ముంబై: ఒక మాజీ మంత్రి హిందుమతానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక వ్యక్తిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు ఎదుర్కొటున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ మేరకు ముంబై పోలీసులు సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్ భుజపాల్, మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అంతేగాదు సదరు వ్యక్తి తాను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన రెండు వీడియోలను ఎన్సీప్ నాయకుడికి పంపించడంతో వారు తనను చంపేస్తానంటూ బెదిరించారని వాపోయాడు. భుజపాల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం నాసిక్ జిల్లాలోని యోలా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేగాదు ఆయ గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment