
మిస్ తెలుగు యూఎస్‌ఏ ఫైనలిస్ట్‌ల్లో జిల్లా యువతి
ఖమ్మం: ‘మిస్ తెలుగు యూఎస్‌ఏ – 2025’ పోటీల్లో బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన యువతి గీతిక ఫైనల్స్‌కు చేరింది. అమెరికాలో స్థిరపడిన, చదువుకుంటున్న తెలుగు వారి కోసం ఏటా ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తెలుగు భాష గొప్పతనం, ఆత్మగౌరవం, సంస్కృతి, జీవన విధానం, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ, అభినయం, సంగీతం, మేధస్సు తదితర అంశాలతో విజేతను ఎంపిక చేయనుండగా గీతిక ఫైనల్స్‌కు చేరింది.
మే 25న గ్రాండ్ ఫినాలే డల్లాస్‌లో జరగనుండగా విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ముష్టికుంట్లకు చెందిన పిల్లలమర్రి శివనర్సింహారావు–మాధవి దంపతుల పెద్ద కుమార్తె గీతిక ప్రాథమిక విద్య ఖమ్మంలో,బీటెక్ చెన్నైలో పూర్తి చేశాక అమెరికాలోని సిన్సినాటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment