ఎంతగా మారిపోయారు? | Politician Chhagan Bhujbal, Then and Now: A Photo Goes Viral | Sakshi
Sakshi News home page

ఎంతగా మారిపోయారు?

Published Mon, Apr 25 2016 3:59 PM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM

ఎంతగా మారిపోయారు? - Sakshi

ఎంతగా మారిపోయారు?

ముంబై: ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో! మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒకప్పుడు రాజవైభోగం వెళ్లబోసిన ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్ బల్ నాటకీయ పరిణామాల్లో జైలు పాలయ్యారు. తాను దగ్గరుండి మరీ కట్టించిన కారాగారంలోనే గడపాల్సి రావడం విధి వైచిత్రి.

తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆయన ఫొటోలు చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఆయనను పోల్చుకోలేపోతున్నారు. నెరిసిన గడ్డం, పెరిగిన జుత్తుతో నీరసంగా వీల్ చైర్ లో కూర్చున్న ఆయనను చూసి మహారాష్ట్రీయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కళ్లు లోతుకుపోయి, బట్టలు చెదిరిపోయి ఉన్న ఆయనను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. 'ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు' అంటూ చర్చించుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను శనివారం ముంబైలోని సెయింట్ జార్జి ఆస్పత్రికి తీసుకువచ్చారు.

ఆరు వారాల క్రితం వరకు మహారాష్ట్రలో ధనవంతుడైన, శక్తివంతుడైన రాజకీయ నాయకుడిగా ఉన్న భుజ్ బల్ జీవితం అవినీతి ఆరోపణలతో దీనంగా మారిపోయింది. ఆయనను అరెస్ట్ చేసి ఆర్థూర్ రోడ్ జైలుకు తరలించారు. పంటి నొప్పి, ఛాతి నొప్పితో బాధ పడుతున్న ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement