నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్‌! | Aryan Khan And Shah Rukh Khan Break Down At Mumbai Arthur Road Jail | Sakshi
Sakshi News home page

Aryan Khan: కొడుకును చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన షారుక్‌

Published Thu, Oct 21 2021 4:17 PM | Last Updated on Thu, Oct 21 2021 4:46 PM

Aryan Khan And Shah Rukh Khan Break Down At Mumbai Arthur Road Jail - Sakshi

Shah Rukh Khan Emotional When He Meets Aryan Khan: డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం అతడికి బెయిల్‌ వస్తుందని అంతా భావించినా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో షారుక్‌ ఖాన్‌  తొలిసారిగా ఆర్థర్‌ రోడ్‌ జైళ్లో ఉన్న కుమారుడిని కలిసి కలిసేందుకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు సమాచారం. వీరి మధ్య గ్రిల్‌, గాజు గోడ అడ్డంగా ఉంది. ఇంటర్‌కామ్‌ ద్వారా వీరిద్దరూ మాట్లాడుకున్నారు.తండ్రిని నేరుగా చూడగానే ఆర్యన్‌ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయినట్లు సిబ్బంది వర్గాలు వెల్లడించాయి. దాదాపు15-20నిమిషాల వరకు వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ఆర్యన్‌ 'ఐ యామ్‌ సారీ' అని పదేపదే తండ్రికి చెప్పాడట.

దీంతో తీవ్ర భావేద్వోగానికి లోనైన షారుక్‌ కన్నీళ్లు ఆపుకుంటూ..నేను నిన్ను నమ్ముతున్నానంటూ కొడుకులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అం‍తకుముందు కూడా తల్లిదండ్రులతో  వీడియో కాల్‌ మాట్లాడుతూ ఆర్యన్‌ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఆర్యన్‌ను కలుసుకున్న షారుక్‌
‘లైగర్‌’ భామని విచారించనున్న ఎన్‌సీబీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement