cloth showroom
-
కూకట్‌పల్లిలో కాంచీపురం నారాయణి సిల్క్స్ వస్త్ర షో రూమ్ ను ప్రారంభించిన సినీనటి లావణ్య త్రిపాఠి (ఫోటోలు)
-
వైరల్ వీడియో: బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు
-
Viral Video: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్
-
బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్
సాక్షి, ఖమ్మం : నగరంలో సోమవారం రాత్రి బట్టల దుకాణంలోకి ఓ ద్విచక్రవాహనం దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు అతి వేగంగా పల్సర్ వాహనంపై కమాన్‌బజార్‌లోని రావిచెట్టు ప్రాంతానికి వచ్చాడు. అయితే, వాహనం బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో వాహనం దుకాణాంలోకి దూసుకెళ్లింది. ఆ సమయాన షాపులో కొనుగోలుదారులు ఉన్నప్పటికీ వారు తప్పుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. వన్‌టౌన్ పోలీసులు ద్విచక్రవాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. -
జూబ్లీహిల్స్: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని ఓ షోరూమ్‌లోని ట్రయల్ రూమ్‌లో దుస్తులు మార్చుకుంటున్న యువతిని ఇద్దరు యువకులు మరో ట్రయల్ రూమ్ లోంచి వీడియో తీశారు.గమనించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెచ్ అండ్ ఎం దుస్తుల షోరూంకు ఈనెల 4వ తేదీన ఓ యువతి దుస్తులు కొనేందుకు వచ్చింది. అదే షోరూమ్‌కు కల్యాణ్‌నగర్ ఫేజ్–1 అమూల్య రెసిడెన్సిలో నివసించే కిరీట్ అసాట్(24), వెంగళరావునగర్‌లోని క్రిస్టల్ అవెన్యూ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.వేణుగోపాల్‌రావు కుమారుడు కన్నెగంటి గౌరవ్ కల్యాణ్(19) వెళ్లారు. (చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్) ఆమె ట్రయల్ రూమ్‌కు వెళ్లగా నే అనుసరించి మరో ట్రయల్రూమ్లోకి వెళ్లి ఆమె డ్రస్ మార్చుకుంటుండగా వీడియోలు తీశారు. గమనించిన ఆమె పెద్దలగా కేకలు వేసి అప్రమత్తం చేసింది. అక్కడే ఉన్న వారు యువకులను సిబ్బంది పట్టుకున్నారు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన మేనేజర్ అమన్సూరిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కిరీట్, గౌరవ్కల్యాణ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (చదవండి: జూబ్లీహిల్స్: కోట్ల విలువైన ఇంటిని అమ్ముతానని నమ్మించి.. చివరికి!) చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
కామారెడ్డిలో నిధి అగర్వాల్ సందడి ఫొటోలు
-
చీకటి గదిలోకి తీసుకెళ్లి సిబ్బందిపై..
కుషాయిగూడ: లెక్కల్లో తేడా జరిగిందన్న అనుమానంతో ఓ వస్త్ర షోరూం యాజమాన్యం ఇద్దరు ఉద్యోగులపై దాడికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన మేరకు.. ఉప్పల్‌కు చెందిన గౌర సంపత్ ఫ్లోర్ ఇంచార్జిగా, బానచందర్ క్యాషియర్‌గా కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్‌లోని అనుటెక్స్‌లో షోరూంలో పనిచేస్తున్నారు. అయితే లెక్కల్లో తేడాలున్నాయని అనుమానించిన యాజమాన్యం ఈ నెల 20న ఏఎస్‌రావునగర్ అనుటెక్స్ షోరూంకు పిలిపించారు. బాధితులు అక్కడికి వెళ్లగానే అప్పటికే అక్కడ ఉన్న బౌన్సర్లు బాధితుల నుంచి సెల్ఫోన్లు, పర్స్‌లను లాక్కొని చీకటి గదిలోకి తీసుకెళ్లి డిస్కౌంట్ల పేరుతో అవినీతికి పాల్పడుతారా అంటు దాడికి పాల్పడ్డారు. కర్రలు, ఇనుపరాడ్లు, చెక్కలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. బౌన్సర్లతో పాటుతా అనుటెక్స్ ఎండీలు పులవర్తి నాగేశ్వరరావు, రాజశేఖర్, రామకృష్ణారావులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. తమ క్రెడిట్, డెబీట్ కార్డుల నుంచి సుమారు 2.5 లక్షలు కూడా డ్రా చేసుకున్నట్లు ఆరోపించారు. అంతేకాక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కేసునమోదు చేయాలని పోలీసులను కోరారన్నారు. అయితేపోలీసులు మందలించగా వెనక్కు తగ్గారన్నారు. అక్కడే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. తరువాత బాధితులు కుషాయిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఇన్స్పెక్టర్ మన్మోహన్ మాట్లాడుతూ.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. బాధ్యులైన పులవర్తి నగేశ్, పులవర్తి రాజు, పులవర్తి రామకృష్ణ, పులవర్తి శ్రీనివాస్, ఉప్పల సంతోష్‌లపైకేసు నమోదు చేశామన్నారు. -
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, కృష్ణా: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బీసెంట్ రోడ్డులోని ఆర్ 900బట్టల షోరూంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో షాపు పరిసర ప్రాంతాల్లో పోగ దట్టంగా వ్యాపించింది. బట్టల షోరూం కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇదే షోరూంకు పక్కన కూడా మరికొన్ని బట్టల షాపులు అనుకుని ఉన్నాయి. మంటలు మరింత వ్యాపిస్తే మిగిలిన షాపులు కూడా ఆహుతయ్యే అవకాశం ఉంది. స్థానికులు సమాచారంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలకు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ప్రక్క షాపులకు వ్యాపింకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ప్రమాదానికి కారణం ఏంటన్నది తెలిసిరాలేదు. -
వస్త్ర దుకాణంలో చోరీ
రొంపిచర్ల(నరసరావుపేట): వస్త్ర దుకాణంలో కొనుగోలుకు వచ్చిన ఐదుగురు మహిళలు రూ.18 వేల రూపాయల విలువ చేసే వస్త్రాలతో పరారైన సంఘటన మండల కేంద్రంలోని రొంపిచర్ల చెరువుగట్టు సెంటర్లో మంగళవారం చోటుచేసుకుంది. దుకాణం నిర్వాహకురాలు రమణ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. రమణ నిర్వహిస్తున్న క్లాత్ రెడీమేడ్ వస్త్ర దుకాణానికి మంగళవారం ఐదుగురు గుర్తు తెలియని మహిళలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. వారిలో ఇద్దరు మహిళలు రేట్లు అడుగుతూ నిర్వాహకురాలు రమణను పక్కదోవ పట్టించారు. ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు మహిళలు బయట ఉన్న ఆటోలోకి వస్త్రాలను తరలించారు. బేరం ఆడుతున్న మహిళలు రేట్లు కుదరక పోవటంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వారికి చూపించిన వస్త్రాలు సర్దుకుంటుండగా, కొన్ని తగ్గినట్టు గమనించి బయటకు వచ్చి చూడగా ఆ మహిళలు పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయానని తెలుసుకున్న రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపులో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్లలో ఆ మహిళలు దుస్తులు కొనుగోలు చేస్తున్న దృశ్యాలు లభ్యమయ్యాయి. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వస్త్ర దుకాణంలో భారీ చోరీ
నెల్లూరు(క్రైమ్): నగరంలోని ట్రంకురోడ్డులోని ఓ ప్రము ఖ వస్త్ర దుకాణంలో ఆదివారం వేకువన దొంగలు చోరీకి పాల్పడ్డారు. టెర్రస్‌పై నుంచి రెండో అంతస్థులోకి ప్రవేశించిన దుండగులు మెట్ల మీదుగా కిందకు చేరుకున్నారు. దుకాణం షట్టర్ తెరుచుకోకపోవడంతో ట్రయల్‌రూమ్ ద్వారా లోనికి ప్రవేశించారు. క్యాష్‌కౌంటర్‌లోని రూ.34.43లక్షలను అపహరించుకెళ్లారు. శనివారం వేకువన ట్రంకురోడ్డులోని కుమార్ జ్యువెలరీస్‌లో దొంగలు చోరీకి యత్నించారు. ఈ ఘటన మరువక ముందే వస్త్రదుకాణంలోకి ప్రవేశించి భారీగా చోరీకి పాల్పడడంతో వ్యాపారులు హడలిపోతున్నారు. పో లీసుల సమాచారం మేరకు....నగరంలోని ట్రంకురోడ్డులో ఉన్న ప్రముఖ వస్త్ర దుకా ణానికి, కనకమహాల్సెంటర్లో మరో దుకాణం ఉంది. రెండు దుకాణాల శుక్ర, శనివారాలకు సంబంధించిన కలెక్షన్ నగదు రూ 34.43లక్షలను ట్రంకురోడ్డులోని దుకాణం క్యాష్‌కౌంటర్‌లో ఉంచారు. సోమవారం వాటిని బ్యాంకులో జమచేయాల్సి ఉంది. శనివారం రాత్రి ఎప్పటిలాగే దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు దుకాణం పక్కనే ఉన్న కాంప్లెక్స్‌పై నుంచి చెక్కబల్ల సాయంతో టెర్రస్‌పైకి వచ్చారు. గ్రిల్స్‌ను యాక్సాబ్లేడ్‌తో కోసి మెట్లమీదుకు చేరుకున్నారు. షట్టర్‌ను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. తెరుచుకోకపోవడంతో పై భాగంలో ఉన్న రంద్రం ద్వారా ట్రయల్రూమ్లోకి ప్రవేశించారు. తలుపు బోల్టులను తొలగించి లోనికి చేరుకున్నారు. రెండో అంతస్థులోని క్యాష్‌కౌంటర్‌లోని చిల్లర నగదును తీసుకున్నారు. పొడిచిల్లరను వదిలేశారు. అనంతరం కింద పోర్షన్‌కు చేరుకున్నారు. అక్కడి క్యాష్‌కౌంటర్‌ను తెరచి అందులోని రూ.34.43లక్షలను తీసుకుని వచ్చిన మార్గంలోనే టెర్రస్‌పైకి వెళ్లారు. అక్కడ నగదు పంచుకున్నారు. రూ.10, రూ. 20 నోట్లను అక్కడే వదిలి మిగిలిన నగదు తీసుకుని పరారయ్యారు. సూపర్వైజర్ ఫిర్యాదు ఆదివారం ఉదయం సూపర్వైజర్ షాపింగ్‌మాల్‌కు వచ్చాడు. షట్టర్ తాళాలు తెరచి లోనికి వెళ్లిచూడగా వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. క్యాష్‌కౌంటర్ తెరచి ఉంది. రెండో అంతస్థులోకి వెళ్లి చూడగా అక్కడి క్యాష్‌కౌంటర్‌ను తెరచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి జనరల్ మేనేజర్‌కు తెలిపాడు. ఆయన, యజమా ని ఘటనా స్థలానికి చేరుకుని చోరీ ఘటనపై ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ తీరును పరిశీలించిన అధికారులు నగర, సీసీఎస్ డీఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎం బాలసుందరరావు, ఒకటోనగర ఇన్చార్జి ఇన్స్పెక్టర్ బీ పాపారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా, ఎస్ఐలు షేక్ కరిముల్లా, షేక్ షరీఫ్ తమ సిబ్బందితో చోరీ జరిగిన తీరును పరిశీలించారు. రెండో అంతస్థులో నుంచి టెర్రస్‌పైకి వెళ్లే షట్టర్‌ను తెరిచే ప్రయత్నం చేయగా ఎంతకీ రాకపోవడంతో దుకాణ సిబ్బంది పక్క కాంప్లెక్స్‌పై నుంచి టెర్రస్‌పైకి చేరుకుని షట్టర్‌ను అతికష్టంపై పైకిలేపారు. దీంతో పోలీసులు టెర్రస్‌పైకి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్‌టీం ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలంతో పాటు సమీపంలోని కాంప్లెక్స్ వద్ద కలియతిరిగింది. కాంప్లెక్స్ పైభాగంలో కొత్తగా గదులు నిర్మిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ పనిచేసే వారి వివరాలను సేకరిస్తున్నారు. రెక్కీవేసి చోరీ దుండగులు పక్కా రెక్కీ వేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి వెళితే షాపింగ్‌మాల్‌లోకి వెళ్లవచ్చు. దొంగతనం అనంతరం ఎలా సులువుగా తప్పించుకోవచ్చనే వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరమే దుండగులు దొంగతనం చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఐదారు రోజుల సీసీఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆన్‌లో లేని సీసీ కెమెరాలు దుకాణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు సీసీకెమెరాలు పనిచేస్తుంటాయి. రాత్రి వేళల్లో షార్ట్ సర్క్యూట్ భయంతో సిబ్బంది ఆఫ్‌చేసి వెళుతున్నారు. సీసీకెమెరాలు ఆపకుండా ఉండి ఉంటే చోరీకి పాల్పడిన దుండగుల ఆనవాళ్లు దొరికి ఉండేవి. క్యాష్‌కౌంటర్ పక్కనే ఇనుప బీరువా ఉంది. దాంట్లో నగదు ఉంచినా భద్రంగా ఉండేది. సిబ్బంది కౌంటర్లోనే నగదు ఉంచడంతో దొంగలు సులభంగా అపహరించగలిగారు. కేసు నమోదు చోరీ ఘటనపై దుకాణం మేనేజర్ ఫిర్యాదు మేరకు ఒకటోనగర ఎస్ఐ షేక్ కరిముల్లా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లభ్యమైన క్లూస్ ఆధారంగా కేసును విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ తెలిపారు. -
తణుకులో భారీ అగ్ని ప్రమాదాలు
తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేల్పూరు రోడ్డులోని నరేష్ క్లాత్‌షోరూంలో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మూడంతస్తుల భవనంలో ఓ ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. కోటి వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం స్థానికంగా ఉన్న పాత బెల్లం మార్కెట్ సమీపంలోని గోనె సంచుల గొడౌన్లో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడటంతో.. రూ. 50 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. -
అగ్నిప్రమాదం : భారీ నష్టం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా నెల్లిపాక మండలం తోటపల్లిలో శుక్రవారం వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో పక్కనే ఉన్న మరో వస్త్ర దుకాణానికి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో రూ. 20 లక్షలు ఆస్తి అగ్నికి ఆహుతి అయిందని దుకాణం యజమానులు తెలిపారు. -
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం : భారీ నష్టం
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అగ్నిమపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. అయితే ఒక్క ఫైరింజన్ ఉండటంతో మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టసాధ్యంగా మారింది. దాంతో అగ్నిమాపక సిబ్బంది మరో ఫైరింజన్ పంపాలని ఉన్నతాధికారులను కోరారు. అగ్నిప్రమాదంతో భారీ నష్టం సంభవించిందని దుకాణ యాజమానులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.