Geetika
-
Gitika Talukdar: ప్యారిస్ ఒలింపిక్స్‌కు మన ఫొటోగ్రాఫర్
వచ్చే నెలలో ప్యారిస్ ఒలింపిక్స్. అన్ని దేశాల ఆటగాళ్లే కాదు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా కెమెరాలతో బయలుదేరుతారు. కాని ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ’ (ఐ.ఓ.సి) గుర్తింపు పొందిన వారికే అన్ని మైదానాల్లో ప్రవేశం. అలాంటి అరుదైన గుర్తింపును పొందిన మొదటి భారతీయ మహిళా ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్. అస్సాంకు చెందిన స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గీతికా తాలూక్దార్ పరిచయం.‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ఎంచుకోవడానికి స్త్రీలు పెద్దగా ముందుకు రారు. ఎందుకంటే అది మగవాళ్ల రంగం చాలా రోజులుగా. అక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. నేను వాటన్నింటినీ అధిగమించి ఇవాళ గొప్ప గుర్తింపు పొందగలిగాను’ అని సంతోషం వ్యక్తం చేసింది గీతికా తాలూక్దార్. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకూప్యారిస్లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో ఫొటోలు తీయడానికి ఆమెకు అక్రిడిటేషన్ లభించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటి (ఐ.ఓ.సి) చాలా తక్కువ మంది ఫొటోగ్రాఫర్లకు మాత్రమే ఒలింపిక్స్‌ను కవర్ చేసే అధికారిక గుర్తింపు ఇస్తుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా అతి కొద్దిమంది మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లు ఈ గుర్తింపు పొందితే మన దేశం నుంచి మొదటి, ఏకైక మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా గీతికా తాలూక్దార్ చరిత్ర సృష్టించింది. ఫ్రీ లాన్సర్‌గా...‘స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ అంటే విస్తృతంగా పర్యటించాలి. సంస్థలో ఉద్యోగిగా ఉన్నప్పుడు సంస్థలు ఒక్కోసారి అనుమతిస్తాయి, మరోసారి అనుమతించవు. అందుకని నేను ఫ్రీలాన్సర్‌గా మారాను. స్వేచ్ఛ పొందాను. నా సేవలు కావాల్సిన సంస్థలు నన్ను సంప్రదిస్తాయి’ అంది గీతిక. ఫ్రీ లాన్సర్‌గా ఉంటూనే ఆమె ఇంకా చదువు కొనసాగించింది. కొలంబోలో డిప్లమా కోర్సు చేసింది. అలాగే సౌత్ కొరియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వారి స్కాలర్షిప్ పొంది సియోల్ నేషనల్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కొలంబోలో చదువుకునే సమయంలో సర్ రిచర్డ్ హ్యాడ్లీని ఇంటర్వ్యూ చేయడం గొప్ప అనుభవం. అక్కడ ఆయన పేద పిల్లలకు క్రికెట్ నేర్పేందుకు అకాడెమీ నిర్వహిస్తున్నారు. నేను వెళ్లిన రోజు బాల్ ఎలా విసరాలో నేర్పుతున్నారు. నేను ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చారు’ అని చెప్పింది గీతిక.కోవిడ్ రిస్క్ ఉన్నా...ప్రపంచంలో ఎక్కడ భారీ క్రీడా వేడుకలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది గీతిక. ఆస్ట్రేలియా ఫీఫా విమెన్స్ వరల్డ్ కప్, ఖతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ పోటీలను ఆమె కవర్ చేసింది. 2020 సియోల్ ఒలింపిక్స్‌కు కోవిడ్ కారణంగా చాలా మంది అక్రిడిటెడ్ ఫొటో జర్నలిస్టులు వెళ్లడానికి భయపడ్డారు. కాని అక్రిడిటేషన్ లేకున్నా గీతిక అక్కడకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఫొటోలు తీసి గుర్తింపు పొందింది. తన వృత్తి పట్ల ఆమెకు ఉన్న ఈ అంకిత భావాన్నే ఒలింపిక్స్ కమిటీ గుర్తించింది. అందుకే ఈసారి అధికారికంగా ఆహ్వానం పలికింది. జూలై 23న ప్యారిస్ బయలుదేరి వెళ్లనుంది గీతిక. ‘గేమ్స్ వైడ్ ఓపెన్’ అనేది ఈసారి ఒలింపిక్స్ థీమ్. మరిన్ని వర్గాలను కలుపుకుని ఈ క్రీడలు జరగాలనేది ఆశయం. తక్కువ గుర్తింపుకు నోచుకునే మహిళా స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా ఈ ఆశయంలో భాగమే. ‘నాకొచ్చిన అవకాశం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరింత కష్టపడి పని చేస్తాను. స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునేవారికి క్రమశిక్షణ అవసరం. అంతర్జాతీయ క్రీడాపోటీలు టైముకు మొదలయ్యి టైమ్‌కు ముగుస్తాయి. వాటిని అందుకోవాలంటే క్రీడల్లోని ఉత్తమ క్షణాలను కెమెరాలో బంధించాలంటే ఏకాగ్రత, క్రమశిక్షణ చాలా అవసరం. అవి ఉన్నవారు ఈ రంగంలో నిస్సందేహంగా రాణిస్తారు’ అంటోంది గీతిక.‘టీ సిటీ’ అమ్మాయిఅస్సాంలోని డూమ్డుమా పట్టణాన్ని అందరూ ‘టీ సిటీ’ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ తేయాకు తోటలు విస్తారం. హిందూస్తాన్ లీవర్ టీ ఎస్టేట్ అక్కడే ఉంది. ఆ ఊళ్లో చిన్న ఉద్యోగి కుమార్తె అయిన గీతిక చిన్నప్పటి నుంచి కెమెరాతో ప్రేమలో పడింది. అందుకు కారణం ఆమె మేనమామ చంద్ర తాలూక్దార్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందడం. అతను కెమెరాలో నుంచి చూస్తూ రకరకాల దృశ్యాలను అందంగా బంధించడాన్ని బాల్యంలో గమనించిన గీతిక తాను కూడా అలాగే చేయాలనుకుంది. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశాక మాస్ కమ్యూనికేషన్లో డి΄÷్లమా చేసింది. క్రీడలంటే ఆసక్తి ఉండటంతో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌గా మారి 2005 నుంచి డీఎన్ఏ, బీబీసీ, ఇండియా టుడే, పీటీఐ వంటి సంస్థలతో పనిచేసింది. -
ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లకు నేనున్నా
‘‘నేను ఫుట్‌పాత్ నుంచి ఈ స్థాయికి వచ్చాను. ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియనివాళ్లు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్లకు నేను బ్రేక్ ఇస్తాను.. నేనున్నంత వరకూ అవకాశాలు ఇస్తాను.. స్టార్ హీరోలతో సినిమా చేసినా అందులో కొత్తవారికి చాన్స్ ఇస్తాను’’ అని డైరెక్టర్ తేజ అన్నారు. అభిరామ్, గీతికా తివారీ జంటగా రూపొందిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజ చెప్పిన విశేషాలు. ► అభిరామ్‌ని హీరోగా పరిచయం చేస్తానని రామానాయుడుగారికి మాట ఇచ్చాను.. ఆ మాట కోసమే తనతో ‘అహింస’ చేశాను. సినీ నేపథ్యంలో ఉన్న పెద్ద కుటుంబాల్లోని వ్యక్తులతో చేసినప్పుడు సహజంగానే పోలికలు వస్తాయి. ఇప్పటికే స్టార్స్ అయిన వెంకటేశ్, రానాలతో అభిరామ్‌ని పోల్చకూడదు. ఎక్కువ డబ్బులు, పేరు కోసం పెద్ద స్టార్స్‌తో పని చేయాలి. నేను డబ్బులు, పేరు చూశాను.. నాకు ఇంకేం కావాలి? ► ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ట్రైలర్‌ని చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. స్టార్ హీరోని బట్టి థియేటర్‌కి వెళతారనుకుంటే.. అప్పుడు పెద్ద స్టార్స్‌కి అపజయాలే రాకూడదు కదా! సినిమాలో ఎమోషన్ ఉంటే ట్రైలర్లో కనిపిస్తుంది. ప్రేక్షకులు ఆ ఎమోషన్‌కి కనెక్ట్ అయితే స్టార్ సినిమానా? కొత్తవారిదా అనే తేడా లేకుండా వచ్చేస్తారు. ► ఒక ఫిలాసఫీని బేస్ చేసి తీసిన చిత్రమిది. అహింసని ఎలా ఫాలో అవ్వాలి? అనే కాన్సెప్ట్‌తో మంచి కమర్షియల్ కథతో ఈ సినిమా చేశాం. ఇందులో దాదాపు 14 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఓ నాలుగు ఎపిసోడ్స్‌కి నేనే ఫైట్ మాస్టర్‌గా చేశాను. ► అభిరామ్‌కి సినీ నేపథ్యం ఉంది. తనని పరిచయం చేస్తున్నప్పుడు నాకంటే అభీపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. సురేశ్‌బాబుగారు ఒకసారి సెట్‌కి వచ్చారు. ‘నాన్నా.. నువ్వుంటే నేను చేయను’ అని అభి అనడంతో మానిటర్ వద్దకెళ్లి కూర్చున్నారాయన. ఇన్ని సినిమాలు చేసిన వెంకటేశ్‌గారు, రానాకి కూడా సురేశ్‌గారు సెట్‌కి వస్తే టెన్షన్ వచ్చేస్తుంది (నవ్వుతూ).. సురేశ్‌గారి దృష్టి వేరుగా ఉంటుంది. కిరణ్‌గారు రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సంగీతం, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ప్లస్ అయ్యాయి. ► ‘అహింస’ విజయం సాధించి డబ్బులు వస్తే ఆ డబ్బుతో మళ్లీ సినిమాలు తీస్తాను. నా చిత్రం మూవీస్ బేనర్లో కొత్త దర్శకులని పరిచయం చేస్తాను. నా తర్వాతి సినిమా ‘రాక్షస రాజు’ని రానాతో చేస్తాను. ఆ తర్వాత మా అబ్బాయిని హీరోగా పరిచయం చేసే సినిమా చేస్తాను. -
అహింస కొత్తగా ఉంటుంది
‘‘అహింస’ కథ చాలా కొత్తగా ఉంటుంది.. కథ కొత్తగా ఉన్నప్పుడు పాట సహజంగానే కొత్తగా వినిపిస్తుంది. ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారుసంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. అభిరామ్, గీతికా తివారి జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అహింస’. పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ– ‘‘అహింస సిద్ధాంతం నమ్మే ఓ అబ్బాయిని పరిస్థితులు ఎలా కృష్ణతత్వంవైపు లాగాయనేది ఈ చిత్రకథ. నా దర్శకత్వంలో ఒక మ్యూజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. ఎన్నికల నేపథ్యంలో ఓ కథ రెడీ చేశాను. నిర్మాతలు దొరికితే ఏడాదికి 4 చిత్రాలకు దర్శకత్వం వహిస్తా. వెబ్ సిరీస్ కోసం రెండు కథలు రాశాను’’ అన్నారు. -
తేజ ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమవుతున్నా
‘‘ఫలానా జానర్‌కు పరిమితం కాకుండా ఓ నటిగా డిఫరెంట్ సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది’’ అన్నారు హీరోయిన్ గీతికా తివారి. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. ఈ చిత్రంలో గీతికా తివారి హీరోయిన్గా నటించారు. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో గీతికా తివారి మాట్లాడుతూ– ‘‘మాది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక యాక్టర్‌గా కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనుకున్నాను. తేజగారితో సినిమాలు చేసిన చాలామంది కొత్త నటీనటులు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఇలా కొత్తవారిని పరిచయం చేయడంలో తేజగారిది లక్కీ హ్యాండ్. ఆయన సినిమా ద్వారా ఇప్పుడు నేను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ‘అహింస’లో చేసిన అహల్య పాత్ర నాకు పెద్ద సవాల్ అనిపించింది. కొన్ని సన్నివేశాలకు ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. కానీ సింగిల్ టేక్‌లో పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని అన్నారు. -
సాచి హిట్ కావాలి
‘‘సాచి’ సినిమా ట్రైలర్ బాగుంది. మహిళా సాధికారతకు సంబంధించిన చిత్రం ఇది. ఇలాంటి మంచి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని హీరో ప్రభాస్ అన్నారు. సంజన రెడ్డి, గీతిక రధన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాచి’. సత్యానంద్ సమర్పణలో వివేక్ పోతగోని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రభాస్ విడుదల చేశారు. వివేక్ పోతగోని మాట్లాడుతూ– ‘‘బిందు అనే ఒక నాయీబ్రాహ్మణ అమ్మాయి నిజ జీవిత గాథ ఇది. తెలంగాణ నాయీబ్రాహ్మణ అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్‌గారు మా చిత్రం ప్రివ్యూ చూసి, బాగుందని అభినందించారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేవీ భరద్వాజ్, నిర్మాణ సారధ్యం: ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని. -
Fashion: శ్రీలీల ధరించిన ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్! మరీ అంత ఖరీదు ఎందుకంటే!
నటన.. తను అలవోకగా అభినయించే కళ అని నిరూపించింది నటి శ్రీలీల! ఫ్యాషన్ విషయంలోనూ ఎలాంటి ట్రెండ్‌ను అయినా అంతే అవలీలగా తన స్టయిల్‌గా మార్చుకోగలదు అనీ అర్థమవుతోంది ఆమె అనుసరించే బ్రాండ్స్‌ను చూస్తుంటే.. గీతిక కానుమిల్లి.. హైదరాబాద్‌కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్‌లో ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించింది. అనతికాలంలోనే ఆమె డిజైన్స్ పాపులరై, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేస్తుంటుంది. ధర కూడా డిజైన్‌ను బట్టే వేల నుంచి లక్షల్లో పలుకుతుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. ద ట్రింక్ హాలిక్.. ఇదొక ఇన్స్టాగ్రామ్ షాపింగ్ సైట్. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్.. తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. అందుకే, సామాన్యులూ.. సెలబ్రిటీలకూ ఇది ఫేవరెట్ బ్రాండ్. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా ఈ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: గీతిక కానుమిల్లి ధర: రూ. 68,000 జ్యూయెలరీ బ్రాండ్: ద ట్రింక్ హాలిక్ ధర:రూ. 850 మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు.– శ్రీలీల - దీపిక కొండి చదవండి: Evening Sandals: ఈవెనింగ్ శాండల్స్.. నడకలో రాజసం.. పార్టీవేర్ ఫుట్‌వేర్! Ketika Sharma: కేతిక శర్మ ధరించిన చీర ధరెంతో తెలుసా? -
AKA: గీతాచిత్రలహరి
బాలీవుడ్ అనే మహా సముద్రంలో ప్రతి అల అరుదైన అనుభవాలు, జ్ఞాపకాలను మోసుకు వస్తుంది. వాటిని అందుకునే వారు అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవకు చెందిన రైటర్, ఎడిటర్, డైరెక్టర్ గీతికా నారంగ్ అబ్బాసి కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్ గెలుచుకుంది... నార్త్ దిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గీతికా నారంగ్ అబ్బాసికి బాల్యంలో ఏకైక వినోద మాధ్యమం సినిమా. కాస్త చమత్కారంగా చెప్పాలంటే, ఆమె బాల్యజీవితంలో బాల్య జ్ఞాపకాల కంటే బాలీవుడ్ సినిమాలే ఎక్కువ! తండ్రి నారంగ్ అబ్బాసి బిమల్‌రాయ్, గురుదత్, రాజ్కపూర్ల గురించి చెప్పడమే కాదు వారి సినిమాలు చూపించేవాడు. చిన్నప్పుడు గీతికకు ఇష్టమైన కథానాయకుడు రాజ్‌కపూర్. గీతిక మాటల్లో చెప్పాలంటే రాజ్‌కపూర్ తన హావభావాలతో గ్రేట్ చార్లి చాప్లిన్‌ను తనకు పరిచయం చేశాడు. చార్లి చాప్లిన్ సినిమాలు చూసి... ‘ఈయన రాజ్‌కపూర్‌ను బాగా కాపీ కొడుతున్నాడు’ అని అమాయకంగా అనుకునే రోజులవి! దిల్లీలోని హిందూ కాలేజి నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది గీతిక. ఆ తరువాత ఎడ్వర్టైజింగ్లో పీజి చేసింది. అయితే ఆ చదువేమి తనకు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఒక సాయంత్రం కాఫీ సేవిస్తూ... ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’ అనుకుంది ప్రకటనల రంగం గురించి. దిల్లీలోని ఒక ఫిల్మ్‌ప్రొడక్షన్ కంపెనీలో చేరడంతో ఫిల్మ్ మేకింగ్‌పై తనకు అవగాహన ఏర్పడింది. కొన్ని డాక్యుమెంటరీలకు సహాయకురాలిగా పనిచేసింది. ‘హాలీవుడ్‌తో పోల్చితే మన దగ్గర డాక్యుమెంటరీల సంఖ్య చాలా తక్కువ. ఎందుకు ఇలా!’ అనుకునేది చాలాసార్లు. ఆ లోటును తనవంతుగా భర్తీ చేయడానికి అన్నట్లుగా తొలిసారిగా ‘గుడ్‌నైట్’ పేరుతో మొదటి సారిగా షార్ట్ డాక్యుమెంటరీ తీసింది. నాన్న తనకు సినిమాలకు సంబంధించిన విశేషాలు చెబుతుండేవాడు. ఉదా: ఫలానా సినిమాలో నృత్య బృందంలో కనిపించే అమ్మాయి ఆ తరువాత పెద్ద హీరోయిన్ అయింది...ఈ సినిమా పేరు చెప్పగానే ఆ హీరో నటవిశ్వరూపం గుర్తుకువస్తుందిగానీ, నిజానికి ఆ సినిమా కథ వేరొక హీరో కోసం తయారు చేసింది. ఆ హీరోకి నచ్చకపోవడంతో ఈ హీరోకి అవకాశం వచ్చి ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గీతికకు అనిపించింది ఏమిటంటే... ‘మన సినిమాల పైనే వివిధ కోణాల్లో డాక్యుమెంటరీలు తీస్తే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కదా!’ విడుదలకు నోచుకోని ‘అమీర్ సల్మాన్ షారుఖ్’ ఫీచర్ ఫిల్మ్ నుంచి ‘అచ్చం ఫలానా హీరోలాగే ఉంటాను’ అని మురిసిపోయే జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఎన్నో విషయాలను తన డాక్యుమెంటరీలలోకి తీసుకువచ్చింది గీతిక. ఫిరోజ్ ఖాన్‌ను ‘మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేక్షకులు నవ్వితే మీ స్పందన ఏమిటి?’ అని అడిగిందట. ‘ఆర్టిస్ట్‌లో హీరోయే కాదు జోకర్ కూడా ఉంటాడు’ అని హాయిగా నవ్వాడట ఫిరోజ్. ఇలా హాయిగా నవ్వే వాళ్లతో పాటు ‘అది నిన్నటి అభిప్రాయం మాత్రమే. ఈరోజు నా అభిప్రాయం మార్చుకున్నాను’ అని ఏ అభిప్రాయం మీద నిలకడలేని నటులతో చిత్రమైన అనుభవాలు ఎదుర్కొవలసి వచ్చింది గీతిక. నాటి ‘గుడ్‌నైట్’ నుంచి నేటి ‘ఏ.కె.ఏ’ వరకు రైటర్, ఎడిటర్, డైరెక్టర్‌గా గీతిక ఎన్నో విషయాలు నేర్చుకుంది. తనను తాను మెరుగుపరుచుకుంది. ఇటీవల కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో గీతిక నారంగ్ తీసిన ‘ఏ.కె.ఏ’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించడమే కాదు ‘బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్’ను గెలుచుకుంది. బాలీవుడ్ కథానాయకులు దేవానంద్, అమితాబ్ బచ్చన్, షారుక్ఖాన్లను పోలి ఉండే ముగ్గురు వ్యక్తులపై తీసిన డాక్యుమెంటరీ ఇది. మిమిక్రీ నుంచి స్టార్డమ్ వరకు చిత్రరంగానికి సంబంధించి అన్ని కోణాలు ఇందులో కనిపిస్తాయి. ‘నా డాక్యుమెంటరీల లక్ష్యం నవ్వించడం కాదు, సీరియస్‌గా ఆలోచింపజేయడం’ అంటుంది గీతికా నారంగ్. అలా అని నవ్వకుండా ఉండలేము, అలా అని సీరియస్‌గా ఆలోచించకుండా ఉండలేము. అదే కదా ఆమె డాక్యుమెంటరీల ప్రత్యేకత! -
కళాశాలలో విషాద‘గీతిక’
తిరుపతి అర్బన్: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సంచలనం సృష్టించాయి. తక్కువ కాల వ్యవధిలో ఇద్దరు తనువు చాలించడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వరుస సంఘటనలు జరగడంతో కళాశాలలో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. సహచరులు సోమవారం ఆందోళన చెందా రు. విషాద వాతావరణం అలముకుంది. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆది వారం ఆత్మహత్య చేసుకున్న ఎంబీబీ ఎస్ విద్యార్థిని పి.గీతిక మృతదేహాన్ని సోమవారం ఆయన రుయా మార్చురీలో పరిశీలించారు. ఆమె కుటుంబ స భ్యులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రుయా ప్రభుత్వ వైద్యులు, జూడాల సంఘం నాయకులు సోమవారం మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్, ప్రభుత్వ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ, సభ్యురాలు లావణ్య తదితరులు హాజరై ఇద్దరు వైద్య విద్యార్థుల చిత్ర పటాలకు పుష్పాంజలితో నివాళులర్పించారు. వారిద్దరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ గీతిక మృతదేహానికి రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ ఆధ్వర్యంలో సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ మునిరామ య్య మీడియాతో మాట్లాడుతూ గీతిక మృతి పూర్తిగా వ్యక్తిగతమని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ డివిజన్ మే జిస్ట్రేట్ (ఆర్డీఓ), తహసీల్దార్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తి చేసినట్లు వెల్లడిం చారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. గీతిక మృతికి మెడికల్ కాలేజీలో వేధింపులు, ఇతర సమస్యలు కారణం కాదని, చదు వులో వెనుకబాటుతనం మాత్రమే ఉందని ఆమె తల్లి చెప్పినట్లు స్పష్ట్టం చేశారు. గీతిక సూసైడ్ నోట్లో కూడా ఎవరి పేర్లు లేవని, ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని డీఎస్పీ పేర్కొన్నారు. గీతిక మృతదేహానికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి స్వస్థలం కడప నగరానికి తరలించారు. -
ఒక్క క్షణం ఆలోచించండి
చిత్తూరు అర్బన్: ‘శిల్ప పిడియాట్రీషియన్ చదువుతున్న వైద్యురా లు. కళాశాలలో అధ్యాపకుల వేధింపులు తాళలేక వారం క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. మానసికంగా కుంగిపోయి తన వద్దకు వచ్చేవారికి ధైర్యం చెప్పి బతుకుపై ఆశ కల్పించాల్సిన వైద్యురాలి బలవన్మరణంతో సమస్యలు తీరిపోయాయా..? తీరినా పోయిన ప్రాణం తిరిగొచ్చిందా..?’ ‘నిన్నటికి నిన్న తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. పరీక్షలకు భయపడో, వ్యక్తిగత సమస్య ఏదైనా ఆమెను ఆత్మహత్మకు పురుగొలిపి ఉండవచ్చని స్నేహితులు భావిస్తున్నారు. భర్త మృతితో కుంగిపోయిన గీతిక తల్లి బిడ్డ చదువు కోసం చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదులుకుని తిరుపతి వచ్చేశారు. ప్రాణం తీసుకోవాలనుకున్న మానసిక సంఘర్షణలో తల్లి పడ్డ కష్టాన్ని గీతిక గుర్తుకు తెచ్చుకోలేకపోయారు.’ వీరిద్దరే కాదు.. చిన్నపాటి సమస్యకే కుంగిపోయి ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తున్నవారి సంఖ్య జిల్లాలో ఇటీవల ఎక్కువైంది. అది కూడా విద్యావంతులు, వృత్తిపరంగా రాణిస్తున్నవారు, నలుగురికీ ధైర్యం చెప్పి సమాజాన్ని నడిపించాల్సిన వారే ఇలా ఆత్మహత్యకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చదవులు, వేధింపులు, ఒత్తిడి, ప్రేమ.. కారణం ఏదైనా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. చమటోడ్చి, కష్టపడి పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితం పూలబాటగా మారుతుంది. లక్ష్యం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని విద్యతో వికసింప చేసుకోవాలని ఆశిస్తుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ చదువుల్లో ఎదుగుతూ గమ్యం వైపు నడవాలని ప్రయత్నిస్తారు. ఈ సమయంలో అడుగులు తడబడడం, ఒత్తిళ్లు, ఆకర్షణ, వేధింపులు ఇలా అనేకం ఎదురవుతాయి. జీవితమంటేనే పోరాటం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోరాటం చేసి విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం అంతాఇంతాకాదు. అంతేగాని సమస్య వచ్చిందని మానసికంగా కుంగిపోయి జీవితాన్ని అర్ధంతరంగా ముగించడం మంచిదికాదు. చనిపోవడం ఒక్కటే పరిష్కారమని భావించేవాళ్లు ఒక్క క్షణం ఆలోచిస్తే గమ్యం.. గమనం తప్పకుండా మారతాయి. జీవిత లక్ష్యాలు, తల్లిదండ్రులు, వారు పడుతున్న కష్టాన్ని తరచూ మననం చేసుకోవడం వల్ల ఆత్మహత్య ఆలోచనల నుంచి బటయపడొచ్చు. జీవితం ఆనందంగా సాగుతుంది. ఒత్తిళ్లు ఇలా దూరం.. ♦ ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉటుంది. విద్యార్థులయితే నిరంతరం ప్రణాళికతో అభ్యసనం చేయాలి. దైన్నైనా ఆశావహ దృక్పథంతో తీసుకుని ముందుకు సాగాలి. ఏదైనా ఒక అంశం సరిగ్గా రాకపోతే రెండు మూడు సార్లు ప్రయత్నించడం వల్ల ఫలితం సాధించవచ్చు. ♦ ప్రతి విషయాన్ని ఒత్తిడిగా భావించి కుంగిపోకూడదు. ఇప్పుడున్న యువత ప్రతి ఒక్క విషయాన్ని స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. చనిపోవాలనే పరిస్థితులు ఎదురైనప్పుడు తమ భావాలను ఎవ్వరితోనూ పంచుకోలేకపోతున్నారు. మన సమస్యను నమ్మకస్తుల వద్ద పంచుకుంటే మనసు తేలికపడుతుంది. కన్నీళ్లు ఉప్పొంగి బయటికొస్తే బాధ దూరమవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి. ♦ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. మనిషికి చదువు సంస్కారాన్ని నేర్పుతుందనే విషయాన్ని మరచిపోవద్దు. సమాజంలో ఎలా బతకాలో నేర్పించేది చదువు. ♦ బాధ ఉన్న సమయంలో చిన్నపిల్లలు ఉన్న చోట ఆడుకోవడం, అన్నీ మరచిపోయి వారితో కాసేపు సరదాగా గడపడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని ఇటీవల పరిశోధనలు రుజువు చేశాయి. ♦ ప్రధానంగా సామాజిక మాధ్యమాలను మనకు ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. అనవసరమైన చర్యలు, సంబంధంలేని విషయాలను వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వల్ల సమయం వృథా అవుతుంది. అంతేగాక మనపై ఒత్తిడి పెంచుతుందనే విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులే ప్రధానం దేశాన్ని మార్చే శక్తి యువతలోనే ఉంది. సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించేది కూడా యువతే. అలాంటప్పుడు విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి..? లక్ష్యంవైపు అడుగులు వేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వాటి పరిష్కారానికి ప్రయత్నించాలి. లేదంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. ప్రపంచంలో అమ్మానాన్నలు మాత్రమే మీ సమస్యను పరిష్కరిస్తారు, దారి చూపిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు. – డాక్టర్ పి.సరళమ్మ,జిల్లా ప్రభుత్వ వైద్యశాలలసమన్వయాధికారిణి చర్చించండి మూడేళ్లలో మహిళలపై జరిగిన వేధింపుల కేసులు 1,372 నమోదయ్యాయి. అందులో ఈ ఒక్క ఏడాదిలోనే 2,083 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వేధింపులు పెరిగాయని కాదు. మహిళలు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి వారి సమస్యలు చెబుతున్నారు. పరిష్కారాలు చూపిస్తున్నాం. సమస్య ఉంటే అమ్మా, నాన్న, స్నేహితులతో చర్చించాలి. గుడికి వెళ్లి దేవుడికి దన్నంపెట్టి బాధను చెప్పుకున్నట్లే ధైర్యంగా స్టేషన్‌కు రండి. రోడ్డుపై భిక్షమెత్తుకునే 90 ఏళ్ల వృద్ధురాలికి కూడా సమస్య ఉంది. అలాగని ఆమె ఆత్మహత్య చేసుకోలేదే. దయచేసి బతుకుపై ఉన్న ధైర్యాన్ని వదలొద్దు. – నారాయణస్వామిరెడ్డి,మహిళా స్టేషన్ డీఎస్పీ, చిత్తూరు -
నిందితులను వదిలే ప్రసక్తేలేదు
చిత్తూరు అర్బన్: తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప మృతికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడతూ శిల్ప ఆత్మహత్మకు కారకులపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామన్నారు. అధ్యాపకులను విధుల నుంచి తొలగించామని, ప్రిన్స్‌పాల్‌ను బదిలీ చేశామన్నారు. మరికొందరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కళాశాలలో మహిళలపై వేధింపులను నివారించడానికి ఉన్న కమిటీలు రద్దు చేసి, కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే చర్యలు తీసుకునేలా కమిటీలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కొనసాగుతున్న సీఐడీ విచారణ పీలేరు: డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. కేసును సీఐడీకి అప్ప గించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం పీలేరు అర్బన్ సీఐ సిద్ధ తేజమూర్తి కేసుకు సంబందించిన రికార్డులను సీఐడీ డీఎస్పీ రమణకు అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారుల బృందం మృతురాలి తల్లిదండ్రులు రాధ, రాజగోపాల్, సోదరి శృతి, భర్త డాక్టర్ రూపేష్‌కుమార్‌రెడ్డి, ఇతర కుటుంబ సబ్యులను వేర్వేరుగా విచారిస్తున్నారు. మృతికి దారితీసిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. అలాగే శిల్ప ఆత్మహత్య చేసుకున్న అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. ప్రొఫెసర్ల వేధింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శిల్ప ఎటువంటి ఆరోపణలు, వాంగ్మూలం లేకుండానే ఎలా చనిపోయిందన్న కోణంలో సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. విచారణపై సీఐడీ అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు. -
గీతిక సూసైడ్ నోట్ దొరికింది
సాక్షి, తిరుపతి: పోలీసుల చేతికి మెడికో గీతిక సూసైడ్ నోట్ దొరికింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. గీతిక ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా గీతిక, తన తల్లి హరితా దేవికి ఇటీవల ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మనస్తాపం చెందిన గీతిక, పెళ్లికి తల్లి ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పిరికి దానిని కాదని..తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకుండా ఉండలేనని, జీవితంలో ఓడిపోతానని ఎప్పుడూ అనుకోలేదని, తనను క్షమించాలని పేర్కొంది. అయితే చదువులో వత్తిడి వల్లే తన కుమార్తె గీతిక ఆత్మహత్య చేసుకుందని, మరే ఇతర కారణాలు లేవని ఆమె తల్లి హరితా దేవి పేర్కొన్నారు. కాగా, గీతిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ చేసి వాస్తవాలు వెల్లడిస్తామని డీఎస్పీ ముని రామయ్య తెలిపారు. గీతిక రాసిన సూసైడ్ నోట్.. -
నిన్న శిల్ప.. నేడు గీతిక
తిరుపతి అర్బన్ : మెడికోల వరుస బలవన్మరణాలతో తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల ఉలిక్కిపడింది. ఐదు రోజుల క్రితం పీజీ విద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఉదంతం మరువకముందే ఆదివారం సాయంత్రం ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గీతిక బలవన్మరణం విద్యార్థులను, వైద్యులను కలవరపాటుకు గురిచేసింది. వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకుందని తల్లి అంటున్నప్పటికీ వారంలోనే ఒకే మెడికల్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అశువులు బాయటం సర్వత్రా ఆందోళనకు తావిస్తోంది. భావి డాక్టర్ల బలవన్మరణాలు సమాజాన్ని అలజడికి గురిచేస్తున్నాయి. మెడికల్ కళాశాలలో అసలు ఏమి జరుగుతోందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఇంటర్నల్ పరీక్షలు.. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సోమవారం పాథాలజీ అంశంలో ఇంటర్నల్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే గీతిక మృతితో ఆ పరీక్షలు వాయిదా పడే అవకాశముందని వైద్య విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. పరీక్షలకు భయపడేంత విధంగా ఇంటర్నల్ పరీక్షలు జరగవని జూడాల నాయకులు చెబుతుండగా, పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులకు భయపడి గీతిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా...? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కళాశాలలోనూ గీతిక ఎక్కువగా ఎవరితోనూ కలివిడిగా ఉండేది కాదని విద్యార్థులు అంటున్నారు. భరోసా ఇచ్చే చర్యలు శూన్యం.. ఒక్క ఎస్వీ మెడికల్ కళాశాలలోనే కాకుండా ఏ విద్యా సంస్థలోనైనా, విధి నిర్వహణ ప్రాంతా ల్లోనైనా వేధింపులు ఎదురైనప్పుడు వారికి భరోసా కలిగించే చర్యలు లేవనే చెప్పాలి. ఈ విషయంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నిర్లక్ష్యంగానే ఉంటున్నారన్న ఆరోపణలకు ప్రస్తుత ఈ రెండు ఘటనలే నిదర్శనాలుగా నిలిచాయి. ఏదో ఘటన జరిగిన సందర్భంలో మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణ మవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యలకు వ్యతిరేకంగాఅవగాహన కల్పించాలి.. కళాశాలల్లో, విధి నిర్వహణ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడకుండా ఉండేలా నిరంతరం అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ధైర్యం నూరిపోయాలి. ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలూ శ్రీకారం చుట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ ప్రద్యుమ్న సూ చించిన వేధింపుల నివారణ కమిటీల ఏర్పాటునూ వేగవంతం చేయాలన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. అవసరమైతే ఈ అంశాలను హైస్కూల్ స్థాయిలోని పాఠ్యాంశాల్లోనే చొప్పించాల్సిన అవసరముంది. -
కన్న పేగే కడతేర్చింది
ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు తాగించిన మహిళ పెద్ద కుమార్తె మృతి అపస్మారక స్థితిలో చిన్నకూతురు అనంతరం తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం సూదనపల్లిలో విషాద ఛాయలు సూదనపల్లి(కురవి) : నవమాసాలు మోసి, పురిటినొప్పులు పడి జన్మనిచ్చిన తల్లే తన పేగు బంధాన్ని తెంచేసుకుంది. పరారుు పురుషుడి మోజులోపడి మాతృత్వాన్ని, మానవత్వాన్ని మరిచింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో కడుపున పుట్టిన బిడ్డలకు విషమిచ్చింది. వారిలో పెద్దకుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా, చిన్నకూతురు అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆ తర్వాత సదరు మహిళ తన ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆస్పత్రి పాలైంది. నల్లగొండ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ సంఘటన కురవి మండలంలోని సూదనపల్లిలో విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నారుు. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మట్టెగజపు లింగయ్య కుమార్తె కవితతో సూదనపల్లికి చెందిన తోట పాపయ్యకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తెలు గీతిక(4), సాయి దీప్తి జన్మించారు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే వీరు కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ కూలీ చేసుకుంటున్నారు. బ్యాం కు అకౌంట్ తీసేందుకని ఇటీవల స్వగ్రామం చేరుకున్నారు. 15వ తేదీన వారు మానుకోటలోని ఓ బ్యాం కులో అకౌంట్ తీసేందుకు వెళ్లి, ఖాతా తెరవకుండా నే తిరిగొచ్చారు. అదే రోజు కవిత తన భర్తకు తెలి యకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని చెప్పాపెట్టకుండా వెళ్లిపోరుుంది. భార్య పుట్టింటికి వెళ్లిందని భావించిన పాపయ్య హైదరాబాద్ వెళ్లేందుకు ఆది వారం బయల్దేరాడు. ఈ క్రమంలోనే అతడి మామ లింగయ్య ఫోన్‌చేసి పిల్లలకు కవిత పురుగులమందు తాగించిన విషయం చెప్పాడు. దీంతో అతడు హైదరాబాద్‌కు వెళ్లకుండ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ప్రియుడితో కలిసి వెళ్లి.. అఘారుుత్యం.. సూదనపల్లి నుంచి పిల్లలను తీసుకుని బయల్దేరిన కవిత నేరుగా తన మేనత్త ఊరైన నూతనకల్ మండలంలోని జి.కొత్తపల్లికి వెళ్లింది. అనంతరం తన మేనత్త కుమారుడు శ్రీపాల్‌తో కలిసి కూతుళ్లకు పురుగుల మందు తాగించి హత్య చేయూలని పథకం రచించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి-చిట్యాల మధ్యలో ఉన్న గుట్ట వద్ద పిల్లలిద్దరికి వారు పురుగుల మందు తాగించారు. దీంతో పెద్దకుమార్తె గీతిక అక్కడికక్కడే మృతిచెందగా, సారుుదీప్తి పరిస్థితి విషమంగా మారింది. అనంతరం కవిత, శ్రీపాల్ కూడా పురుగుల మందు తాగి సారుుదీప్తిని తీసుకుని ప్రధాన రహదారికి చేరుకున్నారు. అక్కడి నుంచే శ్రీపాల్ తన తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా, అతడు వెంటనే కవిత తండ్రి లింగయ్యకు సమాచారమిచ్చాడు. దీంతో లింగయ్య సంఘటన స్థలానికి వెళ్లి చూడగా గీతిక మృతదేహం కనిపించింది. సాయిదీప్తి, కవిత, శ్రీపాల్ అంబులెన్స్‌లో హైదరాబాద్ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లినట్లు లింగయ్య చెప్పాడు. ఇదిలా ఉండగా గీతిక మృతదేహాన్ని ఆదివారం సూదనపల్లికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యూరు. అయితే కేసు పెట్టకుండా మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడంతో వారు సీరోలు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఇక్కడ కేసు నమోదు చేయడం కుదరదని, సంఘటన జరిగిన పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయూలని సూచించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారుు. -
చిన్నారి గీతిక.. విషాద వీచిక
లేతప్రాయం.. స్కూలు, ఇల్లు తప్ప ఇంకో లోకం తెలియని అమాయకత్వం. చెంగు చెంగున లేడిపిల్లలా గెంతుతూ.. ఈ లోకమంతా తనదే అన్నట్లు ఆటపాటలతో తల్లిదండ్రులకు మురిపాలు పంచింది ఆ బాలిక.. ఇది నాలుగు నెలల క్రితంనాటి ముచ్చట. మరి ఇప్పుడు.. ఆ ఇల్లే ఒక శోకనిలయంగా మారింది. నాటి కేరింతలు, తుళ్లింతలు లేవు. ఆటపాటలతో ఇల్లంతా సందడి చేయాల్సిన వారి పుత్రిక జీవచ్ఛవంలా మారి.. మంచానికి పరిమితమైంది. చిన్నపాటి జ్వరం కొద్దిరోజుల వ్యవధిలోనే పెను ఉపద్రవంగా మారి. ఆ పేద కుటుంబంలో కల్లోలం రేపింది. విధితోపాటు వైద్యనారాయణులు తమ ముద్దుల పాప గీతిక తలరాతను మార్చేశారని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. డబ్బు నీళ్లలా ఖర్చయినా జబ్బు నయంకాకపోగా మరింత విషమించి పాప జీవితాన్ని డోలాయమానంలో పడేసింది. రాజాం రూరల్: కులవృత్తిపైనే ఆధారపడిన పేదవర్గానికి చెందినవారు సుగంధం సతీష్, కల్యాణి దంపతులు. రాజాం మధవబజార్ వీధిలో నివసిస్తున్న వీరికి ఒక్కగానొక్క కుమార్తె గీతిక. స్థానిక కాన్వెంట్లో 4వ తరగతి చదువుతోంది. పేద కుటుంబమైనా ఉన్నంతలో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విధి విషం చిమ్మింది. సుమారు నాలుగు నెలల క్రితం చిన్నారి గీతికకు జ్వరం చేసింది. తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడికి చూపించారు. రెండురోజులు మందులు వాడినా ఫలితం కనిపించలేదు. దాంతో రాజాంలోనే స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించారు. అతనిచ్చిన మందులు మరో రెండుమూడు రోజులు వాడారు. జ్వరం తగ్గకపోగా ప్లేట్లెట్స్ పడిపోతున్నట్లు గుర్తించిన వైద్యుడి సూచన మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీన విశాఖలోని కళా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిపిన పరీక్షల్లో గీతిక డెంగ్యూ బారిన పడినట్లు నిర్థారించారు. అయితే అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో విశాఖలోని మరో పెద్ద ఆస్పత్రికి సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి తరలించారు. వైద్యం వికటించిందా? ఆ ఆస్పత్రిలో జరిపిన పరీక్షల్లోనూ డెంగ్యూగా తేలడంతో ప్లేట్లెట్స్ ఎక్కించారు. ఏమైందో తెలియదు గానీ.. ప్లేట్లెట్స్ ఎక్కించినప్పటి నుంచి గీతిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అప్పటివరకు కొద్దిపాటి ఓపికతో మాట్లాడుతూ, మెల్లగా తిరుగాడిన గీతిక శరీరం రంగు ఒక్కసారిగా మారిపోయింది. గొంతు మూగబోయింది. పక్షవాతం సోకినట్లు కాళ్లూచేతులు వంకర్లుపోయి జీవచ్ఛవంలా తయారైంది. కూర్చోలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైంది. దాంతో వైద్యులు ఆమెను ఐసీయూ నుంచి ఎంఐసీలోకి తరలించారు. ఊపిరి పీల్చడం, ఆహారం తీసుకోవడం కూడా సమస్యగా మారడంతో గొంతుకు అడ్డంగా ఒక పరికరం, ముక్కుకు గొట్టం అమర్చారు. ఇలా రకరకాల చికిత్సలతో సెప్టెంబర్ 19వ తేదీ వరకూ సుమారు రూ.10 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరికి పాప పరిస్థితి విషమించిందని చేతులెత్తేసి డిశ్చార్జి చేసేశారు. అయినా ఆశ చావక.. దీంతో పూర్తిగా కుంగిపోయిన తల్లిదండ్రులు.. చేతిలో డబ్బులన్నీ అయిపోయి దిక్కుతోచని స్థితిలో పాపను తీసుకొని సొంత ఊరికి తిరిగొచ్చారు. పాపను ఎలాగైనా బతికించుకోవాలన్న ఆశతో రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వారిచ్చిన మందులు వాడుతూనే విశాఖ కేజీహెచ్‌ను ఆశ్రయించారు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు ఆమెకు అమర్చిన పైపులు, పరికరాలు తీయాలంటే శస్త్రచికిత్స చేయాలని, దాన్ని తట్టుకునే శక్తి పాపకు ప్రస్తుతం లేదని చెప్పారు. కొన్నాళ్లు మందులు వాడాలని, ఆరోగ్యం కొంత మెరుగుపడితే ఆపరేషన్ చేసి తొలగిస్తామన్నారు. అప్పటినుంచి పాపను ఇంటిదగ్గరే 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులకు మళ్లీ శస్త్ర చికిత్స చేయించడానికి అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడం కుంగదీస్తోంది. ఇప్పటికే శక్తికి మంచి అప్పులు చేసి సుమారు రూ.13 లక్షలు ఖర్చు చేశామని.. ఇంక చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఏం చేయాలో పాలుపోవడంలేదని వాపోతున్నారు. కాగా విశాఖ ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స వికటించడం వల్లే తమ కుమార్తె పరిస్థితి ఇలా తయారైందని ఆరోపిస్తున్నారు. ఇక భగవంతుడు, దాతలే తమపై దయ చూపాలని వారు అంటున్నారు. -
స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి
సత్తుపల్లి: ముద్దులొలికే చిన్నారిని స్కూల్ బస్సు మృత్యువు రూపంలో కబళించిన సంఘటన సోమవారం సత్తుపల్లి పట్టణంలోని మసీద్ బజార్ రోడ్డులో చోటు చేసుకుంది. హృదయవిదారకమైన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి పట్టణంలోని మసీద్ బజార్ రోడ్డు చివరిలో కోత మిల్లు పక్క వీధిలో తమ్మా వెంకటేశ్వరరావు (జటార్ వెంకటేశ్వరరావు, ట్రాక్టర్ మెకానిక్) కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అతని కుమార్తె మారేశ్వరిని గుంటూరుజిల్లా రేపల్లె మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన విశ్వనాధపల్లి బుల్లిబాబుకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. ఇటీవల మారేశ్వరి రెండో కాన్పు కోసం మొదటి కుమార్తె గీతిక(18 నెలలు)తో కలిసి పుట్టింటికి వచ్చింది. 40 రోజుల క్రితం ఆమెకు ఓ బాబు జన్మించాడు. గీతిక ప్రతి రోజు ఎదురింట్లో ఉన్న పిల్లలతో కలిసి ఆడుకుంటుంది. సోమవారం సాయంత్రం గీతిక ఇంట్లో ఇడ్లీలు తిని ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వచ్చిన వీవీ విద్యాలయం స్కూల్ వ్యాన్ పిల్లలను దింపి ముందుకు కదిలింది. అప్పటికే గీతిక వ్యాన్ ముందు భాగానికి వచ్చింది. అది గమనించని డ్రైవర్ బస్సును కదిలించడంతో ముందు టైరుకు తగిలి కిందపడడంతో తలపై నుంచి వెళ్లింది. తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లి మారేశ్వరి పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఓ వైపు 40 రోజుల పసికందు ఒడిలో.. మరో వైపు విగతజీవిగా పడి ఉన్న చిన్నారి గీతిక మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. అమ్మమ్మ నాగేశ్వరమ్మ ఆర్తనాధాలతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో ముగినిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రాణం బలిగొంది.. : స్కూల్‌బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే చిన్నారి గీతిక ప్రాణాలను బలిగొందని.. బస్సును ఆపి ముందుకు పోనిచ్చేటప్పుడు పరిసరాలు సరిగ్గా గమనించకపోవటం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చే స్కూల్ బస్సులు మితిమీరిన వేగంతో నడుపుతుండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. స్కూల్ బస్సులో కనీసం అటెండెంట్(క్లీనర్) ఉండక పోవటం వల్లే ఈ ఘోర దుర్ఘటన జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి గీతిక కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డివిజన్ కార్యదర్శి బండి గణేష్‌రెడ్డి, తుమ్మలపల్లి నరేష్‌ల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వీవీ విద్యాలయం ఎదుట ధర్నా చేశారు. అవగాహన లేని డ్రైవర్లను నియమించటం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. కాగా సంఘటన స్థలానికి సత్తుపల్లి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బస్సుడ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.