Arthur Road jail
-
జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల
-
ఆర్యన్ ఖాన్ విడుదల.. ఇప్పటివరకు ఏం జరిగిందంటే?
Aryan Khan Released from Arthur Road Jail: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే ఆర్థర్ రోడ్ జైలు వద్దకు చేరుకున్న షారుక్ ఖాన్ కొడుకును ఇంటికి తీసుకురానున్నారు. దీంతో మన్నత్‌లో సందడి వాతావరణం నెలకొంది. 28రోజుల జైలు జీవితం అనంతరం ఆర్యన్ బయటకు వచ్చారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు షారుక్ అభిమానులు భారీగా మన్నత్‌కు చేరుకున్నారు. 'వెల్కం ఆర్యన్' అంటూ పోస్టర్లు పట్టుకొని బాణసంచా కాల్చుతూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. కాగా ఈ నెల అక్టోబర్ 2వ తేదీన క్రూయిజ్ ఓడరేవులో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడి జరపగా, అందులో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు 23 రోజుల అనంతరం ఆర్యన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు ఆర్యన్ హాజరుకావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్యన్ దేశం వదిలి వెళ్లకూడదని కూడా బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏం జరిగిందంటే.. ► అక్టోబర్ 2: ముంబై తీరంలోని గోవాకు చెందిన కొర్డెలియా క్రూయిజ్‌లో రేవ్‌పార్టీపై ఎన్సీబీ దాడులు చేసి షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌తో సహా 14 మందిని అదుపులోనికి తీసుకుంది. ► అక్టోబర్ 4: ఆ 14 మందిలో ఆర్యన్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు ఎన్సీబీ ప్రకటించింది. అక్టోబర్ 7 వరకు నిందితులు ఎన్సీబీ కస్టడీలోనే ఉన్నారు ► అక్టోబర్ 7: ఎన్సీబీ ఇక కస్టడీ అవసరం లేదని చెప్పడంతో కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ► అక్టోబర్ 8: ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకి ఆర్యన్‌ని తరలించారు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది ► అక్టోబర్ 11: ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఏర్పాటైన ముంబై ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ సమర్పించారు ► అక్టోబర్ 13–20: ఆ కోర్టులోనూ బెయిల్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి 20వ తేదీన ఆర్యన్‌కు బెయిల్ తిరస్కరించింది. ► అక్టోబర్ 21: ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న ఆర్యన్‌ను షారూక్‌ఖాన్ కలుసుకున్నారు. ఆర్యన్ జ్యుడీషియల్ కస్టడీని అక్టోబరు 30 వరకు పొడిగించారు ►అక్టోబర్ 26–28: బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ► అక్టోబర్ 28: ఆర్యన్‌ఖాన్, ఇద్దరు సహ నిందితులకు బెయిల్ మంజూరు చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం చట్టపరమైన బాధ్యత తీసుకున్న ప్రముఖ నటి -
సరిగ్గా తింటున్నావా? ఆర్యన్‌ను ప్రశ్నించిన షారుక్
Shah Rukh Khan Emotional When He Met Aryan: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌ను విడిపించేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అతడికి బెయిల్ రాలేదు. దీంతో షారుక్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారాం. ఈ నేపథ్యంలో తొలిసారిగా కొడుకు ఆర్యన్‌ను చూసేందుకు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి వెళ్లిన షారుక్..దాదాపు 18నిమిషాల వరకు మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో కొడుకు పరిస్థితి తల్లి షారుక్ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తుంది. చదవండి: షారుక్ కుమార్తె సుహానా ఖాన్‌కు డ్రగ్ డీలర్లతో లింకులు? ఈ క్రమంలో..సరిగ్గా తింటున్నావా అని షారుక్ అడగ్గా..జైలు భోజనం బాగోలేదని ఆర్యన్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దీంతో కొడుకు కోసం ఇంటి భోజనం పంపించొచ్చా అని షారుక్ జైలు అధికారులను అడగ్గా..ఇందుకోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పినట్లు తెలుస్తుంది. జైళ్లో ఆర్యన్ సరిగ్గా తినడం లేదని, అంతేకాకుండా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆర్యన్ ఆరోగ్య పరిస్థితిపై షారుక్ ఆందోళన చెందుతున్నట్లు సన్నిహితులు తెలిపారు. చదవండి: నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్! షారుక్ నాకు తండ్రిలాంటి వాడు.. వైరల్ అవుతున్న పాత ఇంటర్వూ -
నన్ను క్షమించండి డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్యన్!
Shah Rukh Khan Emotional When He Meets Aryan Khan: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం అతడికి బెయిల్ వస్తుందని అంతా భావించినా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో షారుక్ ఖాన్ తొలిసారిగా ఆర్థర్ రోడ్ జైళ్లో ఉన్న కుమారుడిని కలిసి కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరూ తీవ్ర భావోద్వేగానికి లోనయినట్లు సమాచారం. వీరి మధ్య గ్రిల్, గాజు గోడ అడ్డంగా ఉంది. ఇంటర్‌కామ్ ద్వారా వీరిద్దరూ మాట్లాడుకున్నారు.తండ్రిని నేరుగా చూడగానే ఆర్యన్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయినట్లు సిబ్బంది వర్గాలు వెల్లడించాయి. దాదాపు15-20నిమిషాల వరకు వీరు మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే ఆ సమయంలో ఆర్యన్ 'ఐ యామ్ సారీ' అని పదేపదే తండ్రికి చెప్పాడట. దీంతో తీవ్ర భావేద్వోగానికి లోనైన షారుక్ కన్నీళ్లు ఆపుకుంటూ..నేను నిన్ను నమ్ముతున్నానంటూ కొడుకులో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతకుముందు కూడా తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడుతూ ఆర్యన్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. #WATCH Actor Shah Rukh Khan reaches Mumbai's Arthur Road Jail to meet son Aryan who is lodged at the jail, in connection with drugs on cruise ship case#Mumbai pic.twitter.com/j1ozyiVYBM — ANI (@ANI) October 21, 2021 చదవండి: Aryan Khan Drug Case: ఆర్థర్ రోడ్డు జైల్లో ఆర్యన్‌ను కలుసుకున్న షారుక్ ‘లైగర్’ భామని విచారించనున్న ఎన్సీబీ -
కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన తనయుడు ఆర్యన్‌ను చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకు బుధవారం ఆయన తనయుడిని కలిసి కాపేపు ముచ్చటించి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసుల అదుపులో ఉన్న ఆర్యన్‌ను షారుక్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల అక్టోబర్ 2న రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన పోలీసులు షారుక్ కుమారుడితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: షారుక్‌కు షాక్, ఆర్యన్‌కు దొరకని బెయిల్ ఈ దాడిలో పోలీసులు నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆర్యన్‌కు ముంబై కోర్టు చుక్కలు చూపిస్తోంది. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆర్యన్ పలుమార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం మరోసారి ఆర్యన్‌కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌కు మళ్లీ బెయిల్ రద్దవ్వడంతో తనయుడిని చూసేందుకు షారుక్ ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చినట్లు సమాచారం. చదవండి: నా కొడుక్కి బెయిల్ వచ్చేవరకు స్వీట్లు వండొద్దు! : గౌరీ ఖాన్ కాగా గతవారం షారుక్‌తోపాటు అతని భార్య గౌరీ ఖాన్ జైలులో ఉన్న ఆర్యన్‌తో వీడియో కాల్ మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన నిబంధనలను సడలిచింది. దీంతో జైలులో ఉన్న వ్యక్తులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునే వెసులుబాటును ఇచ్చారు. ఈ క్రమంలో షారుక్, ఆర్యన్‌ను కలుసుకునేందుకు వచ్చారు. ఈ కేసు కోర్టు విచారణలో ఆర్యన్‌కు షారుక్ మేనేజర్ పూజా దద్లానీ, ఆయన న్యాయవాదులు సాయం చేస్తున్నారు. ప్రత్యేక న్యాయస్థానం తన బెయిల్‌ను నిరాకరిస్తుండటంతో ఇక ఆర్యన్ ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నాడని సమాచారం. -
నీరవ్ మోదీ కోసం బ్యారక్ 12 సిద్ధం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని యూకే, భారత్‌కి అప్పగిస్తుండడంతో, నీరవ్ మోదీ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేక సెల్‌ని సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నీరవ్‌ని ముంబైకి తీసుకొచ్చిన వెంటనే ఆయన్ను ఆర్థర్ రోడ్ జైలులో అత్యధిక భద్రత ఉన్న బ్యారక్ నంబర్ 12లోని మూడు సెల్‌లలో ఒకదానిలో ఉంచనున్నారు. నీరవ్‌కు జైల్లో కల్పించే వసతులను గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తక్కువ మంది ఖైదీలున్న సెల్లో అతడిని ఉంచుతామని జైలు అధికారులు వెల్లడించారు. బ్యారక్‌లో నీరవ్‌కు మూడు చదరపు మీటర్ల స్థలం మాత్రమే ఉంటుంది. ఒక కాటన్ పరుపు, తలదిండు, ఒక దుప్పటి, కప్పుకోవడానికి బ్లాంకెట్ ఇస్తామని అధికారి తెలిపారు. అక్కడ తగు మాత్రంగా గాలి, వెలుతురు సోకుతుందని, ఆయనకు సంబంధించిన వస్తువులు పెట్టుకునే స్థలం కూడా ఉంటుందని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విజయ్‌మాల్యాని యూకే నుంచి భారత్‌కి అప్పగిస్తే ఇదే ఆర్థర్ రోడ్ జైల్లో, 12వ నంబర్ బ్యారక్‌లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్టు జైలు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్, మోసం కేసులో విజయ్ మాల్యా మార్చి 2016 నుంచి యూకేలో ఉన్నాడు. -
మాల్యా జైలు, ఎన్ని సౌకర్యాలో చూడండి..
న్యూఢిల్లీ : టీవీ, పర్సనల్ టాయిలెట్, బెడ్, వాష్ చేసుకునే ఏరియా, ఎల్లప్పుడూ సూర్యుని కాంతి పడేలా వెంటిలేషన్.. ఇదిగో చూడండి.. జైలు ఎంత బాగా రూపుదిద్దుకుందో... ఇంతకుమించిన సౌకర్యాలు కావాలా? అంటూ సీబీఐ, యూకే కోర్టుకు ఓ వీడియో డాక్యుమెంటరీ సమర్పించింది. ఇంతకీ ఈ వీడియో ఏంటి, దీని కథేంటి, అనుకుంటున్నారా? విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలనే కేసుపై యూకే కోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అయితే భారత్‌లో జైళ్లు బాగుండవని బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో నక్కిన విజయ్ మాల్యా, యూకే కోర్టులో వాదించారు. మాల్యా వాదనల మేరకు ఆయన్ను భారత్‌కు అప్పగిస్తే, ఆయనను ఎక్కడ ఉంచుతారు? జైలులో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? నిందితుడి సెల్ ఏ విధంగా ఉంటుందో చూపుతూ ముంబై జైలు వీడియోను తమకు సమర్పించాలని సీబీఐను యూకే కోర్టు ఆదేశించింది. యూకే కోర్టు ఆదేశాల మేరకు మాల్యాను ఉంచే ముంబై ఆర్థుర్ రోడ్ జైలులోని బరాక్ నెంబర్ 12ను, అక్కడ ఉండే సౌకర్యాలను చూపిస్తూ.. 6 నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియోను తీసిన సీబీఐ డాక్యుమెంటరీ రూపంలో యూకే కోర్టుకు సమర్పించింది. ఇదే మాల్యా నివాసం అని పేర్కొంది. కాగ, భారత జైళ్లలో తాజా గాలి, సహజ సిద్ధమైన కాంతి ఉండవని విజయ్‌మాల్యా ఆరోపించారు. మాల్యాను ఉంచబోయే సెల్ ముఖద్వారం తూర్పువైపు ఉంటుంది. అంటే సూర్యకాంతి మంచిగా పడుతుంది అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. కిటికి తలుపులు, ఇరువైపుల బార్లతో మాల్యాను ఉంచబోయే సెల్ మంచి వెంటిలేషన్‌ను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. విజయ్‌మాల్యాకు లైబ్రరీ యాక్సస్ కూడా కల్పిస్తామని ఈ వీడియో తీసిన సీనియర్ అధికారి చెప్పారు. ఇక భద్రతాపరంగా చూసుకుంటే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల భద్రతాపరమైన వసతులున్నాయని తెలిపారు. విచారణ సమయాల్లో పలుసార్లు ఇదే విషయాన్ని తాము కోర్టుకు వెల్లడించామని కూడా చెప్పారు. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లో ఎలాంటి లోపాలు లేవని, హోం మంత్రిత్వ శాఖ కూడా దీనిపై సెక్యురిటీ ఆడిట్ చేపట్టిందని తెలిపారు. జైలులోని సెల్లన్నింటినీ సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంటాయని, బరాక్ వెలుపల, లోపల అదనపు గార్డులు ఉంటారని, వారు 24 గంటల పాటు బరాక్కు కాపాలాగా ఉంటారని అధికారులు చెప్పారు. రోజులో నాలుగు సార్లు భోజనం అందిస్తామని, ఆర్థూర్ రోడ్డు జైలులోని బరాక్ 12 ఎక్కువగా హై-ప్రొఫైల్ ఖైదీలకు మాత్రమే వాడనున్నట్టు తెలిపారు. ఎవరికైతే భద్రతాపరమైన ముప్పు ఎక్కువగా ఉంటుందో, వారు ఎవరికైనా ముప్పు కలిగిస్తారని అనుమానం ఉన్నా.. వారిని బరాక్‌లోనే ఉంచనున్నట్టు చెప్పారు. బ్యాంక్‌లకు దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు ఎగ్గొట్టి, యూకేకు పారిపోయిన మాల్యాను కూడా భారత్‌కు రప్పిస్తే ఇక్కడే ఉంచనున్నారు. ఆయన్ను భారత్‌కు అప్పగించే వ్యవహారంపై తదుపరి విచారణ సెప్టెంబర్ 12న జరుగనుంది. -
ఎంతగా మారిపోయారు?
ముంబై: ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో! మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒకప్పుడు రాజవైభోగం వెళ్లబోసిన ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్ బల్ నాటకీయ పరిణామాల్లో జైలు పాలయ్యారు. తాను దగ్గరుండి మరీ కట్టించిన కారాగారంలోనే గడపాల్సి రావడం విధి వైచిత్రి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆయన ఫొటోలు చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఆయనను పోల్చుకోలేపోతున్నారు. నెరిసిన గడ్డం, పెరిగిన జుత్తుతో నీరసంగా వీల్ చైర్ లో కూర్చున్న ఆయనను చూసి మహారాష్ట్రీయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కళ్లు లోతుకుపోయి, బట్టలు చెదిరిపోయి ఉన్న ఆయనను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. 'ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు' అంటూ చర్చించుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను శనివారం ముంబైలోని సెయింట్ జార్జి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరు వారాల క్రితం వరకు మహారాష్ట్రలో ధనవంతుడైన, శక్తివంతుడైన రాజకీయ నాయకుడిగా ఉన్న భుజ్ బల్ జీవితం అవినీతి ఆరోపణలతో దీనంగా మారిపోయింది. ఆయనను అరెస్ట్ చేసి ఆర్థూర్ రోడ్ జైలుకు తరలించారు. పంటి నొప్పి, ఛాతి నొప్పితో బాధ పడుతున్న ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. -
12వ నంబర్ జైలు గదిలో మాజీ మంత్రి
ముంబై: కాలం కలిసిరాకపోతే కర్రే పాములా మారి కాటేస్తుందన్నది నానుడి. మహారాష్ట్ర రాజకీయ నాయకుడు, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్ బల్ కు ఇపుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. తాను దగ్గరుండి కట్టించిన జైలు గదిలోనే ఇప్పుడు ఆయన ఉండడం గమనార్హం. అవినీతి ఆరోపణలతో అరెస్టైన ఆయనకు ఆర్థర్ రోడ్డు జైలులో 12వ నంబర్ గదిని కేటాయించారు. 'బేరక్ నంబర్ 12'గా పిలిచే ఈ బుల్లెట్ ప్రూఫ్ గదిని 26/11 దాడిలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మాల్ కసబ్ కోసం 2008లో ప్రత్యేకంగా కట్టించారు. లష్కర్-ఈ-తోయిబా నుంచి కసబ్ ముప్పు పొంచివుందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ ప్రత్యేక సెల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు ప్రజాపనుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న భుజ్ బల్ ఇన్ చార్జిగా వ్యవహరించి ఈ జైలు గది నిర్మాణ బాధ్యలు పర్యవేక్షించారు. కాలం గిర్రున తిరిగింది. అవినీతి ఆరోపణలతో అరెస్టైన 68 ఏళ్ల భుజ్ బుల్ ఇప్పుడు ఇదే జైలు గదిలో గడపాల్సి వచ్చింది. సవతి కుమార్తె షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియా ఇదే సెల్ లో ఉన్నారు. వీరు 'బేరక్ నంబర్ 12' ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి బిపిన్ కుమార్ సింగ్ ధ్రువీకరించారు. అయితే 2012లో కసబ్ ను ఉరి తీసిన తర్వాత దీన్ని పలు విభాగాలుగా విడదీసి హైప్రొఫైల్ ముద్దాయిలకు ప్రత్యేకించినట్టు వెల్లడించారు. -
అర్థర్ జైల్లో ఖైదీ మృతి
చీటింగ్ కేసులో అరెస్ట్ అయి అర్థర్ రోడ్డు జైల్లో శిక్ష అనుభవిస్తున్న నబజీత్ నారాయణదాస్ (26) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడని ఆ జైలు ఉన్నతాధికారులు గురువారం ముంబైలో వెల్లడించారు. ఉదయం జైలు గదిలో నారాయణదాస్ విగత జీవుడుగా పడి ఉండటాన్ని జైలు సిబ్బంది కనుగొని, జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జైలు అధికారులు వైద్యులను తీసుకుని తరలివచ్చారు. ఉదయం 4.30 గంటలకు నారాయణదాస్ తీవ్ర గుండె నొప్పితో మృతి చెందాడని వైద్యులు దృవీకరించారు. దాంతో అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జేజే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక అందితే కాని నారాయణదాస్ మృతికి గల కారణాలు తెలియవని జైలు అధికారులు తెలిపారు. అసోం రాష్ట్రానికి చెందిన నారాయణదాసును చీటింగ్ కేసులోముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. అనంతరం అతడిని జూన్ 26న అర్థర్ జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.