మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్ బల్ పై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసు నమోదు చేసింది.
ముంబై: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజ్ బల్ పై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసు నమోదు చేసింది. మరో ఐదుగురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ పెట్టింది.
కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినందుకు వారిపై 420, 465 సెక్షన్ల కింద నమోదు చేసింది. ఢిల్లీలో న్యూ మహారాష్ట్ర సదన్ నిర్మాణంలోనూ అక్రమాలకు పాల్పడినట్టు వీరిపై ఆరోపణలు వచ్చాయి.