secreat camera
-
AP: గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినిల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ సందర్భంగా రాత్రంతా విద్యార్థులు ధర్నాకు దిగారు.వివరాల ప్రకారం.. గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిలు.. మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల వరకు విద్యార్థినిలు నిరసనల్లో పాల్గొన్నారు. గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లోని అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో స్పై కెమెరా లు అమర్చి - వాళ్ల వీడియో లు చిత్రీకరించి - వాటిని బాయ్స్ హాస్టల్ వాళ్లకి అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు - ఇప్పటికి 300 వీడియో లు అమ్మినట్టు సమాచారం ఈ మొత్తం ప్రక్రియ ని నాల్గవ సంవంత్సరం… https://t.co/WPuHnUa0Vh pic.twitter.com/xhIuXZQnlh— 𝐀𝗋α𝗏𝗂𐓣ᑯα𝐒αꭑ𝖾𝗍α🚩 (@HarieswarH) August 30, 2024 ఈ ఘటనకు కారణమైన విజయ్ను అక్కడికి తీసుకురావడంతో అతడిపై విద్యార్థినిలు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ.. వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి.. వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్ను ఆసుపత్రికి తరలించారు. అలాగే, విజయ్ను విచారించిన తర్వాత.. అతడి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, విద్యార్థినిలకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్టు సమాచారం. 🚨 గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్‌కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్… pic.twitter.com/3rALM0f5D8— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) August 30, 2024 -
ఏం తెలివిరా నాయనా.. ఆస్పత్రిలో మహిళల డ్రెస్సింగ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా..
యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా సూరత్కల్లో ఆస్పత్రిలో మహిళలు బట్టలు మార్చుకొనే గదిలో రహస్యంగా కెమెరాను అమర్చి వీడియో తీస్తున్న పురుష నర్సింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సింగ్ విద్యార్థి పవన్‌కుమార్ ఈ పనికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. కలబురిగికి చెందిన పవన్ బజపెలో నివాసం ఉంటూ ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్నాడు. కాగా, ఆస్పత్రికి వచ్చే రోగులు స్కానింగ్‌కు వెళ్లే ముందు బట్టలు మార్చుకొంటారు. దీంతో, ఆ గదిలో రహస్య కెమెరాను అమర్చి వీడియోలు తీసేవాడని బయట పడింది. ఇటీవల ఓ యువతికి ఆ గదిలో అనుమానం వచ్చి పరిశీలించగా ఒక మూల కెమెరా కనిపించింది. ఆమె ఫిర్యాదుతో పవన్‌ను పోలీసులు పట్టుకున్నారు. -
ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. జంటల వీడియోలు రికార్డ్ చేస్తూ..
లక్నో: ఓయో హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి.. అక్కడికి వెళ్లే జంటల వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నలుగురు సభ్యులు వేర్వేరు గ్యాంగులతో కలిసి పనిచేస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా వీళ్లు అవసరమైన వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్ బుక్‌చేసి కమిషన్ తీసుకుంటారు. క్రమంలోనే రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. అక్కడ ఉండేందుకు వచ్చిన జంటల ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో రికార్డు చేస్తారు. అనంతరం ఆ వీడియోను సంబంధిత జంటలకు పంపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అడిగిన మొత్తం అప్పజెప్పకుంటే ఇవ్వకుంటే రహస్యంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తామని బెదిరింపులకు ప్పాలడుతున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుంటే వేధింపులకు గురిచేస్తామంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఓ బాధిత జంట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అంతేగాక వీరు ఐఫోన్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ అక్రమంగా ఓ ల్ సెంటర్‌ను కూడా నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విష్ణు సింగ్, అబ్దుల్ వహవ్, పంకజ్ కుమార్, అనురాగ్ కుమార్‌లుగా గుర్తించారు. వీరి నుంచి 11 ల్యాప్‌టాప్‌లు, 21 మొబైల్ ఫోన్లు, 22 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ స్కామ్‌లో పాల్గొన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. -
సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసి.. ఇద్దరిని ఇంటికి పిలిపించి..
సాక్షి, హైదరాబాద్: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేశాడో యువకుడు. మాయమాటలతో స్నేహితుడిని, తన ప్రేయసిని ఇంటికి రప్పించి వారికి తెలియకుండా వారున్న రూమ్‌లో సీక్రెట్ కెమెరా అమర్చాడు. ఆ తర్వాత నుంచి తన కోరిక తీర్చాలంటూ వెంటపడి వేధించిన యువకుడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. మరో ఘటనలో అడ్రస్ చెబుతున్న యువతి పట్ల అసభ్యకరంగా తాకుతూ ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ సైతం జైలు పాలయ్యాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం బృందం.. వివరాలను కోర్టులో పొందుపరిచారు. నాంపల్లిలోని మెట్రోపొలిటన్ క్రిమినెల్ కోర్టు ఇద్దరికీ ఎనిమిదేసి రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు షీటీం అడిషినల్ డీసీపీ సి.శిరీషరాఘవేంద్ర తెలిపారు. నగరానికి చెందిన అబ్థుల్ సాల్మన్(23) తన స్నేహితుడు, ప్రియురాలికి తన ఇంటిలో చోటు కల్పించాడు. వారిద్దరూ శారీరకంగా కలిసిన సన్నివేశాల్ని ఫోన్లో చిత్రీకరించి తనతో కూడా గడపాలంటూ యువతిని బెదిరించాడు. దీనిపై యువతి, తన ప్రియుడు షీటీం పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించిన షీటీం అబ్దుల్ సాల్మన్ వద్ద ఉన్న ఫోన్‌ను పరిశీలించగా దానిలో నగ్నచిత్రాలు ఉన్నట్లు స్పష్టమవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని కోర్టుకు అందజేశారు. అదేవిధంగా కొద్దిరోజుల క్రితం నారాయణగూడ మెట్రో స్టేషన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని మహ్మద్ హైదర్అలీఖాన్(25) అనే క్యాబ్ డ్రైవర్ తనకు అడ్రస్ చెప్పాలంటూ కోరాడు. తను అడ్రస్ చెప్పేందుకు హైదర్ అలీఖాన్ వద్దకు రావడంతో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో యువతి చాకచక్యంగా డ్రైవర్ ఫొటోలు, కారు నంబర్‌ను తన ఫోన్లో క్యాప్చర్ చేసి షీటీంకు పంపింది. రంగంలోకి దిగిన షీటీం బృందం మహ్మద్ హైదర్ అలీఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన తప్పును ఒప్పుకున్నాడు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను సేకరించి కోర్టులో సమర్చించారు. ఈ ఇద్దరి వ్యవహారంపై గురువారం ఇద్దరికీ వేర్వేరుగా 8 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. -
బాత్రూమ్లో ట్యూషన్ టీచర్.. ఫోన్‌తో వీడియోలు తీసి..
సాక్షి, ముంబై: విద్య నేర్పిన గురువులకు ఎంతో విలువనిచ్చే దేశం మనది. కానీ, కొంత మంది విద్యార్థులు తమకు పాఠాలు నేర్పిన టీచర్ల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ టీచర్ బాత్ రూమ్‌లో ఉండగా విద్యార్థి తన సెల్ ఫోన్ కెమెరాతో ఆమె వీడియోలు రికార్డు చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. పుణెలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. విద్యార్థికి పాఠాలు చెప్పిందుకే తన పేరెంట్స్ ఓ ట్యూషన్ టీచర్‌ను ఎంపిక చేశారు. సదరు విద్యార్థికి ఆమె.. గత ఐదేళ్లుగా పాఠాలు చెబుతోంది. టీచర్ ప్రతీరోజు బాలుడి ఇంటికి వచ్చి పాఠాలు బోధిస్తుండేది. ఈ క్రమంలో సదరు బాలుడు.. టీచర్‌పై వ్యామోహంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా బాత్రూమ్లోని ఓ సోప్ బాక్స్‌లో సెల్ ఫోన్‌ను పెట్టి వీడియోలు తీశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు టీచర్.. పాఠం చెప్పిన అనంతరం బాత్రూమ్ వెళ్లింది. ఇంతలో సోప్ బాక్స్‌లో ఏదో ఉన్నట్టు అనిపించడంతో తెరిచి చూసి.. ఒక్కసారిగా షాకైంది. సోప్ బాక్స్‌లో ఉన్న ఫోన్లో కెమెరా ఆన్ చేసి ఉంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని బాలుడి పేరెంట్స్‌కు చెప్పి.. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బాలుడికి పాఠాలు చేప్పే క్రమంలోనూ తన శరీర భాగాలను ఫొటోలు తీశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
‘నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’
దక్షిణ కొరియాలో ‘రహస్య కెమెరాలతో చిత్రీకరణ’ సమస్య తీవ్రరూపం దాల్చింది. బీచులు, స్విమ్మింగ్పూల్లే కాకుండా పార్కులు ఇతర బహిరంగప్రదేశాల్లోనూ ఇలాంటి చిత్రీకరణలు పెరిగిపోయి వ్యక్తిగత గోప్యతకు ఆటంకంగా మారుతున్నాయి. ఇది ఎంతవరకు వెళ్లిందంటే సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మహిళలు ’ నా జీవితం నీ అశ్లీల చిత్రం కాదు’ అనే ప్లకార్డులు చేపట్టి ఇటీవల వీధుల్లో నిరసనలు తెలిపే వరకు వెళ్లింది. ఇలాంటి వీడియోలు రికార్డ్ చేస్తున్న, వీక్షిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. దక్షిణ కొరియాలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా ‘మీ టూ ఉద్యమం’ సాగుతోంది. దీని ద్వారా మహిళలపై లైంగికదాడులు, వేధింపులకు పాల్పడిన అధికార డెమొక్రాటిక్ పార్టీ నేత యాన్ హి–జింగ్‌తో సహా పలువురు ప్రముఖులను సైతం ఎండగట్టగలిగారు. ఈ నేపథ్యంలోనే తమను రహస్య కెమెరాల్లో చిత్రీకరించడంపైనా మహిళలు గళమెత్తుతున్నారు. పార్కులు, స్విమ్మింగ్‌పూల్‌లు, బీచుల్లోని రెస్ట్రూమ్లు, గదుల్లో దుస్తులు మార్చుకుంటున్న మహిళలను రహస్య కెమెరాల ద్వారా రికార్డ్ చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. వీటిపై మహిళల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగిపోవడంతో పోలీస బృందాలు స్కానర్లతో రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న దానిని కనిపెట్టే చర్యలు చేపడుతున్నారు. అయితే చిన్న చిన్న కెమెరాలు ఎక్కడ పెట్టారనేది మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా లెక్కకు మించి తనిఖీలు చేపడుతున్నా ఈ సమస్యకు చెక్ పెట్టలేకపోతున్నారు. పెరుగుతున్న రహస్య కెమెరా బాధితులు 2012–16 మధ్యకాలంలో రహస్య చిత్రీకరణ బాధితులుæ 26 వేల మందికి పైగానే ఉన్నారని, వారిలో 80 శాతం మంది మహిళలేనని గుర్తించారు. తమను రికార్డ్ చేశారన్న సంగతి కూడా వారిలో చాలా మందికి తెలియదని పోలీసులు చెబుతున్నారు. వారు చెబుతున్న దాని కంటే కనీసం పదింతలు ఎక్కువగా బాధితుల సంఖ్య ఉండొచ్చునని సూన్‌చున్హ్ యాంగ్ వర్సిటీ క్రిమినాలజీ (నేరశాస్త్రం) ప్రొఫెసర్ ఓహ్ యూన్–సంగ్ పేర్కొన్నారు. ‘ఇది రోజువారి జీవితంలో భాగమై పోయింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై మరింత కఠినచర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని ఆ దేశ అధ్యక్షుడు మూన్ జో–ఇన్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 2011లో 1,354 మందిని పోలీసులు గుర్తించగా, 2017 వారి సంఖ్య 5,363 మందికి పెరిగింది. సులభంగా స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉండడంతో పాటు సోషల్ మీడియా వ్యాప్తి కూడా ఈ నేరానికి దోహదపడుతోంది. అధికారులకు సవాలే... బేస్‌బాల్ టోపి, బెల్టు, గడియారం, లైటర్, యూఎస్బీ పరికరం, చొక్కాపై ధరించే టై, కారుతాళాలు, పాదరక్షలు ఇలా ప్రతి వస్తువుపై అతిచిన్న రహస్య కెమెరాలు అమరుస్తున్నారు. మాల్‌లు, షాపింగ్సెంటర్లు, బీచులు, స్విమ్మింగ్ పూల్‌లలోని దుస్తులు మార్చుకునే గదుల్లో డోర్‌లాకర్లు, ఫ్రేమ్‌లు, స్నానపు గదుల్లోని షవర్లు, టాయ్లెట్లలో ఎక్కడబడితే అక్కడ వీటిని పెట్టి దృశ్యాలు రికార్డ్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్ని అదుపుచేయడంతో పాటు ఆన్లైన్, ఇతర వెబ్ కంటెంట్‌లో ఇలాంటి అక్రమ రికార్డింగ్‌లు పెట్టకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కెమెరా హార్డ్‌వేర్ అమ్మకాలపై నిఘాతో పాటు రహస్య చిత్రీకరణలు పెద్ద నేరమనే అంశానికి ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా బహిరంగప్రదేశాల్లో ఏయే రూపాల్లో అతిచిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్‌కు వీలుందో అవగాహన కల్పిస్తున్నారు. రహస్య రికార్డింగ్‌లకు పాల్పడిన వారికి అయిదేళ్ల శిక్ష లేదా రూ.6.2 లక్షల జరిమానా విధిస్తున్నారని, ఇంతకంటే కఠినమైన శిక్షలుండాలని కొరియా మహిళా న్యాయవాదుల సంఘం నేత కిమ్ యంగ్–మి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 5.3 శాతం మాత్రమే జైలుకు వెళ్లినట్టుగా అయిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఫ్యాబ్ ఇండియా తప్పేమీ లేదు: సీఎం
ట్రయల్ రూంలో రహస్య కెమెరాల వ్యవహారంలో గోవా సీఎం లక్ష్మికాంత్ పర్సేకర్ ఫ్యాబ్ ఇండియా సంస్థకు అనుకూలంగా మాట్లాడారు. ఇందులో ఆ సంస్థ తప్పేమీ లేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత బొటిక్‌లలో ఫ్యాబ్ ఇండియా ఒకటని, ఉద్యోగి దుర్మార్గుడైనంత మాత్రాన సంస్థ మొత్తాన్ని నిందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. 'సాక్షాత్తు కేంద్ర మంత్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు ప్రాధాన్యం లభించింది. ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గోవాలో మహిళలకు పూర్తి రక్షణ ఉంది. అని పర్సేకర్ అన్నారు. గోవాలోని ఫ్యాబ్ ఇండియా షోరూంలో దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా ఉండటాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.