ఏం తెలివిరా నాయనా.. ఆస్పత్రిలో మహిళల డ్రెస్సింగ్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరా.. | Youth Arrested For Placing Camera In Dressing Room Of Hospital | Sakshi
Sakshi News home page

ఏం తెలివిరా నాయనా.. ఆస్పత్రిలో మహిళల డ్రెస్సింగ్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరా..

Published Thu, Dec 8 2022 9:04 AM | Last Updated on Thu, Dec 8 2022 9:06 AM

Youth Arrested For Placing Camera In Dressing Room Of Hospital - Sakshi

యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా సూరత్కల్‌లో ఆస్పత్రిలో మహిళలు బట్టలు మార్చుకొనే గదిలో రహస్యంగా కెమెరాను అమర్చి వీడియో తీస్తున్న పురుష నర్సింగ్‌ విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సింగ్‌ విద్యార్థి పవన్‌కుమార్‌ ఈ పనికి పాల్పడ్డాడు.

వివరాల ప్రకారం.. కలబురిగికి చెందిన పవన్‌ బజపెలో నివాసం ఉంటూ ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్నాడు. కాగా, ఆస్పత్రికి వచ్చే రోగులు స్కానింగ్‌కు వెళ్లే ముందు బట్టలు మార్చుకొంటారు. దీంతో, ఆ గదిలో రహస్య కెమెరాను అమర్చి వీడియోలు తీసేవాడని బయట పడింది. ఇటీవల ఓ యువతికి ఆ గదిలో అనుమానం వచ్చి పరిశీలించగా ఒక మూల కెమెరా కనిపించింది. ఆమె ఫిర్యాదుతో పవన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement