Dressing Room
-
డ్రెస్సింగ్ రూంలో క్రికెటర్లను ఓదార్చిన మోదీ
అహ్మదాబాద్: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధాని మోదీ ఓదార్చారు. ఓటమి సాధారణమైనది, నిరుత్సాపడకూడదని ప్రోత్సహించారు. టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన తీరును గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండని కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చేతులు పట్టుకుని ఉత్సాహపరిచారు. ఆటగాళ్లు ఒకరినొకరు నిరంతరం ప్రోత్సహించుకోవాలని చెప్పారు. గుజరాతీ అయిన రవీంద్ర జడేజాతో ప్రధాని మోదీ గుజరాతీలో మాట్లాడారు. ఏం బాబు అని పలకరిస్తూ ఇరువురు నవ్వులు కురిపించారు. మహ్మద్ షమీ వద్దకు వచ్చిన మోదీ.. షమీని కౌగిలించుకున్నారు. అద్భుతమైన ఆటతీరు కనబరిచావని మెచ్చుకున్నారు. #WATCH | Prime Minister Narendra Modi met Team India in their dressing room after the ICC World Cup Finals at Narendra Modi Stadium in Ahmedabad, Gujarat on 19th November. The PM spoke to the players and encouraged them for their performance throughout the tournament. (Video:… pic.twitter.com/ZqYIakoIIj — ANI (@ANI) November 21, 2023 అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ పోరుకు దిగింది. అయితే.. 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఆసిస్ అలవోక విజయం సాధించింది. ఓటమిని చవిచూసిన భారత ఆటగాళ్లు నిరుత్సాహంతో మైదానాన్ని వీడారు. కొందరు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళ్లిన ప్రధాని మోదీ క్రికెటర్లను డ్రస్సింగ్ రూంలో కలిశారు. నిరుత్సాహంలో ఉన్న ఆటగాళ్లను ఓదార్చారు. ఇదీ చదవండి: ద్రవిడ్‌ను కొనసాగిస్తారా లేక సాగనంపుతారా.. టీమిండియా తదుపరి కోచ్ ఎవరు..? -
భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రధాని
అహ్మదాబాద్: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఉరకలెత్తే ఉత్సాహంతో ముందంజ వేసిన భారత జట్టు ఫైనల్ పరాభవంతో షాక్‌కు గురైంది. నిశ్శబ్దం ఆవహించి... నిరాశలో కూరుకుపోయిన రోహిత్ శర్మ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చారు. ఆదివారం రాత్రి బహుమతి ప్రదానోత్సవం ముగిశాక కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి మోదీ భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ప్రతీ ఒక్క ఆటగాడిని సముదాయించారు. ఈ నిరాశ నుంచి కోలుకునేందుకు ఓదార్పు మాటలు చెప్పారు. ‘ప్రియమైన టీమిండియా... మీ ప్రతిభ, ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంకితభావంతో ప్రపంచకప్ గెలిచేందుకు టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడారు. మీ కృషి వెలకట్టలేనిది. ప్రపంచకప్‌లో మీరు కనబరిచిన క్రీడాస్ఫూర్తిని చూసి జాతి గర్విస్తోంది. యావత్ దేశం మీ వెన్నంటే ఉంది. ఇకపై కూడా ఉంటుంది’ అని ఎక్స్‌లో ప్రధాని ట్వీట్ చేశారు. దీన్ని పలువురు క్రికెట్ అభిమానులు షమీని ప్రధాని ఓదారుస్తున్న ఫోటోను జతచేసి రీ ట్వీట్లతో అనుసరించారు. ‘టోర్నీలో గొప్పగా ఆడాం. ఆఖరి పోరులోనే ఓడిపోయాం. ఈ చేదు ఫలితం అందరి గుండెల్ని బద్దలు చేసింది. ఇలాంటి సమయంలో ప్రధాని మా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి కొండంత బలాన్నిచ్చేలా ఓదార్పు పలికారు. మోదీకి కృతజ్ఞతలు’ అని ఆల్‌రౌండర్ జడేజా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవడంతో ఇంగ్లండ్ కథ ముగిసేనట్లేనని అంతా భావించారు. కానీ మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఐదోటెస్టు ఇంగ్లండ్‌కు కీలకంగా మారింది. చివరి టెస్టు గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని భావించిన ఇంగ్లండ్ అందుకు తగ్గట్లుగానే బజ్‌బాల్ ఆటతీరుతో ఆసీస్‌ను కట్టడి చేసింది. కానీ 384 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ చేధించేలా కనిపించింది. కానీ ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకోవడంతో ఆట ఐదోరోజు తొలి సెషన్లో కథ మొత్తం మారిపోయింది. ఆసీస్ తొందరగా వికెట్లు కోల్పోవడంతో 49 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాళ్లు, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక దగ్గర చేరి డ్రెస్సింగ్‌రూమ్‌లోనే మందు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఖండించాడు. స్టోక్స్ మాట్లాడుతూ.. ''పార్జీ జరిగిన మాట నిజమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం అనంతరం ఆసీస్ ఆటగాళ్లు మా దగ్గరకు వచ్చారు. కానీ మా ప్రధాన ఆటగాళ్లు స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్పై స్పెషల్ స్పీచ్‌లతో చిన్న పార్టీ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఒక గంటపాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేం బిజీగా ఉండడంతో మమ్మల్ని కలవకుండానే ఆసీస్ ఆటగాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజానికి యాషెస్ సిరీస్ ముగిశాక ఆసీస్ ఆటగాళ్లతో కలిసి సంప్రదాయ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్, ఇతర కార్యక్రమాల వల్ల కలవడం కుదరలేదు. అయితే ఆసీస్ ఆటగాళ్లతో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లి పార్టీ ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకున్నాం. నెలరోజుల పాటు యాషెస్ ఆడాం. ఎన్ని గొడవలు జరిగినా అది మ్యాచ్‌ల వరకే పరిమితం. బయట ఆ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించుకోం.. సరదాగా ఎంజాయ్ చేయడానికి చూస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత! యాషెస్ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత.. -
ఇప్పుడలా లేదు.. ఎవరూ ఎవరికి సాయం చేయరు: అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Ravichandran Ashwin Shocking Comments: ‘‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెలిగేవారు. కానీ.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కేవలం సహచర ఆటగాడిగానే పరిగణింపబడతాడు. అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది. డ్రెసింగ్‌రూం వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరు అనుక్షణం పక్క వాళ్లతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ‘‘హాయ్ బాస్.. ఏంటి సంగతులు?’’ అని పక్కవాళ్లతో సరదాగా మాట్లాడేందుకు ఎవరి దగ్గరా కాస్తైనా సమయం లేదు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా కేవలం కొలీగ్స్ మాదిరే ఉంటున్నారని, మునుపటిలా ఫ్రెండ్స్‌లా కొనసాగే పరిస్థితి లేదన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ 2021-23లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఈ టీమిండియా బౌలర్‌కు ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అత్యుత్తమ బౌలర్‌కు మొండిచేయి ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. ఆసీస్‌తో ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ ట్రోఫీ గెలవలేక చతికిలపడింది. ఇదిలా ఉంటే.. అశ్విన్ తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రెసింగ్‌రూం వాతావరణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరికి వారే యమునా తీరే.. ఒంటరి ప్రయాణం జట్టులోని ఇతర సభ్యుల నుంచి సహకారం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లు ఉంటారని అశూ పేర్కొన్నాడు. ‘‘నిజానికి.. ఎంత ఎక్కువగా ఆట గురించి చర్చిస్తే అంత ఎక్కువగా టెక్నిక్‌ను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఒకరి అనుభవాలు మరొకరికి పాఠాలుగా పనికివస్తాయి. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. మనకు ఏదైనా సాయం కావాలంటే ఎవరూ ముందుకురారు. పది మందితో కూడిన ఒంటరి ప్రయాణం లాంటిది ఇది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే, క్రికెట్లో ఒకరు చెప్పే పాఠాల కంటే సొంతంగా నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందంటూ ముక్తాయింపు ఇచ్చాడు. మేటి బౌలర్‌గా ఎదిగిన అశూ కాగా రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన ఈ తమిళనాడు బౌలర్.. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 92 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మేటి బౌలర్‌గా ఎదిగిన అతడు టెస్టుల్లో 474, వన్డేల్లో 151, టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు! సచిన్, ధోని, కోహ్లి, రోహిత్.. రుతురాజ్ కూడా వీళ్ల బ్యాచ్‌లో చేరిపోయాడు..! -
మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ మనోడే హీరో!
తెలుగు తేజం నంబూరి తిలక్ వర్మ... ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు. ఈ సీజన్లో ముంబై వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికి తాను మాత్రం విఫలం కాలేదు. రోహిత్ శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే ధాటిగా ఆడుతున్న రోహిత్‌కు జతయ్యాడు. వాయువుకు అగ్ని తోడయినట్లుగా రోహిత్ అండతో తిలక్ వర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి ఔటైనప్పటికి అప్పటికే ముంబైని పటిష్ట స్థితిలో నిలిపాడు. నిజానికి తిలక్ వర్మ ఔట్ కాకపోయుంటే ముంబై మ్యాచ్‌ను 17 లేదా 18 ఓవర్లలోనే ముగించి ఉండేది. అయితే తిలక్ వర్మ, రోహిత్‌లు వెనువెంటనే ఔట్ కావడంతో మ్యాచ్ చివరి వరకు వెళ్లింది. ఆఖరి బంతికి ఉత్కంఠగా మారినప్పటికి టిమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సీజన్ మంచి ఫామ్ కనబరుస్తున్న తిలక్ వర్మ మూడు మ్యాచ్‌లు కలిపి 147 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అతని ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మనోడు మైదానంలోనే కాదు డ్రెస్సింగ్ రూమ్‌లోనూ హీరోగా నిలిచాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ గెలిచాకా ముంబై డ్రెస్సింగ్ రూమ్‌కు ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ వచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను మెచ్చుకున్న ఆమె బ్యాడ్జ్‌లను అందించారు. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈరోజు మ్యాచ్‌లో రోహిత్, తిలక్ వర్మలు ఇద్దరు కీలకపాత్ర పోషించారు. కానీ నా దృష్టిలో నిజమైన విన్నర్ తిలక్ వర్మ.. అందుకే అతనికి డ్రెస్సింగ్ రూమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేస్తున్నాం అంటూ తెలిపింది. అనంతరం తిలక్ వర్మ పొలార్డ్ చేతుల మీదుగా తన షర్ట్‌కు బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు. ''చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు స్పెషల్.. సీజన్లో ముంబై తొలి విజయాన్ని అందుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో కూడా ఇలానే రాణించాలని కోరుకుంటున్నా థాంక్యూ'' అని తెలిపాడు. ఇక బౌలర్లలో పియూష్ చావ్లా బ్యాడ్జ్‌ను అందుకున్నాడు. 𝕋𝕙𝕖 𝕋𝕚𝕝𝕒𝕜 𝕍𝕒𝕣𝕞𝕒 𝕊𝕙𝕠𝕨 continues... 🔥 Our southpaw was also a winner of the 𝘿𝙧𝙚𝙨𝙨𝙞𝙣𝙜 𝙍𝙤𝙤𝙢 𝙋𝙡𝙖𝙮𝙚𝙧 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙈𝙖𝙩𝙘𝙝 for #DCvMI 💪#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/MCRwulWxu3 — Mumbai Indians (@mipaltan) April 12, 2023 చదవండి: 'మీరు కర్మని నమ్మారు.. మేం మాత్రం శర్మని నమ్మాం' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏం తెలివిరా నాయనా.. ఆస్పత్రిలో మహిళల డ్రెస్సింగ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా..
యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా సూరత్కల్లో ఆస్పత్రిలో మహిళలు బట్టలు మార్చుకొనే గదిలో రహస్యంగా కెమెరాను అమర్చి వీడియో తీస్తున్న పురుష నర్సింగ్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సింగ్ విద్యార్థి పవన్‌కుమార్ ఈ పనికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. కలబురిగికి చెందిన పవన్ బజపెలో నివాసం ఉంటూ ఆస్పత్రిలో శిక్షణ పొందుతున్నాడు. కాగా, ఆస్పత్రికి వచ్చే రోగులు స్కానింగ్‌కు వెళ్లే ముందు బట్టలు మార్చుకొంటారు. దీంతో, ఆ గదిలో రహస్య కెమెరాను అమర్చి వీడియోలు తీసేవాడని బయట పడింది. ఇటీవల ఓ యువతికి ఆ గదిలో అనుమానం వచ్చి పరిశీలించగా ఒక మూల కెమెరా కనిపించింది. ఆమె ఫిర్యాదుతో పవన్‌ను పోలీసులు పట్టుకున్నారు. -
రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా!
న్యూజిలాండ్‌కు క్రికెట్లో ఎలాంటి వివాదాలు లేని జట్టు అనే పేరుంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లు తమ హుందాతనాన్ని చూపిస్తారు. ఇప్పటివరకు కివీస్ ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవ పడ్డ దాఖలాలు కానీ.. కవ్వింపు చర్యలకు పాల్పడడం గానీ ఎరిగింది లేదు. ఒకవేళ జరిగినా కూడా గుర్తుంచుకునేంత పెద్దవి కావు. అలాంటి న్యూజిలాండ్‌కు "కూల్ జట్టు" అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఇటీవలే కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ తన 16 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. తాజాగా తన ఆటోబయోగ్రఫీ ద్వారా న్యూజిలాండ్ క్రికెట్‌పై ఒక బాంబు పేల్చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో తోటి ఆటగాళ్లచే తాను వివక్ష ఎదుర్కొన్నట్లు "రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్"లో సుధీర్ఘంగా పేర్కొన్నాడు. టేలర్ వ్యాఖ్యలు ప్రస్తుతం కివీస్ క్రికెట్లో సంచలనం కలిగిస్తోంది. టేలర్ వ్యాఖ్యలతో కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా అనిపిస్తుంది. "నా 16 ఏళ్ల కెరీర్ అంతా సక్రమంగా జరిగిందనేది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో మీకు తెలియని వివక్ష ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కివీస్ క్రికెట్‌కు మంచి పేరు ఉంది. దానిని నేను చెడగొట్టదలచుకోలేను. కానీ సొంతజట్టుకు చెందిన కొందరు క్రికెటర్లు.. నా మొహం గురించి కామెంట్ చేసేవారు. నువ్వు న్యూజిలాండ్‌కు ఆడుతున్నప్పటికి నీలో ఆసియా మూలాలు కనిపిస్తున్నాయి. పొరపాటు మా దేశంలో క్రికెట్ ఆడుతున్నావనుకుంటా అని పేర్కొనేవాళ్లు. రాస్.. నువ్వు సగం మాత్రమే మంచోడివి.. మిగతా సగం ఏంటనేది నువ్వే నిర్ణయించుకో అని ఒక తోటి క్రికెటర్ హేళన చేసేవాడు. ఇదంతా డ్రెస్సింగ్‌రూమ్ వరకు మాత్రమే పరిమితం. మళ్లీ మైదానంలోకి వచ్చామంటే అంతా మాములే. అందుకే న్యూజిలాండ్ క్రికెట్లో వివక్ష ఎక్కడా కంటికి కనబడదు.. కానీ అంతా తెరవెనుక జరుగుతుంది. అందుకే మా డ్రెస్సింగ్‌రూమ్‌ను నేను ఒక బారోమీటర్‌గా అభివర్ణిస్తున్నా. మొదట్లో అలా అంటుంటే ఏదో సరదాకు అంటున్నారులే అని అనుకునేవాడిని.. కొన్నాళ్లు పోయిన తర్వాత కూడా అదే పనిగా మాట్లాడడంతో వివక్షకు గురవుతున్నానని అర్థమయింది. జట్టులో నన్ను చాలా మంది భారతీయ లేదా ఆసియా మూలాలు ఉన్న క్రికెటర్‌గా చూసేవారు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉండే న్యూజిలాండ్ ప్రాంతంలో నా మూలాలున్న ఆటగాళ్లు చాలా తక్కువగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే డ్రెస్సింగ్‌రూమ్‌లో వివక్ష ఎదుర్కొన్నప్పటికి ఆ విషయాలను ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పటికి బయటికి చెప్పలేకపోయాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక 2006లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన రాస్ టేలర్... అనతి కాలంలోనే జట్టుకు నమ్మదగిన ప్లేయర్ గా మారిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బుల్లెట్ లాంటి షాట్లతో బౌండరీలకు పంపడం రాస్ టేలర్ ప్రత్యేకత.బంగ్లాదేశ్‌తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. టేలర్ కెరీర్ ను 2011 వన్డే ప్రపంచకప్ మార్చేసింది. అప్పటి వరకు సాధారణ ప్లేయర్ గా ఉన్న అతడిని హీరోగా మార్చేసింది. భారత్ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్ తర్వాత నుంచి రాస్ టేలర్ ను ఏ బౌలర్ కూడా అంత తక్కవగా అంచనా వేయలేదు. ఆ ప్రపంచకప్ లో రాస్ టేలర్... 324 పరుగులు చేశాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత బ్యాటింగ్ తో మెరిశాడు. జట్టు 175 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన స్థితి నుంచి 302/7కు చేర్చడంలో అసమాన పోరాటాన్ని ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ లో టేలర్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38 ఏళ్ళ రాస్ టేలర్ తన కెరీర్ లో 112 టెస్టు మ్యాచ్ లు, 236 వన్డేలు, 102 టి20లు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 7,683 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 21 సెంచరీలు 51 అర్ధ సెంచరీలతో 8,607 పరుగులు సాధించాడు. టి20ల్లోనూ అదరగొట్టిన టేలర్ 7 అర్థ సెంచరీలతో 1,909 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ 100 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. చదవండి: Sourav Ganguly Resign: దాదాకు తప్పని ఫేక్‌న్యూస్ గోల.. ఇది వారి పనేనా? SA vs ENG: టాప్ స్కోరర్‌గా నిలిచి.. అంత గుడ్డిగా ఎలా ఔటయ్యాడు! -
ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్.. ప్లేయర్స్, ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసిన ధోని
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌లో అదరగొడుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. బట్లర్ సేనకు రెండు సార్టు అలౌట్ చేసి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా, నేడు(ఆదివారం) మూడో టీ20 జరుగనుంది. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టుకు, అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. శనివారం మ్యాచ్‌లో భాగంగా భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని ప్రత్యక్షమయ్యాడు. మ్యాచ్ సందర్భంగా భారత జట్టుతో కలిసి ముచ్చటించారు. ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు ధోని సలహాలు చెబుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు బీసీసీఐ సైతం ఈ ఫొటోలను అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. గ్రేట్ ధోని మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు అంటూ ఈ ఫొటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. Always all ears when the great @msdhoni talks! 👍 👍#TeamIndia | #ENGvIND pic.twitter.com/YKQS8taVcH — BCCI (@BCCI) July 9, 2022 ఇక, టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ధోనితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన తన 41 పుట్టినరోజు సందర్భంగా ధోని వింబుల్డన్ మ్యాచ్‌ను కూడా చూశాడు. దీనికి సంబంధించిన ఫొటోను ధోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. Got goosebumps after watching this. Beautiful heart touching moment for Indian fans.Past, present and future of Indian cricket team. #indvseng pic.twitter.com/6PTtGQ6Ek6 — Rohit.Bishnoi (@The_kafir_boy_2) July 9, 2022 ఇది కూడా చదవండి: టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్.. తొలి భారత ఆటగాడిగా..! -
Matthew Wade: డ్రెస్సింగ్ రూమ్ వినాశనం; వార్నింగ్‌తో సరి..
గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తాను ఔట్ కాదంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైన వేడ్ తన కోపాన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా హెల్మెట్, బ్యాట్‌పై చూపించాడు. వాటిని విసిరేసి.. బ్యాట్‌ను పలుమార్లు నేలకేసి కొడుతూ అసహనం వ్యక్తం చేశాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వినాశనం సృష్టించిన వేడ్‌ను ఐపీఎల్ మేనేజ్మెంట్ హెచ్చరికతో సరిపెట్టింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో బ్యాట్‌ను, హెల్మెట్‌ను విసిరేసి వేడ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్-1 నిబంధన ఉల్లఘించాడు. అయితే ఎవరిపై తన కోపాన్ని వ్యక్తం చేయకుండా.. కేవలం తన వస్తువులను మాత్రమే నాశనం చేశాడు. దీనిని పరిగణలోకి తీసుకొని వేడ్‌ది మొదటి తప్పుగా భావిస్తూ హెచ్చరికతో వదిలేస్తున్నామని.. ఎటువంటి జరిమానా విధించడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ తెలిపింది. PC: IPL Twitter ఈ సీజన్లో మాథ్యూ వేడ్ పెద్దగా రాణించింది లేదు. అసలే సరిగా ఆడడం లేదన్న బాధ.. థర్డ్ అంపైర్ నిర్ణయం వేడ్‌కు మరింత చికాకు తెప్పించాయి. అందుకే సహనం కోల్పోయిన వేడ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆ సమయంలో పక్కన ఎవరైన ఉండి అతను గాయపడితే పరిస్థితి వేరుగా ఉండేదే. ఇక మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన వేడ్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (47 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిల్లర్ (25 బంతుల్లో 34; 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత బెంగళూరు 18.4 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి (54 బంతుల్లో 73; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాత కోహ్లిలా చెలరేగాడు. డుప్లెసిస్ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించాడు. బౌలింగ్‌లో కీలకమైన వికెట్, అద్భుతమైన క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును చకచకా లక్ష్యానికి చేర్చాడు. చదవండి: IPL 2022: మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్ pic.twitter.com/IOmnppKBWb — Cred Bounty (@credbounty) May 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. స్టార్ క్రికెటర్ రొమాంటిక్ మూమెంట్
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్- ఆస్ట్రేలియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ అలీసా హేలీల లవ్‌స్టోరీ అందరికి తెలిసిందే. క్యూట్ లవ్కపుల్గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మిచెల్ స్టార్క్ ప్రస్తుతం ఆసీస్ జట్టులో అన్ని ఫార్మాట్లలోనూ కీలకబౌలర్‌గా సేవలందింస్తున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి స్టార్క్ ఇప్పటివరకు 529 వికెట్లు తీశాడు. మరోవైపు అలీసా హేలీ ఆస్ట్రేలియన్ వుమెన్స్ టీమ్‌లో ప్రధాన బ్యాటర్‌గా రాణిస్తుంది. టి20ల్లో 2,136 పరుగులు, వన్డేల్లో 2039 పరుగులు, ఆరు టెస్టుల్లో 236 పరుగులు చేసింది. చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం ఇక ఆస్ట్రేలియా మెన్స్ టీమ్‌కు ప్రస్తుతం ఏ సిరీస్‌లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియన్ వుమెన్స్ యాషెస్ టెస్టు మ్యాచ్ చూడడానికి వచ్చాడు. మ్యాచ్ చివరిరోజు ఆటలో కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో మిచెల్ స్టార్క్, అలీసా హేలీల రొమాంటిక్ యాంగిల్ కెమెరాలకు చిక్కింది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత హేలీ.. డోనట్‌ను స్టార్క్‌కు ఇచ్చింది. స్టార్క్ ఆ డోనట్‌ను సగం చేసి తన భార్యకు ప్రేమతో తినిపించాడు. ఈ సమయంలో మైదానంలోని కెమెరాలన్నీ వీరిద్దరిపై ఫోకస్ చేశాయి. ఇది చూసిన సహచర మహిళ ప్లేయర్స్ వారిద్దరి క్యూట్లవ్కు తెగ ముచ్చటపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో వుమెన్స్‌తో జరిగిన ఏకైక యాషెస్ టెస్టు డ్రాగా ముగిసింది. 48 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులతో విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ వుమెన్స్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి కేవలం 26 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను పడగొట్టారు. దీంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది ఇంగ్లండ్ పరిస్థితి. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ కష్టతరంగా డ్రా చేసుకుంది. 48 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆస్ట్రేలియన్ వుమెన్స్‌లో అన్నాబెల్ సుథర్లాండ్ 3, అల్నా కింగ్ 2, ఎలిస్ పెర్రీ, డార్సీ బ్రౌన్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Akhtar Vs Brett Lee: ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు Cute 🥰#Ashes pic.twitter.com/WlAMXUXzoy — 7Cricket (@7Cricket) January 30, 2022 -
జూబ్లీహిల్స్: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని ఓ షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్న యువతిని ఇద్దరు యువకులు మరో ట్రయల్ రూమ్ లోంచి వీడియో తీశారు.గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెచ్ అండ్ ఎం దుస్తుల షోరూంకు ఈనెల 4వ తేదీన ఓ యువతి దుస్తులు కొనేందుకు వచ్చింది. అదే షోరూమ్‌కు కల్యాణ్‌నగర్ ఫేజ్–1 అమూల్య రెసిడెన్సిలో నివసించే కిరీట్ అసాట్(24), వెంగళరావునగర్‌లోని క్రిస్టల్ అవెన్యూ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.వేణుగోపాల్‌రావు కుమారుడు కన్నెగంటి గౌరవ్ కల్యాణ్(19) వెళ్లారు. (చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్) ఆమె ట్రయల్ రూమ్‌కు వెళ్లగా నే అనుసరించి మరో ట్రయల్రూమ్లోకి వెళ్లి ఆమె డ్రస్ మార్చుకుంటుండగా వీడియోలు తీశారు. గమనించిన ఆమె పెద్దలగా కేకలు వేసి అప్రమత్తం చేసింది. అక్కడే ఉన్న వారు యువకులను సిబ్బంది పట్టుకున్నారు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన మేనేజర్ అమన్సూరిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కిరీట్, గౌరవ్కల్యాణ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: జూబ్లీహిల్స్: కోట్ల విలువైన ఇంటిని అమ్ముతానని నమ్మించి.. చివరికి!) చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
సచిన్‌ను చూసాక ఇషాన్ కిషన్ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్
Ishan Kishan Reaction After Seeing Sachin Tendulkar In MI Dressing Room: ఇపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటన నెటిజన్లను తెగ నవ్వించేస్తుంది. ఓ మ్యాచ్‌కు ముందు దిగ్గజ క్రికెటర్, ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్ టెండుల్కర్‌ను సడెన్‌గా చూసాక ఆ జట్టు స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ మ్యాచ్‌కు ముందు ఇషాన్ హోటల్ గది నుంచి బయల్దేరుతూ.. బ్లాక్ సన్ గ్లాసస్.. చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకొని క్యాజువల్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చాడు. That Unexpected moment, When Student Saw Principal at Class 💙😁 pic.twitter.com/EK3NZ8HR4e — S H E B A S (@Shebas_10) September 30, 2021 అక్కడ అప్పటికే టీమ్ మెంటార్ సచిన్ కూర్చొని ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సడెన్‌గా సచిన్‌ను చూసిన ఇషాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. క్లాస్ రూమ్‌లో ప్రిన్సిపల్‌ను చూసి స్టుడెంట్స్ భయపడినట్లు.. బ్యాగ్, సన్ గ్లాసస్, ఇయర్ బడ్స్‌ను తీసేసి జట్టును సర్దుకుని గుడ్ ఆఫ్టర్ నూన్ సార్.. అంటూ వినయాన్ని ప్రదర్శించాడు. ఇది చూసిన సహచర క్రికెటర్లు నవ్వుల్లో మునిగిపోయారు. పక్కనే ఉన్న పోలార్డ్, జయంత్ యాదవ్ అయితే.. ఇషాన్ హావభావాలు చూసి నవ్వు ఆపుకోలేక బిగ్గరగా నవ్వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే, గడిచిన ఐపీఎల్ సీజన్లలో అదరగొట్టి టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో సైతం చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్.. ప్రస్తుత సీజన్లో ఫామ్ కోల్పోయాడు. ఈ సీజన్లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 13.38 సగటున కేవలం 107 పరుగులు మాత్రమే సాధించాడు. మరోవైపు సహచర క్రికెటర్, టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ సైతం ఇషాన్‌లాగే ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఈ విషయం టీమిండియాను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ఇద్దరిపై వేటు వేసి శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధవన్‌లకు ఎంపిక చేయాలన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చదవండి: స్టార్ ఫుట్‌బాలర్‌కు చేదు అనుభవం.. హోటల్ గదిలోకి చొరబడి..! -
సిరాజ్, కుల్దీప్ల గొడవ.. నిజమెంత!
చెన్నై: టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌ల మధ్య డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. వివరాలు.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు సెషన్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లను అభినందించడానికి సిరాజ్ డ్రెస్సింగ్ రూమ్ డోర్ వద్ద నిల్చున్నాడు. అతని పక్కనే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఉన్నాడు. జట్టును మొత్తం అభినందించిన సిరాజ్.. కుల్దీప్ రాగానే అతన్ని ఆపి మెడ పట్టుకొని గొడవ పడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో కుల్దీప్, సిరాజ్‌లు విరామం సమయంలో డ్రింక్స్ అందించారు. లంచ్ సెషన్ తర్వాత అశ్విన్‌కి కాసేపు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వెళ్లిన సిరాజ్.. ఆ తర్వాత మైదానం వెలుపలికి వచ్చినా.. డ్రింక్స్ బాయ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా అన్న సందేహం వ్యక్తమయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. మేం చూస్తున్నది నిజమేనా.. కుల్దీప్, సిరాజ్‌లకు ఏమైంది.. ఎందుకు అలా గొడవ పడుతున్నారు.. ఇదంతా ఫేక్.. సిరాజ్ కావాలనే కుల్దీప్తో గొడవ పడుతున్నట్లుగా నటించాడు.. అంటూ కామెంట్లు చేశారు. వాస్తవానికి సిరాజ్, కుల్దీప్ల మధ్య ఎటువంటి గొడవ చోటుచేసుకోలేదు. తుది జట్టులో ఇద్దరికి చోటు లేకపోవడంతో ఉదయం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లోనే గడిపిన వీరిద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. అయితే టీ విరామం సమయంలో సిరాజ్ కుల్దీప్తో గొడవ పడుతున్నట్లుగా యానిమేటర్ వీడియో ద్వారా చిన్న తమాషా చేశాడు.వీడియోలో చూస్తే సిరాజ్ కుల్దీప్ను సీరియస్‌గా ఏదో అంటున్నట్లు కనిపిస్తుంది.కుల్దీప్కు మొదట సిరాజ్ చర్య అర్థం కాకపోయినా.. అతని తీరు చూసి భయపడినట్లుగా వీడియో కనిపించింది. పైగా వీరిద్దరు గొడవ పడుతున్న సమయంలో రవిశాస్త్రి అక్కడే ఉండడం.. వీరిని చూసి కూడా ఏమి పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇదంతా కావాలని చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా టీమిండియా ఇంగ్లండ్ సిరీస్‌ను మంచి ఎంటర్టైనింగ్ మూడ్‌లోనే నడిపిస్తుంది. రిషబ్ పంత్, రోహిత్ శర్మలే అనుకుంటే సిరాజ్ వారిని మించి ఎంటర్టైన్ చేయడంలో సఫలమయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది. కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ(218)తో ఆకట్టుకోగా, స్టోక్స్ 82 పరుగులతో రాణించాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్లు అశ్విన్ ఒక వికెట్ తీయగా, నదీం, ఇషాంత్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక 263 పరుగుల వద్ద పర్యాటక జట్టు తొలి రోజు ఆటను ముగించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ స్కోరు: బర్న్స్ (సి) పంత్ (బి) అశ్విన్- 33; సిబ్లీ (ఎల్బీ) (బి) బుమ్రా- 87; లారెన్స్ (ఎల్బీ) (బి) బుమ్రా- 0; రూట్ (ఎల్బీ) (బి) నదీం- 218; స్టోక్స్ (సి) పుజారా (బి) నదీం-82; పోప్ (ఎల్బీ) (బి) అశ్విన్- 34; బట్లర్ (బి) ఇషాంత్- 30; ఆర్చర్ (బి) ఇషాంత్- 0; బెస్ (బ్యాటింగ్)- 28; జాక్ లీచ్(బ్యాటింగ్)- 6. మొత్తం 555 (8 వికెట్లు, 180 ఓవర్లు) చదవండి: పంత్ బంతి ఎక్కడుంది.. ఎటు పరిగెడుతున్నావు నిన్న హెల్మెట్‌తో ఫీల్డింగ్.. ఇవాళ భజ్జీలా బౌలింగ్ What did siraj do here to kuldeep?👀👀#INDvsENG pic.twitter.com/pmWzVXAwt9 — Aniket Roy (@AniketR25368385) February 5, 2021 -
మహిళలు దుస్తులు మార్చుకునే చోట కెమెరాలు
-
ఇంద్రకీలాద్రి: మహిళల గదిలో కెమెరాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిలో అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఓ పెళ్లి బృందం సీసీ కెమెరాలను గుర్తించి బయటపెట్టింది. అయితే ఈ సంఘటనపై ఆలయ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని, అంతేకాకుండా మూడు రోజుల నుంచి పనిచేయడం లేదని అంటున్నారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. -
మహిళల డ్రెస్సింగ్‌రూంలో కెమెరాలు
-
స్మార్ట్ వాచ్లకు అనుమతి లేదు: ఐసీసీ
దుబాయ్: ఆటలో అక్రమాలకు ఆస్కారమిచ్చే ఏ మార్గాన్నీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఉపేక్షించబోమంటోంది. ఇందులో భాగంగా డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి ఎటువంటి సమాచార సాధనాలు తీసుకెళ్లరాదని నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతం (పీఎంఓఏ)లో స్మార్ట్ వాచ్‌లు ధరించవద్దని పేర్కొంటూ ఈ మేరకు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ‘ఫోన్ లేదా వైఫైతో అనుసంధానమై సమాచారాన్ని స్వీకరించగల స్మార్ట్ వాచ్‌లను ధరించవద్దని క్రికెటర్లకు గుర్తు చేస్తున్నాం. అలాంటివి ఏమైనా ఉంటే మైదానానికి చేరిన వెంటనే ఫోన్‌తో పాటు అప్పగించేయాలి’ అని నిర్దేశించింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు స్మార్ట్ వాచ్‌లు ధరించడంతో ఈ అంశం చర్చకు తావిచ్చింది. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలకు దారితీస్తుందేమోనని భావించిన ఐసీసీ... తక్షణమే అప్రమత్తమైంది. క్రీడాకారులు ఈ తరహా పరికరాలను గ్రౌండ్లోకి తేవడంపై నిషేధం ఉంది. తాజా ఆదేశాల్లో దానిని డ్రెస్సింగ్ రూమ్‌కూ వర్తింపజేశారు. సహచరులతో సంభాషించేందుకు మ్యాచ్ అధికారులకు మాత్రం ప్రత్యేక పరికరాలను అనుమతిస్తారు. మరోవైపు గత నవంబరులో న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో ఉన్న భారత కెప్టెన్ కోహ్లి వాకీటాకీలో మాట్లాడటం కెమెరాకు చిక్కింది. ఇది చర్చకు దారితీసింది. -
మా గెలుపుకు కారణం అదే : ధోని
సాక్షి, హైదరాబాద్ : వరుస విజయాలతో దూసుకుపోతున్న ధోని, తమ విజయాలకు అసలు కారణాన్ని బయటపెట్టాడు. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి ప్లేఆఫ్స్‌లో ఓటమి నుంచి తప్పించుకొని ధోని సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మిస్టర్ కూల్ మీడియాతో మాట్లాడుతూ తమ గెలుపుల వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పేశాడు. జట్టు నిలకడగా రాణించడానికి కారణాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ధోని వెల్లడించాడు. ఈ ఐపీఎల్లో తమకు మంచి జట్టు ఉందని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏళ్ల తరబడి ప్రత్యేక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నామని, దాని కారణంగానే విజయాలు దక్కుతున్నాయని తెలిపాడు. ఇదంతా జట్టు మేనేజ్మెంట్, స్టాఫ్‌కే దక్కుతుందని వెల్లడించాడు. వారి వద్ద నుంచి సరైన సహాయ సహకారాలు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదని అన్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై మిస్టర్ కూల్ ప్రసంశల జల్లు కురిపించాడు. రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు. హైదరాబాద్‌కు ఇద్దరు సరైన సమయంలో వికెట్లు తీశారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడం ద్వార తమపై వత్తిడి పెంచారని అన్నాడు. ఇలాంటి సందర్భాల్లో మ్యాచ్ ఎలా గెలవాలో నేర్చుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు తన జట్టు బౌలర్లపై కూడా ధోని పొగడ్తలు గుప్పించాడు. ఆదివారం జరిగే టైటిల్‌పోరులో మరింత రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
డ్రెస్సింగ్ రూమ్ విధ్వంసం.. కారకుడు అతనే!
సాక్షి, స్పోర్ట్స్ : నిదహస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న విధ్వంస ఘటనపై నివేదిక వెలువడింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ ఘటనకు కారణమని తేలింది. డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్ రిఫెరీ క్రిస్ బ్రాడ్.. మైదాన సిబ్బందిని విచారణ చేపట్టారు. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన ఆయన ఎటువంటి దాడి జరగలేదని నిర్ధారించారు. అందులో షకీబ్ తలుపును బలవంతంగా నెట్టడంతో గదికి ఉన్న అద్దాలు పగిలిపోయినట్లు స్పష్టంగా ఉంది. ఈ మేరకు క్రిస్ బ్రాడ్ నివేదికను సిద్ధం చేసినట్లు శ్రీలంక న్యూస్ పేపర్ ది ఐలాండ్ కథనం వెలువరించింది. అయితే బంగ్లా ఆటగాళ్లు విజయోత్సాహం వేడుకలు నిర్వహించుకున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని.. దీని వెనుక శ్రీలంక అభిమానులు ఉన్నారన్న రీతిలో వెలువడ్డ అభూత కల్పన కథనాలను క్రిస్ బ్రాడ్ ఖండించినట్లు ఆ కథనం ఉటంకించింది. ఘటనలో షకీబ్‌పై చర్యలు తీసుకునే అంశంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షకీబ్‌తో పాటు మరో ఆటగాడు నురుల్ మ్యాచ్ ఫీజులో కోత విధించిన సంగతి తెలిసిందే. -
క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం
-
క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం
కొలంబో : నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తీవ్ర పరిణామాలు జరిగాయి. మ్యాచ్ తర్వాత.. ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు వైరల్ అయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం : మ్యాచ్ చివరి ఓవర్లో బంగ్లా-లంక ప్లేయర్లు పరస్పరం వాదులాడుకున్నారు. ఉత్కంఠపోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేయత్నం చేశారు. ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. అసలేం జరిగింది? ఫైనల్స్‌లో బెర్త్ కోసం బంగ్లాతో జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మరో బంతి మిగిలుండగానే బంగ్లా 160 పరుగులు సాధించి విక్టరీ కొట్టింది. అయితే ఇన్నింగ్స్ చివరి(20వ) ఓవర్లో హైడ్రామా చోటుచేసుకుంది. రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంతో బంగ్లా బ్యాట్స్‌మన్ అసహనానికి గురయ్యారు. ముస్తఫిజుర్ రనౌటైన గ్యాప్‌లో గ్రౌండ్లోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు.. శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పేలోపే కెప్టెన్ షకీబ్ బౌండరీ దగ్గరకొచ్చి ‘బయటికి వచ్చేయండి..’ అంటూ గట్టిగట్టిగా కేకలు వేశాడు. చివరికి బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. మ్యాచ్ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. -
స్టీవ్ స్మిత్‌కు మళ్లీ ఏమైంది?
రాంచీ: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదం అతన్ని ఇప్పుడే విడిచిపెట్టేలా కనబడుటల్లేదు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో డీఆర్ఎస్ నిర్ణయంపై డ్రెస్సింగ్ రూమ్ సహాయం కోరి అడ్డంగా దొరికిపోయిన స్మిత్ పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భాగంగా చివరిరోజు ఆటలో జడేజా బౌలింగ్ లో స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా వేసిన ఒక పదునైన బంతిని బ్యాట్ తో అడ్డుకోకుండా అలానే చూస్తుండిపోయి స్మిత్ తన వికెట్ ను సమర్పించుకున్నాడు. దీనిపై బ్రెయిన్ ఫేడ్ ట్యాగ్‌తో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అటు మాజీ క్రికెటర్ల దగ్గర్నుంచి, ఇటు అభిమానులు సైతం ట్విట్టర్ వేదికగా స్మిత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్ తో సిరీస్ లో స్మిత్ కు అసలు ఏమైందంటూ ఛలోక్తులు విసురుతున్నారు. దీనిలో భాగంగా జడేజా బౌలింగ్ లో స్మిత్ బౌల్డ్ అయిన తీరు చూస్తుంటే మళ్లీ అతనికి బుర్ర పనిచేయలేనట్లు ఉందంటూ ఒకరు చమత్కరించగా, ఇక స్మిత్ కు విమాన టికెట్ తీసి స్వదేశానికి పంపడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సాయం చేయాలంటూ మరొక అభిమాని చురకలంటించాడు. మరొకవైపు ఈ సిరీస్ లో కచ్చితమైన 'బ్రెయిన్ ఫేడ్' ఏదైనా ఉందంటే అది స్మిత్ అవుటేనని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. -
ఫిర్యాదుపై ముందుకి... వెనక్కి
-
ఫిర్యాదుపై ముందుకి... వెనక్కి
ఆసీస్ ఆటగాళ్లపై ఫిర్యాదు చేసి ఉపసంహరించుకున్న భారత్ బెంగళూరు: స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరకు ‘సంధి’తో ముగిసింది. బుధవారం ఎవరిపై చర్యలు లేవంటూ ఐసీసీ చేసిన ప్రకటనపై సంతృప్తి చెందని బీసీసీఐ, మరుసటి రోజు స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే దాదాపు అర్ధ రాత్రి సమయంలో రెండు దేశాల బోర్డులు ఈ వివాదాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా కలిసి సంయుక్త ప్రకటన జారీ చేశాయి. దీని ప్రకారం బీసీసీఐ తమ ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు సమావేశమవుతారు. మిగిలిన సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడేలా, ఆటగాళ్లుగా తమ దేశాలకు అసలైన రాయబారులుగా వ్యవహరించేలా కోహ్లి, స్మిత్ తమ జట్లను నడిపిస్తారు. అంతకు ముందు జరిగిన పరిణామాలను చూస్తే... ఇరు జట్లతో చర్చించిన తర్వాత రివ్యూ ఘటనకు ఐసీసీ ముగింపు పలికిందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా భారత బోర్డు మరో సారి తలపడేందుకు సిద్ధమైంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం లెవెల్ 2 స్థాయి ఆరోపణలు నమోదు చేయాలంటూ బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ఐసీసీకి పంపిన మెయిల్లో తమ వాదనకు మద్దతుగా ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా భారత్ జత చేసింది. ‘స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌లపై బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. స్మిత్‌ను పెవిలియన్ వైపునుంచి సలహా అడగమంటూ హ్యాండ్స్కోంబ్ చెప్పడం, అంపైర్ నైజేల్ లాంగ్ జోక్యం చేసుకున్న వీడియోను కూడా మేం జత చేశాం. నిబంధనల ప్రకారం మ్యాచ్ ముగిసిన 48 గంటల్లోపే ఈ ఫిర్యాదు దాఖలు చేశాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత్ టెస్టుకు సంబంధించి ఆ ఒక్క ఘటనపైనే ప్రత్యేకంగా దృష్టి పెడుతూ తమ ఫిర్యాదులో ఆరోపణలు చేసింది. తమ ఫిర్యాదులో ‘క్రికెట్ స్ఫూర్తిని దెబ్బ తీయడం, ఆటను అగౌరవపర్చడం’ అనే వాక్యాన్ని భారత్ వాడినట్లు తెలిసింది. అందుకే ఆగ్రహమా! డ్రెస్సింగ్ రూమ్‌నుంచి రివ్యూపై స్మిత్ సూచనలు కోరడం అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత హ్యాండ్స్కోంబ్ కూడా తనదే తప్పంటూ ట్విట్టర్లో పొరపాటు అంగీకరించాడు కూడా. అయితే ఇంత జరిగినా ఆసీస్ బోర్డు తమ ఆటగాళ్లను వెనకేసుకు వస్తూ పనిలో పనిగా కోహ్లిని కూడా విమర్శించింది. ఇది బీసీసీఐకి చిరాకు తెప్పించింది. నిజానికి మ్యాచ్ ముగిశాక రిఫరీ క్రిస్ బ్రాడ్ కనీసం స్మిత్‌ను వివరణ కోరి హెచ్చరిస్తారని భావించింది. వీటన్నింటికి తోడు రాంచీ టెస్టుపై దృష్టి పెట్టాలంటూ ఐసీసీ సుద్దులు చెప్పడం భారత బోర్డును నచ్చలేదు. ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉన్న 48 గంటలు పూర్తిగా గడవక ముందే ఐసీసీ తమ తీర్పు వెలువరించేయడం కూడా భారత్‌ను ఈ ఘటనపై పునరాలోచించేలా చేసింది. -
'డ్రెస్సింగ్ రూం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా'
కెవిన్ పీటర్సన్ లాంటి ఆటగాడిని తొలగించడం ఇంగ్లండ్ చేసిన తప్పిదమని, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే సంగతులను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందన్నాడు. 'గత సోమవారం బీబీఎల్‌లో వ్యాఖ్యానం సందర్భంగా కెవిన్‌ను పలు ప్రశ్నలు అడిగే అవకాశం దొరికింది. కొన్ని విషయాలు అడగాలనిపించి, కేపీని కామెంటరీ బాక్స్‌కు పిలిచాను. కేపీ ఆత్మకథ చదివాను. అందులో కొన్ని విషయాలపై కేపీ తో చర్చిస్తే కొంత స్పష్టత వచ్చే అవకాశముంది. ఆ విషయాలు నేను పూర్తిగా తెలుసుకునేందుకు మరోసారి అతడిని కలవాలనుకుంటున్నా' అని పాంటింగ్ అన్నారు. ఇంగ్లండ్ జట్టు కొత్త కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తోడ్పాటుతో తాను జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేపీ ఇటీవలే స్పష్టంచేశాడు. కేపీ తాను రచించిన 'కేపీ: ఆత్మకథ'లో ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూం వేధింపులను ప్రస్తావించిన విషయం తెలిసిందే.