటలపాటు ఆగిపోయిన ఫేస్బుక్ దాని అనుబంధ యాప్ సర్వీస్‌లు ఫేస్బుక్ మెసేంజర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలను సైతం స్తంభింపజేసింది. తిరిగి సర్వీసులు ప్రారంభమైనప్పటికీ.. మొదట్లో మొండికేశాయి కూడా. ఈ ప్రభావం ఇంటర్నెట్పై పడగా.. ట్విటర్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ సేవలు సైతం కాసేపు నెమ్మదించాయి. ఏది ఏమైనా ఈ బ్రేక్‌డౌన్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు మాత్రం కోలుకోలేని నష్టాన్ని మిగిల్చినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్, దాని అనుబంధ సేవల సర్వీసుల విఘాతం వల్ల మార్క్ జుకర్‌బర్గ్ భారీ నష్టం వాటిల్లింది. సుమారు ఏడు బిలియన్ల డాలర్ల(మన కరెన్సీలో దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టం వాటిల్లింది. ఫేస్బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్లో డ్యామేజ్ జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ దెబ్బతో జుకర్‌బర్గ్ స్థానం అపర కుబేరుల జాబితా నుంచి కిందకి పడిపోయింది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా.. ఒక్క సోమవారమే ఫేస్బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. దీంతో ఐదో స్థానం నుంచి కిందకి జారిపోయాడు జుకర్‌బర్గ్. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్ తర్వాత రిచ్ పర్సన్స్ లిస్ట్‌లో ఆరో ప్లేస్‌లో నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్. అతని వల్లే.. ఇక ఫేస్బుక్ అనుబంధ సర్వీసులు ఆగిపోవడంపై యూజర్ల అసహనం, ఇంటర్నెట్లో సరదా మీమ్స్‌తో పాటు రకరకాల ప్రచారాలు సైతం తెర మీదకు వచ్చాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ‘నెగెటివ్’ కథనాల ప్రభావం వల్లే ఇలా జరిగి ఉంటుందని, కాదు కాదు ఇది హ్యాకర్ల పని రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఇది సాంకేతికపరమైన సమస్యే అని తెలుస్తోంది. డొమైన్ నేమ్ సిస్టమ్(డీఎన్ఎస్).. ఇంటర్నెట్కు ఫోన్ బుక్ లాంటిది. ఇందులో సమస్య తలెత్తడం వల్ల సమస్య తలెత్తవచ్చని మొదట భావించారు. ఆ అనుమానాల నడుమే.. బీజీపీ (బార్డర్ గేట్‌వే ప్రోటోకాల్)ను ఓ ఉద్యోగి మ్యానువల్‌గా అప్లోడ్ చేయడం కారణంగానే ఈ భారీ సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ఉద్యోగి ఎవరు? అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కావాలనే చేశాడా? పొరపాటున జరిగిందా? తదితర వివరాలపై స్పష్టత రావాల్సింది ఉంది. సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయనేదానిపై ఫేస్బుక్ నుంచి స్పష్టమైన, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజీపీ రూట్స్‌లో సర్వీసులకు విఘాతం కలగడం వల్ల ఫేస్బుక్, దానికి సంబంధించిన ప్రతీ వ్యాపారం ఘోరంగా దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు కొద్దిగంటల పాటు ఫేస్బుక్ ఉద్యోగుల యాక్సెస్ కార్డులు పని చేయకుండా పోయాయట. దీంతో వాళ్లంతా కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ హెడ్ ఆఫీస్ బయటే ఉండిపోయారు. ఇక బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ (BGP) అనేది గేట్‌వే ప్రోటోకాల్‌ను సూచిస్తుంది, ఇది స్వయంప్రతిపత్త వ్యవస్థల మధ్య రూటింగ్ సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఇంటర్నెట్‌ని అనుమతిస్తుంది. Seeing @Facebook's BGP announcements getting published again. Likely means service is on a path to getting restored. — Matthew Prince 🌥 (@eastdakota) October 4, 2021 చదవండి: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలు పునరుద్ధరణ చదవండి: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం -
ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లం.. ఓ వైద్యుడి భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తగా కరోనా మహమ్మారి విలయం రోజుకు రోజుకు మరింత ఉధృతమవుతోంది. దీంతో దేశంలో ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 ప్రభావిత రాష్ట్రం ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. బాధితులు ఊపిరాడక తమ కళ్లముందే విలవిల్లాడుపోతోంటే తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. ఆసుపత్రిలో దుర్భర పరిస్థితి, రోగుల ప్రాణాలను కాపాడలేని తమ నిస్సహాయతపై ఒక సీనియర్ వైద్యుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని అతిపెద్ద ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో అల్లకల్లోలమవుతున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా స్పందించాయి. తక్షణమే అన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య సదుపాయాలు, రోగుల ప్రమాదకర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు శాంతి ముకాండ్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సునీల్ సాగర్ కంట తడిపెట్టారు. వైద్యులుగా రోగుల ప్రాణాలను కాపాడాల్సిన తాము, కనీసం ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న చాలామందిని డిశ్చార్జ్ చేయవలసిందిగా వైద్యులను కోరామని, చాలా క్రిటికిల్ గా ఉన్న వారికి ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. ప్రాణాలను నిలపాల్సిన తాము చివరికి ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోతే... పరిస్థితి ఏమిటి... వారు చనిపోతారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆసుపత్రిలో ఉన్న స్టాక్స్ మహా అయితే రెండు గంటలకు సరిపోతుందని డాక్టర్ సాగర్ చెప్పారు. తమ రెగ్యులర్ సరఫరాదారు ఐనాక్స్ కాల్స్‌కు స్పందించడం మానేసిందని ఆరోపించారు. మరోవైపు రోహిణి సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో, 51 ఏళ్ల ఆశిష్ గోయల్ వెంటిలేటర్లో ఉన్న తన తండ్రికి ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బందులనెదుర్కాను. అయితే 15 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ దగ్గర ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో చాలా భయంకరంగా ఉంది.. తమకు ఎవరూ రక్షణ లేరంటూ బావురుమన్నారు గోయల్. అటు ఘజియాబాద్‌లోని లక్ష్మీచంద్ర ఆసుపత్రి అంబులెన్స్‌లు ఇప్పుడు రోగులకు బదులుగా ఆక్సిజన్ రీఫిల్స్ సిలిండర్లను రవాణా చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అదే జిల్లాలోని చంద్రలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ గోయల్, " మా వద్ద ఆక్సిజన్ లేదు, మందులు లేవు.. పేషంట్లను స్వీకరించలేను క్షమించండి’’ అంటూ ఏకంగా బోర్టు పెట్టేశారు. ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా యంత్రాంగానికి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాజధానిలోని ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఒక జాబితా విడుదల చేశారు. సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకుంద్ హాస్పిటల్, తీరత్ రామ్ షా హాస్పిటల్, యూకే నర్సింగ్ హోమ్, రాఠి హాస్పిటల్ , శాంటం హాస్పిటల్ ఇందులోఉన్నాయి. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) చదవండి : ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా #WATCH | Sunil Saggar, CEO, Shanti Mukand Hospital, Delhi breaks down as he speaks about Oxygen crisis at hospital. Says "...We're hardly left with any oxygen. We've requested doctors to discharge patients, whoever can be discharged...It (Oxygen) may last for 2 hrs or something." pic.twitter.com/U7IDvW4tMG — ANI (@ANI) April 22, 2021 -
అంత్యక్రియలకు అంతిమ పోరు..
ప్రొద్దుటూరు క్రైం: ‘కరోనాతో దేశం మొత్తం యుద్ధం చేస్తోంది.. మనం పోరాటం చేయాల్సింది రోగితో కాదు వ్యాధితో.. వారిని వివక్షతతో చూడకండి’. ఎవ్వరికి ఫోన్ చేసినా ప్రస్తుతం మనకు వినిపించే మాటలు ఇవి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవే సూచనలు చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తుల విషయంలో, వైరస్‌తో మృతి చెందిన వారి పట్ల ఎక్కడ చూసినా వివక్షత కనిపిస్తోంది. మనిషికి వైరస్ సోకిందని తెలియగానే అతను ఏదో చేయకూడని నేరం చేసినట్లు, సమాజానికి పనికి రాడన్నట్లుగా చూస్తున్నారు. కరోనా వైరస్ సోకి చనిపోయినవారి మృతదేహాలు అనాథ శవాలుగా మిగులుతున్నాయి. పుట్టి, పెరిగిన చోటే మట్టిలో కలసిపోవాలని ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆశ ఉంటుంది. బంధువులు, అయిన వారి చేతుల మీదుగా తమ చివరి మజిలీ జరగాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ సోకి మృతి చెందితే అయ్యో పాపం అంటున్నారే గానీ మృతదేహాన్ని తమ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. కరోనా వల్ల అనేక కుటుంబాలు సతమతం అవుతున్నాయి.. మన అనుకున్న బంధాలు కూడా దూరమవుతున్నాయి... అవగాహన లేక అపోహలు ఆవహించడమే ఇందుకు కారణం. ఏ కార్యం వెళ్లకపోయినా చివరి మజిలీలో మాత్రం కాటికి చేరిన వారికి కాస్త మట్టి ఇవ్వాలని అంటారు.. మరి ఈ కరోనాతో ఆ సంప్రదాయాలన్నీ మసిబారుతున్నాయి. చాపాడు మండలానికి చెందిన ఓ గర్భిణి అనారోగ్యంతో బాధపడుతూ కవలలకు జన్మనిచ్చి కడప రిమ్స్‌లో కన్నుమూసింది. ఈమెకు కూడా తర్వాత పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ పేద మహిళ మృతదేహం స్వగ్రామానికి తీసుకు రావడానికి అక్కడి వారు ఒప్పుకోలేదు. దీంతో అనాథ శవంగా కడప శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. ఐసీఎంఆర్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ►కరోనా సోకిన వ్యక్తులను అంత్యక్రియలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ కొన్ని నిబంధనలను సూచించింది. ►కోవిడ్‌తో మృతి చెందాడా లేదా అనేది ముందుగా నిర్ధారించుకోవాలి. ►ఆస్పత్రి వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే మృతదేహాన్ని ప్యాక్ చేయాలి. ముందుగా మృతదేహంపై సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేసి, పాలిథిన్ కవర్‌తో భద్రంగా ప్యాక్ చేయాలి. ►అంత్యక్రియలకు వెళ్లే ముందు బట్ట, లేదా తాడు సాయంతో మృతదేహాన్ని పాడె పైకి తరలించారు. ►పాడెను మోసుకొని వెళ్లేవారు మృతదేహాన్ని తాకకుండా చూసుకోవాలి ►20 మందికి మించి అంత్యక్రియల్లో పాల్గొనరాదు. వీళ్లు కూడా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. రెవెన్యూ, పారిశుధ్య సిబ్బంది సహకారంతో.. కడపలోని ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి దేవుని కడపలో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో తోటి ఉద్యోగుల సూచన మేరకు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోగా మలేరియా అని తేలింది. వ్యాధి తీవ్రం కావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రిమ్స్‌కు తీసుకెళ్లారు. వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమెకు గుండె పోటు రాగా, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి కొన్ని క్షణాల్లో మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె స్వస్థలమైన పాత కడపలోని శివారు ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించగా స్థానికులు అందుకు నిరాకరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇక్కడ దహన సంస్కారాలు చేయనివ్వమని చెప్పడంతో అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది. తర్వాత రెవెన్యూ, పోలీసు అధికారులు జోక్యంతో చివరకు ఆమె దహన సంస్కారాలు పూర్తి చేయగలిగారు. గ్రామస్తులు వద్దన్నారని.. ఆమె స్వగ్రామం చాపాడు మండలంలోని ఖాదర్‌పల్లె. భర్త, సోదరుడు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. లాక్డౌన్ నిబంధనల కారణంగా వారు సకాలంలో ఇండియాకు రాలేకపోయారు. గర్భిణిగా ఉన్న ఆమెను కాన్పు కోసం కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి రక్తస్రావం ఎక్కువగా జరగడంతో ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. దీంతో ఆమెను గత నెల 4న కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సిజేరియన్ చేయగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చేరేముందే ఆమెకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా తర్వాత వచ్చిన రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామం నడి»ొడ్డున శ్మశానం ఉండటంతో అక్కడ అంత్యక్రియలు చేసేందుకు కొందరు గ్రామస్తులు అంగీకరించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులను కడపకు పిలిపించి చివరి చూపుగా కుమార్తె మృతదేహాన్ని చూపించారు. తర్వాత రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఊరంతా బంధువులున్నా ఆమె చివరి చూపునకు నోచుకోలేదు. బంధువులు వద్దని చెప్పడంతో... ప్రొద్దుటూరులోని దస్తగిరిపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడు అతను. వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ముందుగా అతని ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స కోసం కడపలోని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద వారి తండ్రికి పరీక్షలు చేయగా రెండు రోజుల తర్వాత ఆయనకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఉన్న అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకెళ్లాలని భావించగా బంధువులు వద్దని చెప్పారు. దీంతో అతనికి కడపలోనే అంత్యక్రియలు నిర్వహించారు. వైరస్ సోకుతుందని శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు.. కరోనా వైరస్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. అయితే చనిపోయిన వారి నుంచి వైరస్ సోకుతుందనే దానికి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు ఏమీ లేవు. అలా సోకే అవకాశం కూడా తక్కువే. మృతదేహం నుంచి ఏమైనా స్రావాలు బయటికి వచ్చి, వాటిని ఇతరులు తాకితే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాజుపాళెం మండలంలో ఇటీవల ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికంగానూ, చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నా వైరస్ భయంతో చూడటానికి ఎవరూ రాలేదు. దీంతో ఉన్న నలుగురే అతని మృతదేహాన్ని శ్మశానికి మోసుకొని వెళ్లారు. లాక్డౌన్ ప్రారంభంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. స్థానికంగా కేసులు ఎక్కువగా లేకున్నా చైనా, ఇటలీ దేశాల్లో వచ్చిన కరోనా కేసులను చూసి ఎక్కువగా భయాందోళనకు గురయ్యేవారు. ప్రొద్దుటూరు, కడపలో అనేక చోట్ల సాధారణ మరణాలు సంభవించాయి. అయితే చాలా ప్రాంతాల్లో అయిన వాళ్లు రాకుండానే అంత్యక్రియలు చేశారు. అడ్డుకోవడం సరికాదు కరోనా అనుమానాలతో చనిపోయిన వారి భౌతికకాయాలను ఆయా గ్రామాల శ్మశాన వాటికలలో పూడ్చడం లేదా కాల్చడాన్ని అడ్డుకోకూడదు. అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవు. డబ్లు్యహెచ్‌ఓ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ మృతులను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి దానిని కాల్చడం లేదా పూడ్చడం చేయాలి. ఈ రెండింటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూడ్చేటట్లయితే లోతుగా గుంత తీసి పూడ్చాలి. పాజిటివ్ కేసుల మృతదేహాలపై పడి ఏడ్వడం, తాకడం చేయకూడదు. తగిన దూరంలో ఉంటే వైరస్ స్ప్రెడ్ అవ్వదు. అపోహలు, అవగాహన రాహిత్యంతో అడ్డుకోవడంలాంటి చర్యలకు పాల్పడరాదు. – సి.హరికిరణ్, కలెక్టర్ మానవతా దృక్పథంతో ఆలోచించాలి కరోనా వైరస్‌తో లేదా ఇతర కారణాలతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు అడ్డుపడటం మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఏవైనా అపోహలు పోలీసులు, రెవెన్యూ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి. ఇష్టానుసారం మృతదేహాలను అడ్డుకుంటామంటే కుదరదు. శ్మశాన వాటికల్లోకి రాకుండా అడ్డు కోవాలనిచూస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, కడప -
ట్రైన్ 18 బ్రేక్ డౌన్ : రాహుల్ వర్సెస్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపైకి ఎక్కిన మరుసటి రోజే సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. ప్రధాని మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా విఫలమైందని ప్రజలు భావిస్తున్నారని, ఈ కార్యక్రమంపై పాలకులు పునరాలోచించాలని రాహుల్ వ్యాఖ్యానించారు. వారణాసి నుంచి ఢిల్లీ తిరిగివస్తున్న ట్రైన్ 18 బ్రేక్ డౌన్ అవడాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అహోరాత్రులు కృషి చేసి ప్రతిష్టాత్మంగా రూపొందిన ట్రైన్ 18పై రాహుల్ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతమైందని, కోట్లాది భారతీయుల జీవితాల్లో భాగంగా మారిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మీ కుటుంబంఅభివృద్ధి కోసం ఆలోచించేందుకు తీసుకున్న ఆరు దశాబ్దాల సమయం సరిపోలేదా అంటూ గోయల్ ట్వీట్ చేశారు. -
రెండో రోజే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్రేక్ డౌన్
వారణాసి : ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయిన తొలి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రెండోరోజే బ్రేక్ డౌన్ అయింది. శనివారం ఉదయం వారణాసి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఈ రైలు తుండ్లా రైల్వే స్టేషన్ వద్ద నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైలు నిలిచిపోయింది. నాలుగు కోచ్‌లలో బ్రేక్‌లు పట్టేయడం వల్ల రైలు నుంచి భారీ శబ్ధాలు వచ్చాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం 5.30 గంటలకు చోటుచేసుకుంది. దీంతో రైలులో ఉన్నావారిని మరో రెండు రైళ్లలో తరలించారు. అయితే ఓ గేదె పట్టాలు దాటుతున్న సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు సమాచారం. దీంతో రైలు చివరి బోగీ దెబ్బతినడంతో పాటు చిన్నపాటి పొగతో పాటు దుర్వాసన కూడా రావడంతో అప్రమత్తమైన లోకో పైలెట్లు రైలును నిలిపివేశారు. అనంతరం గేదె కళేబరం రైలు చక్రాలకు చుట్టుకోవడంతో వాటిని తొలగించారు. సుమారు మూడు గంటల అనంతరం రైలు తిరిగి బయల్దేరింది. ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలు రేపటి నుంచి (ఆదివారం) నుంచి కమర్షియల్ రన్ మొదలు కానున్నది. -
హైదరాబాద్‌లో 13 కిలో మీటర్ల ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లైఓవర్‌పై రెండు భారీ వాహనాలు బ్రేక్‌డౌన్ కారణంగా నిలిచి పోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో దాదాపు 13 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్, సికింద్రాబాద్ మార్గాల్లో భారీ ఎత్తున వాహనాల రద్దీ ఉందని ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణం చేసేవారు.. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి జనం రోడ్లపైన నిరీక్షిస్తున్నారు. కాగా, ఘటనపై స్పందించిన సీపీ అంజన్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. పరిస్థితి సమీక్షిస్తున్నామనీ, బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను వెంటనే తొలగిస్తామన్నారు. -
నిలిచిపోయిన 108 సేవలు
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 108 సేవలు నిలిచిపోయాయి. అంబులెన్స్‌లకు మరమ్మత్తులు చేయాలంటూ అధికారులు బ్రేక్ డౌన్ ప్రకటించారు. దీంతో పెదగంట్యాడ పీహెచ్సీలో అంబులెన్స్‌లు ఎక్కడికక్కడ నిలిపివేశారు. అయితే 108 నిలుపుదలపై మీడియా చిత్రీకరిస్తుండగా అధికారులు హడావిడిగా కొన్ని వాహనాలను లోకేషన్లకు పంపారు. -
బతికున్నప్పుడే పాతిపెడతారని భయం!
ఇవాళ త్రిష చాలామంది కొత్త కథానాయికలకు రోల్ మోడల్. ఎందుకంటే..ఈ చెన్నై చందమామ సిల్వర్ స్క్రీన్ మీదకొచ్చి పదిహేనేళ్లయింది.ఇప్పుడు చేతిలో అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నేళ్లయినా ఇంకా బిజీగాసినిమాలు చేస్తున్నారంటే త్రిష హార్డ్‌వర్కే కారణం. 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్రిష తన ఫ్యాన్స్ అడిగిన సరదా ప్రశ్నలకు ఫన్నీగా జవాబు చెప్పారు. పదిహేనేళ్లలో మీరు నేర్చుకున్నదేంటి? మనం అనుకున్న విధంగా అన్నీ జరగవు. అలా జరగకపోవడం కూడా మన మంచికే. మిమ్మల్ని బాగా భయపెట్టే విషయం? బతికున్నప్పుడే పాతిపెట్టడం. అయినా నన్నెవరలా చేస్తారు? కాకపోతే అప్పుడప్పుడూ ఈ ఆలోచన వస్తుంది. అప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. మీ దృష్టిలో ప్రేమంటే ? జీవితానికి కావాల్సిన విషయం. లవ్ అంటే మేజిక్. మీ బలం? నా బ్రెయిన్ కొత్త హీరోయిన్లకు మీరిచ్చే సలహా? హార్డ్ వర్క్ చేయాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇతరులను గౌరవించాలి. ఉదయం నిద్రలేవగానే మీరు చేసే యాక్టివిటీ? సూపర్ బ్రెయిన్ యోగా షూటింగ్ స్పాట్లో అప్సెట్ అయితే..? నా వ్యానిటీ వేన్లోకి వెళ్లి, సైలెంట్‌గా కూర్చుంటా. ప్రస్తుతం మీరు చదువుతున్న బుక్? ది బ్రేక్‌డౌన్. -
బతికున్నప్పుడే పాతిపెడతారని భయం!
ఇవాళ త్రిష చాలామంది కొత్త కథానాయికలకు రోల్ మోడల్. ఎందుకంటే..ఈ చెన్నై చందమామ సిల్వర్ స్క్రీన్ మీదకొచ్చి పదిహేనేళ్లయింది.ఇప్పుడు చేతిలో అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇన్నేళ్లయినా ఇంకా బిజీగాసినిమాలు చేస్తున్నారంటే త్రిష హార్డ్‌వర్కే కారణం. 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్రిష తన ఫ్యాన్స్ అడిగిన సరదా ప్రశ్నలకు ఫన్నీగా జవాబు చెప్పారు. పదిహేనేళ్లలో మీరు నేర్చుకున్నదేంటి? మనం అనుకున్న విధంగా అన్నీ జరగవు. అలా జరగకపోవడం కూడా మన మంచికే. మిమ్మల్ని బాగా భయపెట్టే విషయం? బతికున్నప్పుడే పాతిపెట్టడం. అయినా నన్నెవరలా చేస్తారు? కాకపోతే అప్పుడప్పుడూ ఈ ఆలోచన వస్తుంది. అప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. మీ దృష్టిలో ప్రేమంటే ? జీవితానికి కావాల్సిన విషయం. లవ్ అంటే మేజిక్. మీ బలం? నా బ్రెయిన్ కొత్త హీరోయిన్లకు మీరిచ్చే సలహా? హార్డ్ వర్క్ చేయాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఇతరులను గౌరవించాలి. ఉదయం నిద్రలేవగానే మీరు చేసే యాక్టివిటీ? సూపర్ బ్రెయిన్ యోగా షూటింగ్ స్పాట్లో అప్సెట్ అయితే..? నా వ్యానిటీ వేన్లోకి వెళ్లి, సైలెంట్‌గా కూర్చుంటా. ప్రస్తుతం మీరు చదువుతున్న బుక్? ది బ్రేక్‌డౌన్. -
బండి కాదు.. మొండి ఇదీ...
సిటీ బస్సులు హడలెత్తిస్తున్నాయి. బ్రేక్డౌన్ల కారణంగా ఎక్కడపడితే అక్కడ రోడ్లపై మొరాయిస్తున్నాయి. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, విడిభాగాలు అమర్చకపోవడం వంటి కారణాలతో బ్రేకులు ఫెయిలై మృత్యుదూతల్లా దూసుకొస్తున్నాయి. ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో..ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అధ్వాన్నపు రహదారులు ఒకవైపు జనాల్ని ఇబ్బంది పెడుతుండగా..మరోవైపు డొక్కు సిటీ బస్సులు సైతం నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి. తరచూ బ్రేక్డౌన్ల కారణంగా రోడ్లపై మొరాయిస్తున్నాయి. ఉన్నపళంగా రోడ్లపై నిలిచిపోవడం, దుకాణాల్లోకి దూసుకొనిపోయి ప్రమాదాలు చోటుచేసుకోవడం, రోడ్డు డివైడర్లు ఎక్కేయడం వంటి దుర్ఘటనలు ప్రయాణికులనే కాకుండా నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం విజయవాడలో ఓ సిటీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో చోటుచేసుకున్న ప్రమాదం తరహాలో నగరంలోనూ తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సకాలంలో బస్సులకు మరమ్మతులు చేయకపోవడం, సరైన విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, వందల సంఖ్యలో కాలం చెల్లిన బస్సులే రోడ్లపైన తిరగడంతో బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలతో పాటు, బస్సులు రోడ్లపైన నిలిచిపోవడం వల్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకవైపు మెట్రో కారణంగా, మరోవైపు వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల వల్ల నగరమంతటా ప్రజలు ట్రాఫిక్ నరకాన్ని చవి చూస్తుండగా సిటీ బస్సుల బ్రేక్ డౌన్స్ అందుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 3550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తుండగా వాటిలో వెయ్యికి పైగా డొక్కు బస్సులే ఉన్నాయి. ఈ డొక్కు బస్సుల్లోనూ 11 లక్షల కిలోమీటర్లు దాటిన కాలం చెల్లిపోయిన బస్సులు సగం మేరకు ఉండవచ్చునని అంచనా. మృత్యుశకటాలు.... బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్లు బస్సులను అదుపు చేయలేక ప్రమాదాలకు పాల్పడుతున్నారు. సిటీ బస్సులు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. గతంలో కవాడిగూడలో జరిగిన ప్రమాద ఘటనలో చెంగిచెర్ల డిపోకు చెందిన ఓ బస్సు అదుపు తప్పి స్కూటీ పై వెళుతున్న ఇద్దరు అమ్మాయిలను ఢీకొట్టింది. దాంతో ఆ ఇద్దరు తీవ్ర గాయాలతో దర్మరణం పాలయ్యారు. ఆ ప్రమాదం మొత్తం నగరాన్నే తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రెండేళ్ల క్రితం బండ్లగూడ డిపోకు చెందిన బస్సు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఓ యువకున్ని బలితీసుకుంది. డొక్కు బస్సుల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ ఆర్టీసీలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేకపోవడం గమనార్హం. అప్పట్లో సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృత్యువాత పడింది. అదే ఏడాది ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల బంజారాహిల్స్‌లోని ఐస్‌క్రీమ్ పార్లర్‌లోకి దూసుకెళ్లింది. గత మూడేళ్లలో సుమారు 350కి పైగా బస్సు ప్రమాదాలు జరగ్గా...170 మంది వరకు మృత్యువాత పడ్డట్లు అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయాలకు గురయ్యారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక కారణం అయితే కాలం చెల్లిన, డొక్కు బస్సులు మరో కారణం. నగరంలో ఆర్టీసీ బస్సుల వల్లనే 11 శాతం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ జంపింగ్‌లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకైతే లెక్కే ఉండడం లేదు. ఏటా 7000 నుంచి 10,000 వరకు ఇలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. రోజుకు 10 నుంచి 15 బస్సులు బ్రేక్‌డౌన్.... * గ్రేటర్లో 29 డిపోల నుంచి ప్రతి రోజు 3550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్ధ్యం లేనివి, నాణ్యతలేని విడిభాగాల కారణంగా చెడిపోయేవి రోజూ 10 నుంచి 15 బస్సులు ఉంటాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయం నిలిచిపోయినట్లే. ఈ లెక్కన 2500 కిలోమీటర్ల నుంచి 3750 కిలోమీటర్ల వరకు సర్వీసులు రద్దవుతాయి. ప్రతి నెలా 350 నుంచి 450 వరకు బస్సులు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. నగరంలో సిటీ బస్సులు ♦ మొత్తం డిపోలు : 29 ♦ మొత్తం బస్సులు : 3550 ♦ ఆర్డినరీ బస్సులు : 2299 ♦ మెట్రో ఎక్స్‌ప్రెస్ : 886 ♦ మెట్రో డీలక్స్ : 161 ♦ లోఫ్లోర్ ఏసీ : 58 ♦ సూపర్‌లగ్జరీ : 46 ♦ మెట్రో లగ్జరీ : 80 ♦ వజ్ర : 14, గరుడ : 6, రాజధాని : 17 ♦ ప్రస్తుతం మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో సుమారు వెయ్యి డొక్కువే. ♦ గతంలో జెఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కొనుగోలు చేసిన బస్సులన్నీ ఇప్పుడు చాలా వరకు చెడిపోయాయి. ♦ కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధుల కొరత, వరుస నష్టాల కారణంగా డొక్కు బస్సులనే నడుపుతున్నారు. ♦ సిటీ ఆర్టీసీని మెరుగుపర్చేందుకు ఇప్పటికిప్పుడు 1000 కొత్త బస్సులు అవసరం. ♦ ఒక బస్సు జీవితం కాలం కనీసం 15 సంవత్సరాలు లేదా 10.5 లక్షల కిలోమీటర్లు. కానీ చాలా బస్సులు జీవితకాలం ముగిసినవే ఉన్నాయి. బస్సులు నడపలేకపోతున్నాం స్పేర్‌పార్ట్స్ సరిగ్గా ఉండవు. రేర్ మిర్రర్ పని చేయదు. వైపర్స్ ఉండవు. ఒక్కోసారి ఎక్సలేటర్లు, గేర్లు, ఇబ్బంది పెడుతాయి. బ్రేక్‌లు ఫెయిల్ అవుతాయని ఉహించలేం కదా. బస్సు కండీషన్‌గా ఉంచాల్సిన బాధ్యత మెకానిక్ విభాగానిది. విడిభాగాలు సకాలంలో అందకపోతే కూడా ఇబ్బందే. ఒక్కోసారి సర్దుబాటు చేసి పంపిస్తారు. కానీ తీరా రోడ్డెక్కిన తరువాత బస్సు సడెన్‌గా ఆగిపోతుంది. – మహేష్, ఆర్టీసీ యూనియన్ నాయకుడు రోడ్లు కూడా కారణమే... బస్సులకు ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా గుంతల రోడ్ల వల్ల తరచుగా చెడిపోతున్నాయి. బస్సులు నడపడమే కష్టమవుతోంది. నడుములు విరుగుతున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటోంది. రోడ్లే పెద్ద సమస్య. అడుగడుగునా గుంతలే. చాలా ఇబ్బందిగా ఉంది. – యాదగిరి, డ్రైవర్, కంటోన్మెంట్ -
చీ‘కట్’లు
పది నిమిషాలకోసారి ట్రిప్.. పావుగంటకోసారి బ్రేక్ డౌన్.. అరగంటకోసారి లోడ్ రిలీఫ్.. గంటకోసారి లైన్ క్లియర్.. జిల్లాలో కరెంట్ సరఫరా దుస్థితి ఇదీ. అటు మండుతున్న ఎండలు, ఇటు కరెంట్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కటిక చీకట్లో కంటిమీద కునుకు రాక జనాలు.. వేసిన తుకాల కోసం చుక్కనీరు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెరిగిన డిమాండ్ కనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి లేకపోవడమే అనధికార కోతలకు కారణంగా తెలుస్తోంది. మెదక్: జిల్లాలో కరెంట్ కోతలు తీవ్ర రూపం దాల్చాయి. కోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరోవైపు వ్యవసాయానికి 7 గంటల కరెంట్ ఇస్తామన్న అధికారులు కనీసం 6 గంటలు కూడా సక్రమంగా ఇవ్వలేక పోతుండటం.. మరోవైపు వర్షపు జాడలేక.. ఊపిరి పోసుకుంటున్న నారుమళ్లకు నీరుపెట్టలేక రైతన్న కన్నీటిమయమవుతున్నారు. జిల్లాలో 6.83 లక్షల వాణిజ్య, గృహ వినియోగదారులున్నారు. వీరితోపాటు పరిశ్రమలు, వ్యవసాయ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి విద్యుత్ సరఫరా కోసం పట్టణ ప్రాంతంలో 77 ఫీడర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 613, 135 మిశ్రమ, 96 ఎక్స్‌ప్రెస్, 28 డెడికేటెడ్ ఫీడర్లు కలిసి మొత్తం 949 ఫీడర్లు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 563.27 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కావాలి. కాని వర్షపు జాడలేక జల విద్యుత్ కేంద్రాలు వట్టి పోతున్నాయి. బొగ్గు ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఘననీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో రోజుకు 422.16 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రం సరఫరా అవుతోంది. రైతన్నల గోడు.. జిల్లాలో 2.21.296 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, 6.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. కాని ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుండటంతో రోజుకు 6 గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా కావడం లేదు. అదికూడా రెండు విడతల్లో ఇస్తున్నారు. మధ్యలో అంతరాయం ఏర్పడితే తిరిగి విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షపు చుక్క జాడలేక పోవడంతో బోర్లున్న చోట్ల రైతులు వరి తుకాలు పోశారు. అయితే తుకాలు బతికించుకునేందుకు కూడా నీరు సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే సమయంలో ఎండలు మండుతుండటంతో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వేస్తేగాని ఉండలేని పరిస్థితి నెలకొంది. అయితే కరెంట్ మాత్రం ఎప్పుడు పోతుందో..ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. మెదక్ పట్టణంలో 15 రోజులుగా కరెంట్ కోతలు మరీ దారుణంగా మారాయి. ఒక్కోసారి సుమారు 3 నుంచి 4 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. దీంతో జనాలు నిద్రకు దూరమై ఆరుబయటే జాగరణ చేస్తున్నారు. వ్యాపారులు, కరెంట్‌పై ఆధారపడి జీవనం సాగించే జిరాక్స్ సెంటర్లు, గిర్నీలు, ఇంటర్నెట్ సెంటర్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ దుకాణాదారులు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కరెంట్ కోతల వల్ల వ్యాపారులు దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఫేస్బుక్ కాసేపు నిలిచిపోయిందిలా!