
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని ఓ షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్న యువతిని ఇద్దరు యువకులు మరో ట్రయల్ రూమ్ లోంచి వీడియో తీశారు.గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెచ్ అండ్ ఎం దుస్తుల షోరూంకు ఈనెల 4వ తేదీన ఓ యువతి దుస్తులు కొనేందుకు వచ్చింది. అదే షోరూమ్‌కు కల్యాణ్‌నగర్ ఫేజ్–1 అమూల్య రెసిడెన్సిలో నివసించే కిరీట్ అసాట్(24), వెంగళరావునగర్‌లోని క్రిస్టల్ అవెన్యూ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.వేణుగోపాల్‌రావు కుమారుడు కన్నెగంటి గౌరవ్ కల్యాణ్(19) వెళ్లారు.
(చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్‌కోర్ట్ టాయిలెట్‌లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్)
ఆమె ట్రయల్ రూమ్‌కు వెళ్లగా నే అనుసరించి మరో ట్రయల్‌రూమ్‌లోకి వెళ్లి ఆమె డ్రస్ మార్చుకుంటుండగా వీడియోలు తీశారు. గమనించిన ఆమె పెద్దలగా కేకలు వేసి అప్రమత్తం చేసింది. అక్కడే ఉన్న వారు యువకులను సిబ్బంది పట్టుకున్నారు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన మేనేజర్ అమన్‌సూరిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కిరీట్, గౌరవ్‌కల్యాణ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
(చదవండి: జూబ్లీహిల్స్: కోట్ల విలువైన ఇంటిని అమ్ముతానని నమ్మించి.. చివరికి!)
Comments
Please login to add a commentAdd a comment