సాక్షి, ఖమ్మం : నగరంలో సోమవారం రాత్రి బట్టల దుకాణంలోకి ఓ ద్విచక్రవాహనం దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు అతి వేగంగా పల్సర్ వాహనంపై కమాన్‌బజార్‌లోని రావిచెట్టు ప్రాంతానికి వచ్చాడు.
అయితే, వాహనం బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో వాహనం దుకాణాంలోకి దూసుకెళ్లింది. ఆ సమయాన షాపులో కొనుగోలుదారులు ఉన్నప్పటికీ వారు తప్పుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. వన్‌టౌన్ పోలీసులు ద్విచక్రవాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment