బాత్‌రూమ్‌లో ట్యూషన్‌ టీచర్‌.. ఫోన్‌తో వీడియోలు తీసి.. | Young Boy Recording Videos Of Home Tutor In Bathroom | Sakshi
Sakshi News home page

సోప్‌ బాక్స్‌లో సెల్‌ ఫోన్‌.. బాత్‌రూమ్‌లో ట్యూషన్‌ టీచర్‌ వీడియోలు తీసి..

Published Fri, Apr 1 2022 8:15 PM | Last Updated on Fri, Apr 1 2022 8:57 PM

Young Boy Recording Videos Of Home Tutor In Bathroom - Sakshi

సాక్షి, ముంబై: విద్య నేర్పిన గురువులకు ఎంతో విలువనిచ్చే దేశం మనది. కానీ, కొంత మంది విద్యార్థులు తమకు పాఠాలు నేర్పిన టీచర్ల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ టీచర్‌ బాత్‌ రూమ్‌లో ఉండగా విద్యార్థి తన సెల్‌ ఫోన్‌ కెమెరాతో ఆమె వీడియోలు రికార్డు చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.

వివరాల ప్రకారం.. పుణెలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థికి పాఠాలు చెప్పిందుకే తన పేరెంట్స్‌ ఓ ట్యూషన్ టీచర్‌ను ఎంపిక చేశారు. సదరు విద్యార్థికి ఆమె.. గత ఐదేళ్లుగా పాఠాలు చెబుతోంది. టీచర్‌ ప్రతీరోజు బాలుడి ఇంటికి వచ్చి పాఠాలు బోధిస్తుండేది. ఈ క్రమంలో సదరు బాలుడు.. టీచర్‌పై వ్యామోహంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా బాత్‌రూమ్‌లోని ఓ సోప్‌ బాక్స్‌లో సెల్‌ ఫోన్‌ను పెట్టి వీడియోలు తీశాడు.

ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు టీచర్‌.. పాఠం చెప్పిన అనంతరం బాత్​రూమ్​ వెళ్లింది. ఇంతలో సోప్​ బాక్స్​లో ఏదో ఉన్నట్టు అనిపించడంతో తెరిచి చూసి.. ఒక్కసారిగా షాకైంది. సోప్‌ బాక్స్‌లో ఉన్న ఫోన్​లో కెమెరా ఆన్​ చేసి ఉంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్‌కు చెప్పి.. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బాలుడికి పాఠాలు చేప్పే క్రమంలోనూ తన శరీర భాగాలను ఫొటోలు తీశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్​ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement