Chhagan Bhujbal
-
‘మీరు చెప్పిందల్లా చేయడానికి కీలు బొమ్మను కాను!’
ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.నాసిక్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్‌ను రాజీనామా చేయిస్తారట... నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు. రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్‌బల్.. మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్‌బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు. -
మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు
ముంబై: ఒక మాజీ మంత్రి హిందుమతానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక వ్యక్తిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొటున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ మేరకు ముంబై పోలీసులు సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్ భుజపాల్, మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు సదరు వ్యక్తి తాను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన రెండు వీడియోలను ఎన్సీప్ నాయకుడికి పంపించడంతో వారు తనను చంపేస్తానంటూ బెదిరించారని వాపోయాడు. భుజపాల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం నాసిక్ జిల్లాలోని యోలా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేగాదు ఆయ గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు. (చదవండి: నామినేషన్ సమర్పించిన మరునాడే రాజీనామా చేసిన ఖర్గే) -
మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్(71)కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ ల్యాండర రెండేళ్ల జైలుశిక్ష అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. తన ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు విన్నవించుకున్న భుజ్‌బల్, డిసెంబర్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద సుప్రీంకోర్టు కొన్ని సెక్షన్లపై తీసుకున్న నిర్ణయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చి తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.5 లక్షల పూచీకత్తుపై బాంబే హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో గత రెండేళ్లుగా భుజ్‌బల్‌తో పాటు ఆయనతో పాటు అక్రమ ఆస్తులు కూడబెట్టిన బంధువులు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలడంతో భుజ్‌బల్, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు. భుజ్‌బల్, ఆయన భార్య మీనా, కొడుకు పంకజ్, కోడలు విశాఖ, మేనల్లుడు సమీర్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజ్‌బల్‌పై నమోదయ్యాయి. 2016 మార్చిలో భుజ్‌బల్‌ను ముంబై ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కాం, మహారాష్ట్ర సదన్ స్కాంలతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. దాదాపు రూ.870 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు భుజ్‌బల్‌పై ఆరోపణలున్నాయి. -
మాజీ డిప్యూటీ సీఎంపై ఏసీబీ కేసు
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్, మరో 11 మందిపై అవినీతి నిరోధక శాఖ తాజా కేసు నమోదుచేసింది. ఆయన ఆదాయానికి మించి రూ. 203 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలడంతో భుజ్‌బల్, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు పెట్టారు. భుజ్‌బల్, ఆయన భార్య మీనా, కొడుకు పంకజ్, కోడలు విశాఖ, మేనల్లుడు సమీర్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. వీళ్లతోపాటు సీఏలు సునీల్ నాయక్, చంద్రశేఖర్ శారద, హవాలా ఆపరేటర్ సురేష్ జజోడియా, భుజ్‌బల్ కంపెనీల డైరెక్టర్లు ప్రవీణ్‌కుమార్ జైన్, జగదీష్‌ప్రసాద్ పురోహిత్, ఆర్థిక సలహాదారు సంజీవ్ జైన్, స్నేహల్ సహకార సంఘం డైరెక్టర్ కపిల్ పూరీల పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజ్‌బల్‌పై నమోదయ్యాయి. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కాం, మహారాష్ట్ర సదన్ స్కాంలతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. ముంబై, పుణె, లోనావాలా, నాసిక్ ప్రాంతాల్లో ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఇళ్లు, కార్యాలయాలు, ఇతర ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు భుజ్‌బల్‌తో పాటు పంకజ్, సమీర్, నాయక్‌లపై వచ్చాయి. -
ఎంతగా మారిపోయారు?
ముంబై: ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో! మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒకప్పుడు రాజవైభోగం వెళ్లబోసిన ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్ బల్ నాటకీయ పరిణామాల్లో జైలు పాలయ్యారు. తాను దగ్గరుండి మరీ కట్టించిన కారాగారంలోనే గడపాల్సి రావడం విధి వైచిత్రి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆయన ఫొటోలు చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఆయనను పోల్చుకోలేపోతున్నారు. నెరిసిన గడ్డం, పెరిగిన జుత్తుతో నీరసంగా వీల్ చైర్ లో కూర్చున్న ఆయనను చూసి మహారాష్ట్రీయులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కళ్లు లోతుకుపోయి, బట్టలు చెదిరిపోయి ఉన్న ఆయనను చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. 'ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు' అంటూ చర్చించుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను శనివారం ముంబైలోని సెయింట్ జార్జి ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరు వారాల క్రితం వరకు మహారాష్ట్రలో ధనవంతుడైన, శక్తివంతుడైన రాజకీయ నాయకుడిగా ఉన్న భుజ్ బల్ జీవితం అవినీతి ఆరోపణలతో దీనంగా మారిపోయింది. ఆయనను అరెస్ట్ చేసి ఆర్థూర్ రోడ్ జైలుకు తరలించారు. పంటి నొప్పి, ఛాతి నొప్పితో బాధ పడుతున్న ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. -
12వ నంబర్ జైలు గదిలో మాజీ మంత్రి
ముంబై: కాలం కలిసిరాకపోతే కర్రే పాములా మారి కాటేస్తుందన్నది నానుడి. మహారాష్ట్ర రాజకీయ నాయకుడు, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్ బల్ కు ఇపుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. తాను దగ్గరుండి కట్టించిన జైలు గదిలోనే ఇప్పుడు ఆయన ఉండడం గమనార్హం. అవినీతి ఆరోపణలతో అరెస్టైన ఆయనకు ఆర్థర్ రోడ్డు జైలులో 12వ నంబర్ గదిని కేటాయించారు. 'బేరక్ నంబర్ 12'గా పిలిచే ఈ బుల్లెట్ ప్రూఫ్ గదిని 26/11 దాడిలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మాల్ కసబ్ కోసం 2008లో ప్రత్యేకంగా కట్టించారు. లష్కర్-ఈ-తోయిబా నుంచి కసబ్ ముప్పు పొంచివుందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ ప్రత్యేక సెల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు ప్రజాపనుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న భుజ్ బల్ ఇన్ చార్జిగా వ్యవహరించి ఈ జైలు గది నిర్మాణ బాధ్యలు పర్యవేక్షించారు. కాలం గిర్రున తిరిగింది. అవినీతి ఆరోపణలతో అరెస్టైన 68 ఏళ్ల భుజ్ బుల్ ఇప్పుడు ఇదే జైలు గదిలో గడపాల్సి వచ్చింది. సవతి కుమార్తె షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియా ఇదే సెల్ లో ఉన్నారు. వీరు 'బేరక్ నంబర్ 12' ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి బిపిన్ కుమార్ సింగ్ ధ్రువీకరించారు. అయితే 2012లో కసబ్ ను ఉరి తీసిన తర్వాత దీన్ని పలు విభాగాలుగా విడదీసి హైప్రొఫైల్ ముద్దాయిలకు ప్రత్యేకించినట్టు వెల్లడించారు. -
870 కోట్ల లంచం.. మాజీ ఉపముఖ్యమంత్రి అరెస్టు
వివిధ ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు ఇచ్చినందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న నేరంలో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు అరెస్టు చేశాయి. ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ నిర్మాణం సహా పలు కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఆయన దాదాపు రూ. 870 కోట్లు లంచాల రూపంలో తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తంలో కొంత భాగాన్ని విదేశాలకు తరలించి, బూటకపు కంపెనీలకు పెట్టుబడుల రూపంలో వెనక్కి తెప్పించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలలో ఒకటైన ఆర్మ్‌స్ట్రాంగ్ ఎనర్జీ సంస్థ యజమానులు భుజ్‌బల్ కుటుంబీకులే. ఈ కంపెనీపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. మనీలాండరింగ్ చట్టం కింద భుజ్బల్తోపాటు మరికొందరిపై రెండు ఆర్థిక సమాచార నివేదికల కేసు (ఈసీఐఆర్)లను నమోదుచేసింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం నాసిక్, ముంబై, థానేలోని భుజ్‌బల్, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లపై దాడులు చేశారు. భుజ్‌బల్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన మద్దతుదారుల నుంచి ఇబ్బంది ఎదురవుతుందేమోనని దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో గల ఈడీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. భుజ్‌బల్ అన్న కొడుకు, మాజీ ఎమ్మెల్యే సమీర్ భుజ్‌బల్‌ను ఈడీ ఫిబ్రవరి 1వ తేదీనే అరెస్టు చేసింది. ఛగన్ కొడుకు పంకజ్‌ను కూడా ప్రశ్నించారు. అయితే.. ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపేనని ఎన్సీపీ వర్గాలు అంటున్నాయి. ఛగన్ భుజ్‌బల్‌ను బలిపశువుగా చేసి వేధిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి జితేంద్ర అవద్ అన్నారు. పార్టీ అధినేత శరద్ పవార్, ఇతర సభ్యులు అందరూ ఈ సంక్షోభ సమయంలో భుజ్బల్క అండగా ఉంటారని, తామంతా ఆయనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. -
మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు
ముంబై: ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్, ముంబైలో మరో రెండు ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తోన్న మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం మరో అడుగు ముందుకేసింది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణ నిమిత్తం ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో పొందుపర్చిన సంగతి తెలిసిందే. మూడు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు.. బంద్రాలోని భుజ్ బల్ కార్యాలయం, మజ్ గావ్ లోని నివాసంపై ఏకసమయంలో దాడులు జరిపారని, లభించిన ఆధారాలు, సంబంధిత విషయాలను సాయంత్రానికి వెల్లడిస్తామని మహారాష్ట్ర ఏసీబీ డీజీ ప్రవీణ్ దీక్షిత్ చెప్పారు. మంత్రులు, లేదా మాజీ మంత్రుల ఇళ్లపై ఏసీబీ ఇలాంటి దాడులు నిర్వహించడం మహారాష్ట్రలో ఇదే ప్రధమం. కాగా, భుజ్ బల్ పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేసిన కాలంలో ఆ శాఖలో విధులు నిర్వహించిన పలువురు అధికారుల ఇళ్లలో ఆదివారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంత్రిగా ఉన్న ఛగన్ భుజ్‌బల్ ఆశ్రీత పక్షపాతం, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బహిరంగ విచారణకు అనుమతినివ్వాలన్న ఏసీబీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్లో పచ్చ జెండా ఊపింది. -
ఛగన్ భుజ్ బల్ పై ఏసీబీ కేసు
ముంబై: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్ బల్ పై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసు నమోదు చేసింది. మరో ఐదుగురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ పెట్టింది. కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినందుకు వారిపై 420, 465 సెక్షన్ల కింద నమోదు చేసింది. ఢిల్లీలో న్యూ మహారాష్ట్ర సదన్ నిర్మాణంలోనూ అక్రమాలకు పాల్పడినట్టు వీరిపై ఆరోపణలు వచ్చాయి. -
పది పాసవ్వలేదు కాని పసిడి చొక్కా ధరించాడు
ముంబై: ధరలు చుక్కలంటుతున్న ప్రస్తుతం ఓ ఖద్దరు చొక్కా కొనుక్కోవాలంటేనే పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఓ వ్యక్తి ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి అందర్ని ఆకట్టుకున్నాడు. ఆ చొక్కా బరువు నాలుగు కిలోలు. ధర ఏకంగా కోటి 30 లక్షల (214,000 డాలర్లు) రూపాయలు. ముంబై నగరానికి 260 కిలో మీటర్ల దూరంలో ఉన్న యోలా లోని బంగారు బాబు పంకజ్ పరాఖ్ కనీస విద్యార్హత పది తరగతి కూడ దాటలేదట. పది పాస్ కాని పంకజ్ మాత్రం దస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి ఏకంగా బంగారు చొక్కాను ధరించే స్థాయి చేరుకోవడం చర్చనీయాంశం. యోలా వీధిలో ఎప్పుడు అడుగుపెట్టినా బంగారు చొక్కానే కాకుండా మూడు కేజీల నగలు కూడా ధరించి దర్జాగా తీరుగుతుంటాడు. గత శుక్రవారం జరిగిన 45వ జన్మదినానికి ప్రత్యేక అతిధుల జాబితా ఘనంగా ఉంది. బంగారు బాబు జన్మదిన కార్యక్రమానికి మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఛగన్ భుజ్ భల్, ఓ డజను ఎమ్మెల్యేలు, సెలబ్రీటీలు తరలివచ్చారు. ఏడు బంగారు గుండీలున్న పంకజ్ బంగారు చొక్కా తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది.